Previous Page Next Page 
వసుంధర కధలు -9 పేజి 42

 

    రమేష్ నవ్వి -- "నేను పందెం కాసేదేమిటో తెలుసా?" అన్నాడు.
    "తెలియదు?"
    "వీళ్ళిద్దరూ ధరించిన దుస్తులకున్న జిప్స్, బటన్స్ - బంగారానివి. వీటి ఖరీషు కొన్ని వేలు చేస్తుంది. అవే నేను పందెంగా ఒడ్డుతాను. నన్ను నేగ్గగలిగిన వారెవ్వరైనా సరే - ఈ సుందరాంగుల వలువలు నెగ్గుకు పోవచ్చు."అన్నాడు రమేష్.
    "సరే- అది మొదటి పందెం. రెండో పందెం?...." అన్నాడు జోగినాధం.
    రమేష్ ముఖం ఎర్రగా అయింది. "ఈ రమేష్ తో రెండో పందెం ఆడిన మగవాడున్నాడా ....?" అన్నాడు.
    'అసలు నువ్వు మగవాళ్ళతో పెకాడావా అని!" అన్నాడు జోగినాధం.
    రమేష్ కోపం యింకా పెరిగింది. అతనా వేశాపడుతున్నాడని గ్రహించి గంగాధరం అతని భుజం తట్టి, "ఆవేశపడకు రమేష్! నీ తడఖా చూపించు...' అన్నాడు.
    రమేష్ తన పందెం గురించి గట్టిగా చెప్పి -- ఎవరైనా సరే ముందుకు రావచ్చు నని అన్నాడు.
    అక్కడ కూర్చున్న మగవారిలో ఈ పందెం చెప్పుకోదగ్గ సంచలనం కలిగించింది. అద్భుత సౌందర్యంతో వెలిగి పోతున్న ఆ అమ్మాయిల వయసు సొగసుల్ని చూసి ఆనందించవచ్చునన్న ఆశతో చాలామంది ముందుకు వచ్చారు. అట ప్రారంభమయింది.
    రమేష్ పది ఆటలు ఆడాడు. ఆటకు రెండు వేలు చొప్పున ఇరవై వేలు సంపాదించాడతను. అట మీద అట రమేష్ నెగ్గుకుంటూ వస్తుంటే ఆ అమ్మాయి లిద్దరూ ఉత్సాహంగా చప్పట్లు కొట్టేస్తున్నారు.
    "మిస్టర్ జోగినాధం - ఆర్ యు ప్రిపెర్డ్" అన్నాడు రమేష్.
    "ఒక చిన్న రిక్వెస్ట్ ...." అన్నాడు జోగినాధం .... "నేను మనుషులను బాధ పెట్టలేను. ఆడపిల్లల మనుషుల నయితే అసలే బాధ పెట్టలేను. ఈరోజు ఇప్పుడు ఇక్కడ మొట్ట మొదటి సారిగా రమేష్ నా చేతిలో ఒడి పోయాడనుకోండి. అప్పుడీ అమ్మాయి లిద్దరూ  ఇంతమంది ప్రేక్షకుల ముందు బట్టలు విప్పాలి. ఏ ఆడదాని కైనా అదెంతో బాధాకరమైన విషయం. ఈ విషయంలో ఆ అమ్మాయి లిద్దరూ చెప్పుకోవాల్సిందేమైనా ఉన్నదా అని తెలుసు కోరుతున్నాను."
    ఇద్దరమ్మాయి లూ హేళనగా జోగినాధం వంక చూసి - "మా బాధ గురించి మీరు పట్టించుకొనవసరం లేదు. రమేష్ ఇష్టమే మా యిష్టం.... తప్పించుకోవడం కోసం టైము వేస్టు చేయక వెంటనే అట ప్రారంభించండి....' అన్నారు.
    'అయితేసరే ....' అన్నాడు జోగినాధం. "మీ ముందు బట్టలు విప్పడానికి యీ ఆడపిల్లలు సిగ్గు లేకుండా ఉన్నారు. బాగానే ఉంది. అయినా ఆ పని మీరెవ్వరూ చేయించ లేకపోయారు. ఇప్పుడు నేను చేయించ బోతున్నాను. సహజంగా ఇది మీ కానందాన్ని కలిగిస్తుంది. అందుకు ప్రతిఫలంగా మీరంతా కలిసి నాకో ఐదు వేలిచ్చారంటే -- రమేష్ వద్ద నేను గెల్చుకో బోయే మొత్తం తో కలిసి -- మొత్తం పాతిక వేలవుతుంది...."
    'అప్పుడే ఆటలన్నీ నేగ్గినట్లు మాట్లాడుతున్నావు అన్నాడు రమేష్."
    "నేను భవిష్యత్ లోకి చూడగలను...' అంటూ జోగినాధం ఒక నిముషం కళ్ళు మూసుకుని ఏదో ధ్యానిస్తున్నట్లుండి పోయాడు. తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి "పేకలు కలుపు...." అన్నాడు రమేష్ తో.
    రమేష్ పేక కలిపాడు. కలిపిన పెకను టేబిలు మీద స్ప్రెడ్ చేశాడు. అందులోంచి జోగినాధం మూడు ముక్కలు తీసుకున్నాడు. రమేష్ మూడు ముక్కలు తీసుకున్నాడు.
    "ముక్కలు తిరగెయ్ --" అన్నాడు జోగినాధం.
    రమేష్ ముఖంలో భయం లేదు. కానీ మరీ అంత సంతృప్తి కరంగా లేవతని భావాలు. అతను తిరగవేసిన మొదటి ముక్క ఆసు.
    "రెండోది కూడా !" అన్నాడు జోగినాధం.
    రెండు, మూడు ముక్కలు తిరగేసాడు రమేష్ -- కింగూ, కింగూ ....
    "మరి నా ముక్కలు చూడు ....' అన్నాడు జోగినాధం.
    అవి చూస్తూనే రమేష్ మ్రాన్పడి పోయాడు. అమ్మాయిలిద్దరూ నీళ్ళుగా పోయారు. అవి మూడూ అసులే!
    "కంగ్రాట్యూలేషన్స్ జోగినాధం. అయిదు వేలూ నికిచ్చు కుంటాం. అద్భుతమైన ప్రదర్శన ఇప్పుడు జరుగబోతోంది. ఇద్దరుబంగారు బొమ్మలు.... అహం నిండిన ప్రాణులు.... రమేష్ కు తప్ప లొంగని రమణులు..... ఈరోజు మా ముందు...." అంటూ ఓ యువకుడు ఉత్సాహంగా గెంతుతూ ముందుకు వచ్చాడు.
    

                                    9
    :ఈ డబ్బు నేను కష్టపడి సంపాదించినది. మళ్ళీ మీరు తిరిగి ఇవ్వనక్కరలేదు. వెళ్ళి నీ బిడ్డను విడిపించు కోమ్మా...." అన్నాడు జోగినాధం మాలతికి పదివేలుస్తూ. అతను క్లబ్ లో గెలిచినా మిగతా పదిహేను వెలను క్లబ్ లోని బ్యాంకు లోనే డిపాజిట్ చేశాడు.
    'అన్నయ్యా ...." అంది మాలతి. ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగాయి. పక్కనే ఉన్న ఆమె భర్త "మీరు సామాన్యులు కారు. మిమ్మల్ని మొదట్లో చాలా తక్కువ అంచనా వేశాను....' అన్నాడు.
    "మాలతి నాకు చెల్లెలు. కాబట్టి మనమంతా ఒక గూటి పక్షులం. ఒకళ్ళ నొకరు మన్నించుకొనవసరం లేదు, నా వేషాన్ని బట్టి నన్ను చిన్న చూపు చూడడం అందరికీ సహజమే! అయితే నా వేషాన్ని చూసి కూడా మాలతీ నన్నాదరించింది. అప్పుడామె ఆదుకోకపోతే నేనేమైపోయి ఉండేవాడినో-- ఇప్పుడీ డబ్బు ఇచ్చినా ఆ ఋణం మాత్రం తీరదు..." అని అక్కణ్ణించి వెళ్ళిపోయాడు జోగినాధం.
    తర్వాత భార్య భర్త లిద్దరూ కర్తవ్య మేమిటో ఆలోచించారు. భర్త వెళ్ళి సూచనల ప్రకారం డబ్బిచ్చి వస్తానని బయల్దేరాడు.
    బస్ స్టాండు లో రామా కిళ్ళీ షాపు ముందు నిలబడ్డాడు. మాలతి భర్త. అతనక్కడ నిలబడ్డ అయిదు నిముషాలకు నీలం రంగు పాంటు, తెల్ల చొక్కా వేసుకున్న యువకుడొకడు అక్కడికి వచ్చాడు.
    "మీపేరు గోపీనాద్ కదూ --" అన్నాడతను.
    "నీ పేరు మూర్తి కదూ -" అన్నాడు మాలతీ భర్త గోపీ నాద్.
    అది వారి సంకేతం.
    "తెచ్చారా?" అన్నాడు మూర్తి.
    "తెచ్చాను!" అన్నాడు గోపీనాద్.
    మూర్తి అక్కణ్ణించి పక్కనే ఉన్న హోటల్ లోకి వెళ్ళి ఎక్కడి కో ఫోన్ చేసి వచ్చి "మరో పావు గంటలో ఓ ముసలమ్మా తో కలిసి మీ ఆవిడ , పిల్లాడు ఇక్కడికి రిక్షాలో వస్తారు. వాళ్ళను చూస్తూనే మీరు నాకు ఇచ్చేయండి. లెక్క సరిపోతే - రిక్షా లోంచి ముసలమ్మ దిగి పోతుంది. ఆ స్థానంలో మీరు కూర్చుని ఇంటికి వెళ్ళి పోవచ్చు. ఏమైనా మోసముంటే - " అని స్వరం తగ్గించి "మీ భార్య పిల్లాడు , రిక్షా లోనే చచ్చిపోతారు..." అన్నాడు గోపీనాద్ తో.
    గోపీనాద్ అన్నింటికీ తలాడించాడు.
    "మీపిల్లాడు మీకు దక్కాడని సంతోషించాలి తప్పితే - ఇంకే విధమైన అరాలూ తీయకూడదు. అందువల్ల అనవసరంగా ఇబ్బందుల్లో పడిపోతారు...." అన్నాడు మూర్తి.
    "మేము చాలా సామాన్యులం. మాకిన్ని సార్లు చెప్పడం అనవసరం. మాకోకరి వల్లనే కానీ మావల్ల ఎవరికీ ప్రమాద ముండదు...." అన్నాడు గోపీ నాద్'.
    తర్వాత కొంతసేపటికి అక్కడికి ఓ రిక్షా వచ్చింది. అందులో మూర్తి చెప్పిన విధంగానే ముసలమ్మ, మాలతి తన కొడుకు ఉన్నారు. గోపీనాద్ వెంటనే మూర్తి కి ఓ కవర్ అందించాడు. అయిదు నిముషాల్లో మూర్తి పక్కకు వెళ్ళి వచ్చి - పాట పాడుతున్నట్లుగా ఈల వేశాడు. రిక్షా లోంచి ముసలమ్మ దిగిపోయింది.
    ఉత్సాహంగా రిక్షా దగ్గరకు వెళ్ళాడు గోపీనాద్. అప్పుడే మాలతి అతన్ని చూసి "ఏమండీ!" అంది ఆనందం , దుఖం మేళవించిన కంఠంతో. గోపీనాద్ మాట్లాడలేదు. అతనికి మాట రావడం లేదు. కొడుకు వంకే చూస్తున్నాడు. తను మళ్ళీ చూడగలనా లేదా అనుకున్న కొడుకు తన కళ్ళెదుట కనబడుతుంటే నోట మాట రాకపోవడం ఏ తండ్రికైనా సహజం. అతడు చటుక్కున రిక్షా ఎక్కి కొడుకును దగ్గరగా తీసుకున్నాడు.
    "ఎక్కడికి వెళ్లాలండీ!" అన్నాడు రిక్షా వాలా, మాలతి చెప్పగానే రిక్షా కదిలింది.
    అంతవరకూ ఆ దృశ్యాన్ని చూస్తూ నిలబడ్డ మూర్తి సంతృప్తిగా తలాడించి - అక్కడ్నించి కదిలాడు. అయితే కొద్దిపాటి దూరంలో తన ననుసరిస్తున్న వ్యక్తి నతను గమనించలేదు. అయినా బికారి వాడిలా ఉన్న జోగినాధాన్ని ప్రత్యేకంగా గమనించే వ్యక్తులు చాలా తక్కువ. అతని గురించి బాగా తెలిసిన వారు మాత్రమే అతని గురించి పట్టించు కోవలసిన అవసరం గమనిస్తారు.

                                   10
    "మిస్టర్ సాంబయ్య! డబ్బు రెడీ అయిందా?"
    'అయిందండీ...."
    "అయితే శంకర మఠం వీధిలో - రామాలయం మీంచి అజంతా కేఫ్ కి వెడుతుంటే వచ్చే మూడో ఇంటికి ఇంకో గంటలో డబ్బు తో సహా బయల్దేరిరా. నువ్వొక్కడివే రావాలి. ఈ విషయం ఇంకెవరికైనా తెలిసిందా మీ అబ్బాయి శవాన్ని మాత్రమే చూస్తావు....'
    "అన్నీ తెలుసు నాకు ......."
    "నిన్ను నా అనుచరులు వెయ్యి కళ్ళతో కనిపెడు తున్నారు. ఏదైనా తెలివి తక్కువ పని చేస్తే నాకు తెలియకుండా తప్పించుకోగల  ననుకోకు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS