Previous Page Next Page 
వసుంధర కధలు -12 పేజి 55

 

                         "ఊరుకుంటేనే ఉత్తమం"

                                                                       వసుంధర

    ఈరోజోక అద్భుత ప్రయోగం చేయబోతున్నాను సావిత్రీ" అన్నాడు శేఖరం.
    "ఏమిటండీ అది -" అంది సావిత్రి.
    'మొక్కల మీద న్యూక్లియర్ రేడియేషన్ ప్రభావం, మొక్కల మీద నేను చేయబోయే ఈ ప్రయోగం వల్ల పంట దిగుబడి బాగా పెంచవచ్చు. పంట క్వాలిటీని హెచ్చించవచ్చు. ఇంకా రకరకాల ప్రయోజనాలున్నాయి. ఏ సీజన్లోనైనా ఏ వంటైనా పండించవచ్చు."
    "మీ ప్రయోగం ఏ దశలో ఉంది -" అంది సావిత్రి.
    'ఇంకా గ్రుడ్డు దశలోనే ఉంది. ఈరోజే మొదటి దశ ప్రారంభం. మా లాబరేటరీ నా  గురించి కొన్ని పొలాలు కొంది. వాటిలో నేను వేసిన విత్తులు మొక్కలై న్యూక్లియర్ రేడియేషన్ అందుకునే దశకు ఇప్పుడిప్పుడే వచ్చాయి. ఇంక నా ప్రయోగం మొదలు కావాలి. ఈ రోజే అందుకు ముహూర్తం పెట్టాను" అన్నాడు శేఖరం.
    శేఖరం ప్రభుత్వ పరిశోధనా సంస్థలో సైంటిస్టుగా పని చేస్తున్నాడు. యూనివర్సిటీలో పీహెచ్ డీ చేస్తున్నప్పుడు తనతో పాటు రిసెర్చి స్కాలర్ గా ఉండే సావిత్రి నతడు ప్రేమించి పెళ్ళాడాడు, భర్త ఎంత ప్రోత్సహించినా వినకుండా పెళ్ళి కాగానే సావిత్రి రీసెర్చి కి స్వస్తి చెప్పింది.
    శేఖరం భార్యకు టాటా చెప్పి -- ఆఫీసుకు వెళ్ళి అక్కణ్ణింఛి - తన ప్రయోగాల కవసరమైన ఎక్విప్ మెంట్ ను వ్యాన్ లో వేయించుకుని- నలుగురు అటెండెంట్స్ ని తీసుకుని బయల్దేరాడు. ఆఫీసు నుంచి పొలాలకు చేరడానికి సుమారు పదిహేను నిమిషాలు పట్టింది. పొలం మధ్యలో ఒక చిన్న గది ఉంది. ఆ గదికి విద్యుచ్చక్తి సదుపాయాలున్నాయి. శేఖరం తన ఎక్విప్ మెంట్ నక్కడికి తరలింప జేసి వ్యాన్ డ్రైవర్ తో - మళ్ళీ ఎప్పుడు రావాలో చెప్పి పంపించేశాడు.
    తర్వాత ఒకొక్క ఇన్ స్ట్రూమెంటు కీ ఎలెక్ట్రికల్ కనేక్ష నిచ్చాడు. నెమ్మదిగా అతని ప్రయోగాలు ప్రారంభమయ్యాయి.
    శేఖరం చేయబోయే ప్రయోగాల ఫలితాలు తెలుసుకోవడానికి కొంత వ్యవధి కావాలి. అందువల్ల శేఖరం తన నోట్ బుక్ లో ఆరోజు తేది వేసుకుని -- ఏయే మొక్కలకు ఎంతంత ఫ్రీక్వెన్సీ లో ఏయే రేడియేషన్ ఇచ్చినదీ నోట్ చేసుకోసాగాడు. అతనలా చేసుకుంటుండగా ఆకాశం హటాత్తుగా మేఘా మృతమైంది. అతని మీద ఒకటి రెండు చినుకులు కూడా పడ్డాయి.
    శేఖరానికి చిరాకు కలిగింది. మంచి పనుల కెప్పుడూ విఘ్నాలే! అతను ఇన్ స్ట్రూమెంట్స్ మీద రెయిన్ ప్రూఫ్ కవర్సు కప్పి -- ఎలక్ట్రికల్ కనెక్షన్స్ తీసేసి -- కేబుల్స్ గదిలోకి మార్చేశాడు. అతనివన్నీ ముగించేసరికి ఆకాశంలో మబ్బులు తొలగి పోయి - మళ్ళీ మామూలు వాతావరణ మేర్పడింది.
    'అయితే కేవలం నా ప్రయత్నానికి విఘ్నం కలిగించడం కోసమే నన్నమాట -- వాతావరణంలో మార్పు వచ్చింది -- నేనా లొంగేవాడిని -" అనుకుని శేఖరం ఉత్సాహంగా మళ్ళీ ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ఇచ్చి తన ప్రయోగాలు ప్రారంభించాడు. అతని ప్రయోగం జరుగుతుందనగా మళ్ళీ ఆకాశం మేఘామృతమైంది. అతని మీద ఒకటి రెండు చినుకులు పడ్డాయి.
    శేఖరానికి చాలా చిరాకు వేసినా చేయగలిగిందేమీ లేదు. అతను మళ్ళీ ఇందాకటి లాగే ఇన్ స్ట్రూమెంట్స్ డిస్కనెక్ట్ చేసి వచ్చేసరికి- వాతావరణం మళ్ళీ మామూలై పోయింది. పట్టువదలని విక్రమార్కుడిలా శేఖరం తన ప్రయోగాలు మళ్ళీ ప్రారంభించాడు. అయితే మళ్ళీ ఇందాకటి లాగే జరిగింది.    
    అంతేకాదు - అలా అయిదారు సార్లు జరగడంతో శేఖరానికి చిన్న అనుమానం కూడా వచ్చింది. తన ప్రయిగాలకూ - వాతావరణంలోని ఈ మార్పుకూ ఏమీసంబంధం లేదు కదా అని! ఎందుకంటె ప్రయోగం ఒక దశకు వచ్చే సరికి వాతావరణం లో మార్పు వస్తోంది. ప్రయోగం అపివేయగానే వాతావరణం మామూలై పోతోంది.
    శేఖరం దీక్షగా తను నోట్ చేసుకున్న రీదింగ్స్ వైపు చూశాడు. వాటిలో అతడు ప్రయోగం ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఆగింది నోట్ చేసుకున్నాడు. ఆ విషయం చూడగానే శేఖరం ఆశ్చర్యానికి అంతు లేదు. ప్రతిసారీ కూడా గామా రేడియేషన్ ఒక పర్టిక్యులర్ ఫ్రీక్వెన్సీ లో వదిలినప్పుడు ప్రయోగం ఆగిపోయింది.
    శేఖరానికి ఉత్సాహం వచ్చింది. ఈసారి అతను అదే ఫ్రీక్వెన్సీ లో గామా రేడియేషన్ అప్లై చేసి చూశాడు. కానీ వాతావరణంలో మార్పు రాలేదు. అయితే ఇందాకటి మార్పు కాకతాలీయమై ఉండాలని సరిపెట్టుకుని మళ్ళీ తన ప్రయోగాన్ని ప్రారంభించాడు శేఖరం.
    అక్కడ పడేసి మొక్కలు ఒక వరుస చొప్పున పాతపడి ఉన్నాయి. శేఖరం మొదటి మొక్క దగ్గర ప్రారంభించి ఫ్రీక్వెన్సీలు మార్చుకుంటూ రేడియేషన్ అప్లై చేస్తున్నాడు. ఇంతవరకూ అతను వరుస పూర్తీ చేసినపుడల్లా వాతావరణం లో మార్పు వచ్చింది. కానీ తన ప్రయోగానికీ వాతావరణంలో మార్పుకీ సంబంధం లేదని గ్రహించిన శేఖరం నెమ్మదిగా మళ్ళీ ఇంకో వరస మొదలు పెట్టి పూర్తీ చేసేసరికి వాతావరణంలో ఇందాకటిలా గానే మార్పు వచ్చింది.
    శేఖరం బుర్ర లోని సైంటిస్టు పని చేయసాగాడు , ఖచ్చితంగా తన ప్రయోగాలకీ - ఈ మార్పుకీ సంబంధముంది. ఎటొచ్చీ తను సరిగ్గా ఆలోచించలేక పోతున్నాడు.
    అతను నోట్ బుక్ దగ్గర పెట్టుకుని రకరకాలుగా ఆలోచించసాగాడు. హటాత్తుగా అతనికి స్పురించింది. వాతావరణంలో మార్పు రావడానికి కారణం - రేడియేషన్ ఒక పర్టిక్యులర్ ఫ్రీక్వెన్సీ లో వెళ్ళడం కాదు, ఫ్రీక్వేన్స్, పది రకాల ఫ్రీక్వెన్సీలు- తను అప్లై చేసిన ఫ్రీక్వేన్స్ లోనే వేసుకుంటూ వెడితే ఈ మార్పు వస్తూ ఉండవచ్చు.
    ఇది నిజమో కాదో తెలుసుకొనేందుకతడు రకరకాల ఫీక్వెన్సులు మార్చి ప్రయోగాలు చేశాడు. వాతావరణంలో మార్పు రాలేదు. కాని తనిందాకటి నుంచే అప్లై చేస్తున్న ఫీక్వెన్సు ఫాలో అయితే ఏదో ఫ్రీక్వెన్సీ దగ్గరకు వచ్చేసరికి మేఘాలు వర్షించే స్థితికి వచ్చాయి. ఆ ఫ్రీక్వెన్సు నే ఫాలో అవుతూ ఫ్రీక్వేన్సి ఇంకా పెంచుకుంటూ పొతే -- వర్షం బాగా ఉదృతి మవుతుందని కూడా శేఖరానికి తట్టింది.
    అదే నిజమైతే - తానొక కొత్త విశేషాన్ని కనుగొన్నట్లు లెక్క! కావాలనుకున్నప్పుడు  వాన కురిపించగల శక్తి తను సంపాదించాడు. అంతేకాదు, కోరినంత సేపు మాత్రమే వాన కురిపించగల శక్తి కూడా తనకుంది. తను ప్రయోగాన్ని అదే ఫ్రీక్వెన్సీ నంబరుని బట్టి- వర్షం కురిసే వ్యవధి ఉండవచ్చు. కానీ అందుకు మరికొన్ని ప్రయోగాలు చేయవలసి ఉంటుంది.
    శేఖరం అనుమానం - కేవలం రేడియేషన్ ఒక్కటే ఈ విశేషానికి కారణం కాదని, బహుశా తను వాడిన ఈ మొక్కలు కూడా అందుకు దోహదం చేస్తుండవచ్చు. లేదా ఈ ప్రాంతపు వాతావరణం కూడా అందుక్కారణం కావచ్చు. ఈ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చే ముందు తనింకా చాలా ప్రయోగాలు చేయాల్సుంటుంది.
    శేఖరం త్వరత్వరగా తన ఆలోచనలన్నీ కాగితం మీద ఎక్కించసాగాడు.

                                    2
    "మీది మీ వారిదీ ఒకే సబ్జక్టు కదా -- మీరూ ఉద్యోగంలో చేరి మీ వారికి సహకరించరాదూ" అంది అరుణ.
    "నేను విజ్ఞానం కోసం చదువుకున్నాను. నేను ఉద్యోగం చేస్తే మరికాస్త డబ్బు సంపాదించ వచ్చు ననుకోండి. ఉద్యోగం చేసే ఆడది- సరైన సంసార జీవితాన్నివ్వలేదు. అవసరమున్నప్పుడు తప్పదు. అవసరం లేనప్పుడు ఉద్యోగం చేయడమెందుకు చెప్పండి!" అంది సావిత్రి.
    "మీరింకా చాలా పాతకాలంలో ఉన్నారు. అడవాళ్ళిప్పుడు ఇతర గ్రహలక్కూడా పోతున్నారు" అంది కరుణ.
    "కాదని నేనలేదు. కానీ భగవంతుడు ఆడదాన్ని బలహీనంగా , సుకుమారంగా సృష్టించాడు. ఎంతో ఒర్పునూ త్యాగ బుద్దీనీ ఇచ్చాడు. ఇవన్నీ ఉపయోగించి ఆడది ఒక ఆహ్లాదకరమైన వాతావరణానికి తానూ రాణియై - తనకు చెందిన వాళ్ళందరినీ పరిపాలించాలి. అలా జరగనప్పుడు - ఇప్పుడొచ్చిన మోడ్రన్ డెవలప్ మెంట్స్ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నట్లే - మెంటల్ సొల్యుషన్ వస్తుంది" అంది సావిత్రి. "క్షమించాలి , ఇది కేవలం నా అభిప్రాయం" అంది మళ్ళీ.
    కరుణ నవ్వి "పోనీ - కనీసం మీ వారితో పరిశోధనల గురించేనా చర్చిస్తున్నారు. అది ఒకందుకు నయమే-" అంది. 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS