Previous Page Next Page 
వసుంధర కధలు -9 పేజి 50

 

    గోపీనాద్ కి  దొరకనిదల్లా ఒక్కటే. హత్యకు కారణం! అది గోవిందరావు ని అడిగితె "సునీత వంటి ప్రాణ ప్రదమైన మహా ఇల్లాలిని నేను చంపెనన్న ఆరోపణ వచ్చినప్పుడు అంగీకరించమంటే అంగీకరించగలను కానీ, కారణం ఏమీ కల్పించి చెప్పగలను? అదీ నువ్వే వెతుకు. ఆమె శీలానికి కళంకం ఆపాదించనంత కాలం అది ఏ కారణమైనా అంగీకరిస్తాను" అన్నాడు.
    ఆ సమయంలో రామస్వామి ఊరి నుంచి తిరిగి వచ్చాడు. జరిగిన హత్య గురించి విని గుండెలు బాదుకున్నాడు. గోవిందరావును కలుసుకుని, "నీ అనుమానంతో యెంత పని చేశావురా?" అన్నాడు. ఆశ్చర్యంగా గోపీనాద్ అడిగినదానికి, "అవును ఇన్స్ పెక్టర్ గారూ - సునీత పరమ పతివ్రత అయినా వీడికి మా ఇద్దరి మీద అనుమానం. వరసకు బావను కావడమూ, కలసి ఒకింట్లో పెరగదమూ అందు క్కారణాలు , వీడి అనుమానాల కారణంగానే నేను సునీత యింటికి వెళ్ళడం కూడా మానుకున్నాను. ఏదో ఒకరోజున ఈయన నన్ను చంపినా చంపేస్తాడు . ప్రతిరోజూ మనకేదయినా సంబందముందా అని అడిగి వేధిస్తుంటారు- అని ఓ పర్యాయం సునీత నా దగ్గర భోరున ఏడ్చింది " అన్నాడు రామస్వామి.
    గోపీనాద్ కిప్పుడు విషయం పూర్తిగా అర్ధమయినదనిపించింది. రామస్వామి మాటలతని నమ్మ దగ్గవిగా తోచాయి. "ఇంటికి రాలేనందుకు సునీత నేమీ అనుకోవద్దని చెప్పు" అని అతను తన కళ్ళ ముందే ఓ పర్యాయం గోవిందరావు కు చెప్పాడు.
    సునీత కూ రామస్వామికీ సంబంధముందన్న అనుమానం గోవిందరావు లో బలంగా వుంది. రోజూ దాని గురించే వేదిస్తుండేవాడు. ఒక పర్యాయం ఆమె విసిగిపోయి, "ఔను ఉంది. ఏం చేస్తారు?' అని అంటే , ఆవేశంలో  గోవిందరావామెను హత్య చేసి వుంటాడు. ఇన్స్ పెక్టర్ గోపీనాద్ ఈ కారణాన్ని గోవిందరావుకు చెబుతుంటే. 'అలా అనుమానించే వాదినయితే సునీతను, రామస్వామి నీ ఒకే ఇంట్లో ఎందు కుంచి వెడతాను?" అన్నాడు.
    "ఇదో అబద్దమా?' అన్నాడు రామస్వామి. అతను గోపీనాద్ ప్రశ్నలకు జవాబిచ్చి అక్కణ్ణించి వెళ్ళిపోయాడు.
    రామస్వామి వెళ్ళిపోయిన రెండు నిముషాలకు పోలీస్ స్టేషన్ లో ఓ వ్యక్తీ అడుగు పెట్టాడు. ఆ వ్యక్తీ చూట్టానికి పిచ్చి వాడిలా బికారి వాడిలా గున్నాడు.
    "నా పేరు జోగినాధం " అన్నాడతను.
    "ఏవిటి నీకిక్కడ పని!" అన్నాడు గోపీనాద్.
    "రామస్వామి నాకు తెలుసు. ఓరోజు వాడింట్లో స్నానం చేద్దామని వెళ్ళాను. నన్నవమానించాడు. వాడి లోని క్రూరత్వం పసి గట్టాను. ఆ క్షణం నుంచీ ఈ క్షణం వరకూ వాడి ననుసరిస్తూనే ఉన్నాను. వాడిప్పుడేప్పుడు యెక్కడేక్కడ ఉంటున్నదీ నాకు తెలుసు. ఈ హత్య సంగతి విన్నాక ఇది వాడి పనే అనిపించింది.
    వాడి దగ్గర ఓ శక్తి వంతమైన అయస్కాంతముంది.  దాని సాయంతో వాడు యినుప చువ్వలను వంచి మళ్ళీ  మాములుగా చేయగలడు. పొరుగూర్లో గదిలో తలుపులు వేసుకొని పడుకొని అయస్కాంతం సాయంతో బయటపడి ఇక్కడకు వస్తున్నాడు. ఆ విధంగా పొరుగూర్లో వాడికి ఎలిబీ లభిస్తోంది. వాడు పోరుగూరుకి ఏ టాక్సీలో వెళ్ళాడో అక్కడ్నించి యిక్కడి కేలా వచ్చాడో అన్నీ వివరంగా చెప్పగలను.
    వీడు మూడు రాత్రులు గోవిందరావు ఇంట్లో వున్నాడు. హత్య జరిగిన రోజు రాత్రి పన్నెండు గంటలకా ఇంట్లోంచి బయట పడ్డాడు. హత్య చేస్తాడని తెలుసుంటే అది కూడా ఆపగలిగి ఉండేవాడిని. ఆ ఇంట్లోంచి బయటపడి వాడే దారిన నడిచాడో, ఏ టాక్సీ ఎక్కాడో ఆ వివరాలన్నీ నేనిస్తాను...." అన్నాడు జోగినాధం.

                             *    *    *    *
    "నేను చెప్పానుగా - దుష్ట శిక్షణ కోసం అవతరరించిన వాణ్ని నేను. నువ్వు నామీద బెల్టు ఎత్తి నప్పుడే అనుకొన్నాను. నీకు మూడిందని. అప్పుడే చెప్పాను గదా. బెల్టు ను నామీద ఉపయోగించినందుకు దుఃఖించే రోజు వస్త్గుందని అది వచ్చింది. నీకు కాకపోయినా సునీతను  చంపి, ఆ నేరాన్ని గోవిందరావు మీదకు నెట్టి, అమెరికా వెళ్ళే చాన్సు కూడా దక్కించుకుందామనుకున్నాను . కానీ దురదృష్టం నా రూపంలో నిన్ను వెంటాడింది అన్నాడు జోగినాధం.
    రామస్వామి తల వంచుకున్నాడు. అనుకోని విధంగా తను పట్టు బడడంతో అతను విధిలేక పోలీసుల వద్ద జరిగిందంతా చెప్పేశాడు.
    "నా సునీత నాకు దక్కక పోయినా , ఆమెను చేజేతులారా నేనే చంపుకొన్నానన్న అపవాదు పాల్పడకుండా నన్ను కాపాడారు. మీ ఋణమేలా తీర్చుకోవాలో తెలియడం లేదు...' అన్నాడు గోవిందరావు.
    "ఎప్పుడూ  యిలాంటి దుర్మార్గులకు ఆశ్రయమీయ వద్దు. అదేమో నీతి పాఠం. ఇంక నాకు మీవల్ల జరుగవలసిన ఒక ఉపకారమొ కటుంది. ఈ రామస్వామి ఇంట్లో నేను షవర్ బాత్ చేయవలసి ఉంది. ఆ కోరిక తీర్చండి చాలు"అన్నాడు జోగినాధం.

                           ---: అయిపొయింది :----


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS