ఆ సమయంలో విమల్ ని చూసిన ఎవరూ, సినిమా హీరో విమల్ అని అనుకోరు.
విశాలమైన మౌంట్ రోడ్ లో , రోడ్డు పక్కన నెమ్మదిగా నడుస్తూన్నాడు. అడపా, దడపా వెళ్ళే కార్లూ, సినిమాల నుంచి కబుర్లాడుకుంటూ వస్తున్నా జనం.......
సిగరెట్ల కోసం జేబుల్ని తడుముకున్నాడు విమల్.
సిగరెట్లు లేవు - పిస్టల్ మాత్రం ఉంది.
ఇప్పుడు తననేవారైనా పోలీసులు చెక్ చేస్తే ......ఆ ఆలోచనకు నవ్వుకున్నాడు విమల్.
దూరంగా రోడ్డు పక్కన టీ అంగడిని చూడగానే ఆకలి గుర్తు కొచ్చింది.
ఆకలి స్టేటస్ ని ఎరగదు-- అలాంటి అంగళ్ళ వేపు ఎప్పుడూ కార్లోంచి తలతిప్పి కూడా చూడని హీరో విమల్ -
ఆ అంగడి వేపు నడిచాడు.
ఆ అంగడిలో దీపాల వెలుతురు మసక మసగ్గా ఉంది. ఇద్దరు ముగ్గురు , కొట్టు ముందున్న పొడవాటి బల్లమీద కూర్చుని , అప్పుడే తాము చూసొచ్చిన సినిమా కధను చర్చించుకుంటూ , టీ తాగుతున్నారు.
"ఒక టీ......."అని బల్ల మీద కూర్చున్నాడు విమల్.
రెండు నిమిషాల్ తర్వాత , బాయ్ టీ తెచ్చిచ్చాడు. తెచ్చి విమల్ ముఖం వేపు సూటిగా చూసి, లోనికెళ్ళి పోయాడు.
"త్రిబుల్ ఫైవ్ ........సిగరెట్లున్నాయా......." అడిగాడు విమల్.
"ఇది........రోడ్డు పక్క కాకా హోటల్......తాజ్ కోరమాండల్ కాదు సారూ......" పక్కనున్న వాడు జోగ్గా అని------
విమల్ ముఖం వేపు తేరిపార జూసి, "హీరో విమల్ మాదిరి ఉన్నావప్పా........" అన్నాడు నవ్వుతూ.
ఆ మాటకు మిగతా ఇద్దరూ కూడా విమల్ వేపు చూసారు.
"విమల్ మాదిరి ఎంటిరా.......విమలే ......కావలిస్తే చూడు ...." ఎదురుగా ఉన్న ఓ పోస్టరును చూస్తూ అన్నాడు.
అప్పటివరకూ రోడ్డుకు కుడివేపున గోడ వేపు చూడలేదు విమల్.
విమల్ నటించిన పాత సినిమా వాల్ పోస్టరు అది.
అది విమల్ నటించిన రెండో సినిమా సంవత్సరం పాటు నడిచి బంపర్ హిట్ అయినా సినిమా .....
"సార్.......హీరో విమల్.......మీరే గదూ........నిజంగా ........మీరేనా ......సార్....."
ఇంకొకడు ఎక్సయిట్ అయిపోతూ అడిగాడు.
"సిగరెట్లు దొరకవా........" ఆ మాటను విన్పించుకోకుండా, జేబులోంచి వంద రూపాయల నోటును తీస్తూ అన్నాడు విమల్.
"త్రిబుల్ ఫైవ్......కదా ........సర్ .......నేను ........తెస్తాను" ఎక్సయిట్ అయిపోతున్న కుర్రాడే, ఆ వంద కాగితాన్ని తీసుకుని, పరుగెత్తి కెళ్ళి మరో అయిదు నిమిషాల్లో వగర్చుకుంటూ సిగరెట్ పాకెట్ తో వచ్చాడు.
వాడు పరుగెడుతూనే -- "హీరో విమల్ ..హీరో విమల్ " అరుచుకుంటూ వెళ్ళి , అరుచుకుంటూ రావడం వల్ల --------
టీ అంగడి దగ్గరికి జనం పరిగెత్తుకుంటూ రాసాగారు.
సిగరెట్ ప్యాకెట్ తీసుకున్నాడు విమల్.
"టీ డబ్బులు ఇచ్చేసి , మిగతా డబ్బులు నువ్వు తీసుకో......." అనేసి గబగబా ముందు కెళ్ళి పోయాడు.
"ఏడీ హీరో విమల్ .......ఎడ్రా విమల్......."
"అదుగో........అదుగో.......రోడ్డుపక్కన నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడే........"
"కోతలు ......కొయ్యకురోయ్..........హీరో విమలట.......నడుచుకుంటూ అదీ ఈ టైములో?"
"నిజంరా........నన్ను నమ్మండిరా........."
విమల్ ఆ మాటల్ని విని, తనలో తను నవ్వుకున్నాడు. కొంత సేపటికి ఆ మాటలు వినపడనంత దూరంలో -------
ఒంటరి రోడ్డుమీద, ఒంటరిగా .......
సిగరెట్ వెలిగించుకుని, అటూ, ఇటూ గోడలవేపు చూస్తూ నడుస్తున్నాడు.
"కనుపాపల్లో కాటుక."
విమల్ కళ్ళు, ఆ వాల్ పోస్టర్ని వెతుకుతున్నాయి.
ఆ టీ అంగడి గోడ దగ్గరున్న వాల్ పోస్టరు సగభాగం మాత్రమే ఉంది. అందువల్ల తన చిత్రాన్ని మాత్రమే అతను చూసుకోగలిగాడు.
కానీ - రెండవ సగంలో ఉన్నది -----
కృష్ణ నందన -
కృష్ణ నందన జ్ఞాపకానికి రావడంతో క్షణకాలం రోడ్డుమీద అలా నిలబడిపోయాడు.
వెన్నెల ఆకాశంలో చిన్న చిన్న మబ్బుల దొంతర్లలాంటి జ్ఞాపకాలు .
సాయంకాలం పూట వరసగా ఆకాశంలో ఎగిరే కొంగల బారుల్లా జ్ఞాపకాలు......
Love is a terrible thing.
For there is a flame that has blown too near.
And there is a name that has grown too dear,
And there is fear -
And to tha still and cool earth and far sky I moon a moon;
The heart is may bosom is not my own,
oh! would I where free as the wind on the wing
Love is a terrible thing.
కనుపాపల్లో కాటుక"
లేత ఆకుపచ్చని పచ్చిక మీద మెరిసే రెండు పున్నాగ పువ్వుల మీద మెరిసే వెన్నెల తీపి ప్రేమ......
ఆకాశమంత ఎత్తున నిలబడ్డ కొండ శిఖరాగ్రాల మీద నుంచి తుళ్ళుతూ, పారే జలపాతం తునకల్లోంచి ఎగిరిపడి, రాలిపడిన పనస పండు మీద నిలిచిన మంచు తడి ప్రేమ......
ప్రేమ
