Previous Page
మల్లెలు ఎర్రగులాబీలు పేజి 48


    'నాన్నారూ !' గద్గస్వరంతో అని తను కూడా కంట తడి పెట్టుకొని తండ్రి గుండెల్లో తల దాచుకుంది.
    అంతలో తనను శ్రీపతి గారు పిలిచినట్లు విన్న సుందరరామయ్య గారు శారద ను ఊరడిస్తూ కళ్ళు తుడుచు కోవలసిందిగా ఆమెకు చెప్పి అక్కడి నుండీ వెళ్ళిపోయారు.
    శ్రీపతి గారితో, ప్రభాకరం తో మళ్ళీ శారద ఉన్న చోటికి వచ్చారు సుందరరామయ్యగారు.
    'అమ్మా శారదా! పసిపిల్లావాడి వంటి మనస్తత్వం గల ప్రభాకరాన్ని నీకు ఒప్పగిస్తున్నాను, అయినా నీకు ఒకరు చెప్పవలసిన అవసర మేముంది? నా కన్నా వాడిని నీవే బాగా అర్ధం చేసుకో గలిగావు. నీకన్నీ తెలుసు. మా యింటి మహాలక్ష్మీ వై పది కాలాల పాటు పిల్లా పాపలతో పచ్చగా వర్ద్ఘిల్లు తల్లీ!' అని శారదను దీవించారు శ్రీపతి గారు.'
    'పెదబాబు గారూ!......' అని వారి పాదాల నంటి నమస్కారం చేసింది శారద.
    'లే తల్లీ!' అని లేవనెత్తి శ్రీపతి గారు 'అమ్మా! అదేం పిలుపు? చనువుతో మామయ్యా అని పిలువు.'
    'అలాగే మామయ్యా'-- శారద.
    'నీవంటి కోడలు లభించినందువల్ల మా యిల్లు పావనమైందమ్మా! నేనూ, అన్నపూర్ణ అదృష్ట వంతులం తల్లీ!'-------- శ్రీపతి గారు.'
    'లేదు మామయ్యా! ఈ అదృష్టమంతా నాదే'' --శారద ప్రభాకరాన్ని ఓరగా చూస్తూ.
    అక్కడికి ఆ సంభాషణ అంతటితో ముగిసింది ---
    
                            *    *    *    *
    మూడు రోజులు గడిచిపోయాయి. బంధువులంతా వెళ్ళిపోయారు.
    ఒకరోజు శ్ర్రీపతి గారింట్లో నూతన వధూవరులు, సుందరరామయ్య గారు, పార్వతమ్మ గారు అంతా సమావేశ మయ్యారు.
    'అమ్మాయి శారద చలవ వల్ల మా సమస్య తీరిపోయింది. ఆమె ఋణం ఈ జన్మలో తీర్చుకోలేము. ఇంత త్వరలో పరిస్థితులు చక్క బాదతాయని నేను ఊహించ లేదు.' ఆప్యాయంగా శారదను చూస్తూ అన్నారు లక్ష్మయ్య గారు.
    'అలా అనకండి మామయ్యా గారూ! మీకు ముందుగా ఋణపడింది నేను. మీ ఆదరణ అత్తగారి ఆప్యాయత, సహాయం లేకపోయి నట్లైతే నా జీవితం ఏమై ఉండేదో ; మీరు చేసిన దాంట్లో నే చేసినదేన్నో వంతు?' శారద.
    'తల్లీ! నీవెప్పుడూ యిలాగే అంటూ ఉంటావు. నీ మంచితనం ఎవరికి తెలియదు?' అన్నపూర్ణమ్మ గారు తను కోడలి ముఖంలోకి ప్రేమగా చూస్తూ అన్నారు.
    'తర్వాత కార్యక్రమ మేమిటో నిర్ణయించండి --' శ్రీపతి గారు.
    'మేమంతా మా ఊరు వెళ్ళిపోతాం -- లక్ష్మయ్య గారు.
    'అలా వీలుపడదట.......! నూతన వధూవరులు హనీమూన్ కు వెళ్లాలని మా ప్రభాకరం ప్రోగ్రాం తయారు చేశాడు. డానికి కావలసిన ఏర్పాట్లన్నీ నేను చేయిస్తాను. మూడు జంటలూ హనీమూన్ కు వెడతాయి.' అందరి ముఖాలలోకి పరిశీలనగా చూస్తూ అన్నారు శ్రీపతి గారు.
    'అదేమిటి? మా అమ్మాయిలు, అల్లుళ్ళు హనీమూన్ కు వెడుతూ ఉంటె మధ్య మీ ఏర్పాట్లే]మిటి? నేనే చేయిస్తాను--' చిరునవ్వుతో సుందరరామయ్య గారు.
    అరగంట ఘర్షణల తర్వాత సుందరరామయ్య గారు ఆ ఏర్పాట్లు చేయడానికి ఒప్పుకున్నారు శ్రీపతి గారు.
    'రేపే మంచి రోజు . బయలుదేరి వెళ్ళాలి' శ్రీపతి గారు.
    'అలాగే వెడతాం నాన్నారూ......!' నూతన వదూవరుల తరపున ప్రభాకరం ఆమోదించాడు.
    'మరి మేము మా ఊరికి వెళ్ళిపోతాం' శ్రీపతి గారితో అన్నాడు లక్ష్మయ్య గారు.
    'అలా వీల్లేదు. వారంతా హనీమూన్ నుండి తిరిగి వచ్చేంత వరకు మీరు, మా సుందరయ్య మాకు అతిధులుగా ఉండాలి' సుందరరామయ్య గారి వైపు ఎగతాళి గా చూస్తూ అన్నారు శ్రీపతి గారు.
    'బావగారు నన్ను చివరకు సుందరయ్య ను చేశారు మొత్తానికి హాస్య ప్రియులు '-- పెద్దగా నవ్వారు.
    వారి నవ్వులో మిగతా వారి నవ్వులు కలియడంతో శ్రీపతి గారి భవనం లో నవ్వుల వర్షం కురిసి పువ్వులు రాలి నట్లైంది.

                          (అయిపొయింది)


 Previous Page

WRITERS
PUBLICATIONS