"మీరేమీ చెప్పనక్కర్లేదు.... నేను బ్రతికేదే తన కొడుకు కోసం. వాడేలాగున్నాడు? మాకోసం బెంగ పెట్టుకోలేదు గదా...."
"కుర్రాడు చాలా ఉత్సాహంగా , ఆరోగ్యంగా ఉన్నాడు- ఇంతవరకూ ఆ తర్వాత సంగతి నీ ప్రవర్తన మీద ఆధార పడి ఉంది...." ఫోన్ క్లిక్ మంది.
తనూ రిసీవర్ పట్టేసి కళ్ళు తుడుచుకున్నాడు సాంబయ్య. అయన మనసు నిండా కొడుకు గురించిన ఆలోచనలే... అక్కణ్ణించి అయన వెంటనే రిక్షా కట్టించుకుని ఇల్లు చేరాడు. ఇంటి దగ్గర అయన కోసం ఆత్రుతగా ఎదురు చూస్తోంది భార్య.
"ఏమండీ ఏమయింది....' అందావిడ.
"అన్న ప్రకారమే ఆఫీసుకు ఫోన్ చేశాడు. డబ్బు రెడీగా ఉందా అన్నాడు. ఉందని చెప్పాను. అయితే తీసుకు రమ్మని చెప్పాడు. నేను వెడుతున్నాను. నువ్వేమీ కంగారు పడకు. ఓ రెండు గంటల్లో మన బాబుని తీసుకుని వచ్చేస్తాను....' అన్నాడు సాంబయ్య.
'అసలిదంతా ఏమిటండీ...." అంది సాంబయ్య భార్య.
"మాన కర్మ ....అంతకంటే ఏం చెప్పను?" అన్నాడు సాంబయ్య.
సాంబయ్య లోపలకు వెళ్ళి అలమారా లోంచి డబ్బు తీసి లెక్క పెట్టాడు. సరిగ్గా యాభై వేలు. ఆ డబ్బుని చిన్న తోలు సంచీలో వేసుకుని అక్కణ్ణించి బయటకు వచ్చాడు. అయన బయల్దేర బోతుంటే మెట్ల మీదే వారి పురోహితుడు అవధాని ఎదురయ్యాడు.
"ఏమండీ -- లోపలకు రండి...." అంది సాంబయ్య భార్య. ఆవిడ ఉద్దేశ్యాన్ని గ్రహించిన సాంబయ్య లోపలకు దారి తీశాడు.
"బాబుగా రెక్కాడికో పెద్ద పనిమీదే బయల్దేరినట్లు ఉన్నారు. నన్నడిగితే ప్రయాణం వాయిదా వేసుకోమంటాను. సమయం యే మాత్రమూ అనుకూలంగా లేదు..." అన్నాడు అవధాని.
సాంబయ్య విసుగ్గా - ' అసలే ఒంటి బ్రాహ్మణు శకునం వచ్చినందుకు బెంగ పడుతుంటే -- మళ్ళీ ఇదొకటా...." అనుకుని దొడ్లోకి వెళ్ళి కాళ్ళు కడుక్కుని వచ్చి, కాసిని మంచి నీళ్ళు తాగి - 'అయ్యా - అవధాని గారూ! మీరు అన్యదా భావించక మాట్లాడవలసిన విశేషాలన్నీ మా ఆవిడతో మాట్లాడండి. సమయం అనుకూలంగా వున్నా లేకపోయినా నాకు బయటకు వెళ్ళక తప్పదు..." అని అక్కణ్ణించి వెళ్ళిపోయాడు.
"అలాంటప్పుడు ....ముందుగా తెలిసినా తప్పించుకో లెం గదా ...."
సాంబయ్య భార్య కంగారుగా 'సమయం బొత్తిగా అనుకూలంగా లేదంటారా? అంది. ఆవిడ కళ్ళలోని అత్రుతను ఆశ్చర్యంగా గమనిస్తూ 'అవునమ్మా అందుకే హేచారించాను. అయినా ఏదో చెప్పడమే కానీ - అంటా మన చేతుల్లో ఉందా ఏమన్నానా?" అన్నాడు అవధాని.
సాంబయ్య భార్య గుండెలు గుబగుబ లాడాయి. రాజారావు ఎలా ఉన్నాడో నని ఆవిడ మనసు కలవర పడ సాగింది.
11
సాంబయ్య అయిదారు నిముషాలు బాగా పరీక్షించి ఆ యింటి తలుపు తట్టాడు.
ఓ కుర్రాడు తలుపు తీసి "మీపేరు సాంబయ్య గారా?" అన్నాడు. అవునని సాంబయ్య చెప్పగానే లోపలికి తీసుకు వెళ్ళి - "ఆ గదిలోకి వెళ్ళండి...." అని ఓ మూల గది చూపించాడు.
సాంబయ్య ఆత్రుతగా ఆ గదిలోకి వెళ్ళాడు. ఆయన లోపలకు వెళ్ళగానే ఆ గది తలుపులు మూసుకున్నాయి. సాంబయ్య గదిలో అటూ ఇటూ చూసి ఆశ్చర్య పోయాడు. ఆశ్చర్యం ఆనందంగా మారడానికి ఎన్నో క్షణాలు పట్టలేదు. గదిలో ఉన్న ఒకే ఒక వ్యక్తీ అయన కొడుకు రాజారావు!
"నాన్నా!' అన్నాడు రాజారావు. సాంబయ్య ఒక్క ఉదుటున వెళ్ళి కొడుకుని గట్టిగా కౌగలించు కున్నాడు. ఆ పరిష్వంగంలోని సుఖం ఆ పితృ హృదయానికే తెలియాలి.
ఓ అయిదు నిముషాల అనంతరం ఆ గదిలోకి తలుపులు తీసుకుని నిండా ముసుగున్న వ్యక్తీ ప్రవేశించి - "వెల్ మిస్టర్ సాంబయ్య! డబ్బిలాగియ్యి -" అన్నాడు.
సాంబయ్య అతనికి తన చేతిలోని డబ్బు అందించాడు. ఆ ముసుగు వ్యక్తీ అందులోని డబ్బు తీసుకుని లెక్క పెట్టుకున్నాడు. తర్వాత తన జేబులోంచి ఏదో కాగితం తీసి ఆ నోట్ల ను మళ్ళీ పరిశీలించాడు.
"మిస్టర్ సంబయ్యా- నా దగ్గరున్న నంబర్ల తో నువ్విచ్చిన నోట్ల నంబర్లు సరిపోయాయి. అంటే గోపీనాద్ గారబ్బాయిని దాచేసి పదివేలు వసూలు చేసింది నువ్వే నన్నమాట!" అన్నాడు ముసుగు మనిషి.
సాంబయ్య ఉలిక్కిపడ్డాడు. - "మీరేమంటున్నారో నాకు తెలియదు ,"
"బుకాయించి ప్రయోజనం లేదు. నీకు డబ్బిచ్చిన గోపీనాద్ ఆ నంబర్లు నోట్ చేసుకున్నాడు. గోపీనాద్ డబ్బిచ్చి సాయం చేసిన అతను కూడా నంబర్లు నోట్ చేసుకున్నాడు. ఆ నంబర్లు నువ్విచ్చిన నోట్ల కున్నాయ్."
"ఇంతకీ మీరెవరు?" అన్నాడు సాంబయ్య.
ముసుగు వ్యక్తీ ముసుగును తొలగించాడు. అతను ఫుల్ యూనిఫాం లో ఉన్న పోలీసు అధికారి -- "ఎస్ అయాం ఇన్ స్పెక్టర్ నరేష్ !' అన్నాడతను.
సాంబయ్య కంగారుగా - "యేమిటిది ఇన్ స్పెక్టర్ - సామాన్య గుమస్తాని. నా పిల్లాడిని దాచేసి ఉన్నపళంగా యాభై వేలు కావాలంటే ఏం చేసేది? వాళ్ళనీ వీళ్ళనీ బెదిరించి డబ్బు పోగు చేసుకున్నాను....' అన్నాడు.
'అది సరే - ఇలాంటి పరిస్థితుల్లో సామాన్య గుమస్తా అయితే తెగించి ఏ దొంగతనానికొ దారి దోపిడీకో వెళ్ళి పట్టు బడేవాడు. కానీ చేతిలో ముఠా సిద్దంగా ఉన్నవాడే అప్పటికప్పుడు ఇలాంటి ఏర్పాట్లు మరికొన్ని చేయగల్గుతాడు. నీ క్రింద పెద్ద ముఠా ఒకటి ఉన్నదని వార్తలు ఇదివరలోనే వచ్చాయి. అది ఈ పధకం రూపంలో ఈనాడు రుజువయింది."
"ఇన్ స్పెక్టర్ -- నా బాబుని అపహరింసింది పోలీసులా?" అన్నాడు సాంబయ్య ఆశ్చర్యంగా భయంగా.
'అవును, ఒకతను ఈ పధకం వేశాడు. సామాన్య గుమస్తా యాభై వేలైనా ఇవ్వగలుగుతాడని - అ డబ్బు ఎలా వచ్చిందో తెలుసుకుంటే అతని గుట్టు బయట పడుతుందని చెప్పాడు. అతనొక సీబీఐ అధికారి కావడంతో నేను రంగంలోకి దిగాను. నీ కొడుకును అతనే దాచాడు. కానీ ఈరోజు నేను వచ్చాను...." అన్నాడు ఇన్ స్పెక్టర్.
"మీరు అన్యాయంగా నామీద నేరారోపణ చేస్తున్నారు. నాకే పాపం తెలియదు."అన్నాడు సాంబయ్య.
"మా దగ్గర చాలా బలమైన సాక్ష్యాలున్నాయి. మూన్ లైట్ నైట్ క్లబ్ యజమాని కూడా ఈరోజే పట్టు బడ్డాడు! మన ఊళ్ళో ని ప్రముఖ వ్యాపారస్తుడు కోటేశ్వరరావు దానికి రహస్య యజమాని. అక్కడ చాలా అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నాయి. ఆ నైట్ క్లబ్ లో డబ్బు డిపాజిట్ చేసిన ఒకతను ఆ నోట్ల నంబర్ల న్నీ గుర్తుంచుకున్నాడు. మర్నడా నంబరు గల నోట్లు యే బ్యాంకుకు వచ్చినా గుర్తించి చెప్పవలసిందిగా రహస్యపు అజ్ఞా జారీ చేయగా - అవి కోటేశ్వరరావు అకౌంట్లో జమ చేయబడినట్లు తెలిసింది. ఆ ఆధారంతో అయన పట్టుబడ్డ్డాడు. ఒకదాని వెనుక ఒకటిగా బోలెడు సాక్ష్యాలు దొరికాయి. సాక్ష్యాలతో కొన్ని నీ నేరాన్ని కూడా బయట పెట్టాయి. కోటేశ్వరరావు ముఖ్య నుచరులలో నువ్వొకడివని చెప్పటానికి...."
"ఆగండి ఇన్ స్పెక్టర్!" అన్నాడు సాంబయ్య- "మా బాస్ కోటేశ్వరరావు పట్టుబద్దాక ఇంకా నిజాలు దాచడమెందుకు? నేను అయన అనుచరున్నే కాక - ఓ చిన్న సైజు ముఠా నాయకుడ్ని. నాక్కావలసిన డబ్బు సంపాదించు కోవడం నాకు తెలుసు. నా పాపం మూడింది నా కర్మ కాళింది." అన్నాడు పశ్చాత్తాప్పడుతూ.
12
'అమ్మా -- మాలతీ!"
"ఎవరది -- అన్నయ్యా--' అంది ఆశ్చర్యంగా మాలతి.
"నా పని ముగిసిందమ్మా - అనుకున్న కార్యం సాధించాను. నీకు మాటిచ్చిన ప్రకారం మీ ఇంట్లో స్నానం చేద్దామని వచ్చాను...." అన్నాడు జోగినాధం.
అప్పుడే అక్కడికి వచ్చిన గోపీనాద్ - "మా అదృష్టం . మా ఇంట్లో మీ స్నానం మా ఇంటినే పునీతం చేస్తుంది." అన్నాడు ఆహ్వాన పూర్వకంగా.
జోగినాధం మాలతి ఇంట్లో స్నానం చేస్తున్న సమయంలో సాంబయ్య భార్య తన భర్తకు ఎదురొచ్చిన పురోహితుడు అవధానిని తిట్టు కుంటోంది. అ తప్పు అవధానిది కాదు, జోగినధానిదని , ఆ మాట కొస్తే సాంబయ్యదేనని ఆవిడకు తెలియదు.
-----: అయిపొయింది :-----
