ప్రేమ దొంగ
జొన్నలగడ్డ రామలక్ష్మీ.
నేను మోహన్ ని ప్రేమించినపుడు అతడి ఉద్యోమొకటే చూశాను. మా యింట్లో నేను పొందని సుఖా లన్నీ అతడి వల్ల పొందవచ్చు ననుకున్నాను.
నాకెన్నో సరదా లున్నాయి. మా యింట్లో అవేమీ తీరడం లేదు. పౌడరు డబ్బా కొనాలంటేనే మా యింట్లో గగనమయి పోతుంది.
నేను చాలా అందంగా ఉంటానని నా స్నేహితురాళ్ళు అంతా అనేవారు. ఎక్కడి నుంచో ఓ రాజకుమారు డోచ్చి అమాంతం నన్ను పెళ్ళాడేస్తాడని వాళ్ళు అభిప్రాయాపడేవారు.
అసలు చదువుకునే రోజుల్లోనే డబ్బున్న అబ్బాయి యెవడయినా నన్ను ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడని నేనే ఆశపడ్డాను. అప్పటికీ నాకు అత్యాశ లేదు. కుర్రాడికి అందం అవసరం లేదు. పెర్సనాలిటీ అవసరం లేదు. డబ్బు అదోక్కటుంటే చాలు.
అయితే ఇంటర్మీడియట్ కాగానే నాన్న నన్ను ఇంట్లో కూర్చోపెట్టి సంబంధాలు చూడటం మొదలు పెట్టాడు. అన్నీ అంతంత మాత్రపు సంబంధాలు. ప్రతి ఒక్కరికీ తల మునకలయ్యే బాధ్యతలు. పెళ్ళాం సరదాలు తీర్చగల లక్షణాలు వాళ్ళలో బొత్తిగా లేవు.
కానీ యివన్నీ నాన్నకు చెప్పుకోలేను. అయన తెచ్చిన ప్రతీ సంబంధం చేదిపోవాలని కోరుకున్నాను. చాల సులభమయిన కోరిక కోరాననేమో దేవుడు యీ కోరిక మాత్రం తీరుస్తూ వచ్చాడు.
మింగ మెతుకులేని వెధవ కూడా కట్నం పాతికవేలు అడుగుతున్నాడు. నాన్నకు అంత శక్తి లేదు. ఎలాగో అలాగా పదివేలు కట్న మివ్వగలనని అయన ననుకుంటున్నాడు. చిన్నతనం నుంచీ నా పెళ్ళి కోసం అయన యెంతో పొదుపు చేసి చేసి కూడా బెట్టిన డబ్బు అది, నాకు యిద్దరు అన్నలున్నారు. వాళ్ళిద్దరూ ఎలాగో కష్టపడి పెళ్ళి ఖర్చులు భరిస్తామంటున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో నాకు మంచి సంబంధ యెలా వస్తుంది.
అందుకని నేను అడ్డదారి తొక్కాను.
ఇంట్లో ఊరికే కూర్చోడ మెందుకని ఓ టైపు ఇన్ స్టిట్యూట్లో చేరాను. అక్కడ టైపు, షార్టు హ్యాండు, శ్రద్దగానే నేర్చుకునేదాన్ని. అయితే యింట్లోంచి బయట పడడానికి వంకగా కూడా దీన్ని యేన్నుకున్నాను.
ఆ టైపు యిన్ స్టిట్యూట్ కు వస్తుండేవాడు మోహన్. అతడు తన ఆఫీసుకు సంబంధించిన కాగితాలు యిక్కడ టైపు చేయించేవాడు. చూడగానే ఆకర్షించే రూపం కాదతడిది.
అతడి గురించి మొదట్లో నే నట్టే పట్టించుకోలేదు. ఓ రోజు నాతొ పాటు యిన్ స్టిట్యూట్ కు వచ్చే లత అనే అమ్మాయి అతడి గురించి చెబుతూ - "అతనలా కనబడతాడు. కానీ ఏదో కంపెనీలో చాలా పేద్ద ఉద్యోగమట. ఇప్పుడే నెలకు పదిహేనొందలు పైగా వస్తుందట' అంది.
అంతే! మోహన్ చుట్టూ నా ఆశలు పేరుకు పోసాగాయి. అతడి మీదకు వల విసరాలని నిర్ణయించుకున్నాను.
,ముందు అతడికో ప్రేమలేఖ టైపు చేసి పోస్టు చేశాను. నేనెవరో చెప్పకుండా నా ప్రేమ నతడికి తెలియబరుస్తూ ఫలానా పార్కులో ఫలానా టైముకి ఫలానా సంకేత స్థలంలో కలుసుకొమ్మని వేడుకున్నాను! ఆ టైముకి నేను అక్కడ కూర్చున్నాను.
అతడు వచ్చాడు. నన్ను చూసి ఆశ్చర్యపోయాడు. అతడ్ని చూసి నేను ఆశ్చర్యం నటించాను.
అతడికి ప్రేమ వ్యవహారాలు నడపడం తెలియదో లేక అన్నీ ముక్కుకు సూటిగా చేసుకుపోతాడో నేనెరుగును. కానీ అతడు టైపు చేసిన ఉత్తరాన్ని నాకు చూపించి అది నేను రాసిందేనా ? అనడిగాడు.
కాదని చెప్పాను.
"మరి మీరెక్కడ ఎందుకున్నారు?" అనడిగాడు.
"మరి మీరిక్కడ ఎందుకున్నారు?" అనడిగాడు.
"నా స్నేహితురాలు వనజ వస్తానని చెప్పింది" అని ఉలిక్కిపడ్డట్లు "కొంపతీసి అదే మీకీ ఉత్తరం రాసిందేమో! ముక్కూ మొహం యెరుగని వాళ్ళను యిలా పార్కుల్లో కలవడం దానికి అలవాటే" అన్నాను.
ఈ సమాధానం అతడికి తృప్తి కలిగించినదేమో అతడాక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోకుండా మరికాసేపు కూర్చున్నాడు. అ కాసేపటి లోనూ నేనెలాగో వీలు చూసుకుని అతడి రూప విశేషాలను పోగిడాను. అతడు చాలా సంతోషించాడు. అతడు కదలలేని విధంగా చూశాను. మొత్తం మీద అతడిని ప్రేమలోకి దింపాను.
మేము మళ్ళీ మళ్ళీ కలుసుకునే వాళ్ళం. నేను అతడి ముందు పైట జార్చినా పట్టించుకోకుండా పకపకా నవ్వుతూ పరధ్యానం నటించేదాన్ని. కాని మా మధ్యదూరం మాత్రం జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాను. ఆ కారణంగా అతడికి నాపై ఆకర్షణ పెరిగిపోసాగింది.
ఒకరోజున అతడు అనేశాడు - "నువ్వు లేందే నేను బ్రతకలేను. మా నాన్న నాకోసం ఎన్నో సంబంధాలు చూస్తున్నాడు. అవేమీ వద్దని చేపెస్తాను. నాకు నువ్వే కావాలి. ఈ విషయం రేపే మా నాన్న కుత్తరం రాస్తాను. నీకేం అభ్యంతరం లేదు కదా!"
"నాకు మీరంటే ఇష్టం. అంతవరకే నేను చెప్పగలను. ఆడపిల్లను, అస్వతంత్రురాలిని. పెద్దల నిర్ణయానికి కట్టుబడి వుండాలి కదా" అంది.
"మీ పెద్దవాళ్ళు అభ్యంతరం చేబుతారంటావా ?" అన్నాడతను భయంగానూ, అనుమానంగానూ.
"మీరేమిటో , మీ పరిస్థితి ఏమిటో నాకు తెలియదు. నాకు కాబోయే వరుడు కనీసం నెలకు ఆరేడు వందలైనా సంపాదించుకుంటూ ఉండాలని నాన్న అనుకుంటున్నాడు." అన్నాను నెమ్మదిగా.
అతడు ఆశ్చర్యంగా "నా ఉద్యోగం సంగతి నీకు తెలియదా ?" అన్నాడు.
"ఎలా తెలుస్తుంది మీరు చెప్పందే" అన్నాను.
నిజానికది అతడి తప్పు కాదు. అతడి ఉద్యోగ ప్రసక్తి మా మధ్య రాకుండా నేను జాగ్రత్త పడేదాన్ని. అతడి ఉద్యోగం చూసి కాక అతడిని చూసే ప్రేమలో పడ్డానన్న భ్రమను అతడికి కలిగించాలి.
"నెలకు ఆరేడు వందలెం ఖర్చు - అంతకు రెట్టింపుకు పైగానే సంపాదిస్తున్నాను" అన్నాడతను గర్వంగా.
'అమ్మ బాబోయ్" అన్నాను కంగారుగా.
"ఏమయింది?" అన్నాడతను కంగారుగా.
"మిమ్మల్ని మొదటిసారి కల్సుకోగానే ఏదో మైకంలో పడిపోయాను. మీ వ్యక్తిత్వం , మాటలు నన్నెంతగానో ఆకర్షించాయి. మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ కలుసుకోవాలనిపించింది. నేనేం చేస్తున్నానో తెలీకుండానే మిమ్మల్ని కలుసుకుంటున్నాను. మీ వుద్యోగం గురించి తెలిస్తే మీతో యింతలా కలిసి తిరిగేదాన్ని కాదు - " అన్నాను దిగులు నటిస్తూ.
"నా వుద్యోగం చేసిన తప్పేమిటి ?...." అన్నాడతను కంగారుగా.
"తప్పు మీ వుద్యోగానికి కాదు. మా పేదరికానిది --" అన్నాను.
"అంటే?"
"మీ సంపాదనకు చాలా కట్నం కావాల్సి వుంటుంది. మా నాన్న చిన్న ఉద్యోగస్టుల్నే కానీ భరించలేడు --" అన్నాను.
అతడు కాస్త ఆవేశపడ్డాడు -- "అవన్నీ తర్వాత -- ముందు నీకు నేనంటే యిష్టమో, కాదో చెప్పు " అన్నాడు.
"ఆ ప్రశ్న నన్ను కాదు -- నా కళ్ళ నడగండి -- చెబుతాయి--" అన్నాను.
ఈ డైలాగు నా స్వంతం కాదు. ఇంటర్మీడియట్ చదివే టప్పుడు ఆడపిల్లలమంతా కలిసి ఓ నాటకం వేశాం. అందులో నా క్లాస్ మేట్ ఒకామె నాకు ప్రియుడిగా వేసింది. ఆమెతో నేనీ మాట అంటాను. దీనికి ఎలా నటించాలో సైన్సు టీచరు నాకు తను నటించి చూసి మరీ బోధించింది. అ విధంగా ఆ చూపు నాకు ప్రాక్టీసయింది. నాతకమయ్యేక నా క్లాస్ మేట్ నాతొ అంది - "అప్పటి నీ చూపు చూస్తె ఆడపిల్ల నేందుకయ్యానా అని బాధ కలిగింది -'
ఆ నాటకంలో ఉత్తమ నటి బహుమతి నాకే వచ్చింది.
ఆ నటన విప్పిడిలా జీవితంలో ఉపయోగిస్తున్నాను. బహుమతిగా మోహన్ లభిస్తే -- ఆ చూపు నేర్పిన సైన్సు టీచరుకు పెళ్ళయాక వెళ్ళి పాదాభినందనం చేసి రావాలి.
అతడికి నా చూపుల అర్ధం తెలిసిపోయి నట్లుంది. మర్నాడే నాన్నను కలుసుకుని తను ప్రేమిస్తున్నట్లు పెద్దల అనుమతితో పెళ్ళి చేసుకుందామనుకుంటున్నట్లూ చెప్పాడు.
"ఆడపిల్ల తండ్రిని, ఏం చేసినా మీవాళ్ళు అన్నింటికీ ననన్నుమానిస్తారు . నా అనుమతి ఎలాగూ వుంది. ఈ పెళ్ళి మీ పెద్దల అనుమతితో జరగాలి -- " అన్నాడు నాన్న.
నాన్న అతడి తండ్రి కుత్తరం వ్రాశాడు.
మోహన్ తండ్రి పేరు శేఖరం. అయన కొడుకును తీసుకుని పెళ్ళి చూపులకు వచ్చాడు. అప్పుడే నేనాయన్ను చూశాను.
అయన పచ్చగా, పొడుగ్గా, బలంగా, హుందాగా , ఠీవి గా వున్నాడు. మోహన్ పోలికలు ఆయనవి కాదు. అతడి కాయన పోలికలు వచ్చి వుంటే ఇంకా చాలా బాగుండేదనిపించింది.
"వాడు ప్రేమించానని ఉత్తరం వ్రాస్తే ఏమిటో నానుకుని కంగారు పడ్డాను. ఇంత సంప్రదాయం కుటుంబమనీ, లక్షణమైన పిల్ల అనీ తెలిస్తే ఈ సంబంధం కోసం నేనే వెతుక్కుంటూ వచ్చేవాడిని --" అన్నాడాయన.
ఈ మాటలకు నాన్న కంటే ఎక్కువగా నేనే సంతోషించాను.
నాన్న తన ఆర్ధిక పరిస్థితి నాయనకు వివరించాడు.
"దానికేముంది -- కట్నం పదివేలు చాలు నాకు. అదైనా పెళ్లి ఖర్చుల గురించీ , బంధు మర్యాద గురించీ ను. మగ పిల్లాడి పెళ్ళికి చేతి డబ్బు పడితే అంతా వెటకారం చేస్తారు గదా -- అందుకని .... ఎటొచ్చీ పెళ్ళి ముహూర్తం రెండు వారాలున్నదనగా నాకు డబ్బు క్యాషు రూపంలో ఇవ్వాలి" అన్నాడాయన.
అంత మంచి సంబంధం తనకు అందుబాటులోకి వచ్చినందుకు నాన్న అపరిమితంగా సంతోషించాడు. ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.
ఆప్పుడాయన తన సంగతి చెప్పుకున్నాడు.
