"వీరభద్రమ్మకో తమ్ముడున్నాడు. అతడికి అక్కంటే పంచ ప్రాణాలూను. అక్క పాడిన పాట లున్న పెట్టె అతడు బావ నడిగి తీసుకువెళ్ళాడు . ఆ పాటల మధ్య -- వీరభద్రమ్మ నీతో చేసిన సంభాషణ రికార్డయింది. అధతను విన్నాడు ...." అన్నాడు బ్లాక్ మెయిలర్.
"ఇది చాలా తమాషాగా వుంది ....' అన్నాడు ఆత్మారామం.
"వీరభద్రమ్మ కిది అలవాటే నట. ఎవరితో నైనా మాట్లాడుతున్నాప్పుడామే అప్రయత్నంగా టేపు రికార్డర్- రికార్డింగ్ స్విచ్ నొక్కుతుంటుంది. అలాగే ఇప్పుడూ జరిగి వుండాలి. లేక కావాలైనా ఆమె అలా చేసి వుండాలి. ఏమయితేనేం ఆమె తమ్ముడి కిది తెలిసింది. అతడికి ప్రసాదరావు మీద మంట పుట్టింది. అతడి నేరాన్ని బైట పెట్టాలని పట్టుబట్టాడు. నిన్ను చూచాయగా కదిపి చూశాడు. నువ్వు ప్రసాదరావంటే భయపడుతున్నావనీ నీ నుంచి ఆ సమాచారం మాములుగా బైట పడదనీ తెలుసుకున్నాడు. అప్పుడు నేను అతడి కోరిక మీద రంగం లోకి దిగాను. ఇప్పుడు నీ దగ్గర వున్న ఆ ఉత్తరం విలువ లక్ష రూపాయలు. అది నాకు అందజేసి ఈ నెగటివ్ లు తీసుకుని పోవచ్చు --" అన్నాడు బ్లాక్ మెయిలర్.
"ఆ ఉత్తరం బయట పడితే ప్రసాదరావు నన్ను.....
"నువ్వు భయపడకు . నీ పేరు బయటకు రానివ్వడం జరుగదు. వచ్చినా నువ్వు ప్రసాదరావు కంటే బలవంతుడి రక్షణలో వుంటావు. ఓ దుర్మార్గుడిని ఉరికంబం మెక్కించడానికి నువ్వు చేస్తున్న సాయం నీ భవిస్యత్తు కు మంచి బాట వేయగలదు...."
'అయితే ముందు నాకా నెగటివ్ లివ్వు ...."
"నో నో! ఉత్తర మిచ్చాకనే నెగేటివ్స్...."
"ఉత్తర మిచ్చాక నువ్వు నన్ను మోసం చేస్తే ....?" భయంగా అడిగాడు ఆత్మారామం.
"మోసం చేసి నేనేం బావుకుంటాను. నువ్వేమైనా రాజకీయ నాయకుదివా, పారిశ్రామికవేత్త వా- బ్లాక్ మెయిల్ చేస్తే పరువు పోతుందనుకుందుకు. నీ నుంచి ఈ వుత్తరం ప్రయోజన ముండడం వల్ల నిన్ను బ్లాక్ మెయిల్ చేయాలనుకునేటంత చచ్చు వెధవేవడూ ఉండడు....'
ఆత్మారామం ముఖం చిన్నబోయింది. అయితే ఆలోచించాడు.
అత్తయ్య తన సమర్ధతను విశ్వసించి ఓ పని తనకు అప్పజెప్పింది. ఆమె ఆత్మకు శాంతి కావాలంటే ఆ పని పూర్తీ చేయాలి.
అతడా వుత్తర్తం బ్లాక్ మెయిలర్ కందజేయాలని నిర్ణయించుకున్నాడు. అందువల్ల మరో లాభముంది. ప్రసాదరావు జైలు పాలయితే అయన కూతుర్ని తనే వివాహం చేసుకొనవచ్చు. అడ్డేవారుండరు. అదీకాక అది తన అబీష్టమని వీరభద్రమ్మ వుత్తరంలో రాసింది.
3
ప్రసాదరావు నేరం రుజువయింది. అతడు జైలు పాలయ్యాడు. అయన కుమార్తె సుమలత ఒక్కసారిగా దిక్కులేని దయింది. ఆమెను సమయానికి ఆత్మారామం తలిదండ్రులు పెద్ద దిక్కుగా ఆదుకున్నారు.
ఆత్మారామం యిప్పుడు సుమలత సాహచర్యం కోసం తహ తహ లాడుతున్నాడు. ఆమె తనది కాగలదని ఆశ పడుతున్నాడు. ఎటొచ్చీ మర్యాదకు కొద్ది వారాలు ఆగాడు.
ఒకరోజున ఆమెతో ఏకాంతం కల్పించుకుని తనామెను ప్రేమిస్తున్నాననీ పెళ్ళి చేసుకుంటాననీ అన్నాడు.
"వద్దు బావా! నువ్వు పిరికివాడివి. పిరికివాళ్ళతో నేను సుఖ పడలేను. నీకై నువ్వే ధైర్యం చేసి నీ దగ్గరున్న ఆ వుత్తరం బయటపెట్టి వుంటే నేను చాలా సంతోషించేదాన్ని. నీ పిరికితనం మన మధ్య దూరాన్ని సృష్టించింది " అంది సుమలట్ అదోలా.
"అదేమీ కాదు. నేను మీ నాన్నను నేరస్థుడిని చేశానని నీకు నా మీద కోపం. అవునా...." అన్నాడు ఆత్మారామం.
సుమలత నవ్వి ..." నా ప్రాణానికి ప్రాణమైన అమ్మను -- మరో ఆడదాని మీద వ్యామోహంతో పొట్టన బెట్టుకున్న ఆ కిరాతకుడంటే చిన్నతనం నుంచీ నాకు ద్వేషమే! నిన్ను కాదనడానికి కారణం వేరే వుంది --" అంది.
"ఏమిటది ?"
"నేను నా భర్తను మరో ఆడదానితో పంచుకోలేను .' అంది సుమలత.
'అంటే?"
"సుమలత అతడికో కవరు అందించింది. అందులో రెండు ఫోటోలున్నాయి. ఆ ఫోటోలు ఆత్మారామం కు పరిచితమైనవే!
'ఆ బ్లాక్ మెయిలర్ యెంత పని చేశాడు?" అన్నాడు ఆత్మారాం.
"యెంత పని చేసినా అది కేవలం నా కోరిక మీదనే! కాసేట్టు లో అమ్మ మాటలు విని నేను మామయ్యకు చెప్పాను. అయన ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లు -- నాన్న నేరాన్నీ, నీ మనో దౌర్భాల్యాన్నీ కూడా రుజువు చేశాడు. అందుకే అన్నాను -- నువ్వు పిరికివాడివి కాకుండా వుంటే బాగుండేదని! ఆప్పుడీ వుత్తరాన్ని ముందే పోలీసుల కిచ్చి - అటు నాన్నను జైలుకు పంపి - ఇటు నా ప్రేమాభిమానాలను పొంద గలిగేవాడివి. నువ్వు తప్పు చేశావని తెలుసు. నిన్నింక నా జీవితంలోకి ఆహ్వానించలేను...."
ఆత్మారామం దిగులుగా ఆ ఫోటోల వంకనే చూసుకుంటూ "బ్లాక్ మెయిలర్! నీ ఫోటోలు నా జీవితాన్ని నాశనం చేశాయి --" అనుకున్నాడు.
ఓ సంవత్సరం గడిచేక ఆ బ్లాక్ మెయిలర్ సుమలతకు భర్త స్థానం ఆక్రమించగా - ఒకే దెబ్బకు అతడేన్ని పిట్టల్ని కొట్టడా అని లెక్క చూసుకోసాగాడు ఆత్మారామం. ఆ పిట్టల్లో తనూ ఒకదన్న యదార్ధం మాత్రం అతడికి తెలుసు.
***
