అంతే! నేను ముందుకు ఒక్కదూకుదూకి ఆ అమ్మాయి నోరు మూశాను. ఎన్నడూ ఎరగని ఆడదాని స్పర్శ-ఒళ్ళు వేడెక్కిపోయింది. కథల్లో చదివినవీ, సినిమాల్లో చూసినవీ దృశ్యాలు గుర్తుకు రాసాగాయి. కథల్లో చదవనివీ, సినిమాల్లో చూడనివీ అయిన దృశ్యాలు చూసే అవకాశం వచ్చిందని గ్రహించాను. ఆమె పెనుగులాడింది. విఫలురాలయింది. లొంగిపోయింది. ఏం మాట్లాడలేదు.
నిజంగా బలవంతం చేయడంలో గొప్ప థ్రిల్ ఉంది. అని ఆ రాత్రే గ్రహించాను. తీయని ఆ అనుభవాన్ని తలచుకుంటూ ఏడుస్తున్న ఆ అమ్మాయిని అక్కడే వదిలేసి వచ్చేశాను. ఇంటికి వచ్చి ఫాంటు జేబులో చేయిపెడితే పర్సులేదు. "అరే!" అనుకున్నాను. అయితే-ఆ అమ్మాయి-ఒక.....
ఇదొక కొత్త రకమయిన వ్యభిచారమన్నమాట-నేను డబ్బుపోయిందని బాధ పడలేదు. ఆ అనుభవపుటాన్నం దాన్ని అందించిన ఆమెకు నా జోహారు లర్పించాను. కానీ అప్పట్నించీ ఆడవాళ్ళమీద ఒక విధమైన చులకన భావ మేర్పడిపోయింది.
అప్పట్నించీ మనస్సు కొత్త కొత్త అనుభవాలకై ప్రాకులాడ సాగింది. అందుకే నా స్నేహితుడు బ్రాందీ విషయంలో కదిపినందుకు చాలా సంతోషించాను. అతను చెప్పిందిది-
"అప్పలస్వామి బాటిల్సు సప్లయి చేస్తానన్నాడు. ఒకోటి పద్నాలుగు రూపాయలు. రాత్రి తలో బాటిలూ వేసుకుని - మస్తుగా తినేసి సెకండు షోకి వెళ్ళాలనుకుంటున్నాం-నీ కిష్టమయితే...."
"ఇష్టం లేక పోవడమేమిటి?"
ఆ రాత్రి ఎనిమిది గంటలకి-మా స్నేహితుడి రూమ్ లో బ్రాందీ మొదటిసారిగా తాగాను. స్నేహితుడు బాటిల్ విప్పి సగం ఓ గ్లాసులోపోసి-ఒక సోడా కొట్టి అందులో పోశాడు. గటగటా తాగేశాను. పెద్ద ఘాటుగా లేదు కానీ కొంచెం చేదుగా ఉంది.
"అలా గటగటా తాగేస్తే కిక్ ఇస్తుంది. స్లోగా సిప్ చేయాలి-" అన్నాడు నా స్నేహితుడు. నవ్వాను. కిక్ ఇస్తుందేమోనని భయంగా ఉంది. "ఆ సగం కూడా పోసేయ్" అన్నాను. అదికూడా తాగేశాను.
ఒళ్ళంతా ఏదో విద్యుత్ పాకినట్లయింది. అసలు చలిఅనేది తెలియడంలేదు. ఒళ్ళంతా వెచ్చగా హుశాఉర్గా ఉంది. ఎదురుగా ఉన్న మనుష్యులందరూ గుర్తు తెలుస్తున్నారు.
ప్రత్యేకంగా తెప్పించిన నాన్ వెజిటేరియన్ కారియర్స్ విప్పి భోంచేశాము. నామటుక్కు ఎంత తిన్నానో లెక్క లేదు. ఎంత తిన్నా కడుపు నిండినట్లు లేదు. ఏదో తిమ్మిరెక్కినట్లుగా ఉంది. ఇంక విసుగొచ్చేక, ఉన్నదంతా అయిపోయేక తినడం మానేశాము.
దేవదాసులో నాగేశ్వరర్రావు గుర్తుకొచ్చాడు. సరదాకి నా స్నేహితులిద్దరు అలా నటించేరు కానీ అంతా "ఫుల్ సెన్సెస్" లో ఉన్నాము. ఉన్నట్లుండి ఒక స్నేహితుడన్నాడు "సెకండ్ షోకి బదులు-ఆ వీధికి పోతే రంజుగా ఉంటుందేమో-"
నేను ఒప్పుకోలేదు. నాకది ఇష్టంలేదు. నేను స్వార్ధపరుణ్ణి. సుఖాన్ని ఆశించి ఆరోగ్యాన్ని పాడుచేసుకోను.
నేను నా రూం కి పోయి పడుకున్నాను. ఎందుకంటే సినిమా చూసే ఓపికలేదు. కాళ్ళు తేలిపోతున్నాయి. మత్తు అవహిస్తోంది.
ఆ రాత్రి హాయిగా ఒళ్ళు తెలియకుండా పడుకున్నాను.
మత్నాడు నిద్రలేచాక అనుకున్నాను-రాత్రి నేను నిజంగా తాగేనా అని? నిజంగా నేను తాగివుంటే తాగడం పెద్ద తప్పుకాదు-అని కూడా నాకు అనిపించింది.
కాస్సేపు హుషారుగా ఉందన్న మాటేకానీ బ్రాందీలో రుచి ఏమీలేదు. దానికోసం జనం మరీ అంతగా పిచ్చెక్కి పోవడమెందుకో నా కర్ధంకాలేదు. మళ్ళీ ఇంకెప్పుడూ తాగకూడదని గట్టిగా అనుకున్నాను.
నేను అద్దెకుంటున్న ఇంటి వాళ్ళమ్మాయి చాలా బాగుంటుంది. నిజం చెప్పాలంటే ఆమెను నేను ప్రేమించానేమోనని నా అనుమానం. ఆ అమ్మాయికూడా అప్పు డప్పుడు నాకేసీ నా రూమ్ కేసీ చూస్తూంటుంది. చాలా కథలు చదివానేమో ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమిస్తోందేమో ననిపించింది. ఆరోజు అవకాశం చూసి అడిగేయాలనుకున్నాను.
ఆ రోజు.....
మళ్ళీ ఆ రోజులాంటి పాంబీచి అవకాశం. మా ఇంటి వాళ్ళమ్మాయి సీత-అంతా వెళ్ళిపోయినా ఇంకా బీచి దబ్బర కూర్చునేవుంది. బీచి నిర్జనంగా ఉంది-సీతా-నేనూ తప్ప ఇంకెవరూ లేరు. నేను మళ్ళీ లేచాను. నన్ను మళ్ళీ ఆవేశం ఆవహించింది. సీతకూడా ఆ రోజు ఆ అమ్మాయి లాగే-అదే ఉద్దేశ్యంతో కూర్చుందా?
కొంచెం ధైర్యంచేసి ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి-"నమస్కారమండీ!" అన్నాను. సీత తలెత్తి బెదురుకళ్ళతో నన్ను చూసి లేచి నిలబడి-"నమస్కారం!" అంది. నవ్వాను-"మిమ్మల్నొక విషయం అడగాలని వచ్చాను!" అన్నాను.
ఆమె అనుమానంగా నా కళ్ళలోకి చూసింది కానీ వెనక్కు తిరగలేదు. "అడగండి!" అంది.
నాకు సూటిగా మాట్లాడటం తప్ప డొంక తిరుగుడుగా మాట్లాడ్డం అలవాటులేదు. అందుకే వెంటనే అన్నాను- "నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను సీతా!" అని.
ఉలిక్కిపడి వెనక్కు తిరిగి నడవడం మొదలుపెట్టి-"నాకు వివాహమయిపోయింది-ఆయన ఫారిన్ లో ఉన్నారు. వచ్చే నెలలో వస్తారు-" అంది.
తల తిరిగింది, సీతను పెళ్ళి చేసుకోవడం కుదరదన్న మాట-కానీ ఆమెమీద నా కోరిక ఎలా తీరుతుంది! అసలామెను నేను నిజంగా ప్రేమించానో లేదో నాకే తెలియదు. ఇప్పుడు ఇష్టపడితే మాత్రం వెంటనే పెళ్ళి చేసుకుని ఉందును.
నిర్జన ప్రాంతం-ఒంటరిగా ఓ అమ్మాయి ఉంది. చక్కని వాతావరణం-బలవంతమంటే నాకెంతో ఇష్టం-అన్నీ కలిసిరాగా నా చేతుల్తో బలంగా ఆమెను చేయి పట్టుకుని లాగాను.
ఆమెకు నోటమాట రాలేదు. భయం భయంగా నాకేసి చూస్తూ వణికిపోతోంది. ఆమెను అలా చూస్తూంటే నాలోని పిశాచం విజ్రుంభిస్తోంది. ఇలాంటి అమ్మాయినే అనుభవించాలి. ఆలోచిస్తే మళ్ళీ అవకాశం రాదు.
అంతలోనే నా చెంప చెళ్ళుమంది. ఉలిక్కిపడి ఆమెను వదిలేశాను. పరుగెట్టింది రోడ్డుకేసి-పరుగులో చీర అడ్డువచ్చి-కంగారులో క్రింద పడిపోయింది. నేను ఆమెను సమీపించేలోగానే ఆమె మళ్ళీ లేచి పరుగెట్టింది. పైట తగులుకొంది ముళ్ళడొంకకి - చాలా బలంగా-ఉలిక్కిపడి వెనక్కు తిరిగి గట్టిగా లాగింది. చిరిగి ముక్కలై బయటకు వచ్చింది. అదేసమయానికి ఆమెను నేను పట్టుకున్నాను.
