Previous Page Next Page 
వసుంధర కధలు -9 పేజి 49

 

    "ఆ తర్వాత , కరెంటు పోయింది చూశావా, అది మన ప్రతాపమే. మెయిన్ ఆఫ్ చేశాను" అన్నాడు రామస్వామి.
    సునీత ముఖంలో కంగారు కనపడింది.
    "కరెంట్ పోగొట్టి తలుపు తట్టాను. నీ మొగుడు తాగే మంచి నీళ్ళలో నేను కలిపిన మత్తుమందు అతనికి గొడ్డు నిద్ర రప్పించింది. అగ్గి పెట్టె వంకతో నీ గదిలోకి వచ్చి, నీ మొగుణ్ణి జాగ్రత్తగా మంచం దింపి కింద పడుకో బెట్టాను. వేల్లిపోతున్నట్లు నటించి గదిలోనే ఉండిపోయి, మంచం మీద నీమోగుడు స్థానంలో పడుకున్నాను. నువ్వు తాగే మందులో నేను కలిపిన బ్రాంది బాగానే పనిచేసింది. మంచి నిషాలో వున్న నీకు నేను నీ మొగుడి లాగే అనిపించాను. తేడా గుర్తించే తెలిసీ, ఓపికా కూడా నీలో నశించాయి...."
    రామస్వామి చెబుతుంటే , "నువ్వింత దుర్మర్గుడివని నేననుకోలేదు..." అంటూ సునీత కూలబడి పోయి వెక్కి వెక్కి ఏడ్వసాగింది.
    రామస్వామి ఆమెను సమీపించి కళ్ళు తుడిచి "జరిగిందేలాగూ జరిగిపోయింది. ఇదేమీ నీ మొగుడికి తెలియదు. నేను చెప్పను. జీవితంలో ఓ రెండ్రోజులు నన్ను సుఖపెట్టు." అన్నాడు.
    "దుర్మార్గుడా , అబద్దాలు చెప్పి నన్ను వశ పర్చుకుందామనుకుంటున్నావా?" అంది సునీత కొద్దిగా వెక్కుతూనే.
    "నేను చెప్పేవి అబద్దాలు కావని నీకు తెలుసు. ఐనా మనసును మభ్య పెట్టుకుందుకు ప్రయత్నిస్తున్నావు. తిరుగు లేని ఇంకో రెండు సాక్ష్యాలు చెబుతాను. నీ వీపుకు కాస్త క్రిందుగా సిరాతో నీ పేరు రాశాను. నీ పరికిణీ మధ్యలో చిన్న ముక్క కత్తిరించి నా దగ్గరుంచుకున్నాను. ఇంకా చెప్పాలంటే...."
    అతను చెబుతుంటే వినలేక చెవులు మూసుకున్న సునీత బలం తగ్గిపోయింది. ఐదు నిముషాల్లో అతను చెప్పినవన్నీ నిజమని ఆమె గ్రహించేసింది. ఆమె ఆ కఠోర సత్యాన్ని గ్రహించేక అతనామెను దగ్గరగా లాక్కుని ముద్దు పెట్టుకుంటే ఆమె వారించనయినా వారించ లేకపోయింది.
    "నేను నీకు వరసకు బావను. నిన్ను పెళ్ళి చేసుకోవాలనుకున్న వాణ్ని.అయిదు  భర్త లున్న దౌపది ఎలా చెడ్డది కాదో నువ్వూ అంతే. ఈ రెండు రోజులూ నన్ను సుఖపెట్టు. మళ్ళీ నిన్నిలాటి కోరికలు కోరను." అన్నాడు రామస్వామి.
    "నాకు తెలియని స్థితిలో చేసిన తప్పు తెలిసి చేయలేను." అంది సునీత.
    "చేయక తప్పదు. ఇది నా అజ్ఞా. నేనిప్పుడు నీ భర్తను" అన్నాడు రామస్వామి.
    సునీత అతని ధైర్యం చూసి ఆశ్చర్యపోయింది. ఒకనాడు బలవంతంగా తన చేయి పట్టుకునేందుకు భయపడ్డ బావకు తనీనాడు యెంత లోకువయిపోయింది?
    "నా బ్రతుక న్యాయమై పోయింది" అంటూ మళ్ళీ ఏడ్చింది సునీత.
    'అలా నా కనిపించడం లేదు. అన్యాయమంటూ జరిగితే అదినాకే జరిగింది. ఏడుపులు కట్టిపెట్టి యీ రెండు రోజులూ నన్ను బాగా సుఖపెట్టు. ఆ తర్వాత నా బాధ నీకుండదు." అన్నాడు రామస్వామి.
    ఆ సాయంత్రం భర్తతో యెప్పటి లా ఫ్రీగా ఉండలేక పోయింది సునీత.
    ఆమె మనసులో రకరకాల భావాలు కదులాడుతున్నాయి. శారీరకంగా తను మలినమై పోయింది. తన ఇష్టానికి వ్యతిరేకంగా తనింకో మగవాడితో భర్తతో మసిలే విధంగా మసిలింది. ఇప్పుడెం చేయాలి తను? జరిగింది భర్తకు చెప్పి క్షమార్పణ అడగాలా? లేక యేమీ యేరుగునట్లు ఊరుకోవాలా?
    జరిగింది తెలిస్తే భర్త తనను క్షమిస్తాడన్న నమ్మక మామెకు లేదు. చెప్పకపోతే మనసులో ఏదో బాధ!
    ఒకవేళ భర్త తనకు లాంటి తప్పు చేస్తే !
    ఈ ఆలోచన వచ్చేక సునీత మనసు తేలిక పడింది. ఇలాంటి తప్పులు చేసిన చాలా మంది మగవాళ్ళ గురించి అమెవింది. వాళ్ళందర్నీ భార్యలు క్షమించారు. కానీ ఇలా తప్పు చేసిన ఏ ఆడది భర్త చేత క్షమింప బడలేదు. కారణమేమిటి? సమాజంలో ఆడదాని కున్న స్తానమా?
    తనకు తానై ఏ తప్పు చేయలేదు. కాబట్టి తను మంచిదేనని సునీత అనుకుంది. కానీ ఈరోజు రాత్రి మాత్రం తనకు తానై తప్పు చేయాలి. ఇలా యింకా రోజుని అంటున్నాడు బావ. కానీ అలా అని నమ్మ డానికి లేదు. ఒకసారి రుచి మరిగిన మగవాడు మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే వుంటాడు.
    అయినా ఆడది యెంత బలహీనురాలు? ఇష్టం లేని మగవాడికి ఒకసారి లొంగిపోయేక , మళ్ళీ ప్రతిఘటించక పోవడమేమిటి? అందుకు బలహీనత, జాలి, కరుణ , ప్రేమ - వీటిలో ఏమిటి కారణం?

                                  10
    'కెవ్వు' మన్నాడు గోవిందరావు.    
    మంచం మీద సునీత , సునీత గుండెల్లో కత్తి. ఆమె శరీరం మంచు కంటే చల్లగా ఉంది.
    "సునీతా!"హృదయవిదారకంగా అరిచాడు గోవిందరావు. ఒక్క క్షణంలో అతను తేరుకుని బయటకు వచ్చాడు. రామస్వామి కోసం చూశాడు. ఆ గదిలో అతను లేడు. అతని ఆలోచనలు పరిపరి విధాల పోయాయి.
    అదేపనిగా పాలవాడు తలుపు తడుతుంటే గోవిందరావుకి మెలకువ వచ్చింది. మత్తుకళ్ళు విడకుండానే- "నువ్వు కదలకు సునీతా. నేను వెళ్ళి పాలు పోయించుకు వస్తాను." అని కళ్ళు తెరిచాడు. కళ్ళ ముందు కనబడ్డ భయంకర దృశ్యమది!"
    గోవిందరావు పరుగెత్తుకుని వీధి గుమ్మం దగ్గరకు వెళ్ళి పాలవాడి తో "హత్య! " అని అరిచి అక్కణ్ణించి వీధిలో కెళ్ళిపోయాడు. పాలవాడు తెల్లబోయి కంగారు పడి చేతిలోని పాలచెంబు ఎత్తేశాడు.
    ఓ అరగంటలో గోవిందరావు పోలీసుల్నీ వెంట బెట్టుకుని వచ్చాడు. ఇన్ పెక్టర్ గోపీనాద్ అతనితో పాటు వచ్చాడు.
    పోలీసులు ఇల్లంతా తిరిగారు. రకరకాలుగా పరిశోధించారు.
    "నా అనుమానం రామస్వామి పైనే వుంది. గత కొద్ది రోజులుగా అతడు మా యింట్లోనే వుంటున్నాడు....' అన్నాడు గోవిందరావు.
    గోవిందరావు వంక చిత్రంగా చూశాడు గోపీనాద్. "రామస్వామి ఎవరు?"
    రామస్వామి కధ చెప్పాడు గోవిందరావు.
    గోపీనాద్ హత్య గురించి ఆచూకీ తీయడం కోసం పాలవాడినీ, పనిమనిషి నీ, చుట్టూ పక్కల వాళ్ళనూ రకరకాల ప్రశ్నలు వేశాడు. పనికి వచ్చే సమాచార మేదీ లభించలేదు. కానీ ఆ యింట్లో భార్య భర్త లను మినహాయిస్తే మూడో వ్యక్తీ యెవరూ వున్నట్లు యెవ్వరికీ తెలియదు.
    "రామస్వామి అంటే ఒకవేళ ఆరోజు మనకు కనబడిన వ్యక్తీయేనా?" అంటూ గోపీనాద్ అడిగాడు గోవిందరావు ని. అతను అవునన్నాడు.
    "మిస్టర్ గోవిందరావు! నీ నోటితో నువ్వే చెప్పావ్ అసలు సంగతి. అతను నీ యింటికి కూడా రాలేదన్నావు. ఊళ్ళో లేడని చెప్పావు.... నీ కధ కొంచెం అనుమానం గా వుంది. నీపట్ల నాకు సానుభూతి ఉన్నప్పటికీ నా బాధ్యతను తాత్కాలికంగా నిర్వహించక తప్పదు. నువ్వు పోలీస్ స్టేషన్ కి రావాలి...." అన్నాడు గోపీనాద్.
    గోవిందరావు తెల్లబోయి "వాట్ ---- ఇన్స్ పెక్టర్ నేను నా ప్రాణానికి ప్రానమయిన సునీతను హత్య చేస్తానా? అన్నాడు. ఊహించు కుందు క్కూడా ఆ విషయం భయంకరంగా ఉన్నట్లు అతని ముఖం చూస్తె తెలుస్తుంది.
    "అలాగని నేనడం లేదు . కానీ ....' అని ఊరుకున్నాడు గోపీనాద్.
    అయితే ఆ తర్వాత గోవిందరావు పైన కేసు బలపడింది. ఆ యింట్లో మూడో మనిషి మసిలిన చాయ వున్నట్లు లేదని అంతా అన్నారు. గోవిందరావు గోపీనాద్ తో అన్న మాటలా విషయాన్నింకా బలపరుస్తున్నాయి. ప్రస్తుతం రామస్వామి ఊళ్ళో లేడు.
    సునీత హత్య చేయబడిన కత్తి పిడి మీద గోవిందరావు వెలి ముద్రలు మాత్రమే ఉన్నాయి. ఆ ఇంట్లో రామస్వామి మసిలాడని గోవిందరావు చెబుతున్న ప్రాంతాల్లో వున్న వేలిముద్రలు ఒక్క పనిమనిశివి మాత్రమే.
    గోవిందరావు మనసులో "రామస్వామీ! సునీత అంటుండేది నీకు మా యిద్దరి పైనా పగ వున్నదని. పకడ్బందీగా నువ్వు పధకం వేసుకుంటుంటే అందుకు తెలివి తక్కువగా మా పూర్తీ సహకారాన్నిచ్చాను. సునీత నేను కొదొఆ ఈ దెబ్బతో ఫినిష్! అయినా సునీత చనిపోయాక నాకు మాత్రం ఈ లోకంలో పని యేముంది?" అనుకున్నాడు. ఆ తర్వాత అతను తన గురించి యింకేమీ చెప్పుకోలేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS