ఆ డైరీ చదివినవాడెవడూ అతను ఆత్మహత్య చేసుకుంటాడనుకోడు.
హతుడి గదికి వెళ్ళాలంటే ఓ పెద్ద సందులోకి వెళ్ళి అక్కడ్నించి ఇరుకు సందులోకి వెళ్ళాలి. అతను ఇంటికి ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు వెడతాడో అతనింటికి ఎవరెవరు వచ్చి వెడుతుంటారో పెద్దగా పట్టించుకున్న వాళ్ళెవ్వరూ లేరు. అందువల్ల పోలీసులకి దొరికిన సమాచారం చాలా స్వల్పం.
అయితే హత్య జరిగిన చోట పోలీసులకు ఒక వస్తువు దొరికింది. ఇది హతుడికి సంబంధించినది కాదు. హంతకుడికి సంబంధించినదనుకొనడానికి కొద్దిగా ఆధారాలున్నాయి.
అ వస్తువు ఏమిటో పోలీసులు బయట పెట్టలేదు. దాని సహాయంతో ఈ హత్యా రహస్యాన్ని భేదించవచ్చునని వారు ఆశ పడుతున్నారు.
హంతకుడి కి సంబంధించిన ఆ వస్తువు డాక్టర్ నర్సన్న గారింట్లో భద్ర పర్చబడినట్లు అక్కడ ఆ వస్తువు పై వారం రోజుల పాటు రకరకాల పరీక్షలు జరుగుతాయని పోలీసులు పబ్లిక్ గానే ప్రకటించారు. అలా ప్రకటించడం లో పోలీసుల ఉద్దేశ్యం హంతకుడు ఆ వస్తువు గురించి ప్రయత్నించి పట్టు బడి పోతాడని!
ఆ తర్వాత ఆ హత్య కేసు గురించి ఎవ్వరూ ఏమీ వినలేదు. పేపర్లు. ప్రజలు కూడా క్రమంగా దాని గురించి మరిచిపోవడం జరిగింది. దాని గురించి మరిచిపోని అతికొద్ది మందిలో సుబ్బారావు ఒకడు!
"నేనిలా అన్నానని మళ్ళీ రాఘవరావు దగ్గర అనకు. పోలీసులు చాలా తెలివితక్కువ వారిలా కనిపిస్తున్నారు. వారి దగ్గర ఉన్న ఆ వస్తువును ఎవరో కాజేసి వుంటారు" అన్నాడు సుబ్బారావు గోవిందంతో.
'అలా ఎందుకు జరుగుతుంది ?' అన్నాడు గోవిందం.
"వారి దగ్గర ఆ వస్తువు వుండి వుంటే కొంతకాలం పాటు హంతకుడు ట్రాప్ లో పడతాడేమోనని ఎదురు చూసి అలా జరక్క పోయేక వాళ్ళే దాన్ని బయట పెట్టి పదిమంది దృష్టి లోకి తీసుకువచ్చి ఎవరైనా దాన్ని ఫలానా వ్యక్తికీ చెందినా వస్తువుగా ఐడెంటి ఫై చేయగలరేమో తెలుసుకునేందుకు ప్రయత్నించేవారు. పోలీసులు కిమ్మనకుండా ఊరుకోవడాన్ని బట్టి వారివద్ద హత్యకు సంబంధించి ఏవిధమైన ఆధారమూ లేదని నిర్ధారణ చేయవచ్చు" అన్నాడు సుబ్బారావు.
"నీ ఊహ బాగానే వుంది కానీ హంతకుడు పోలీసుల కన్ను గప్పి ఎలా మాయం చేయగలిగాడంటావ్?" అన్నాడు గోవిందం.
"నీ వెర్రి కానీ హంతకుడు ఆ వస్తువు కోసం ఎందుకు ప్రయత్నిస్తాడు?"
"తనను పట్టిచ్చే ఆధారం కోసం ఏ హంతకుడు ప్రయత్నించడు?"
"కొంచెం అలోచించి చూస్తె నీ ఆలోచనలోని తప్పు నీకే తెలుస్తుంది. హంతకుడ్ని ట్రాప్ చేయడం కోసం పోలీసులు ఆ అధారాన్ను పయోగించుకున్నారని అమాయకుల క్కూడా అర్ధమవుతుంది. అంటే ఆ ఆధారాన్ని బట్టి హంతకుడెవరో తెలియదు. ఆ ఆధారం కోసం ప్రయత్నిస్తేనే హంతకుడెవరో బయట పడుతుంది. హత్య చేసినవాడు ఈమాత్రం ఊహించలేకపోడు- అందులోనూ డిటెక్టివ్ సాహిత్యం ఇప్పటి స్థాయికి చేరుకున్నాక!" అన్నాడు సుబ్బారావు.
"హంతకుడు కానివాడికి ఆ ఆధారంతో పని ఏమిటి?"
"బ్లాక్ మెయిలింగ్!" అన్నాడు సుబ్బారావు "ఈ రోజుల్లో శ్రమ పడకుండా డబ్బు సంపాదించే మార్గమది. అందు గురించి కొందరు అప్పుడప్పుడు శ్రమపడి ఇలాంటి వస్తువులు సేకరిస్తుంటారు."
గోవిందం అనుమానంగా సుబ్బారావు వంక చూసి "నేను పోలీసు ఇన్ స్పెక్తర్ని కాకపోయినప్పటికీ కూడా నిన్ను అనుమానించాలని పిస్తోందిరా -- నువ్వే బ్లాక్ మెయిలింగ్ వ్యవహారం స్వయంగా నడిపిస్తున్నావేమోనని !" అన్నాడు.
"నేనా? నాకంత కర్మేం పట్టింది? అయినా నేను బ్లాక్ మెయిల్ చేస్తానేమోనన్న అనుమానం నీకు కలిగిదంటే నీ ప్రవర్తనలో ఏదో లోపముండి వుండాలని నా ఊహకు తడుతోంది. అదేమయుంటుందో చెబుతానుండు...." అన్నాడు సుబ్బారావు.
"బాబ్బాబు ఊరుకుందు... కాస్త నెమ్మదిగా మాట్లాడు...." అన్నాడు గోవిందం. ఆఫీసులో అడ టైపిస్టు తో అతను కాస్త చనువుగా ఉంటాడన్న విషయం సుబ్బారావుకు తెలుసును. ఆ విషయం గోవిందం భార్యకు తెలియడం ఇష్టం లేదని కూడా సుబ్బారావు కు తెలుసును.
"కెవ్వు" మన్న కేక విని వీధి లోని జనం చాలామంది ఆగిపోయారు. చాలామంది ఆ కేక వచ్చిన వైపు గాలించారు. అక్కడొక పాతికేళ్ళ మనిషి వుంది. ఆ కేక వేసినది అదే!
"శవం !" అని అరిచిందామే మళ్ళీ.
జనం గుమిగూడాను.
"ఏం జరిగింది ?" చాలామంది అడిగారు. జవాబుగా ఆమె గుమ్మంలోకి చూపించింది. గుమ్మం దాకా వెళ్ళిన వాళ్ళకు ఏం జరిగిందో ఎవరూ చెప్పనవసరం లేక పోయింది.
ఒక మనిషి వెల్లికితలా పడి వున్నాడు. అతడి గుండె లోకి దిగి వుంది కత్తి, రక్తం ఛాతీ పైకి చిమ్మి వుంది.
"హత్య!" అన్నాను ఇద్దరు ముగ్గురు అప్రయత్నంగా.
"నువ్వెవరు?" అన్నాడు అక్కడున్న వారిలో ఒకతను ఆడమనిషిని.
"నేను వీరింట్లో పనిమనిషి నండి ..." అందామె.
తడబడిపోతూ ఆమె చెప్పిన వివరాలేమిటంటే - గదిలో ఆమె వచ్చి పడున్నతని పేరు జగన్నాధస్వామి , అక్కడే వుంటున్నాడు. ఈమె అతని ఇంట్లో రెండు నెలలుగా పనిచేస్తోంది. జగాన్నాదస్వామి చాలా మంచి వాడు. ఊదారస్వభావుడు , తను మాములుగా పని చేయడానికి వచ్చి తలుపులు తోయగా ఈ దృశ్యం కాళ్ళ బడింది.
'అర్జంటుగా పోలీసులకు ఫోన్ చేయాలి. మీరంతా అక్కడే వుండండి.... వాళ్ళడిగే ప్రశ్నలకు సమూహ సాక్ష్యం బాగా పనికొస్తుంది" అన్నడక్కడున్న వాళ్ళతో పనిమనిషిని పలకరించినతను.
పోలీసులు, సాక్ష్యం అన్న మాట వినగానే అక్కడున్న వారందరూ ఒకొక్కరే ఏవేవో పనులున్నాయంటూ తప్పించుకున్నారు. పనిమనిషి ఒక్కటే అక్కడ నిలబడింది.
"వీళ్ళింట్లో ఫోన్ వుందా?" అనడిగాడతను.
"లేదు "అందామె.
"పోలీసులు వచ్చేవరకూ నువ్విక్కడుంటావా , నీకింకా ఇక్కడేమైనా పనులున్నాయా?" అన్నాడతను మళ్ళీ.
'ఇంకా చాలా ఇళ్ళలో పని కెళ్ళాలండి" అందామె.
'అయితే నువ్వు వెళ్ళు . నేను పోలీసులకు కబురు చెబుతాను...." అన్నాడతను.
పనిమనిషి ముఖం సంతోషంతో వెలిగింది.
'ఇంట్లో ఏమైనా ఖరీదైన వస్తువులున్నాయా?"
"మనిషి ప్రాణం కంటే ఖరీదైనదేముంటుంది బాబూ" అంది మనిమనిషి కళ్ళు వత్తుకుంటూ.
"దానికి కాదు. హంతకుడు ఎందుకీ హత్య చేశాడూ అనడానికి ఇలాంటి విషయాలు దోహదం చేస్తాయి. అయినా అవన్నీ పోలీసులు చూసుకుంటారులే కానీ నువ్వొక్క క్షణం బయట నిలబడు. నేను లోపలకు వెళ్ళి తాళం వెదుకుతాను. గదికి తాళం వేసి అప్పుడు పోలీసులకు కబురు చేస్తే చాలా మంచిది" ఆన్నాడతను.
"తాళం ఎక్కడుందో నాకు తెలుసు బాబూ!" అంది పనిమనిషి.
"తెలిసినా నువ్వు వెళ్ళకూడదు. ఎందుకంటె అక్కడ మన వేలిముద్రలు పడకుండా , మనగురించి ఏ ఆధారాలు వదలకుండా ప్రయత్నించాలి. లేకపోతె అన్నీ మన నెత్తి మీదకే వస్తాయి...' అన్నాడతను.
అతని మాటలకు పనిమనిషి బాగా భయపడింది. అతన్నే లోపలకు వెళ్ళమని తాళాలేక్కడుంటాయో చెప్పింది. అతను లోపలకు వెళ్ళి తలుపులు వేసుకున్నాడు.
పనిమనిషి బయట నిలబడింది.
హత్య గురించి తెలిసిన వారందరూ వెళ్ళిపోయారు. ఉన్నవారిలో కొందరు దూరాన్నుంచి ఆ ఇంటి కేసు చూస్తున్నారు. తెలియని వారు చాలామంది వీధిలో మాములుగా అటూ ఇటూ తిరుగుతున్నారు.
పనిమనిషి వణుకుతూ పది నిమిషాలు అక్కడ నిలాబడి వుంది. లోపలకు వెళ్ళిన మనిషి అంతసేపు అక్కడ ఏం చేస్తున్నాడో ఆమెకు తెలియలేదు.
ఆమె నిలబడి ఉండగానే అతను సన్నగా తలుపులు తెరిచి గదిలోంచి బయటకు వచ్చాడు. తలుపులు దగ్గరగా లాగి తాళం వేశాడు. తాళం చెవి పనిమనిషికి ఇచ్చి - తన చేతిలోని రుమాలు చూపించి - "నా వేలిముద్రలు పడకుండా ఆ జాగ్రత్త తీసుకున్నాను. నీకైతే ఇలాంటివి తెలియవు. నువ్వు జాగ్రత్తగా ఈ తాళం దాచు. ఎవరింట్లో వుంటావో చెప్పు పోలీసులకు నేను కబురు చెబుతాను" అన్నాడు.
పనిమనిషి తాళం చెవి అందుకుంది. అతను వెళ్ళిపోయాడు.
4
ఇన్ స్పెక్టర్ రాఘవరావు తాళం తీసుకుని -- "హత్య జారిగిందని ఎలా అనుకున్నావ్?" అన్నాడు.
