Previous Page Next Page 
వసుంధర కధలు -9 పేజి 41

 

    "ఆప్టరాల్ కాపలా వాడివి. నువ్వు నాకు చెప్పోచ్చేవా?" అన్నాడు జోగినాధం.
    "నీలాంటి వాళ్ళు లోపలకు వెళ్ళకుండా చూడ్డం కోసమే కదా నేనిక్కడ కాపలా కాస్తుంది?"
    "అలాగే అయితే అది నీ చేతకాని పని...." అంటూ జోగినాధం విసురుగా లోపలకు వెళ్ళబోయాడు. కాపలా వాడతన్ని పట్టుకుని వారించాడు.
    "నిన్నోడించడం నాకు చాలా సులభం...." అన్నాడు జోగినాధం.
    "ఎందుకని?"
    జోగినాధం జేబులోంచి యాభై రూపాయల నోటు తీసి "తర్వాత నీ యజమాని ముందు పోరాపాటై పోయిందని ఒప్పుకున్నావనుకో . ఆ పొరపాటు కంటే ఈ డబ్బు వదులుకోవడమన్నది చాలా పెద్ద పొరపాటు--" అన్నాడు.
    కాపలా వాడా నోటును ఆప్యాయంగా అందుకుని-- "నిన్ను నేను చూడలేదంటాను. నీ ఇష్టం. లోపలేలా మానేజ్ చేస్తావో " అన్నాడు.
    జోగినాధం ఈల వేసుకుంటూ లోపల ప్రవేశించాడు. భవనం లోకి వెళ్ళ బోయే ముందు మరో వ్యక్తీ అతన్ను ఆటకాయించాడు.
    "ఈరోజు క్లబ్ అయిటమ్స్ లో వాడే ఓ స్పెషల్ అట్రాక్షన్ -- ' అన్నాడు జోగినాధం. అతన్నటకాయించిన మనిషి అతని వంక ఓ పర్యాయం సందేహంగా చూసి ఊరుకున్నాడు.
    అ క్లబ్ లో చాలామంది జోగినాధం వంక ఆశ్చర్యంగా చూస్తున్నారు. అక్కడ అందరూ ఘుమఘుమ లాడి పోతున్నారు. తళతళ మెరిసి పోతున్నారు. వారి మధ్యన జోగినాధం ఓ శాపగ్రస్తుడిలా ఉన్నాడు. ఐనా అతని ముఖంలో విచారం లేదు.
    ఓ అయిదు నిముషాలు గడిచాక ఓ మనిషి జోగినాధాన్ని సమీపించి - "ఎవరు నువ్వు?' ఇక్కడి ఎందుకు వచ్చావ్?' అనడిగాడు.
    "నా పేరు జోగినాధం. అందరికి లాగే వచ్చాను." అన్నాడు జోగినాధం.
    "ఇంపాజిబుల్ నువ్వు తక్షణం బయటకు వెళ్ళాలి."
    "అలా అనొద్దు. ఎందుకంటె మీ క్లబ్ ననుగ్రహించి ఈరోజు ఇక్కడికి వచ్చాను. నేను రేపు రమ్మన్నా రాను...." అన్నాడు జోగినాధం.
    "నిన్ను రమ్మనడమా?" అని ఆ మనిషి హేళనగా నవ్వి - "ఇప్పుడు ఈ క్షణంలో నిన్ను బయటికి గెంతించ గలను...." అన్నాడు.
    "నా శక్తిని తక్కువగా అంచనా వేస్తున్నట్లున్నావు. నేను ఒక్క చేత్తో పరిమందికి సమాధానం చెప్పగలను. ఇక్కడ చాలా ఖరీదైన ఫర్నిచర్ కనబడుతోంది. అదంతా పాడుచేకోవాలనుకుంటే నన్ను బయటికి పంపడానికి ప్రయత్నించండి...." అన్నాడు జోగినాధం.
    ఆ మనిషి ముఖంలో ఆందోళన కనబడింది. "అయ్ సి అయితే క్లబ్ మెంబర్స్ కి వినోదం కలిగించే విధంగా నీకో పరీక్ష పెడతాను. అందులో నెగ్గితే నీకు వెయ్యి రూపాయల బహుమతి కూడా ఉంటుంది....' అన్నాడు.
    "వెయ్యి రూపాయలా? నేనింకా ఎక్కువ ప్లాను మీద వచ్చాను. అయితే నా శక్తి నీవు తెలుసుకోవాల్సిన అవసరముంది కాబట్టి అందాకా ఒప్పుకుంటున్నాను....'
    'అయితే నాతొ రా...." అన్నాడా మనిషి.

                                     8
    "ఫ్రెండ్స్! మీ అందరికీ ఇప్పుడొక అద్భుత వినోద ప్రదర్శనం. మన క్లబ్ చాంపియన్ వస్తాదు గుండూ రావుతో -- ఓ కొత్త వ్యక్తీ కుస్తీ పడతాడు. ఈ ప్రదర్శన మీకు కలిగించ బోయే వినోదం పోటీ దార్ల నిద్దర్నీ చూడగానే మీరర్ధం చేసుకోగలుగుతారు...."
    క్లబ్ లోని వేదిక పై దీపాలు వెలిగాయి. తెర తొలగించి వేదిక పై ఉన్న ఇద్దరు మనుషుల్నీ చూసి సభికులు నివ్వెర పోయారు. వారిలో ఒకతను కండలు తిరిగి ఏనుగులా ఉన్నాడు. రెండో వాడు బక్క పలచగా ఉన్నాడు.
    "నాపేరే గుండూ రావ్!" అన్న మనిషి కండలు మెరుస్తున్నాయి.
    అపరిశుభ్రంగా , పిచ్చి వాడిలా ఉన్న మనిషి సభికులకు చేతులు జోడించి- "నమస్కారం . నా పేరు జోగినాధం. మీరనుకున్నంత వినోదం ఈ ప్రదర్శన ద్వారా మీకు లభించదు. నా ప్రతి కక్షని చిత్తు చేయడాని కింత వరకూ అయిదు సెకన్ల కి మించి నేను తీసుకోలేదు. మీరు ప్రత్యేకంగా కోరితే తప్ప ఈ ప్రదర్శన ఎక్కువ సేపు కొనసాగదు...." అన్నాడు.
    తర్వాత గుండూరావు , జోగినాధాన్ని సమీపించాడు. చూసే వాళ్ళకి జోగినాధం ఏమైపోతాడో నన్న కంగారు కలిగింది.
    అయితే జోగినాధం గుండూ రావుని గమనిస్తూనే ఉన్నాడు. అతను తనని సమీపించగానే తమాషాగా కాలు విసిరాడతను. అది గూండురావు మోకాలి ప్రాంతంలో తగిలింది. గుండూరావు మొదలు నరికిన  వృక్షం లా బోర్లా పడిపోయాడు. చటుక్కున జోగినాధం గుండూ రావు ని సమీపించి రెండు భుజాల మీదా రెండు దెబ్బలు వేశాడు.
    తర్వాత సభికుల వైపు తిరిగి - "అయ్యా -- మన్నించాలి గుండూరావు గారు లేవడానికి కనీసం పది నిమిషాలు పడుతుంది. ఈ రోజు కింక అయన పోటీలో పాల్గొనగలరని నాకు తోచడం లేదు. ప్రదర్శన నాలుగు సెకన్ల లోనే ముగిసింది. ఏమీ అనుకోవద్దు" అన్నాడు.
    కరతాళధ్వనులతో హాలు దద్దరిల్లి పోయింది. ఈ పోటీ ఏర్పాటు చేసిన మనిషి జోగినాధాన్ని సమీపించి "అద్భుతం! మా క్లబ్ చరిత్రలోనే ఇది ఒక అపూర్వ సంఘటన మిస్టర్ జోగినాధం.- ఈ గంగాధరం మీకు సంతోషంగా వెయ్యి రూపాయల బహుమతి ఇచ్చుకున్తున్నాడు...." అంటూ పది వంద రూపాయల నోట్లు అందించాడు.
    "ఈ హల్లో ఫర్నిచర్ లక్ష రూపాయల విలువ చేస్తుంది. వెయ్యి రూపాయల ఖర్చులో లక్ష రూపాయల ఫర్నిచర్ని రక్షించు కున్నావ్ మిస్టర్ గంగాధరం. అభినందిస్తున్నాను"అన్నాడు జోగినాధం. అప్పుడే హల్లో కేకలు మొదలయ్యాయి. జోగినాధాన్ని తమ మధ్యకు తీసుకు రావలసిందిగా చాలామంది కోరుతున్నారు.
    జోగినాధం మళ్ళీ మనుషుల మధ్యకు వెళ్ళాడు. అయితే ఎవ్వరూ అతని వంక జుగుప్సాకరంగా చూడడం లేదు. కొంతమంది ఆడవాళ్ళు ఆరాధనా భావంతో చూస్తున్నారు కూడా! కొత్త కొత్త ఫేషన్ల కోసం యువతరం గంగ వెర్రులేత్తుతున్న ఈ రోజుల్లో అతని వేషం కూడా బాగానే ఉందని పించింది.
    ఒకమ్మాయి చటుక్కున అతన్ని సమీపించి కౌగలించుకున్నంత పని చేసి - "అబ్బ వాసన!" అని ముక్కు మూసుకుంది.
    "చూశావా-- నా కిష్టం లేని వాళ్ళ నుంచి తప్పించుకోడానికి వాసన ఎంత ఉపయోగపడుతుందో-" అన్నాడు జోగినాధం.
    "మిస్టర్ జోగినాధం ...." అన్నాడు గంగాధరం . "మీరిక్కడకు వచ్చిన పనేమిటో చెబితే...."
    "డబ్బు కావాలి...." అన్నాడు జోగినాధం.
    "ఎంత?"
    "పది వేలు....'
    "చేతనైతే సంపాదించుకోవచ్చు. ఇంకో పది నిముషాల్లో మూడు ముక్కలాట ఆరంభం కానుంది..." అన్నాడు జోగినాధం.
    'అందుకేగా లోపలకు వచ్చెను...." అని నవ్వాడు జోగినాధం.
    "డబ్బుందా?"
    "ఇక్కడకు వచ్చేక సంపాదించినదే ఉంది- వెయ్యి రూపాయలు."
    గంగాధరం తడబడి - "మా క్లబ్ అతగాడు రమేష్ నింతవరకూ ఎవ్వరూ నేగ్గలేదన్న విషయం తెలుసా?" అన్నాడు.
    జోగినాధం చిరాగ్గా -- "అటు స్టేజి కేసి చూడండి. పాపం గుండూ రావింకా లేవలేదు. నిద్రపోతున్నాడో ఏమో!' అన్నాడు.
    గంగాధరం కంగారుగా అక్కణ్ణించి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయినా అయిదు నిముషాలకు అక్కడ దీపాలు డిమ్ అయ్యాయి. సన్నగా పాశ్చాత్య సంగీతం వినిపించ సాగింది.
    పదిమంది నర్తకీమణుల బృందం ఒక అర్ధవంత నృత్యాన్ని ప్రదర్శించారు. ఆ డిమ్ లైట్ల కాంతిలో నృత్యం మనుషుల్లో ఉద్రేకాన్ని కలిగించి, ప్రోత్సహించేడిగా వుంది. నృత్యం ముగింపు దశ చేరుకునే సరికి - నర్తకిమణులతో పాటు హాల్లోని పది మంది మగవాళ్ళు కూడా అదృశ్య మయ్యారు. హల్లో తిరిగి దీపాలు వెలిగాయి.
    గంగాధరం జోగినాధాన్ని పలకరించి "ఎలా వుంది నృత్యం?" అన్నాడు.
    "నేనిప్పుడే దేశంలో  వున్నాను?" అడుగు తీసి అడుగు వేస్తె అమ్మా, ఆకలి అని ఆక్రోశించే ఆభాగ్యులున్న దేశం ఇదేనా?' అన్నాడు జోగినాధం.
    "ఛా --ఛా- ఒక్క రాత్రిలో పదివేలు సంపాదించడం కోసం కాపలా వాడికి లంచ మిచ్చి అక్రమంగా క్లబ్ లో ప్రవేశించిన నువ్వు -- ఈ సమయంలో అభాగ్యుల గురించి తలచుకున్తున్నావా?" సిగ్గుగా లేదు?" అన్నాడు గంగాధరం.
    "ప్రజాక్షేమాన్ని కోరిన ధర్మరాజు ప్రజానాశనం కలిగించే యుద్దానికి పాల్పడ్డాడు. దుర్మార్గుల్ని అణచడం కోసం అక్రమ యుద్ధం చేయడమే కాక, తనూ ఓ అబద్దం కూడా ఆడాడు. మీ విషయంలో నేనేం చేసినా అది తప్పు కాదు...." అన్నాడు జోగినాధం.
    "అది సరే -- అటు చూడు -- ఆ వస్తున్నదే రమేష్!" అన్నాడు గంగాధరం.
    జోగినాధం నిర్లక్ష్యంగా అటువైపు చూస్తున్నాడు.
    సినిమా హీరోలను మించి అందంగా వున్న ఓ పడుచు వాడు. అతనికీ అటూ ఇటూ ఇద్దరమ్మాయిలు. ఏ స్వర్గాన్నించో సరాసరి దిగివచ్చిన రంభ, ఊర్వశి ల్లా వున్నారు వాళ్ళిద్దరూ.
    "ఆ ముగ్గురిలో రమేష్ యెవరు?' అన్నాడు జోగి నాదం వెటకారంగా.
    గంగాధరం కోపంగా జోగినాధం వంక చూసి- "ఆడకూ, మగకూ బేధం తెలియకుండా వుందా నీకు?" ఇంక పెకేం అడతావ్!" అన్నాడు.
    "ఆడవాళ్ళు పొడుగ్గా ఉండడం , మగవాళ్ళు పొట్టిగా ఉండడం పెద్ద విచిత్ర మేం కాదు. వాళ్ళు ముగ్గురూ ఒకే రకమైన బట్టల్లో , ఒకేరకమైన హెయిర్ స్టయిల్ లో వున్నారు. అడేవరో, మగ ఎవరో నాకెలా తెలుస్తుంది?" అన్నాడు అమాయకత్వాన్ని నటిస్తూ జోగినాధం.
    అప్పటికి అ పడుచువాడు జోగినాధాన్ని సమీపించి "ఎస్ ఐయామ్ మిస్టర్ రమేష్!" అన్నాడు.
    జోగినాధం టైము చూసుకుని "మూడు ముక్కలాట ప్రారంభించడాని కింకా యెంత వ్యవధి వుంది?' అన్నాడు.
    "నేను వచ్చేశాగా -- ఇప్పుడే ఈ క్షణం లోనే ప్రారంభము. నువ్వు సిద్దమా?" అన్నాడు రమేష్. అతన్ని పక్క నున్న ఇద్దరమ్మాయిలూ జోగినాధం వంక వెటకారంగా చూసి నవ్వారు.
    "మిస్టర్ రమేష్!ఐయాం మిస్టర్ జోగినాధం. నేనీ వేళ పెద్ద యెత్తులో వచ్చాను. ముందుగా నువ్వో రెండు రౌండ్లు వేసి నాలుగు డబ్బులు సంపాదించుకో ..." అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS