Previous Page Next Page 
వసుంధర కధలు -9 పేజి 47

 

    అతనిక్కడికి ఎందుకు వచ్చాడూ, ఏం చేయదలచుకున్నాడు. అన్న ప్రశ్నల కన్నా ఒంటరిగా ఒక్కడినే గదిలో పెట్టి గొళ్ళెం వేశామన్న బాధ, జాలి ఆమెలో ఎక్కువగా ఉన్నాయి. అయితే తనకు తానై గొళ్ళెం జోలికి వెళ్ళదలచుకొలేదామే. రామస్వామి ప్రమాదకరమైన మనిషని ఆమెకు తెలుసును.
    భర్త వెళ్ళి అరగంటైనా లత రాలేదు. మొదటి రోజు అతనింకా వెళ్ళాలి. రాధతో మాట్లాడాలి. లతకి విషయం తెలియ జేయ్యాలి. రేపట్నించయితే ఆమె పెందరాళే రావచ్చు. లత గురించి అబద్దం చెప్పాలనుకుంటున్నా ఆమె కిప్పుడు నిజంగానే వంట్లో బాగున్నట్లు లేదు.
    మరో అర్ధగంట కు రామస్వామి గదిలోంచి కొన్ని శబ్దాలు వినిపించాయి. అవి తనను పిలవడానికి సంకేతంగా సునీతకు తోచింది. కొద్ది క్షణాలు తటపటాయించి ఆమె ధైర్యం తెచ్చుకుని తలుపులు తీసింది.
    "అర్జంటుగా మరుగు దొడ్డి కి వెళ్ళాలి. నీకు శ్రమ ఇచ్చినందుకు మన్నించు" అన్నాడు రామస్వామి. ఆమె జవాబు కోసం ఎదురు చూడకుండా అతను వేగంగా వెళ్ళిపోయాడు.
    రామస్వామి పరిస్థితికి సునీతకు చాలా జాలి కలిగింది. ఆమె ఇంకా ఆ అవస్తలో ఉండగానే ఎవరో వీధి తలుపులు తట్టారు. సునీత వెళ్ళి తలుపులు తీసింది.
    "నమస్కారమండీ !" అంటూ ప్రవేశించింది లత. సునీత ఆమెను చూస్తూనే నీరసంగా ముఖం పెట్టేసింది. అందుకు నటన అవసరం లేదు. ఆ మనిషితో సాయంత్రం భర్త వచ్చేవరకూ వేగాలన్నా భావన అప్రయత్నంగానే ఆమె ముఖం లోకి నీరసాన్ని తీసుకు వచ్చింది.
    "మీరేమీ అనుకోనండీ - కబురు తెలియగానే ఉన్న దాన్ని ఉన్న పళంగా పరుగెట్టు కొచ్చాను. ఇంకా కొన్ని కాలకృత్యాలుండి పోయాయి." అంది లత. ఆమె ముఖం చూస్తూనే ఆమె అవసర మేమిటో తెలిసి పోతోంది.
    సునీత చెవులు సునిశితంగా పనిచేస్తున్నాయి. మరుగు దొడ్డి కని వెళ్ళిన బావ ఇంకా వచ్చింట్లు లేదు. ఇప్పుడు లతనేలా ఆపాలి?
    సునీత కు మనుషుల్ని కబుర్ల లో పెట్టి మభ్యపెట్టడం చేతకాదు. అయినా ఏదో ప్రయత్నం చేస్తూ లతను వంటింటి వైపుకు నడిపించింది. అలా వెళ్ళేటప్పుడు రామస్వామి ఉండే గది వైపు చూసింది. ఆ తలుపు లింకా తెరిచే వున్నాయి. అంతసేపు అతను మరుగు దొడ్లో ఎందుకుండి పోయాడో అనుకుంది ఆమె మనసులో.
    "ఇప్పుడు వంటిల్లు చేరవలసిన సమయం కాదండీ-"అని లత అక్కణ్ణించి చటుక్కున పరుగెత్తింది. ఆమె నెలా వారించాలో తెలియక సునీత ఊరుకుంది.
    ఓ అయిదు నిముషాల అనంతరం లత ప్రశాంతంగా తిరిగి వచ్చింది. ఆమె ముఖంలో ఆశ్చర్యం, భయం లాంటి భావాలేమీ లేవు. ఆమె అంత ప్రశాంతంగా ఉండడం చూసి సునీత కాశ్చర్యం కలిగినా, ఆ ఆశ్చర్యాన్ని ప్రకటించుకునే దారి లేక ఊరుకున్నదామె.
    తన మనసులోని అనుమానాన్ని నివృత్తి చేసుకోవడం కోసం ఆమె తనూ ఒకసారి బాత్రూం గదిలోకి వెళ్ళింది. అది ఇంట్లో ఒక భాగంగా ఉంటోంది. బాత్రూం లెట్రిన్ కంబైన్ద్ద్ గా ఒక విశాలమైన గదిలో ఉన్నాయి.
    సునీత అ గదిలోకి వెళ్ళి వెళ్ళగానే అక్కడ రామస్వామి కనిపించాడు. ఆమె ఆశ్చర్యానికి అంతులేదు. తలుపులు వేయమన్నట్లు సంజ్జ్ఞ చేశాడతను. ఆప్రయట్నంగా తలుపులు వేసిందామె. రామస్వామి ఆమెను సమీపించి "ఆ అమ్మాయేవరు? ఎందుకొచ్చింది ?" అని నెమ్మదిగా అడిగాడు.
    సునీత చెప్పింది. రామస్వామి ముఖం ఎర్రబడింది. "నా నుంచి రక్షణ కోరుతున్నావంనమాట!" అన్నాడు.
    "భర్త చాటు ఆడదాన్ని, అయన కనుమానం రాకుండా కాపాడు కోవడం నాకు అవసరం --' అంది సునీత.
    "గోవిందరావీ విధంగా నీకు కాపలా పెట్టడం నిన్నూ నీ మంచి తనాన్ని అనుమానించి నట్లు ఫీలవడం లేదా నువ్వు?" అన్నాడు రామస్వామి.
    "లేదు-- " అంది సునీత.
    "కానీ ఇది నాకు అవమానమే! స్వయానా మరదలువి నువ్వు. అయినా పెళ్ళి చేసుకోలేక పోయాను. నీ ఇంటికి ఆశ్రయం కోరి వచ్చాను. గదిలో బందీ నయ్యాను. అంతే కాదు, ఓ ఆడపిల్ల కాపలా కూడా!" అన్నాడు రామస్వామి "సునీతా ప్లీజ్! అసలే కష్టాల్లో ఉన్న నేను ఈ అవమానాన్ని భరించ లేను. ఆ పిల్లను పంపించేసేయ్."
    'అది సాధ్యం కాదు -" అంది సునీత.
    "సాయంత్రం నీ భర్తతో ఈ విషయం మాట్లాడతాన్లె. ఇలాంటి విషయాల్లో నీకంటే వాడే నయం!" అన్నాడు రామస్వామి.
    "ఆ పిల్ల బాత్రూం లోకి వస్తే కళ్ళ బడకుండా ఎలా తప్పించుకున్నావ్?" అంది సునీత.
    'అది నువ్వడక్కూడదు. నేను చెప్పకూడదు. దీన్ని బట్టినా శక్తి సామర్ధ్యాలు తెలుసుకో. నేను నిన్నేమైనా చేయదల్చుకుంటే -- ఆ పిల్ల ఉన్నా చేయగలను-" అన్నాడు రామస్వామి.
    "సరే కానీ -- రోజల్లా లెట్రిన్లో ఉంటె మాకు చాలా ఇబ్బంది . నువ్వు నీ గదిలో కెళ్ళి తలుపులు జేర వేసుకుంటే ఎలాగో అలా నేను వచ్చి గొళ్ళెం పెట్టేస్తాను. కానీ లత తిన్ననైనది కాదు. ఇల్లంతా తిరుగుతుంది. నీగదిలోకి మేము రావాలనుకుంటే గొళ్ళెం కాస్త చప్పుడు చేస్తాను. ఏ మంచం క్రింద కైనా దూరు--" అంది సునీత.
    ఆమె రామస్వామి జవాబు కోసం అట్టే ఎదురు చూడకుండా బయటకు వెళ్ళింది. తర్వాత లతను తీసుకుని వంటింట్లో కి వెళ్ళింది. వెంటనే కబుర్లు మొదలు పెట్టేసింది లత.
    "కాస్త కాఫీ పుచ్చు కుంటారా? లేకపోతె భోం చేసేస్తారా?" అంది సునీత.
    లత దానికి వెంటనే సరైన జవాబివ్వలేదు. తనకు కాఫీ ఎంతగా అలవాటై పోయిందో , ఎన్ని సార్లు తాగినా తనకు మాములుగానే ఎలా ఉంటుందో , భోజనానికి కాఫీ ఎలా అడ్డు రాదో వగైరాలు చెబుతూ వాటికి సపోర్టుగా ఉదాహరణలు కూడా చెబుతోంది.
    "అయితే  కాఫీ కలుపుతాను. తర్వాత భోం చేద్దురు గాని" అంది సునీత.
    "అలాగే కానీ -- అసలే మీకు ఒంట్లో బాగోలేదు. మీరు నాకు కాఫీ కలిపివ్వడమేమిటి? మీరలా కూర్చోండి . నేను కాఫీ కలుపుకు తాగేస్తాను. బైదిబై మీక్కూడా అని లత ఇంకాయేదో అనబోతుండగా "రోజుకి రెండు సార్లే నేను కాఫీ తాగుతాను. రెండు సార్ల కూడా పూటైనా గ్యాపుండాలి" అంది సునీత.
    'అంటే మా పెద్దమ్మ గారిలా అన్నమాట!' అంది . లత తన పెద్దమ్మ గారి గురించి చెప్పడం మొదలు పెట్టింది. ఈలోగా సునీత వెళ్ళి రామస్వామి వున్న గది తలుపులు వేసి వచ్చింది. లత ఆమెకు వినబడేలా స్వరం పెంచి మాట్లాడుతూనే వుంది.

                                     7
    "నాకు కాపలాగ లతని పెట్టడం నాకు నచ్చలేదురా" అన్నాడు రామస్వామి.
    గోవిందరావు తడబడి 'అబ్బే అలాంటిదేమీ లేదు సునీతకు నిజంగా వంట్లో బాగుండడం లేదు. సాయంగా ఉంటుందని లతకు కబురు పెట్టాను. ఇది మాకు కొత్త కాదు" అన్నాడు.
    "కానీ ఇప్పుడు సునీత ఆరోగ్యం బాగానే ఉన్నదని నా అనుమానం. నిజంగా బాగోలేక పోయినా -- నేను ఇంట్లోకి వచ్చినప్పుడే లతని పిలిపించడం నాకూ, సునీతనూ కూడా అవమానం."
    "నాకేమీ అవమానం లేదు" అంది సునీత ఖచ్చితంగా.
    "అవేం మాటలు సునీతా!" అన్నాడు గోవిందరావు. అతను క్షణం అలోచించి, "సరే నిన్ను బాధ పెట్టడం నాకిష్టం లేదు. రేపట్నించి లత రాదు."
    "నువ్వు చాలా మంచి వాడవురా. నువ్వు నన్ను గదిలో పెట్టి తలుపు గొళ్ళెం వేసేయ్. మళ్ళీ నువ్వు తిరిగొచ్చే దాకా గదిలోనే వుంటాను." అన్నాడు రామస్వామి.
    "అది మాత్రం నీకు అవమానం కాదా!" అన్నాడు గోవిందరావు.
    "కాదు. ఎందుకంటె ఇంట్లో ఫ్రీగా తిరగటం నాకూ ఇష్టం లేదు. ఇంట్లో ఇంకో మనిషున్నడన్న భావం ఎవరికీ కలగకూడదు. లతను నువ్వు బయట నుంచి రప్పించడం వల్ల ఈ ఇంట్లో నా ఉనికి గురించి అనుమానం తలెత్తే అవకాశం వుంది. అదే - సునీత యే పొరుగింటి పుల్లమ్మ తోనో కబుర్లు చెబుతూ కూర్చుంటే నాకు అభ్యంతర ముండదు." అన్నాడు రామస్వామి.
    "అసలేం జరిగింది , ఎందుకీదంతా?" అన్నాడు గోవిందరావు.
    'చాలా కష్టాల్లో వున్నాను. ప్రస్తుతానికేమీ చెప్పలేను. అయిన వాళ్ళు...."
    "సరేలే: అన్నాడు గోవిందరావు తన విసురు ను బయటకు ప్రదర్శించకుండా మనసులోనే దాచుకున్నాడు.
    రాత్రి భోజనాలై పడుకున్నాక "నాకేదో బెంగగా ఉంది" అంది సునీత భర్తతో.
    "రేపు ఆఫీసుకు వెళ్ళేప్పుడే చెప్పేస్తాను. లతను రావద్దని. వాడు చాలా అఫెండవుతున్నాడు" అన్నాడు గోవిందరావు.
    "మీరు మాత్రం సందేహించకుండా గదికి గొళ్ళెం పెట్టి మరీ వెళ్ళండి" అంది సునీత.
    మర్నాడలాగే చేసి వెళ్ళాడు గోవిందరావు. అతను వెళ్ళేక పనులు చూసుకుని ఓ నవల చదువుతూ కూర్చుంది సునీత. చాలావరకు రామస్వామి గదిలోంచి అలికిడేమీ వినబడలేదు. నవల మీద బాగా ఫ=దృష్టి పడ్డాక రామస్వామి గదిలోంచి సంకేత శబ్దం వినిపించింది సునీతకు. సునీత వెళ్ళి గొళ్ళెం తీయబోయింది."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS