Previous Page Next Page 
శంఖారావం పేజి 47

 

    వారం రోజుల్లో ఆ ఆటవిక యువతి కోలుకోగలిగింది. ఆమె పూర్తిగా మామూలు మనిషి కావడానికి మరో వారం రోజులు పట్టింది.
    ఈలోగా ఉదయ ఒక అపూర్వం సాధించింది. విస్సీ బావ సాయంతో ఆమె ఆటవిక భాషనూ సులభంగా తను నేర్చుకోగలగడమే కాక కులభూషణ్ కీ, వేదాంతానికీ నేర్పింది. ఇప్పుడు వారు నాయకుడి సాయం లేకుండా అటవికులతో సంభాషణ చేసే స్థాయికి వచ్చేశారు.
    అంత సులభంగా వారికి ఆటవిక భాష రావడం నాయకుడికాశ్చర్యన్ని కలిగించింది.
    అయితే వారు దేవతా పురుషులని అతడు సరిపెట్టుకున్నాడు.
    ఆటవిక యువతి మామూలు మనిషి కావడం ఆటవిక గ్రామంలో సంచలనాన్ని కలిగించింది.
    మాంత్రికుడామే శాపగ్రస్థ అని బ్రతకదని అన్నాడు.
    కులభూషణ్ తనామేను బ్రతికిస్తానన్నాడు. అతడు మాట నిలబెట్టుకున్నాడు. అంటే మాంత్రికుడి శక్తులు నశించాయా? ఆటవికుల్లోనూ , నాయకుడి లోనూ ఈ ఆలోచన మెదులుతుంటే అసలైన విశేషం జరిగింది.
    ఆటవిక యువతిది అద్భుత సౌందర్యం. అందుకే భర్త ఆమెను బ్రతికించుకోవాలని తాపత్రయపడ్డాడు. ఆమె ఇంకా ఉదయ తోటే ఉంటోంది.
    ఒకరాత్రి ఉదయ నిద్రలో ఉండగా ఆమె లేచింది. చప్పుడు చేయకుండా వేదాంతం గదిలోకి ప్రవేశించింది. వేదాంతం అప్పుడు మంచి నిద్రలో ఉన్నాడు.
    ఆమె గది తలుపు వేసింది. ఆమె వేదాంతాన్నిసమీపించింది.
    నిద్రలో అతడి ముఖం అమాయకంగా ఉంది. అతడి అందం పెరిగింది. ఆమె అతణ్ణి చూస్తూ ముఖం మీదకు వంగి పెదవులపై ముద్దు పెట్టుకుంది.
    వేదాంతం ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. ఎదురుగా ఆటవిక యువతి! గదిలో సన్నగా చమురు దీపం వెలుగుతోంది.
    ఆ దీపపు వెలుతురును మించింది. ఆటవిక యువతి . వేదాంతం కళ్ళు నులుముకున్నాడు. ఆటవిక యువతి తన దుస్తులు తొలగించింది.
    గదిలో మెరుపు మెరిసినట్లయింది. వేదాంతం గుండెలో పిడుగులు పడ్డాయి.
    అడవి సింహం నాజూకుతనానికి వ్యాయామం అవసరం లేదు. అడవి పులి రాజఠీవికి శిక్షణ ఆవసరం లేదు. అడవి కన్నె అందచందాలకు మెరుగులవసరం లేదు. వేదాంతం ఆమెను చూస్తున్నాడు.
    ఆమె మళ్ళీ అతడి మీదకూ వంగింది. క్షణ కాలం పాటు వివేకానికి, ప్రలోభానికి మధ్య సంఘర్షణ.
    "ఏమిటిది?" అన్నాడతడు. ఆమె బదులుగా ఏదో అంది. అతడి కర్ధమైంది- "నీ భాష నాకర్ధం కావడం లేదు" అందామె.
    అప్పుడతడామెతో ఆమె బాషలో మాట్లాడడం ప్రారంభించాడు. అతడినామే తీగెలా అల్లుకుపోవాలని చూస్తోంది. అతడు మనసును నిగ్రహించుకుని ఆమె ప్రవర్తనకు కారణం తెలుసుకుంటున్నాడు.
    అనారోగ్య పరిస్థితిలో ఆమె ఉన్నప్పుడు మాంత్రికుడామెతో "నీవు శాపగ్రస్థ వు కాకపోతే నీ ఆరోగ్యం బాగుపడుతుంది. నీ ఆరోగ్యం కుదుట పరచిన వారికీ నువ్వు ఒకరాత్రి నీ శరీరాన్నర్పించు కోవాలి ' అన్నాడు.
    "నేను వివాహితను " అందామె.
    "ప్రాణదాత విషయంలో నువ్వేం చేసినా తప్పులేదు" అన్నాడు మాంత్రికుడు. ఆమె ఇప్పుడు తన ప్రాణదాతకు ఋణం తీర్చుకుందుకు వచ్చింది.
    "ఇదా ఆ పద్దతి?" నీకు సిగ్గు లేదా ?' అన్నాడు వేదాంతం.
    మాంత్రికుడామెకు చెప్పి వున్నాడు. "మన ఆటవిక సంప్రదాయాలను కాపాడే మాంత్రికుణ్ణి నేను. తప్పు చేయడం నాకిబ్బండిగా ఉంటుంది. కానీ ప్రాణదాతను నీవు ప్రాణాన్ని మించిన కానుక ఇచ్చుకోకపోతే ఋణ గ్రస్తురాలివై జీవితంలో దుఃఖపడతావు. కాబట్టి నీ కోసం నేను త్యాగం చేస్తాను. ఆ త్యాగం చేయాలంటే నువ్వు నన్ను బాగా రెచ్చగోట్టాలి. నా నిగ్రహం కోల్పోయేలా చేయాలి. అప్పుడే నేను తప్పు చేయగల్గుతాను..."
    ఆమె మాంత్రికుడి ఆదేశాన్ని పాటిస్తోంది.
    'అయితే నీవు పోరబడ్డవు. నీ ప్రాణదాతను నేను కాదు. నా మిత్రుడు పక్క గదిలో ఉన్నాడు..."
    "అతడు కేవలం నాకు మందిచ్చాడంతే! అంతా నీ ఆదేశం మీదనే జరిగింది."

 

                                 
    "ఎవరు చెప్పారు నీకు?" అన్నాడు వేదాంతం ఆశ్చర్యంగా.
    "ఉదయ" అందామె. వేదాంతం మరింత ఆశ్చర్యపోయాడు. అంటే ఉదయకు తెలుసు ఇలా జరుగుతుందని! ఈ ఆటవిక యువతి ద్వారా ఆమె తన నిగ్రహాన్ని పరీక్షించాలనుకుంటుందన్నమాట!
    ఆమె కులభూషణ్ ని కాక తననే పరీక్షించాలనుకుంటోందంటే కారణం ఆమెకు నమ్మకం --- తానోడిపోతానని!'    తానోడిపోయాక కులభూషణ్ ని పరీక్షించనవసరం లేదు.
    "ఉదయా -- నీకు నాపై ఎంత ద్వేషం ?' అనుకున్నాడతడు.
     ఈ ఆలోచన రాగానే బలహీనపడుతున్న అతడి మనసు గట్టి పడింది. అప్పుడామే అతణ్ణి వాటేసుకుని ఉంది.
    "ఉదయ నీకు తప్పు చెప్పింది. నీ ప్రాణ దాత నా మిత్రుడే తప్ప నేను కాదు. ఉదయకు నేనంటే ఇష్టం. అందుకని ఆమె లేని ఘనతను నాకందించింది" అన్నాడు వేదాంతం.
    "నువ్వు నిగ్రహం చూపిస్తున్నావు. నేను నీ నిగ్రహాన్ని పటాపంచలు చేయగలను" అందా ఆటవిక యువతి.
    వేదాంతం చలించలేదు. ఆమె ఏంతో సేపు ఆ గదిలో ఉండలేదు. కాసేపాగి "నువ్వు చెప్పిందే నిజమనుకుంటాను" అని పక్క గదిలోకి వెళ్ళింది.
    అప్పుడు కులభూషణ్ మెలకువగా ఉన్నాడు. ఆమె తలుపు వేస్తుంటే "పక్కగదిలో మాటలు వింటూంటేనే నాకిక్కడ వళ్ళు వేడెక్కింది. నీ సమయాన్ని రసికుల కంకితం చేయాలి తప్ప బదుల కోసం వృధా చేయకూడదు" అన్నాడు.
    ఆమె పరుగున అతడి వడిలో వాలింది.
    ఆ తర్వాత వారి మధ్య మాటలు లేవు.
    అ గది కటూ ఇటూ ఉన్న గదుల్లో వేదాంతం, ఉదయలకు మాత్రం నిద్ర పట్టలేదు.
    
                                *    *    *

    ఇంకా తెల్లవారలేదు. ఎవరో గుడిసె తలుపు తట్టారు. ఆటవిక యువతి ఉలిక్కిపడి లేచింది.
    కులభూషణ్ ఆమెను దగ్గరగా హత్తుకుని నిద్రపోతున్నాడు. ఆమె మృదువుగా అతణ్ణి విడిపించుకుంది.
    కులభూషణ్ కు మెలకువ వచ్చింది. ఆమెను గట్టిగా పట్టుకుని "అప్పుడే వెళ్ళకు" అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS