Previous Page Next Page 
వసుంధర కథలు-1 పేజి 45


    ఎదురుగా ఒక పావలా కాసు కనిపిస్తే అది తీసి జేబులో వేసుకుంటే గానీ నాకు నిద్రపట్టదు. తీసి జేబులో వేసుకునేవాన్ని. అయితే ఒక పావలా ఖర్చు పెట్టాలంటే మా ఊళ్ళో కొంచెం కష్టమే. అదీకాక మా నాన్నగారు మాకు రోజూ ఒక పావలా ఇచ్చేవారు బడికి వెళ్ళేముందు. ఏవో తినుబండారాలు కొని తినేవాన్ని. కానీ డబ్బులు బాగా మిగిలేవి. అవి వేరే నా పెట్టిలో దాచేవాణ్ణి.
    సిగరెట్లు-మొదలైన దురలవాట్లు అలవాటు చేసుకునే అదృష్టం మా ఊళ్ళో నాకు కలగలేదు. మరీ అంత పల్లె పల్లె మీరు కాకపోయినా మా ఊరికి పల్లెటూరి లక్షణాలు లేకపోలేదు.
    దానికి తోడు చాలా బుద్ధిమంతుడని పేరెన్నికగన్న పక్కింటివాళ్ళబ్బాయి ఒకడున్నాడు. వాడూ నేనూ కలిసి స్కూలుకి వెళ్ళి కలిసి వచ్చేస్తూంటాం. వాడు స్కూలు వదిలాక అరక్షణం కూడా ఉండేవాడు కాదు-వాడితోపాటే నేనూ వెంటనే ఇంటికి బయల్దేరవలసి వచ్చేది. కాలేజీకి వెళ్ళాక బాధపడ్డాను కానీ అప్పట్లో వాడితో స్నేహం బాగానే వుండేది.
    పట్నంపోయి కాలేజీలో చదువుకోవాలనే వాంఛ నన్ను పరీక్షలకి బాగా చదివించింది. స్వతహాగా తెలివైనవాడిని చాలా సులువుగా ప్యాసయ్యాను. నా మార్కులు చూసి నాన్నగారు చాలా సంతోషించి-వీణ్ణి తప్పక కాలేజీకి పంపించాలన్నారు. చేరాను రాజమండ్రి ఆర్ట్సు కాలేజీ హాస్టలులో.
    జీవితం అంటే నాకు తెలియడం ఇక్కడే ప్రారంభించింది. ఉన్న డబ్బు ఖర్చుపెట్టడానికి డబ్బు చాలదే! ఎలా? అనే సమస్య ఇక్కడే కలిగింది.
    గాయకుడు నిద్రలో కూడా కూనిరాగాలు తీస్తాడట. చిత్రకారుడు సుద్దముక్క కనిపిస్తే చాలు-నేలమీదైనా చిత్రం గీసేస్తాడట- అలాగే నాకు అలవాటైపోయిన దొంగతనం హాస్టల్లో తన ప్రభావం చూపించసాగింది.
    నేను పుష్కలంగా డబ్బున్న వాడినని తెలుసు-అందువల్ల ఎవరి అనుమానం నామీదకు తిరగలేదు. అయినా హాస్టల్లో విద్యార్ధులు తగు జాగ్రత్తలో ఉండసాగారు.
    నా దొంగతనం చాలా చిత్రంగా ఉండేది. హోటలుకు వెడితే ఇడ్లీ సాంబారు చెప్పి-రెండు స్పూనులు జేబులో వేసుకువచ్చేవాడిని. ఏ షాపుకి వెళ్ళినా ఎలాగో అలా ఏదో ఒక వస్తువుని కాజేసేవాణ్ణి. నాకదొక వ్యసనంగా పరిణమించింది.
    అవకాశం దొరికితే తప్పులు చేయాలని నాకేకాదు చాలామందికి ఉంటుంది.
    డబ్బు ఖర్చుపెట్టడం ఇప్పుడు నాకొక సమస్యకాదు సిగరెట్లు బాగా అలవాటయాయి. పేకాట బాగా జోరుగా ఆడుతున్నాను. ఇవన్నీ నాకు అలవాటు అవడం పెద్ద కష్టమేమీ కాదు. స్వతహాగా తప్పు అంటే నాకు ఒక పెద్ద ఆకర్షణ ఉంది.
    ఏదెలాగున్నా పరీక్షలు వచ్చేసరికి నేను చాలా జాగ్రత్త పడేవాడిని. పరీక్షల్లో పైకిపోతేనే తప్ప- ఈ విధమైన అనందానికి అవకాశం ఉండదని నా భయం. ఫ్రీ యూనివర్శిటీ పరీక్షలు బాగానే రాసి ఇంటికి వెళ్ళాను.
    మా ఊరు నిజంగా ఎంత పల్లెటూరో నాకప్పు డర్దమైంది. ఆ ఊళ్ళో నాలుగు నెలలెలా గడపాలో నా కర్ధం కాలేదు. పరీక్షపోతే మళ్ళీ ఏడాది అక్కడే గడపాలి-నాకు చాలా బెంగపట్టుకుంది.
    ముఖ్యంగా సిగరెట్ల విషయంలో పెద్ద సమస్య పట్టుకుంది. ఊళ్ళో ఉన్న కోట్లు చాలా తక్కువ. అంతానన్ను బాగా ఎరుగున్నవారే-వాళ్ళ దగ్గర సిగరెట్లు కొంటే నాన్నగారికి తెలిసిపోతుంది. సిగరెట్లు తాగకపోవడంవల్ల అదొకలా ఉండేది నాకు. మొదట్లో కొంచెం పిచ్చెక్కి నట్లుండేది కానీ తరువాత మామూలుగానే ఉండేది. క్రమంగా సిగరెట్లు లేకుండా గడపడానికి అలవాటుపడి పోయాను. ఎప్పుడైనా రాజమండ్రీ వెళ్ళినప్పుడు మాత్రం సిగరెట్ పెట్టెలు పదో పదిహేనో కొని తెచ్చుకుని పొదుపుగా వాడుకునేవాడిని.
    నా ఫలితాలు వచ్చాయి. సెకండ్ క్లాసులో ప్యాసయాను. నాన్నగారు నన్ను బీ.యస్సీ చదివిస్తానన్నారు. అయితే నేను ఆనర్స్ చదువుతా నన్నాను.
    అలా అనడంలో ఒక ఉద్దేశ్యం ఉంది నాకు. మా ఊరికి విశాఖపట్నం చాలా దూతం. చటుక్కున అనుకున్నప్పుడల్లా నాన్నగారు నా దగ్గరకు రాలేరు.
    మా అమ్మ నన్నంత దూరం పంపించడానికి మొదట ఇష్టపడలేదు. కానీ నేను మంచి మాటలతో నచ్చచెపితే ఊరుకుంది నాకు కెమిస్ట్రీ ఆనర్స్ లో సీటు వచ్చింది.
    విశాఖపట్నంలో బయట వేరే రూమ్ తీసుకున్నాను.
    ఇంతవరకూ నేను తెలుసుకున్నది చాలా తక్కువ అనీ జీవితం అంటే ఇంతమాత్రమే కాదనీ చాలా ఉందనీ ఇక్కడే తెలిసింది. విశాఖపట్నం విశాలమైన నగరం. తప్పులు చేయడానికి ఎక్కడో ఒకచోట చోటు దొరక్కపోదు.
    మొదటి రెండు సంవత్సరాలూ మామూలుగానే గడిచి పోయాయి. నాలో యౌవనం పూర్తిగా సంతఃరించుకుంది. ఏదో తెలియని అవేశమూ, వింత వింత కోరికలూ కలగసాగాయి.
    నాకు సెక్స్ నవలలంటే చాలా ఇష్టం. చాలా ఎక్కువగా చదివేవాడిని. ఎక్కువగా "బలవంతం" అంటే నాకు ఇష్టం. కథల్లోకానీ-సినిమాల్లోగానీ బలవంతం చేయడం గురించి వచ్చినప్పుడు నాలో కలిగే ఉత్సుకత చెప్పనలవి కాదు. ఎవరో వచ్చి రక్షించినట్లు చూపిస్తే నాకు ఒళ్ళు మండిపోయేది. నా మటుక్కు నాకు ఎవరినైనా అమ్మాయిని బలవంతం చేయాలని కోరిక ఉంది.
    అటువంటి అవకాశం నాకు వచ్చింది ఒకరోజు.
    పాంబీచి దగ్గర ఒక రోజు నేను చాలాసేపు కూర్చున్నాను. క్రమక్రమంగా చీకటి పడేసరికి అంతా వెళ్ళిపోయారు. ఒక అమ్మాయి తప్ప.
    టైము పావు తక్కువ ఏడయింది. ఇంకా ఆ అమ్మాయి లేవలేదు. నన్ను ఏదో శక్తి ఆవహించింది. నెమ్మదిగా లేచాను. చుట్టూ చూశాను. ఎక్కడా జనం ఉన్నట్లు లేరు. ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళాను.
    ఎటో చూస్తున్నదల్లా అలికిడికి ఉలిక్కిపడి-లేచి నిలబడింది-
    "హలో!" అన్నాను. ఆ అమ్మాయి మాట్లాడకుండా వెనక్కు తిరిగింది. కంగారుపడుతోందని గ్రహించాను. చటుక్కున చేయి పట్టుకున్నాను.
    ఆ అమ్మాయి గట్టిగా చేయి విదిలించుకుని- "గెటౌట్ - అరుస్తాను!" అంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS