Previous Page Next Page 
వసుంధర కధలు -9 పేజి 55

 

    మిడతల దండు సభ్యుడికి ప్రతి వాడికీ ఒక నిర్ణీత ముంటుంది. టెలిఫోన్ , ఉత్తరం, కబురు వగైరా ఏదో సాధనంతో వారెం చేయాలో తెలియజేయబడుతుంది. సభ్యుడు పోలీసులకు సహాయపడుతున్నాడని ఏమాత్రం అనుమానంగా ఉన్నా దారుణమైన చావు చస్తారు. చచ్చాక మిగతా సభ్యులకు ఆ వార్త అందుతుంది.
    ఆ కారణంగా మిడతల దండులో చేరి ఇంకా బ్రతికి వున్న పోలీసులు అరిచేతిలో ప్రాణాలేట్టుకుని వుంటున్నారు. అయినప్పటికీ ఎలాగో అలా మిదతలదండు యొక్క భావి పధకాలు డిపార్టుమెంటుకి అందజేయ గలుగుతున్నారు. ఈ సమాచారాన్నందుకుని తమ డిపార్టుమెంటు వ్యక్తులకు ఏవిధంగా సాయపడాలా అని ఆలోచిస్తున్నారు పోలీసు ప్రముఖులు.
    ప్రస్తుతం పోలీసులకు తెలిసిన సమాచారం ప్రకారం మిడతలదండీ ఊళ్ళో మూడు పనులు చేయాలను కుంటుంది. ఆ వూళ్ళో శ్రీనివాసా బ్యాంకు వుంది. ఆ చుట్టూ పక్కల ఓ పది పదిహేనూళ్ళలో ఈ బ్యాంకు డబ్బుకు సంబంధించిన వ్యవహారాలు నడుపుతోంది. చాలామంది వ్యాపారస్థులు బ్లాక్ మనీ దాచుకునేందుకు ఈ బ్యాంకు సహాయపడుతున్నట్లు మిదతలదండు ఆరోపించి ప్రధమ ప్రయత్నంగా ఆ వూళ్ళో ని బ్రాన్చిని నిలువునా దోపిడీ చేయాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయాన్ని చాలా రహస్యంగా వుంచింది మిడతల దండు. బ్యాంకును పూర్తిగా దోచుకున్నాక అందులోని వ్యక్తులను అందర్నీ చంపేయాలని - అప్పుడే తన పధకం బహిర్గతం చేయాలని మిదతలదండు అనుకుంది. కానీ పోలీసు డిపార్టుమెంటుకీ వార్త చేరింది.
    మిడతల దండుకు సంబంధించిన రెండువ సమాచారం దేశం లోని అపూర్వ వజ్రాల గురించి, శంకర దాస్ గుప్తా అనే నగల వ్యాపారి దేశ దేశాలు తిరిగిన వాడు. అతని వద్ద అపూర్వమైన వజ్రాలు, రత్నాలూ వున్నాయనీ, వెల కట్టడానికీ చాలా కష్టమైన రాళ్ళ తని వద్ద వున్నాయనీ వదంతి వుంది. మిడతలదండు అవన్నీ సంపాదించాలని అనుకుంది. ఈ సమాచారం కూడా రహస్యమే అయినప్పటికీ పోలీసులకు చేరింది.
    ఆ ఊళ్ళో ఒక టెస్టింగ్ లాబరేటరీ వుంది. పేరుకు టెస్టింగ్ లాబరేటరీ అయినప్పటికీ -- అక్కడ డిఫెన్సు కి సంబంధించిన రీసెర్చి జరుగుతోంది. ఇది ఎవరికీ తెలియని రహస్యం. కానీ మిడతలదండు తెలుసుకుంది. ఆ లాబరేటరీ చీఫ్ అయిన శివప్రసాద్ ని డబ్బాశ చూపి లొంగ దీసుకుంది. అతడు లాబరేటరీ పరిశోధన ఫలితాలనన్నింటినీ కోడ్ లాంగ్వేజీ లో రాసి చందమామ అని పేరు పెట్టాడు. ఎవరయినా ఆ పుస్తకం చదివితే చంద్రుడికి గురించిన వివరాలున్నాయనుకుంటారు కానీ డీకోడ్ చేయగలిగితే ఇండియన్ డిఫెన్సు కు సంబంధించిన చాలా రహస్యాలున్నాయి. డిఫెన్సు లో ఒక మెకానిజమ్ యింప్రూవ్ చేయాలంటే రీసెర్చ్ చేయాలి. రిసెర్చి యెందుకు? లోపాలను సవరించడానికి. ఏయే విషయాల్లో రీసెర్చి జరుగుతున్నదో తెలిస్తే  ఏయే లోపాలున్నదీ సులభంగా తెలుసుకోవచ్చు. ఈ వివరాలన్నీ చందమామ లో వున్నాయి.
    శివప్రసాద్ చందమామ ను తయారు చేశాడు. కానీ అతని మనసు దేశభక్తికీ, ప్రాణ భయానికీ , ధనాశకూ మధ్య ఊగిసలాడుతుంది. ఇటీవలే మిదతలదండు అతనికో తేదీ యిచ్చింది. ఆ తేదీలోగా అతను చందమామను సిద్ధంచేసి మిడతల దండుకు అప్పగించాలి.
    బ్యాంకు యాజమాన్యాన్ని, శంకర్ దాస్ గుప్తా ని, శివ ప్రసాద్ ని మిడతలదండూ రహస్యంగా హెచ్చరించాడమే కాక -- తమ హెచ్చరిక బయటపడడానికి వీల్లేదని , అలా జరిగితే హెచ్చరిక నందుకున్న ఆయా వ్యక్తులు సకుటుంబంగా నాశన మవుతారని కూడా హెచ్చరించింది. ఈ వార్తలు  పోలీసు డిపార్టుమెంటుకు చేరాయి.
    అయితే ఈ విషయంలో పోలీసులు కొదొఆ బాగా తెలివి తేటలు చూపించారు. మిడతలదండు గురించిన సమాచారం తమకు తెలిసినట్లు వారే మాత్రమూ బయట పడలేదు.
    ఈ వివరాలన్నీ తెలిసిన సందర్భంలో ఏం చేయాలా అని ప్రముఖులందరూ ఆలోచిస్తున్న సమయంలో కొత్త సమస్య వచ్చి పడింది. ఒక ఆడపిల్ల మిడతలదండు చేయాలనుకున్న ఈ మూడు పనులనూ చేసేసింది.
    ఆ పిల్ల ఎవరు? మిడతలదండు ముఠా కు చెందినదేనా? లేక మరో కొత్త ముఠా ఏదయినా బయల్దేరిందా?
    పోలీసులు బాగా అలోచించి ఈ విధంగా అనుకున్నారు. ఆమెకు క్షుణ్ణంగా మిడతలదండు ముఠా పధకాలు తెలిశాయి కాబట్టి ఆమె ఆ ముఠాకు చెందనదే అయుండాలి. పోలీసుల ఆలోచనలను తప్పుదారి మళ్ళించడం కోసమని మిడతలదండు కొత్త ముఠా ను సృష్టించి వుండవచ్చు.
    "ఏది ఏమయినా మిడతలదండు మనగురించి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నది. దానికి మనసై గౌరవం వెలిగింది. ఆ గౌరవాన్ని నిలబెట్టుకునే విధంగా మనం ప్రవర్తించాలి. మన ఆలోచనలకు వాళ్ళు తప్పుదారి తోక్కిస్తున్నట్లే-- వాళ్ళ ఆలోచనలను మనమూ తప్పుదారి తొక్కించగలగాలి. అంటే ఒక్కటే ఉపాయం. మిడతలదండు సభ్యులు కొందరు మన వాళ్ళనే అనుమానం-- ముఠా నాయకులకు రావాలి" అన్నాడు పోలీసు కమీషనర్.

                                     6
    ఏదో చప్పుడుకు ఒక రాత్రి వేళ మెలకువ వచ్చిందామెకు. చేయి చాచి బెడ్ దగ్గరున్న లైట్ వేయబోయింది. ఎవరో ఆ చేయి పట్టుకున్నారు. ఆ చేయి కర్కశంగా వుండి పురుషుడని తెలుస్తూనే ఉంది. ఆమె తడబడకుండా -- "ఆడవారి చేయి పట్టుకోడాని కింత చీకటి కావాలా? దీపం వేస్తె నిన్ను చూస్తానని భయమా?' అంది.
    మరుక్షణమే గదిలో దీపం వెలిగింది. ఆ వ్యక్తీ ఆమె చేయి వదిలేసి "ఈ ప్రసాద్ అంటే సింహం . యెవరికీ భయపడడు." అన్నాడు.
    "గ్రామాల్లో గ్రామ సింహమంటారు. పట్నాల్లో నిన్నేమని పిలవాలో తెలియడం లేదు. పట్నసింహం కంటే ఉత్త సింహ మంటేనే బాగుంటుంది. సరేగానీ ఇందాక ట్నించీ లేని ధైర్యం ఇప్పుడెలా వచ్చింది? హటాత్తుగా దీపం వేశావ్" అందామె.
    ప్రసాద్ నవ్వి -- "నీ చేయి చాలా మెత్తగా వుంది. ముఖం చూడాలనిపించి దీపంవేశాను. బాగున్నావు నువ్వు" అన్నాడు.
    "నా బాగుకేం గానీనీ బాగు చూసుకో. ఇలా ఒంటరిగా నా దగ్గరకు రావడం మంచిది కాదు. ఇంతవరకూ ఇలా వచ్చి ప్రతి ఒక్కడూ చెడిపోయాడు' అందామె.
    "అయితే నేనెందుకో'చ్చానో తెలుసా?"
    "సి.బి.ఐ మనిషిని, అన్నీ తెలుస్తాయి నాకు."
    "కోయ్ " అని నవ్వేడతను. "నీమాటలు  విని నమ్మడానికి నేను బ్యాంకు ఉద్యోగిని కాను. శంకర దాస్ గుప్తాని కాను..."
    "ఇంకో పేరు మర్చిపోయావేమో."
    "నేను మర్చిపోయినా ఫరవాలేదు. గుర్తు చేసి మరీ అన్నీ నాకు అందిస్తావు" అని అదోలా నవ్వడం మొదలు పెట్టాడు ప్రసాద్.
    "మిస్టర్ ప్రసాద్, ఈ క్షణంలో నేను నిన్ను పోలీసులకు పట్టించగలను. సిబీఐ మనుషులతో వేళాకోళ మడటం వంటికి మంచిది కాదు." అందామె తీవ్రంగా.
    "కోయ్ ...." అని మళ్ళీ నవ్వసాగాడు ప్రసాద్.
    ఆమె కొద్దిగా ఉక్రోషాన్ని ప్రకటించి "అయిడెంటిఫికేషన్ చూస్తావా?' అనడిగింది.
    ప్రసాద్ నవ్వు అపబోయిన వాడల్లా ఈ మాటలు విని మరింత నవ్వడం మొదలు పెట్టాడు. తమాయించు కొన్నాక "నీ ఇష్టమొచ్చిన దేశానికి నన్ను గూడచారి అనుకో. ఆ అయిడెంటి ఫికేషన్ క్షణాల మీద చూపిస్తాను నీకు నేను" అన్నాడు.
    ఈసారి ఆమె కూడా నవ్వి "పోనీలే నేను సీబీఐ మనిషిని కాను"అంది.
    'అలాగని ఊరుకుంటే చాలదు. మిడతలదండు కు క్షమార్పణ చెప్పుకోవాలి నువ్వు."
    "దేనికి?"
    "మిడతలదండు సొత్తును నువ్వు తీసుకున్నావు?"
    "ఓక ఆడపిల్ల కష్టపడి సంపాదించుకున్న దాన్ని తన సొత్తుగా భావించడానికి మిడతలదండు కు సిగ్గు లేదా?" అందామేతీవ్రంగా.
    "నీకు చాలాపెర్లున్నాయని తెలుసు గానీ వాటిలో నాకు నచ్చిన పేరు లత!కాబట్టి మిస్ లతా! వృధా ప్రసంగం ఆపి నువ్వు స్వాధీనం చేసుకున్న మా సొత్తును మాకు అప్పగించి క్షమార్పణ అడుగు. ఆ విధంగా నీ ప్రాణాలు దక్కించు కుంటావు" అన్నాడు ప్రసాద్.
    "ప్రాణాల గురించి మరీ యెక్కువగా మాట్లాడుతున్నావ్. మీ మిడతలదండు లో వాళ్ళ సంగతి తెలియదు కానీ నాకు ప్రాణ భీతి లేదు. నా ముఠా లో నా లాంటి వాళ్ళు పాతిక మంది ఉన్నారు. నాకేమయినా జరిగిందో -- వాళ్ళు మీ మిడతల దండు ను నిప్పులో పేలుస్తారు."
    ప్రసాద్ స్వరం తగ్గించి "అయితే నీ  ముఠా ఉద్దేశ్య మేమిటి? మేము తలపెట్టిన కార్యక్రమాలకే నువ్వూ పూను కోవడం లో అంతర్య మేమిటి? తెలుసుకోవచ్చా?' అన్నాడు.
    "నా పరివారితో కానీ నేను మాట్లాడను. నువ్వు అనుచరుడి జాతి వాడివి. నాగురించి తెలుసుకోవాలనుకుంటే నీనాయకులను నా దగ్గరకు రమ్మను. నేనింకా ఈ హోటల్లో అయిదు రోజులుంటాను." అంది లత.
    'అంతవరకూ ఇన్ స్పెక్టర్ చంద్రశేఖర్ కళ్ళ బడకుండా ఉంటె?" అన్నాడు ప్రసాద్ వ్యంగ్యంగా.
    లత ఈసారి నవ్వి "నువ్వు చాలా అమాయకుడిలాగున్నావు. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం వేస్తె కావాలని ఆంజనేయుడు కట్టుబడ్డట్టు నేనూ అంతే చేశాను. నీకు సరదాగా ఉంటె చంద్రశేఖర్ కి ఫోన్ చేసి నా వివరాలు చెప్పు. సీబీఐ మనిషిని మట్టుకోడానికి కూడా ధైర్య ముండతనికి" అంది.
    ప్రసాద్ తడబడి , మనసులో "నీ సిబిఐ బంగారం కానూ" అని మాత్రం అనుకున్నాడు. లత తనకు కొరుకుడు బడదని అర్ధమయేక అక్కణ్ణించి కదిలాడతను.

                                     7
    లత ఆ హోటల్లో రెండు రోజులుంది.
    ఆ రెండు రోజులు ఆమె గది వదిలి బయటకు రాలేదు. ఆమెను మాత్రం ముగ్గురు వ్యక్తులు కలుసుకున్నారు. ముగ్గురూ మిడతలదండు కు సంబంధించిన వారే.
    తాము మిడతలదండు నాయకులమని ముగ్గురూ అన్నారు కానీ ఆమె రకరకాల ప్రశ్నలు వేసి వాళ్ళు నాయకులన్న నమ్మకం తనకు కలగడం లేదని చెప్పింది. వాళ్ళు యెన్నో రకాల ఆమెకు నచ్చ జెప్పడానికి ప్రయత్నించి విఫలులై వెళ్ళిపోయారు.
    రెండో రోజు సాయంత్రం ఆమె వద్ద కింకో వ్యక్తీ వచ్చాడు. అతనామేను సూటిగా ఒకేఒక ప్రశ్న వేశాడు -- "నేను మిదతలదండు నాయకుడి నని ఎలా నమ్ముతావు?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS