Previous Page Next Page 
రారామాఇంటిదాకా పేజి 43


    ఓ వీడియో క్యాసెట్ వుంది.
    
    దాన్ని చూసి అతను విస్మయం చెందాడు.
    
    వీడియో క్యాసెట్ ఎవరు పంపారో, అందులో ఏం వుందో అర్ధం కాలేదు.
    
    వీసీపీ తన దగ్గర వుంచుకోవడం మంచిదయిందని అనుకుంటూ ఇంగ్లీష్ క్యాసెట్ బయటికి తీసాడు.
    
    పార్శిల్ లో వచ్చిన క్యాసెట్ ను పెట్టి ప్లే చేశాడు.
    
    కొన్ని క్షణాలకు బొమ్మలు రావడమ ప్రారంభించాయి. అతను పరిసరాలన్నింటినీ మరిచిపోయి చూస్తున్నాడు.
    
    క్యాసెట్ ముందుకు పోతున్న కొద్దీ అతని మెదడు మొద్దుబారుతోంది.
    
    కాళ్ళు చేతులూ తిమ్మిరెక్కి తనకు అనస్థీషియా ఇచ్చినట్లు అయిపోతున్నాడు.
    
    కళ్ళు ఆర్పడం కూడా మర్చిపోతున్నాడు.
    
    సుజన మరో యువకుడు చెట్టాపట్టా లేసుకుని ఓ ఖరీదు అయిన హోటల్ కి వెళ్ళడం దగ్గర్నించి ఇద్దరూ ఓ గదిలోకి ప్రవేశించడం వరకూ క్యాసెట్ చూపిస్తోంది.
    
    తలంతా తిరుగుతున్నట్లనిపించి బలవంతం మీద అక్కడ్నించి లేచి స్విచ్ ఆఫ్ చేసాడు.
    
    టేబుల్ మీదున్న జగ్ లోంచి నీళ్ళు తాగి తిరిగి క్యాసెట్ ప్లే చేసాడు.
    
    సుజన ఆ యువకుడివేపు చూసి మత్తుగా నవ్వింది.
    
    కాట్ పై సగం పడుకుని, నడుంపై భాగాన్ని పైకి లేపి రా - రమ్మన్నట్లు చేయి అందించింది.
    
    అప్పటికే షర్టు తీసేసిన అతను చెలరేగిపోతున్న కోరికలా ఆమె మీద పడ్డాడు.    

    ముద్దులు, వేడి నిట్టూర్పులు, బిగికౌగిలులూ ప్రారంభమయ్యాయి. వంశీ మరింత ముందుకు వంగి పరిశీలించి చూస్తున్నాడు.
    
    నో డౌట్ - ఆమె సుజనే.
    
    అవే కళ్ళు అదే ముక్కు అదే చిరునవ్వు, అవే పెదవులు - ఆమే సందేహం లేదు.
    
    ఎవరో తనను బంధించి చెవుల్లో కరిగించైనా సీసం పోస్తున్నట్లు, కళ్ళలో కారంపొడి చల్లుతున్నట్లు అతను గిలగిల్లాడిపోయాడు.
    
    ఆ యువకుడ్ని తనివితీరా కౌగిలించుకుని సుజన ముద్దులతో నింపేస్తోంది.
    
    సైడ్ యాంగిల్ లోంచి కూడా ఆమె కళ్ళతో పడగవిప్పిన కోరిక మరింత స్పష్టంగా తెలుస్తోంది.
    
    ఆ యువకుడు బట్టల్ని ఒక్కొక్కటి విప్పుతున్నాడు. ఆమె సిగ్గుపడడం లేదు.
    
    పైపెచ్చు అతన్ని రెచ్చగొడుతోంది.
    
    తన భార్యతో మరో యువకుడు జైర్పిన రొమాన్స్ ను వీడియోలో చూసి భరించడం మానవ మాత్రుడికి సాధ్యం కాదు. అది భయంకరమైన అనుభవం.
    
    ప్రస్తుతం వంశీ ఆ స్థితిని అనుభవిస్తున్నాడు.
    
                                                               *    *    *    *    *        
    
    డాబా మెట్లెక్కుతోంది వైదేహి.
    
    ఆమెకు ఇరవయ్ ఎనిమిదేళ్ళుంటాయి.
    
    చాలా అందమైన ముఖం, అందానికి మించిన వినయం ఆమెకు హుందాతనాన్ని తెచ్చిపెట్టింది.
    
    ఆ సాయంకాలంపూట నీట్ గా తయారయిన ఆమెను చూడడం కూడా గొప్ప అనుభవం.
    
    తబలా మీదుండే తెల్లటి, నల్లటి గుర్తుల్లా వుండే కళ్ళు, పిల్లన గ్రోవిని బోర్లించి పెట్టినట్లుండే ముక్కు, వాయులీనాల్లాంటి పెదవులు, డ్రమ్ లా వుండే కంఠం, అటు ఇటు రెండు నగరాలను పెట్టినట్లుండే వక్షస్థలం, వీణ పైభాగంలా వుండే నడుము, చుట్టూ గజ్జెలు కట్టిన డప్పులాంటి బొడ్డు - మొత్తం ఆమే ఓ సంగీత వాయిద్యాల కొలువులా వుంటుంది.
    
    ఆమెను ముట్టుకుంటేనే సంగీత వాయిద్యాలన్నీ ఒక్కసఆరిగా మోగుతాయనో ఎందుకనో అనిపిస్తోంది.
    
    ఆమె మెట్లన్నీ ఎక్కి డాబా మీదకు చేరుకోగానే సుజన ఎదురువచ్చి సాదరంగా ఆహ్వానించింది.
    
    "రా వైదేహీ! నీకోసమే చూస్తున్నా"
    
    ఆమె చిరునవ్వు నవ్వుతూ వెనకే నడిచింది.
    
    పిట్టగోడకు దగ్గరగా ఆపాటికే వేసున్న రెండు కుర్చీల్లో కూర్చున్నారు.
    
    "చాలా రోజులయింది మాట్లాడి, కొత్త పెళ్ళికూతుర్ని గదా పని ఏం లేదు. అందుకే నీతో సరదాగా కబుర్లు చెపుదామని పిలిచాను" సుజన ప్లాస్కులోని కాఫీ కప్పులో పోసి అందిస్తూ చెప్పింది.
    
    "ఎలా వుంది పెళ్ళి? మొత్తానికి ప్రేమించినవాడ్ని చేసుకున్నావ్. ఇలాంటి పెళ్ళిళ్ళే బెస్ట్.
    
    ఎవరో ముక్కూ, మొహం తెలియని వాడ్ని చేసుకోవడం కన్నా మనకు బాగా తెలిసినవాడ్ని, మనం నచ్చినవాడ్ని చేసుకోవడం ఉత్తమము. ఆఫ్ కోర్స్! కొన్ని పెళ్ళిళ్ళు ఇలాంటివీ ఫెయిలయినా మన తప్పుకు మనమే బాధ్యులం అవుతాం.
    
    కనీసం పశ్చాత్తాపం అయినా పడచ్చు. అదే అరేంజ్ డ్ పెళ్ళిళ్ళలో అయితే ఆ అవకాశం కూడా వుండదు" కాఫీ సిప్ చేయడానికి ఆగింది వైదేహి.
    
    "మన పెళ్ళి మన ఇష్టం, బతకడం కూడా ఒక కళే. వయసు వచ్చిన ప్రతి ఆడపిల్లా, ప్రతి మగవాడూ పెళ్ళికోసం అమ్మా నాన్నలవైపు చూస్తుంటారు. జాతరలో రంగుటద్దాల్లో వుంచిన తినుబండారాలను చూసి కొనివ్వమని అమ్మవైపు చూస్తున్న పిల్లలాగా."
    
    "నిజమే - ఆ మాత్రం వ్యక్తిత్వం లేకపోవడంవల్లే మన లైఫ్ స్టయిలే మారిపోతుంది. ఇది భయంకరమైన నిజం. అందుకే చాలామంది తమకు ఇష్టంలేని రంగాలలో వుండిపోతారు. నటి కావాలనుకున్న పిల్ల బ్యాంకులో గుమస్తా అవుతుంది. ఐపిఎస్ కావాలనుకున్న అమ్మాయి హోమ్ గార్డ్ పెళ్ళామౌతుంది. ఇంటర్ లో ఏ సబ్జెక్టు తీసుకోవాలో కూడా తల్లిదండ్రులే నిర్ణయిస్తారు. ఇలా చెడిపోయిన జీవితాలు చాలా అందులో నేనూ ఒకదాన్ని" ఏదో బాధలాంటి ఫీలింగ్ ఆమె కంఠాన్ని కెలికింది.
    
    "ఏం జరిగింది? పెళ్ళయిన నెలరోజులకే పుట్టింటికి చేరిపోయావు. అసలు ఫస్ట్ నైట్ నే మీ ఇద్దరిమధ్యా ఏవో గొడవలు ప్రారంభమయ్యాయని ఎవరో చెప్పుకుంటూంటే విన్నాను"
    
    "ఆఁ ఆ రోజునే కదా స్త్రీకి మగవాడి రాక్షసత్వమో, రొమాంటినిజమో తెలిసేది. నా విషాదం చెప్పే ముందు మన ఊర్లోనే జరిగిన ఓ సంఘటన చెబుతాను. నా గొడవ బాగా అర్ధం కావడానికి ఇది ఉపయోగపడుతుంది" అంటూ వైదేహి చెప్పడం ప్రారంభించింది.
    
    "పక్క వీధిలో కాశీపతి అనే వ్యక్తి కాపురాముంటున్నాడు. వీధి చివర ఇల్లు. స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తుంటాడు. నూలు కండెలాగా సన్నగా, బక్కపలచగా వుంటాడు. ముఫ్ఫై ఏళ్ళకు మించవు.
    
    రెండేళ్ళ క్రితం వివాహమైంది. ఒక కూతురు. అత్తిల్లు గూడూరు దగ్గర పల్లెటూరు అన్నంబాకం. తుఫాను రావడంతో అత్త చనిపోయింది. మరదలు పిల్ల వుండేది. తల్లి చనిపోవడంతో వున్నదేదో అమ్ముకుని అక్కింటికి వచ్చేసింది. పదిహేడేళ్ళ వయసులో విరబూసిన ముద్దబంతిలా వుండేది. తల్లిని పోగొట్టుకుని తన పంచన చేరిన చెల్లెల్ని అక్క బాగా చూసుకునేది. ఆమె తెచ్చిన డబ్బుతో ఎకరం పొలం కొన్నారు. ఆ ఎకరం అమ్మి చెల్లెలి పెళ్ళి చేసెయ్యాలని అక్క ఉబలాటపడి పోతుండేది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS