Previous Page Next Page 
డాళింగ్ పేజి 49

 

    ----అవార్డు ఫంక్షన్స్ కి రుక్మిణి వెళ్ళలేకపోయింది ------రుక్మిణి అవార్డును కూడా జయేంద్ర తీసుకున్నాడు.
    ఆ అవార్డును అందజేయడం కోసం, ఆ రోజు ఫంక్షన్ తర్వాత నేరుగా రుక్మిణి బంగళా కొచ్చాడు జయేంద్ర దత్.
    అప్పుడు సమయం రాత్రి ఎనిమిది గంటలు.
    "అమ్మగారికి రెండ్రోజులనుంచి జ్వరం ......" పనిమనిషి చెప్పిడంతో, కనీసం తనకు ఫోన్ చేసైనా ఆ విషయం చెప్పనందుకు బాధపడుతూ మేడ మెట్లెక్కి - రుక్మిణి బెడ్ రూమ్ వేపు నడిచాడు జయేంద్ర.
    బెడ్ రూమ్ తలుపులు దగ్గరగా వేసున్నాయి.
    నెమ్మదిగా తలుపులు తోసి , లోనికి అడుగుపెట్టాడు. మంచం మీద పడుకుని వుంది రుక్మిణి.
    అడుగుల చప్పుడుకి తలతిప్పి చూసి------
    "నువ్వా జయేంద్ర, రా ....ఫంక్షన్ బాగా అయిందా......" కూర్చుంటూ అంది రుక్మిణిదేవి.
    బెడ్ కి ఎదురుగా వున్న కుర్చీలో కూర్చున్నాడు జయేంద్ర.
    "జ్వరమట , నాకా విషయం ఎందుకు చెప్పలేదు?" ఆ గొంతులో నిష్టురం వుంది.
    "జ్వరం దేహానికే .......మనసుకు కాదు. మనస్సు హాయిగా వుంది. ప్రశాంతంగా వుంది. ఫంక్షన్ బాగా జరిగిందా?"
    గవర్నమెంట్ వారిచ్చిన అవార్డునీ, చెక్కునీ చేతిలో పెట్టాడు జయేంద్ర-
    "కొన్ని వేలమంది మీ ఫాన్స్ , మీరు ఫంక్షన్ కి రాకపోవడం వల్ల చాలా నిరుత్సాహ పడ్డారు."
    "నా తరుపున నువ్వేళ్ళావుగా........నువ్వుంటే , నేనెందుకు?" ఎవంటావ్ అన్నట్లుగా చుసిందావిడ.
    "మీ ఫాన్స్ కోసం."
    "నా ఫాన్స్ కి నేను అభిమాన నటిని ........నాకు నువ్వు అభిమాన నటుడివి."
    ఆ మాటకు జయేంద్ర కళ్ళంట , జల జలా కన్నీళ్ళోచ్చాయి.
    "నిన్ను మొదటిసారిగా చూసినప్పుడే అనుకున్నాను......నీకు మంచి స్వర్ణయోగం ఉందని, ఈ ఫీల్డ్ లోనే కాదు, నువ్వు ఏ ఫీల్డ్ లో అడుగు పెడితే, ఆ ఫీల్డ్ లో రాణిస్తావ్!"
    తెరలు తెరలుగా దగ్గోచ్చింది రుక్మిణికి. టేబ్లేట్ తీసుకుని వేసుకుని, నీళ్ళు తాగిందావిడ.
    "నేనేమీ కాకపోయినా ,ఎలాంటి బంధుత్వమూ లేకపోయినా, నా పట్ల మీ అపేక్ష......మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలీడం లేదు.'
    "ఇది ఈనాటి ఋణం కాదేమో ఎలా తీర్చుకుంటావ్....." ఆ మాటంటూ రుక్మిణి, జయేంద్ర ముఖం వేపు ఆసక్తిగా చూసింది.
    "ఎలా తీర్చుకోమంటారు చెప్పండి" అమితమైన గౌరవం నిండిన మనసుతో అన్నాడు జయేంద్ర.
    "నిజంగా అడుగుతున్నావా......"
    "నిజం మేడమ్ ......నా వృత్తి సాక్షిగా, నేను అమితంగా ప్రాణానికి ప్రాణంగా అభిమానించే మీ సాక్షిగా చెప్తున్నాను......."
    "వందేమాతరం సినిమాలో, నా కేరక్టర్ , నీ కేరక్టర్ చేతుల్లో ప్రాణాలు విడుస్తుంది, అవునా..."
    "అవును మేడమ్......."
    "నిజజీవితంలో నాకు నీ చేతుల్లో ప్రాణాలు విడవాలనుందయ్యా"
    "మేడమ్ ......." ఏదో అనబోయి ఆగిపోయాడు జయేంద్ర.
    "ఇదేవిటీ కోరిక........ఇదేవిటీ వైరాగ్యం అనుకుంటున్నావా........చెప్పలేం. మనిషి జీవితం, నీటి బుడగాలాంటిది ఎవరో, ఎప్పుడో చెప్పగా విన్నాను.......ఈ క్షణం ఇలా ఉన్నాను. రేపుదయానికి ఎలా ఉంటుందో......ఎవరు చెప్పగలం చెప్పు."
    "మేడమ్"
    "ఆ మేడమ్ పిలుపేంటయ్యా , రుక్మిణి అని పిలువు....నేను నీ హీరోయిన్ ని........" ఆ మాటలంటున్నప్పుడు రుక్మిణి దేవి పెదిమల మాటున , సన్నని నవ్వు.
    అంతా దిగ్బ్రమగా ఉంది జయేంద్రకు.
    అంత నిరాశగా రుక్మిణీదేవి ఎప్పుడూ మాట్లాడడం వినలేదు జయేంద్ర.
    "నలభై ఏళ్ళు వంటరిగా బతికానయ్యా.......పేరు, ప్రతిష్ట, డబ్బు, అధికారం ఎన్నున్నా ఏం లాభమయ్యా, నా అన్న వాళ్ళెవరూ లేనపుడు కనీసం చచ్చిపోయినపుడు , ఏడవదానికైనా ఎవరైనా ఉండాలా.......చెప్పు.ఉండాలా.......వద్దా......ఆశలూ, కోరికలూ అన్నీ అవశానదశకు వచ్చేస్తున్నాయి.
    తెర జీవితం విసుగొస్తుంది.జయేంద్ర. వేషాలు వేసీ, వేసీ అలిసిపోయాను. నా నవ్వులు, నా అందం, నా హావభావాలు, నా శ్రుంగారాన్ని నిర్మాతలు డబ్బు చేసుకున్నారు. కానీ నేను నా జీవితంలో ఏ ఒక్కరికీ హీరోయిన్ని కాలేకపోయాను. నాకూ నా బాధలు పంచుకునే భర్త కావాలని ఉండదూ .......నా మమతను పంచివ్వటానికి పిల్లలు కావాలని ఉండదు.....అయిపొయింది.....ఇప్పుడు ఇన్నేళ్ళ తర్వాత ఆ కోరిక కలుగుతోంది జయేంద్ర. ఇప్పుడు ....ఇప్పుడు....ఎంత హీరోయిన్నయినా, వయసు పైబడిన హీరోయిన్ని గదా! నన్నెవరూ చేసుకుంటారు? మనసంతా ఏదో బాధ. నిజంగా నాకు జ్వరం అనుకున్నావా.....మనోవ్యాధి, దానికి మందులేదు . చెప్పు జయేంద్ర.
    ఈ కేరెక్టర్ కి నీ చేతుల్లో ప్రాణం విడవాలని ఉందయ్యా.......నీ కిష్టమేనా......:"
    ఏం జవాబు చెప్పాలో అర్ధం కాలేదు జయేంద్ర దత్ కి.
    "ఆ రకంగా నన్ను రుణం తీర్చుకొమంటే మీ ఇష్టం." జయేంద్ర కనుకొలకుల్లో రెండు కన్నీటి బొట్లు.
    "నా ఇష్టమే అన్నావు కదా........నేను చెప్పినట్లు చేస్తావా......
    నేను చెప్పాక.....నచ్చకపొతే........"
    "మీరు చెప్పండి.......నేను చేస్తాను. దృడంగా అన్నాడు జయేంద్ర.
    రెండు నిముషాలు మౌనం.
    నెమ్మదిగా బెడ్ మీద నుంచి దిగింది రుక్మిణి దేవి. జయేంద్ర ముఖంలోకి ముఖం పెట్టి చూసి, అతని కుడిచేతిని పట్టుకుని, "నాతోరా .......అని.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS