Previous Page Next Page 
వసుంధర కథలు-14 పేజి 47

 

    "మనం స్నేహం చెడకుండా విడిపోయే అవకాశామిస్తున్నందుకు మీకు నా కృతజ్ఞతలు. ముందుగా అయిదు లక్షల క్యాషు సిద్దం చేసి వుంచండి" అన్నాడు నారాయణ.
    అతడి నమ్మకానికి ఆశ్చర్యపడుతూ -- "అయితే ఈరోజే పరీక్ష ....' అన్నాడు స్వరూప్.
    "బాస్! నాకు ఒక్కరోజు గడువు కావాలి ....' అన్నాడు నారాయణ.
    "ఎందుకు?"
    "మనిషి ఎంతటి సమర్దుడైనా కావచ్చు. కానీ అతడి ప్రతి విజయం వెనకా ఎవరిదో అజ్ఞాత హస్తముంటుంది. నాకు దేవుడి పై నమ్మకం. ఇప్పుడు తలపెట్టిన కార్యక్రమం నాకు జీవన్మరణ సమస్య. నేను తిరుపతి వెళ్ళి ఆ శ్రీనివాసుడికి తలనీలాలు సమర్పించుకుని వస్తాను."
    స్వరూప్ ఆశ్చర్యంగా --- "ఎవరైనా తలనీలాలు మ్రొక్కుబడి అయ్యాక ఇస్తారు. పని సఫలం కాకుండా ముందే తలనీలాలివ్వడ మెందుకు?" అన్నాడు.
    "ఒకసారి దేవుడికి మ్రొక్కు కున్నాక పని సఫల మెందుకు కాదు? నేను దేవుడిని అనుమానించను...." అన్నాడు నారాయణ.

                                    2
    మర్నాడు సాయంత్రం ఆరుగంటలకు నారాయణకు నున్న గుండు లో చూసి ఆశ్చర్య పోయాడు స్వరూప్.
    "నీ రూపమే మారిపోయింది ...." అన్నాడాయన.
    "కానీ నేను నేనే !" అన్నాడు నారాయణ.
    "అదీ అనుమానంగానే ఉంది --" అన్నాడు స్వరూప్ నవ్వుతూ.
    అప్పుడిద్దరూ ఓ గదిలోనికి వెళ్ళారు.
    గదిలో మెత్తటి కుర్చీ ఒకటి వుంది. ఫోంబెడ్ వున్న సింగిల్ కాటుంది. గోడ కో అలమారా వుంది.
    అన్నీటికీ మించి ఏసీ రూం అది!
    "రాత్రికి రాత్రి ఇందులో ఏసీ పెట్టించాను " అన్నాడు స్వరూప్.
    "ఎందుకని?"
    "ఈ గది కిటికిలన్నీ మూయబడ్డాయి. అవి తెరవడం నీ వల్ల కాదు. నీ మనుషులేవారైనా నా మనుషుల కనుగప్పి గదిలో ప్రవేశించకుండా కిటికిలన్నీ మూయబడ్డాయి. నువ్వు గదిలో ఉక్కిపోతావని ఏసీ పెట్టించాను " అన్నాడు స్వరూప్.
    తర్వాత అయన అలమారా తీశాడు. అందులో ఒకే ఒక్క భరిణ . ఆ భరిణ లో తళతళలాడే వజ్రం.
    నారాయణ ఆ వజ్రాన్ని  అందుకున్నాడు. తన జేబులోంచి ఓ లెన్సు తీసి వివిధ కోణాల నుంచి దాన్ని పరీక్షించి "మోసం ఇది నకిలీ వజ్రం....' అన్నాడు.
    "వెరీ షార్ప్ !' అని మెచ్చుకుని స్వరూప్ ఆ వజ్రం తీసుకుని జేబులో వేసుకుని మరో వజ్రాన్ని బయటకు తీసి "ఇది చూడు!" అన్నాడు.
    నారాయణ ఆ వజ్రాన్నందుకుని లెన్సు తో పరీక్షించి -- "ఇది అయిదు లక్షలు విలువ చేస్తుంది...." అంటూ అలమారా లోని భరిణ లో పెట్టి అలమారా తలుపులు మూశాడు.
    "నీ జాగ్రత్తలో నువ్వున్నావు...." అన్నాడు స్వరూప్.
    "ఈ వజ్రాన్ని ముందు మీ నుంచి అయిదు లక్షలు తీసుకుని కానీ యివ్వను...." అన్నాడు నారాయణ.
    "ఎందుకని ? నామీద నీకు నమ్మకం లేదా?"
    "అదేం కాదు. ముందు జాగ్రత్త . మిమ్మల్ని మోసం చేసి నేను బ్రతకలేను. కానీ నన్ను మోసం చేసి మీరు బ్రతగ్గలరు...."
    "ఇట్స్ ఏ వాలిడ్ పాయింట్ ....' అని మెచ్చుకున్నాడు స్వరూప్.
    "నేను తలుపులు వేసుకునేదా .....?" అన్నాడు నారాయణ.
    "మంచం అడుగున క్యారియరుంది. రాత్రి తెల్లవార్లూ నీ కాకలి వేస్తె పనికివస్తుందని ఆ ఏర్పాటు ...."
    "థాంక్స్ !"
    'అదిగో -- యిది బాత్ర్రుం "- అంటూ ఓ తలుపు తీశాడు స్వరూప్.
    నారాయణ లోపలకు తొంగి చూశాడు.
    చాలా చిన్న గది అది. అందులో ఓ వాష్ బేసిన్, షవరు , లెట్రిన్ పెసిలిటీ వున్నాయి. వెంటిలేషను కూడా గోడకు అయిదారు చిన్న చిన్న కన్నాలున్నాయి.
    "ఇందులోంచి బయటకు పోవడానికి కానీ బయటి వారు లోపలకు రావడానికి గానీ అవకాశం లేదు ...." అన్నాడు స్వరూప్.
    'అర్ధమవుతోంది --"
    "అన్నట్లు ఓ చిన్న మాట చెప్పడం మరిచాను ...."
    'చెప్పండి ...."
    "ఈ వజ్రాన్ని మింగితే వెంటనే ప్రాణం పోతుంది!..."
    నారాయణ కళ్ళు పెద్దవి చేసి -- "దానికి విషం పూశారా?" అన్నాడు.
    "లేదని నీకూ తెలుసు. ఇప్పుడే యిద్దరం దాన్ని తాకాం. ఆ వజ్రాని కున్న పదునైన కోణాలు శరీరంలోని నరాలను కోసేస్తాయి ...."
    "ఈ విషయం నాకెందుకు చెబుతున్నారు?"
    "ఈ పరీక్షలో ఓటమి నిన్ను వరించాలని కోరుకుంటున్నాను. కానీ నువ్వు బ్రతికుండాలన్నది నా ఆశయం...."
    "థాంక్యూ బాస్ !' అన్నాడు నారాయణ.
    "మనం - మళ్ళీ రేపుదయం కలుసు కుందాం ...." అంటూ రెండడుగులు ముందుకు వేసి మళ్ళీ వెనక్కు తిరిగి -- "తలగడ క్రింద మేగజైన్సు న్నాయి. కాలక్షేపానికి పనికొస్తాయి ...." అన్నాడు స్వరూప్.
    "థాంక్యూ వెరీమచ్ బాస్!" అన్నాడు నారాయణ.
    స్వరూప్ ఒక్క క్షణం ఆగి - "మిస్టర్ నారాయణా! ఈ పరీక్షల్లో నువ్వు నెగ్గుతాననే అనుకుంటున్నావా?" అన్నాడు.
    "ఆ ఏడు కొండల వాడికి తల నీలా లిచ్చాను. అదే నన్ను గెలిపిస్తుంది. ఇంతవరకూ ఆస్వామి నన్నెప్పుడూ ఓటమికి గురి చేయలేదు - ' అన్నాడు నారాయణ.
    స్వరూప్ నారాయణ మాటల కంటే అతడి కళ్ళలో కనపడుతున్న నమ్మకానికి ఆశ్చర్య పడ్డాడు.
    స్వరూప్ గుమ్మం దాకా వెళ్ళగానే -- "బాస్ ! లోపల్నుంచీ గడియ వేసుకుంటాను ....' అన్నాడు నారాయణ.
    "బయట నుంచి నేనూ గడియ వేస్తాను ...." అన్నాడు స్వరూప్.

                                      3
    స్వరూప్ వెళ్ళిపోయాక లోపల్నుంచీ గడియ వేసుకున్నాడు నారాయణ. మంచం అడుక్కు వంగి -- క్యారియర్ లాగి చూశాడు.
    దాంట్లో మొత్తం నాలుగు గిన్నేలున్నాయి. ఒక గిన్నెలో వడలు. మరో గిన్నెలో వెజిటబుల్ పులావు వుంది. ఓ గిన్నెలో పులావు లోకి ఉల్లిపాయ చట్నీ వుంది. ఓ గిన్నెలో పెరుగూ అన్నముంది.
    అన్నీ కొద్ది కొద్దిగా రుచి చూసి -- "వంటవాడేవడో అద్భుతంగా చేశాడు - " అనుకున్నాడు నారాయణ.
    తర్వాత అతడు క్యారేజీని మూత పెట్టి మంచం అడుక్కు తోసేశాడు. అప్పుడు మంచం మీద దిండు తీశాడు. అడుగున నాలుగు మేగజైన్సు న్నాయి. అన్నీ పోర్నోగ్రఫీ కి సంబంధించినవేనని అట్టలు చూడగానే తెలుస్తోంది. నారాయణ వాటి పైన దిండు వేసి - "నా దృష్టికి నిలకడ లేకుండా చేయాలని బాస్ చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు- " అనుకున్నాడు.
    అతడు నెమ్మదిగా మంచం మీద వాలాడు. కళ్ళు మూసుకున్నాడు. అతడు నిద్ర పోవడం లేదు. ఆలోచిస్తున్నాడు.
    వజ్రాన్నేలా కాజేయాలో అతడు ముందుగానే నిర్ణయించుకున్నాడు. అయితే గదిలో తనేం చేస్తున్నదీ బయటి నుంచి స్వరూప్ కనిపెడుతున్నాడేమోనన్న భయం అతడికుంది. అందుకని గదిలో దీపం అర్పేశాడు.
    ఎయిర్ కండిషనర్ సన్నగా రోద చేస్తోంది.
    గదిలో చిమ్మ చీకటి !'    
    ఆ చీకటిలో మసలడానికి అలవాటు పడ్డాడు నారాయణ కాసేపటికి. ఇప్పుడతడు దిండు కింద నుంచి పుస్తకాలు తీసి చూసి ఏ పుస్తకమేదో చెప్పగలడు. తడుముకోకుండా మంచం  కింద క్యారియర్ తీయగలడు. వెళ్ళి కుర్చీలో కూర్చోగలడు. మంచం మీద పడుకోగలడు. అలమారా లోని వజ్రాన్ని తీయగలడు.
    ఆ చీకటి అతడికిప్పుడు వెలుగుగా మారింది. అతడి కిప్పుడన్నీ కనబడుతున్నాయి. ఆ గదిలో మరో వ్యక్తీ వుండి వుంటే మాత్రం అతడెం చేస్తున్నాడో కూడా కనబడనంత చీకటి అది!
    ఆ చీకటిలో  నారాయణ ఏదో చేస్తున్నాడు. అతడెం చేసినా మళ్ళీ గదిలో దీపం మాత్రం వేయలేదు.

                                   4

    స్వరూప్ బయట నుంచి తలుపు గడియ తీసి -- తట్టాడు. తలుపు తెరుచుకుందుకుకాసేపు పట్టింది.
    తలుపు తీసిన నారాయణ -- "మరి నాకు సెలవిప్పించండి--" అన్నాడు.
    "అగు...." అన్నాడు స్వరూప్ -- "నిన్ను సోదా చేయకుండా ఇక్కణ్ణించి పంపడం కుదరదు...."
    'అంతా మీ యిష్టం !' అన్నాడు నారాయణ.
    "నువ్వలా కుర్చీలో కూర్చో -- " అన్నాడు స్వరూప్.
    నారాయణ కుర్చీలో కూర్చున్నాడు.
    స్వరూప్ అలమారా దగ్గరకు వెళ్ళాడు. అందులో భరిణ లో వజ్రం లేదు.
    "మొత్తం మీద సాధించావన్న మాట!" అన్నాడు స్వరూప్.
    నారాయణ మందహాసం చేశాడు.
    'అయితే అప్పుడే పూర్తీ కాలేదు ...." అన్నాడు స్వరూప్.
    గది తలుపు తెరచుకుని లోపలకు ఇద్దరమ్మాయి లు, ఇద్దరబ్బాయిలు వచ్చారు.
    "ఇతడిని శోధించండి ...." అన్నాడు స్వరూప్.     


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS