"తలుపు తియ్యక్కర్లేదు. కాస్త కాఫీ తెచ్చి పెట్టు -- చాలు" అన్నాడు రామస్వామి.
తలుపు తియకుండానే సునీత వెనక్కు వెళ్ళింది. మధ్యాహ్నని కని ఆమె ఫ్లాస్కు లో పోసిన కాఫీ సిద్దంగా ఉంది. అది ఓ గ్లాసు లో పోసి ఆమె మళ్ళీ గది దగ్గరకు వచ్చి గొళ్ళెం తీసి తలుపులు తోసింది.
సునీత తలుపులు తోసేసరికి లోపల యెవ్వరూ కనబడలేదు. ఆమె గదంతా పరీక్షించి ఆఖరికి మంచం కింద కూడా చూసింది. రామస్వామి గదిలో లేడు.
8
సాధారణంగా గోవిందరావు , గోపీనాద్ మధ్యాహ్నం గోవిందరావు అఫీసు కేదురుగా ఉన్న కాంటీన్ లో కలుసుకుని కాఫీ తాగుతుంటారు. వారు చిన్ననాటి నుండి స్నేహితులు కాకపోయినా, గత ఆరు నెలలుగా అనుకోకుండా పరిచయ మైనప్పట్నించీ ఆప్త మిత్రుల్లా మసలు కుంటున్నారు. గోపీనాద్ పోలీస్ ఇన్ పెక్టర్.
ఈరోజు కూడా ఇద్దరూ యెప్పటి లాగే కబుర్లు చెప్పుకుంటుండగా అక్కడికి హటాత్తుగా రామస్వామి వచ్చేడు. అతన్ని చూసి గోవిందరావు చాలా ఆశ్చర్య పడ్డాడు. అతనేదో అనబోతుండగా రామస్వామి తనే చొరవగా "హలో గోవిందరావ్! ఇక్కడుంటావని అనుకున్నాను. అర్జంటు పని మీద ఈ ఊరోచ్చాను. ఇంకో అర్ద గంటలో వెళ్ళిపోతాను. మీ యింటికి రాలేక పోయినందు సునీత నేమీ అనుకోవద్దని చెప్పు. ఈ ముక్క చెప్పడం కోసమే నీ దగ్గర కొచ్చాను" అన్నాడు.
గోవిందరావు పరిస్థితి ని అర్ధం చేసుకున్నాడు. రామస్వామికి సహాయపడే ఉద్దేశ్యంతో "వారం రోజులుగా నీకోసం యెదురు చూస్తున్నాను. నువ్వు రాకపోతే సునీత ఏమయినా అనుకుంటుంది. ఓసారి ఇంటికి వెళ్ళ కూడదు ?" అన్నాడు.
"కుదిరితే తప్పక వెళ్ళి వుండేవాడినే కదా" అని వెళ్ళిపోయాడు రామస్వామి.
"ఎవరతను?" అన్నాడు గోపీనాద్.
చెప్పాడు గోవిందరావు. తనకూ, రామస్వామి కీ మధ్య జరుగుతున్న కధ చెప్పాలా అనిపించింది గోవిందరావు కి. ఐతే యెంత మిత్రుడయినప్పటికీ గోపీనాద్ పోలీస్ ఇన్స్ పెక్టరన్న విషయం గుర్తుకు వచ్చి ఆ కోరిక బలవంతాన చంపుకున్నాడతను
ఆ సాయంత్రం అతను ఇంటికి వెళ్ళగానే భార్యతో "రామస్వామి వచ్చాడా?' అనడిగాడు. సునీత అతని వంక ఆశ్చర్యంగా "బావ యింట్లో లేడని మీ కేలా తెలుసు?' అనడిగింది.
గోవిందరావు భార్యకు తన అనుభవం, చెప్పేక, సునీత తన అనుభవం భర్తకు చెప్పింది.
"ఐతే నువ్వు తలుపు తీయకుండా రామస్వామి మాయమయ్యాడంటావు ? ఇది నేను నమ్మలేను. ఇంకా నీతో చెప్పు యెలాగో బయట పడ్డాడని అనుకుంటున్నాను...." అన్నాడు గోవిందరావు.
'అదెలా సాధ్యమో మీరే చెప్పాలి. రండి. ఆ గదికి వెడదాం." అంది సునీత. ఇద్దరూ ఆ గది దగ్గరకు వెళ్ళగానే , "వాడు లేకపోయినా గదికి గొళ్ళెం ఎందుకు?" అన్నాడు గోవిందరావు.
" ఆ గదికి గొళ్ళెం పెట్టె అలవాటు మనకు యెప్పుడూ ఉన్నట్లుండాలి కదా."
"బాగానే ఉంది" అంటూ గొళ్ళెం తీసాడు గోవిందరావు . అతను తలుపులు తీయగానే , "హలో - కులాసానా?" అంటూ పలకరించాడు రామస్వామి.
అతన్ని లోపల చూస్తూనే మ్రాన్పడి పోయింది సునీత. గోవిందరావు రామస్వామి వైపు, సునీత వైపూ మార్చి మార్చి చూశాడు. భార్య ముఖంలో కొట్ట వచ్చినట్లు కనవడుతున్న ఆశ్చర్యం అతన్ని విచిలితుడిని చేసింది.
"ఏమిటి మాయ? గదిలో నుంచి యెలా మాయంయ్యావ్. మళ్ళీ తిరిగి ఎలా వచ్చావ్?" అంది సునీత .
"అవి నాకు సంబంధించిన జాగ్రత్తలు" అన్నాడు రామస్వామి.
"బాగానే వుంది. కానీ, ఈరోజు నీ సంగతేమిటో తేల్చి చెప్పు. చాలా కష్టాల్లో వున్నాను. అంటూ పాత పురాణాలు విప్పకు. మా ఇంట్లో నాలుగు రోజులుండదలుచు కున్న పక్షంలో ఏ ఉద్దేశ్యంతో నువ్వు మా ఇంట్లో చేరినదీ చెప్పాలి" అన్నాడు గోవిందరావు.
"ఈరోజు రాత్రి భోజనాల వద్ద అన్నీ చెబుతాను. కానీ నేను ఎంత చెబితే అంతే వినాలి. అంతకంటే యెక్కువ అడక్కూడదు." అన్నాడు రామస్వామి.
"ఎంతో కొంత - అసలంటూ మొదలు పెడితే!" అన్నాడు గోవిందరావు.
భోజనాల కూర్చున్నప్పుడు రామస్వామి ముక్తసరిగా అన్నాడు. "నన్నిప్పుడీ పనిమీద మన ఆఫీస్ నియోగించింది. ఒక దేశద్రోహి బండారం బయట పెట్టె ప్రయత్నంలో వున్నాను. నా సమాచార ము కరించేది పోలీసులకే అయినా, ప్రస్తుతం పోలీసులక్కూడా నేనేం చేస్తున్నానో తెలియకూడదు. ఇలా యింకో మూడు రాత్రులు గడిపితే చాలు. ముచ్చటగా మూడు రాత్రులు.,, ఆ తర్వాత నేననుకున్న పని సాధించగలుగుతాను...."
సునీత మనసులో "క్షణ క్షణమూ గండంగా ఉన్న ఈ మనిషితో ఇంకా మూడు రోజులు గడపడం కష్టం. ఏమైనా ఈ రాత్రి ఆయనకు నచ్చ చెప్పి బయటకు పంపించే యాలి. రేపట్నించీ ఫ్రీగా ఉండాలి.' అనుకుంది.
గోవిందరావు భోజనం పూర్తీ చేసి , "నాకు నిద్ర వస్తోంది..." అన్నాడు. సాధారణంగా ఎదుటి వ్యక్తితో మాట్లాడ్డం యిష్టం లేనప్పుడు అతనలాగంటాడు. ఆ విషయం తెలిసిన సునీత మనసులో నవ్వుకుంది.
గోవిందరావు రామస్వామి తమతమ గదుల్లోకి వెళ్ళి పోయారు. సునీత వంటిల్లు సర్దుకుని పడుకోబోయే ముందు నీరసం తగ్గడానికి తను తీసుకుంటున్న టానిక్ తాగింది. ఆరోజులా లేదని ఆమెకు అనిపించింది. ఆమె నిద్ర పోవడానికి వెళ్ళేసరికి గోవిందరావు మంచి నిద్రలో ఉన్నాడు. ఆమె యెంత ప్రయత్నించినా అతను లేవలేదు. ఆమెకు వళ్ళంతా తెలిపోతున్నట్లుగా యేదోలా ఉంది.
అదే సమయంలో గదిలో బెడ్ లైటు ఆరిపోయింది. తిరుగుతున్నా ఫ్యాను ఆగిపోయింది. గదంతా చిమ్మ చీకటి. కళ్ళు పొడుచుకున్నా ఏమీ కనబడడం లేదు. ఆ సమయంలో యెవరో ఆమె గది తలుపు తట్టారు.
సునీత తలుపు దాకా వెళ్ళి "బావా" అంది.
"ఔను-- నేనే- ఒక్కసారి తలుపు తీస్తావా?" అన్నాడు రామస్వామి.
సునీత తలుపు తీసింది.
"ఇంట్లో బ్యాటరీ లైటుందా?" అన్నాడు రామస్వామి.
"లేదు...."అంది సునీత.
"ఐతే యెలా? నేను బాత్రూం కి వెళ్ళాలి. ఇల్లంతా చిమ్మ చీకటిగా ఉంది." అన్నాడు రామస్వామి.
"ఐతే మా మంచం దగ్గర తలుపు దిక్కున ఉన్న బల్ల మీద అగ్గిపెట్టె ఉండాలి. ఈ చీకట్లో నేనవన్నీ వెలికి తేలేను. నేను గుమ్మం దగ్గర నించుంటాను. నువ్వు అగ్గిపెట్టె తెచ్చుకో.." అంది సునీత.
రామస్వామి తడుముకుంటూ మంచం దగ్గరకు వెళ్ళాడు. అక్కడ ఒకటి రెండు నిముషాలు తచ్చాడాడు.
"ఏం చేస్తున్నావక్కడ?" అంది సునీత.
"అగ్గిపెట్టె దొరకలేదు." అన్నాడు రామస్వామి.
సునీత కదిలి తనూ మంచం దగ్గరకు వచ్చింది. అప్పుడు ఆమెకు వెళ్ళిపోతున్న రామస్వామి అడుగుల చప్పుడు వినిపించింది. "అగ్గిపెట్టె అక్కర్లేదులే. నేపోతున్నాను అన్న రామస్వామి మాటలు గుమ్మం అవతల నుంచి వినిపించాయి.
సునీత వెళ్లి తలుపులు వేసేసింది. మళ్ళీ ఆమె మంచం మీదకు వచ్చేసింది. నిజం చెప్పాలంటే రామస్వామి అక్కడున్నంత సేపూ అమెమనసును నిగ్రహించుకోంది. శరీరమంతా ఏదో తేలిపోతున్నట్లు ఉండామెకు. మంచం మీద పడుకుని భర్తకు దగ్గరగా జరిగింది. అతని మీద చేయి వేస్తె ఈ పర్యాయం కొద్దిగా కదిలాడతను.
సునీత భర్తను తన వైపుగా తిప్పుకుంది. బలంగా దగ్గరగా హత్తుకుంది. అతనిలో చలనం కలుగుతున్నట్లు గుర్తించి ఉత్సాహంగా "ఏయ్!"అంది భర్త చెవిలో .
9
మరునాడు గోవిందరావు రామస్వామి ని గదిలో పెట్టి తలుపు గొళ్ళెం పెట్టి వెళ్ళిపోయాడు.
సునీత చిల్లర పనులన్నీ పూర్తీ చేసుకుని ఓ నవల పట్టుకొని కూర్చుంది. ఆలోచనలన్నీ రామస్వామి మీదనే ఉండడం వల్ల ఆమె నవల మీద దృష్టి పెట్టలేక పోయింది. కాసేపటికి రామస్వామి గదిలోంచి పిలుపు రానే వచ్చింది.
పిలుపు వినగానే సునీతకు భయం వేసింది. రామస్వామి దగ్గరకు వెళ్ళడం ఆమె కంత ఇష్టం లేదు. మనసులో కాస్త భయం కూడా లేకపోలేదు. ఐనా మొండి ధైర్యంతో లేచి వెళ్ళి అతని గది గొళ్ళెం తీసిందామె.
"ఇలారా, నీకోముఖ్య విశేషం చెప్పాలి"అన్నాడు రామస్వామి.
సునీత అతన్ని సమీపించి , "ఏమిటది?" అంది.
"మొదటి రాత్రి బాగా సుఖ పెట్టావు నన్ను. రెండో రాత్రి యింకా రంజుగా వుండాలి." అన్నాడు రామస్వామి.
సునీత ముఖం యెర్రగా అయిపోగా, "ఏమిటి నువ్వనేది?" అంది.
"రాత్రి అగ్గి పెట్టె కోసం అడిగినట్లు గది తలుపులు తీయించానా -- తర్వాత నేనా గదిలోంచి వెళ్ళలేదు. నీతో ఖుషి చేశాను." అన్నాడు రామస్వామి తాపీగా.
"పిచ్చిపిచ్చి మాటలాడకు" అంది సునీత కోపంగా.
"ఋజువులున్నాయి. ఉదయం నువ్వు లేచేసరికి నీ గది తలుపులు తీసి వున్నాయా, లేదా?" అన్నాడు రామస్వామి.
ఆమాట నిజమే కావటంతో సునీత తడబడింది. తలుపులు దగ్గరగా వేసి వున్నా గడియ తీసి వుంది. బహుశా భర్త ఏ రాత్రయినా బయటకు వెళ్ళి మళ్ళీ వేయడం మర్చి పోయుంటాడేమో ననుకుంది. కానీ దాన్ని గురించి అంత సీరియస్ గా ఆలోచించలేదు.
