Previous Page Next Page 
వసుంధర కథలు-14 పేజి 54

 

                                ప్రేమ దేవత

                                                               వసుంధర

    "కళ్ళు మూసుకో -- దైవ ప్రార్ధన చేసుకో " అన్నదామె.
    అతడు దీనంగా ఆమె వంక చూశాడు. అతడు కూర్చుని వున్నాడు. చేతులు వెనక్కు విరిచి కట్టబడి వున్నాయి. అతడి నడుం స్థంబానికి కట్టబడి వుంది. ముందుకు జాపిన కాళ్ళు రెండూ దగ్గరగా కట్టబడి వున్నా యి.
    అతడు అసహాయుడు.
    "ప్లీజ్ ...నన్ను....చంపవద్దు" అన్నాడతను.
    ఆమె చేతిలో కత్తి వుంది. అది యెనిమిదంగుళాల పొడవు వుంది. తళతళ మెరుస్తోంది. అయితే ఆమె కంటి చూపులు ఆ కత్తి కంటే వాడిగా వున్నాయి.    
    అతడు కంగారుగా , దిగులుగా ఆలోచిస్తున్నాడు.
    ఇలా జరుగుతుందని అతడనుకోలేదు . ఇంట్లో ఒంటరిగా వున్నాడు. ఆమె ఫోన్ చేసింది - వస్తానని!
    రమ్మన్నాడు....
    వచ్చింది.
    శృంగారం నటించి బుట్టలో వేసుకుని ఈ స్థితికి తీసుకుని వచ్చింది. ఇప్పుడు తనేం చేయాలి ?
    "ఇంకా కళ్ళు మూసుకోలేదు నువ్వు ...." అన్నదామె.
    "భయం వేస్తోంది ....' అన్నాడతను.
    "నీకు భయమా? నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తోంది."
    "ప్లీజ్ -- నన్న వదిలిపెట్టు ...." మళ్ళీ అన్నాడతను.
    "నేను చెప్పేది ఒక్కటే మాట -- కళ్ళు మూసుకో -- దైవప్రార్ధన చేసుకో!" అన్నాదామే.
    "నాకు వేరే దైవం లేదు. నువ్వు నా దైవానివి" అన్నాడతను.
    "నిజంగా ?" అన్నదామె నవ్వుతూ.
    "అవును" అన్నాడతను.
    "నువ్వు నీ దైవాన్ని ఏమి చేయాలను కుంటున్నావో చెప్పు !" అన్నదామె ఇంకా నవ్వుతూ . ఆ నవ్వులో వెటకారం వుంది.
    "ప్రతిరోజూ పూజ చేస్తాను" అన్నాడతను.
    "ఒక్కసారి గుర్తు చేసుకో -- ఇదివరకు గూడా ఇలాంటి మాటే అన్నావు" అన్నదామె అదేవిధంగా నవ్వుతూ.
    అతను కళ్ళు మూసుకున్నాడు.
    "దైవ ప్రార్ధన చేసుకుంటున్నావా?' అన్నదామె.
    "లేదు-- గతాన్ని గుర్తు చేసుకుంటున్నాను ...." అన్నాడతను.
    "గుర్తుచేసుకో ....నువ్వేం గుర్తు చేసుకుంటున్నావో పైకి అను. తప్పు చెప్పవా - కత్తి సూటిగా గుండెల్లో దిగుతుంది " అన్నదామె.
    
                      *    *    *    *    *

    ఇద్దరూ బీచి వద్ద కూర్చుని వున్నారు. అతను వున్న ట్లుండి కనులు మూసుకున్నాడు.
    "కంట్లో ఏమైనా పడిందా ?" అన్నదామె కంగారుగా.
    "నీ వంటి కేమైనా అయిందా?" అన్నాడతను తాపీగా.
    "నీ కంటికి నా వంటికీ ఏమిటి సంబంధం?"
    "నా కంటి నిండా నీవే వున్నావు, నా కంట్లో ఏం పడినా నీ వంటికి ఏదో అవుతుంది.  అలా ఏమీ కాలేదంటే నా కంట్లో ఏమీ పడలేదనే అర్ధం" అన్నాడతను.
    "అబ్బ -- ఎంత తెలివిగా మాట్లాడావు? అన్నదామె.
    "ఈ తెలివి నా స్వంతం కాదు" అన్నాడతను.
    "ఎక్కణ్ణించైనా అద్దెకు తెచ్చుకున్నావా ?"
    "లేదు. నేను భక్తుణ్ణి ...." అన్నాడతను.
    "భక్తులకు తెలివితేటలుంటాయా ?" అన్నదామె ఆశ్చర్యంగా.
    "భక్తుల కున్న తెలివి తేటల వల్లనే కదా - ఉన్నాడో లేదో తెలియని దేవుడికి ఊరూ పేరూ వస్త్గున్నాయి ."
    "అబ్బ - నీ మాటలు అర్ధం చేసుకోవడం చాలా కష్టం. ఇంతకూ నువ్వు కళ్ళేఎందుకు మూసుకున్నావో చెప్పు" అన్నదామె.
    "పొరపాటున నీ ముఖంలోకి సూటిగా చూశారు. కళ్ళు జిగేలుమన్నాయి...."
    "మరీ అంతలా పోగటకు....నాకు సిగ్గేస్తోంది " అన్నదామె.
    "పొగడ్డం నిజంగా నాకు చేతనై వుంటే ఈ పాటికి మా ఆఫీసులో నాకు చాలా ప్రమోషన్లు వచ్చి వుండేవి. నాకు నిజం తప్ప మరోటి చెప్పడం రాదు...." అన్నాడతను.
    "పోనీ కాసేపు మాట్లాడ్డం మానేయ్...."
    "మానేస్తాను -- నన్ను పూజ చేసుకోనిస్తే ...."
    "పూజా ?" అన్నదామే ఆశ్చర్యంగా .
    "అవును నా పూజ చూద్దువు గానీ -- నా గదికి వస్తావా?"
    "నీ గదికా - పెళ్ళి కాకుండా అక్కడికి రాను...."
    "అంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నావు . అయితే ఇప్పుడే నేను యిక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఎందుకంటె దేనికీ నిన్ను నేను తప్పు పట్టలేను. ఒక ఆడపిల్ల పేమ మైకంలో పడిపోకుండా తన జాగ్రత్తలో తనుండాలను కోవడం సహజం. అందుకు నిన్ను నేను తప్పుపట్టలేను. కానీ నువ్వు నన్ను అనుమానించావంటే నా ప్రవర్తనలో ఏదో లోపమున్నదన్న మాట ."
    "అలాగనవద్దు నీ ప్రవర్తనను నేనూ తప్పు పట్టలేను."
    "ఇవన్నీ ఉత్తుత్తి మాటలు. నిజంగా నువ్వు నన్ను నమ్మిన పక్షంలో నాతొ నా గదికి వస్తావు -- " అన్నాడతను.
    ఆమె లేచి "పద!' అంది.
    "నిజంగా నువ్వు ఒప్పుకున్నావా?" అన్నాడతను ఆశ్చర్యపోయి.
    "పద!" అన్నదామె మళ్ళీ.
    ఇద్దరూ అతడి గదికి వెళ్ళారు. అతడు గది తలుపులు వేశాడు.
    ఆ గదిలో ఓ మంచం వున్నది. మంచం మీద ఎత్తైన పరుపు. తెల్లని దుప్పటీ ....దుప్పటి పై మల్లెపూలు.
    గదిలో మత్తైన పరిమళం.
    ఆమెకు అనుమానం వచ్చింది. కానీ బయటపడలేదు.
    "ఇందులో నాకెక్కడా దేవుడి పటం కనబడడం లేదు " అన్నదామె.
    "నాకు దేవుడు లేడు ....నువ్వే నా దేవతవు ...." అన్నాడతను.
    "అంటే?" అన్నదామె కంగారుగా.
    "ఈ గది నా పూజా మందిరం. ఈ మంచం నా ప్రేమ సింహాసనం. నిన్నీ సింహాసనం పై అధిష్టింపజేసి ప్రేమ పూజ చేస్తాను."
    "చివరికి నేననుకున్నట్లే చేశావు" అన్నదామె.
    "ప్లీజ్ నన్ను అనుమానించకు. వెళ్ళి ఆ మంచం మీద కూర్చో !" అన్నాడతను.
    "కూర్చుంటాను ....పడుకొను" అన్నదామె.
    "నీ యిష్టం " అన్నాడతను.
    "నీవు నా పక్కన కూర్చోకూడదు ....నన్ను తాకకూడదు.
    "ప్లీజ్ ....తాకవద్దని మాత్రం అనకు."
    "ఎందుకు?"
    "పూజకు నీ పాదాలు తాకవలసి వున్నది ."
    "ఛీ" సిగ్గుపడిందామె.
    "ప్లీజ్ ....ఇది నా ముచ్చట ....కాదనకు...."
    ఆమె వెళ్ళి మంచం మీద కూర్చుంది . అతడామె పాదాల చెంత చతికిల బడ్డాడు.
    "ఛీ -- ఏమిటిది?"
    "నీవు దేవతవు. నేను భక్తుణ్ణి. ఇది యింతే " అంటూ అతడు జేబులోంచి చిన్న పొట్లం తీసి అందులోని మల్లెపూలు ఆమె పాదాల మీద వేస్తూ -- ప్రేమ దేవాతాయై నమ్హ అంటూ స్తోత్రం చదవసాగాడు.
    కొద్ది క్షణాలు ఆమె సహించింది. తర్వాత "ఏమిటిది?" అంటూ లేచి నిలబడింది.
    అతడామె పాదాలు గట్టిగా పట్టుకుని "నా దేవతకు ఆగ్రహం వచ్చింది. పూజ మధ్యలో లేచిపోయింది" అన్నాడు దిగులుగా.
    "లేదు -- నాకీ పూజ చాలు ."
    "నిజం గానా ?"
    "నా పూజ నీకు తృప్తి కలిగించిందా ?"
    "ఊ"
    "మరి నీ భక్తుడికి వరమేమిస్తావు ?"
    "వరం దేవత చెప్పదు . భక్తుడు అడగాలి."
    "అడిగితె దేవత ఇస్తుందా ?"
    అతడు లేచి నిలబడ్డాడు. ఆమె వంక సూటిగా చూసి కనులు మూసుకుని "నేను అడగలేను" అన్నాడు.
    'అయితే నేను వెళ్ళిపోతాను ' అన్నదామె.
    "నువ్వు వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను ."
    ఆమె అతడి వంక చూసింది -- "పెళ్ళి కాకుండా తప్పు కదూ?" అన్నది.
    "పెళ్ళి సమాజం కోసం. అది ఈ రోజు కాకుంటే రేపైనా జరుగుతుంది. కానీ అంతవరకూ నేను బ్రతికి వుండగలనా?"
    "నువ్వు బ్రతికి వుండాలి --"
    "అయితే నీకు ఇష్టమేనా ?"
    ఆమె తల వంచుకుంది. అతడామెను దగ్గరగా తీసుకున్నాడు....

                        *    *    *    *    *

    "నువ్వు చచ్చిపోతావేమోనని ఆరోజు నీరు లొంగి పోయాను. కానీ ఈరోజు నిన్ను లొంగదీసి మరీ చంపుతున్నాను. ఓడలు బండ్లు ...బండ్లు ఓడలు అంటారు. ఇదే కాబోలు " అన్నదామె కఠినంగా.
    "నన్ను చంపవద్దు -"
    "నిన్ను చంపకపోతే ఎలా?"
    "నన్ను చంపడం వల్ల నీకు లాభమేమిటి?"
    "నాకు కాదు ఆడపిల్లలకు లాభం. నీలాంటి మోసగాళ్ళు బ్రతికి వుండకూడదు " అన్నదామె.
    "నేను నా తప్పులన్నీ ఒప్పుకుంటాను. నువ్వెలా చెబితే అలా వింటాను. నన్ను వదిలిపెట్టు ."
    'అయితే నన్ను పెళ్ళి చేసుకుంటావా ?"
    "చేసుకుంటాను "
    "మరి నీ భార్యనేం చేస్తావ్ ?'
    "నువ్వేం చెబితే అది చేస్తాను"
    "నీ భార్యకు చంపమని విషం ఇస్తాను . అదామే కిస్తావా ?"
    "ఇస్తాను --"
    "అందుకే నిన్ను చంపాలనుకుంటున్నాను. నీ అవసరం తీరడం కోసం నువ్వేమైనా చేస్తావు. నువ్వు నీచుడివి. దుర్మార్గుడివి అల్పుడివి తుచ్చుడివి ."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS