Previous Page Next Page 
వసుంధర కధలు-10 పేజి 54

 

    "ఏయ్....నిన్నే....అపు" అందామె మళ్ళీ.
    డ్రైవర్ ఆ మాటలు విన్నట్లు లేదు. అటో వేగం కూడా తగ్గలేదు.
    ఆమె కేక పెట్టింది. కానీ అటో ఇంజన్ రొదను దాటి అది ఎంత దూరం వెళ్ళిందో తెలియదు. ఆమె కళ్ళలో భయం. శరీరంలో వణుకు. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని కూర్చుంది.
    ఊరి చివర పాడుబడ్డ ఆలయం దగ్గర అటో ఆగింది.
    "ఏమిటి నీ వుద్దేశ్యం?" అని కోపంగా డ్రైవర్ తో అంటూ ఆమె అటో దిగింది.
    "నా ఉద్దేశ్యం చాలా సింపుల్. నన్ను పరిశీలనగా చూస్తె ఆ విషయం నువ్వే గ్రహిస్తావ్- లీలా!" అన్నాడతను.
    "రామం" అంది కంగారుగా లీల "నువ్వా ?"
    "అవును - నేనే!' అన్నాడు రామం.
    "నన్నెందుకు కిక్కడికి తీసుకోచ్చావ్ ?" అంది లీల.
    "ఎందుకు తీసుకోచ్చానో ఊహించలేవా?" అన్నాడు రామం.
    "నాకు తెలిసిన రామం చాలా మంచివాడు. నన్ను మనసారా ప్రేమించి నా క్షేమాన్ని కోరుకునే వాడు. కలలో కూడా నాకు అపకారం తపపెట్టని వాడు" అంది లీల.
    "అయితే ఆ రామాన్ని పెళ్ళి చేసుకుంటావా?"
    "చేసుకోను. పెళ్ళి బాధ్యత నన్ను కని పెంచిన తలిదండ్రులకు వదిలిపెట్టాను. నిన్ను పెళ్ళి చేసుకోవడం నా తలిదండ్రుల కిష్టం లేదు. వారి కిష్టం లేని పని నేను చేయలేను."
    "నీకు నీ తలిదండ్రులు కావాలి. నాకు నువ్వు కావాలి. నీ తలిదండ్రుల కోసం నువ్వు నన్నే త్యాగం చేశావు. నీ కోసం నేను ప్రాణాలకే తెగించి నిన్నిక్కడకు తీసుకు వచ్చాను" అన్నాడు రామం.
    "ఎందుకు?"
    "చాలా అమాయకంగా ఈ ప్రశ్న వేసినంత మాత్రాన నువ్వు అమాయకురాలివని నేను నమ్మను. అనుకోకుండా ఐశ్వర్యవంతుల సంబంధం కుదరగానే మన ప్రేమ పాఠాలన్నీ మరిచిపోయావు నువ్వు. మాయమాట లతో నన్ను మభ్యపెట్టాలనుకుంటున్నావు. ఇప్పుడిక్కడ నీతో నాకు ఏం పనో నీకు బాగా తెలుసు" అన్నాడు రామం.
    "నిజంగా తెలియదు. ఎంతో మంచివాడైన రామానికి రాత్రి వేళ ఈ సమయంలో ఇలాంటి చోట నాతొ ఏం పని వుంటుందో నా ఊహ క్కూడా అందడం లేదు" అంది లీల.
    "రామం ఎంతో మంచివాడని నువ్వే ఒప్పుకుంటున్నావు గదా! అయితే నీ కళ్ళ ముందిప్పుడు నిలబడ్డది నీకు తెలియని రామం. నీక్కావలసిన రామాన్ని స్వార్ధంతో నీక్కాకుండా చేసినట్లే - నీకు తెలిసిన రామం నీకు తెలియని రామంగా మారడానికి కూడా నువ్వే కారణం" అంటూ రామం ఆమె చేయి పట్టుకుని మీదకు లాక్కున్నాడు.
    "రామం ఏమిటిది?" అన్న లీలకు అతనింక మాట్లాడడనీ చేతల్లోకి దిగాడని గ్రహించడానికి కొద్ది క్షణాలు కూడా పట్టలేదు. తన మాన సంరక్షనార్ధం ఆమె అతన్ని బలంగా తోసి పరుగెట్టింది.
    "లీలా! పరుగులో కానీ, బలంలో గానీ నువ్వు నన్ను గెలవలేవు. తప్పించుకోవడానికి ప్రయత్నించడం వల్ల నీ బట్టలు చిరిగిపోతాయి. నీ శరీరానికి గాయలవుతాయి. అంతకు మించి ప్రయోజనం లేదు" అంటూ లీలను హెచ్చరించాడు రామం. అతని హెచ్చరికలను లీల లక్ష్య పెట్టలేదు. ఫలితంగా రామం చెప్పినట్లే జరిగింది.
    "నీలో ఇంత దుర్మార్గం దాగి వుందని నేననుకోలేదు" అంది లీల అక్కడ నేల మీద కూర్చుని ఏడుస్తూ.
    "ప్రతి మనిషిలోనూ దుర్మార్గం వుంటుంది. అవసరాన్ని బట్టి అది బైటకు వస్తుంటుంది. నువ్వు నా పట్ల వహించిన దుర్మార్గం కంటే ఇది ఎక్కువ కాదులే!" అన్నాడు రామం.
    "ఇలా చేయడం వల్ల నీకు భార్య నౌతాననుకున్నావా?" అంది లీల ఉక్రోషంగా.
    "నిన్ను భార్యగా పొందాలన్న కోరిక నీ కారణంగానే నాలో ఎప్పుడో చచ్చిపోయింది. కాబోయే లాక్షాదికారిణితో ఈ మాత్రం పరిచయముండడం మంచిదనిపించి ఇలా చేశాను" అన్నాడు రామం.
    లీల మాట్లాడకుండా ఇంకా ఏడుస్తూ అలా కూర్చుని వుంది.
    "ఏడ్చి లాభం లేదు. జరుగావలసింది జరిగిపోయింది. నీ మనసులో ఎలా వున్నా నీ కారణంగా నాకు తృప్తి కలిగింది కాబట్టి చెబుతున్నాను. త్వరగా బట్టలు వేసుకో. ఆటోలో ఊళ్ళో దిగ బెడతాను "అన్నాడు రామం.
    లీల కదలలేదు. ఆమె ఇంకా ఏడుస్తోంది.
    "నేను త్వరగా ఆటోను స్వంత దారుకు అప్పజెప్పాలి. త్వరగా అటో ఎక్కు."
    లీలకు ఆ క్షణంలో భయం వేయలేదు. ఆమెకు చాలా ఉక్రొషంగా వుంది. తను సామాన్యుడి గా భావించి తీసిపారేసిన రామం ఈరోజు నన్ను లోబరచుకుని లోకువకట్టి మాట్లాడుతున్నాడు. ఆమెకు కాస్త పక్కగా ఆమె వంటి మీది బట్టలు కుప్పలా పడి వున్నాయి.
    "ప్రాణాలు తీయడం కంటే పెద్ద ఘతకమే చేశావు. ఇంకా ఏం భయపడతావ్ - పో - ఇక్కడ్నించి " అంది ఆమె వంచిన తల ఎత్తకుండా.
    ఆ తర్వాత ఆమెకు రామం మాటలు వినబడలేదు. మరి కొద్ది క్షణాలలో అటో స్టార్తయిన శబ్దం వినబడింది. లీల ఉలిక్కిపడి తల ఎత్తింది. ఆమె చూస్తుండగానే అటో కదిలి వెళ్ళిపోయింది.
    అప్పుడు లీల ఉక్రోషం మరిచి ఈ లోకంలోకి వచ్చింది. పరిస్థితి ఆకళింపు అయిందామేకు. పూరికి చిట్టచివర నిర్మానుష్య మైన చోట పరువంలో ఉన్న ఓ పెళ్ళి కాని పిల్ల మానభంగం కావించబడి నగ్నంగా వుంది. శిధిలావస్థలో ఆమె దుస్తులు అక్కడ పడి వున్నాయి. అక్కడ ఆమెకు తోడుగా ఇంకెవ్వరూ లేరు.
    ఇప్పుడు తను ఏం చేయాలి?"
    "లీల ఆలోచిస్తూనే వుంది. ఆమెకు ఏ ఉపాయమూ తోచడం లేదు. చిట్టచివరకు ఆమె ఎలాగో అలా అక్కణ్ణించి నడిచైనాసరే ఊళ్ళో కి వెళ్ళాలనుకుంది. ఆడదానికి మానభంగానికి మించిన ప్రమాద మేముంటుంది?" అది ఎలాగూ తనకు జరుగానే జరిగింది....
    లీల లేచి నిలబడి తన బట్టలను సమీపించా బోయి చటుక్కున ఆగిపోయింది. ఆమెకు కొంచెం దూరంలో ఎదురుగా ఒక పురుషుడు నిలబడి వున్నాడు. అతను రామం కాదు.
    "వేరి గుడ్ - చాలా బాగున్నావు" అన్నాడతను.
    లీల కుంచించుకు పోయింది. జీవితంలో ఇంత అవమానం తన కోరాకై కాచుకుని వున్నదని ఆమె ఎన్నడూ ఊహించలేదు. తన బట్టల నండుకోవడం కోసం ఆమె మరో అడుగు ముందుకు వేయబోయి ఆగిపోయింది.
    'అగు!" అన్నాడతను. అ కంఠస్వరం కఠినంగా వుంది.
    లీల చటుక్కున చతికిలబడి "ఎవర్నువ్వు?" అంది.
    "నే నేవరైనదీ నీకు అనవసరం. నువ్వా బట్టలు వేసుకోడం నాకిష్టం లేదు. కాబట్టి వేసుకోడానికి వీల్లేదు" అన్నాడు ఆ పురుషుడు.
    "నీకు దణ్ణం పెడతాను. దురదృష్టం నన్నింతవరకూ తీసుకు వచ్చింది. ఆ అవమానానికే నేనింకా తట్టుకోలేకుండా వున్నాను. నువ్వు నా జోలికి వచ్చావంటే నా ప్రాణాలు తీసుకుంటాను" అంది లీల.
    'ఛ -- ఛ -- ఎంగిలి కూడుకు ఆశించే వాడికింద జమ కట్టావన్న మాట నన్ను...." అంటూ అతను విసుక్కుని- నేనన్నదేమిటి -- నువ్వర్ధం చేసుకున్న దేమిటి?" అన్నాడు.
    "మరి ....మరి... బట్టలు వేసుకోకుండా ఇలా ఎంత సేపు....' ఏం మాట్లాడాలో తెలియక అక్కడితో ఆపి భయం భయంగా అతని వంక చూసింది లీల.
    "నువ్వు పెద్దింటి అమ్మాయివి. అవి నలిగి చిరిగిన బట్టలు. నీలాంటి వాళ్ళు అలాంటి బట్టలు వేసుకోవడం ఇష్టం లేక వద్దన్నాను కానీ నిన్ను బట్టలు వేసుకోవద్దనలేదు...." అంటూ అతను ఆమె పైకి ఒక ప్యాకెట్ విసిరాడు.
    లీల ఆశ్చర్యంగా చూసింది. ఆ ప్యాకెట్లో ఒక చీర, లంగా, బ్లౌజు, బ్రా వున్నాయి. ఆశ్చర్యమేమిటంటే లంగా, బ్లౌజు, బ్రా - కేవలం తనకోసం కొన్నట్లు చక్కాగా సరిపోయాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS