Previous Page
ధర్మ చక్రం పేజి 42


    అర్జున్ ఆమె ను చిరునవ్వుతో నే అభినందించాడు.
    రాజ్యలక్ష్మీ గదిలోకి వెళ్ళారు అందరూ. ఆమెకు స్పృహ వచ్చింది. ఎటువంటి ప్రమాదమూ ప్రాణహానీ లేదని డాక్టరు హామీ  ఇచ్చాడు.
    ధర్మారావు రాజ్యలక్ష్మీ పాదాల మీద పడి విపరీతంగా రోదించాడు. తల్లీ కుమారులిద్దరికీ మాటలు కరువయ్యాయి.
    రాజ్యలక్ష్మీ తల నిమురుతూ కన్నీళ్ళతో అన్నాడు గౌతమ్ : "రాజ్యం! నన్ను విపరీతంగా అభిమానించి వివాహం చేసుకున్నావు. కాని ఏం సుఖ పడ్డావు? ఎలాగై పోయాయో మన జీవితాలు!"
    'అలా అనవద్దు. అలా అనవద్దు!" విపరీతావేశంతో అన్నది రాజ్యలక్ష్మీ. "మిమ్మల్ని చేపట్టబట్టే వీరపత్ని, నయ్యాను; వీర మాత  నయ్యాను. చూచారా, మన ధర్మారావు! నీతి న్యాయ ధర్మాలపై మీకు గల ప్రేమాభిమానాలతో, కన్న కుమారునికి ఆపేరు పెట్టారు. మీరు అనుకున్నట్టే. ఆశించినట్టే అతడు మీ ఆదర్స్శాల పంట అయ్యాడు. అక్షరాల మీ పుత్రుడే. ధర్మరావు ధర్మమూర్తి! ఆ ధర్మమూర్తి కి తల్లిని, ఈధర్మమూర్తి కి పత్నిని. జన్మజన్మా లకు నాకు ఈ తృప్తే చాలు!" అంటూ "బాబుగారూ! ఈ చలవంతా మీది. ఈ ధర్మరావు మీవాడే కాని మావాడు కాదు!" అన్నది నారాయణ్ శర్మ తో.  
    "ధర్మారావ్!" ప్రేమతో అతడిని అక్కున చేర్చుకున్నాడు నారాయణ్ శర్మ. "నిజంగా నేను గర్విస్తున్నాను, బాబూ! తండ్రిని మించిన తనయుడివి. తల్లిదండ్రులకు విముక్తి కలిగించిన సమర్దుడివి."
    "ఇంకా మెల్లగా అంటారా? పిల్లవాడు సూర్య కిరణం లాంటి వాడని నేనేప్పుడో అనుకున్నాను." అంటున్న సుమిత్రతో, "ఏమేవ్, నీ ధోరణి ఇలా మారిపోయింది?' అని హేళనగా అన్న మిత్రా మాటలకు అందరూ నవ్వారు.
    ఏమీ పట్టనట్టు నిర్లిప్తంగా ఒక పక్క నిలబడి పోయిన సత్యను చూచిన ప్రేమమయి అయిన రాజ్యలక్ష్మీ మనస్సు దయార్ద్రమయినది. నెమ్మదిగా లేచి ఆమెను సమీపించి, చుబుకం పట్టి "సత్యా!" అని సంబోధించింది.
    ఆ అపూర్వ వాత్సల్యానికి తికమక పడింది సత్య.
    "మొదట నిన్ను అపార్ధం చేసుకున్నాను కానీ, మీ ఇంట్లో ఉన్న నాలుగు రోజులలో వెన్న వంటి నీ అంతర్యాన్ని గ్రహించానమ్మా. నిశ్చింతగా ఉండు. ఈ విషయాలేమీ నీ వ్యక్తీ గత జీవితానికి అడ్డుగా నిలవవు. ధర్మారావు కూ, నీకూ ఉన్న స్నేహం నాకు తెలుసు! ఇక నీకు అమ్మనూ, అత్త నూ కూడా నేనే!" అవధులు దాటిన సంతోషంతో ఆమె చేతులలో ఇమిడిపోయింది సత్య.
    "అయితే త్వరలో మాకు భోజనాలున్నా యన్న మాట?' అంటూ అర్జున్ ధర్మారావును హాస్యం చేశాడు. బలరాం మౌనంగానే చిరుహాసంతో అభినందించాడు ధర్మారావును.

                                     42
    రాజధాని డిల్లీ లో రాష్ట్రపతి ఆధ్వర్యాన జరిగిన మహా సభలో వీరధైర్య సాహసోపెతులైన గౌతమ్ కుటుంబ సభ్యులకు సన్మానం జారిగింది.
    "మాతృదేశ రక్షణ కోసం ప్రాణాలకు కూడా తెగించి, కుటుంబ మంతా చెల్లా చెదురై చెట్టూ పుట్టా పట్టి పోయినా ధర్మ దూరులు కాలేదు. తల్లి, తండ్రి, కుమారుడు -- ముగ్గురూ మూడు జాతి రత్నాలు. తల్లి, భారతి నేడు అద్వితీయ సుగుణ సంపన్న మైన తన ఈ సంతానాన్ని చూచుకొని నిజంగా గర్విస్తున్నది. కలియుగ మైనా ఇక్కడ ధర్మం నివసిస్తున్నది. ధర్మదేవతే దిగి వచ్చిందా అన్నట్టు -- నీతీ, న్యాయం, ధర్మం, దయా, అహింసా ఇక్కడా నివసిస్తున్నాయని గౌతమ్, నారయణ్ శర్మ , ధర్మారావు, రాజ్యలక్ష్మీ గారలు తామే ధర్మదేవత నాలుగు పాదాలై నిరూపించారు. ప్రభుత్యోద్యోగిగా సత్యాదేవి, వ్యక్తిగత మమకార దూరయై, కర్తవ్య నిర్వహాణ కు దాసోహమని సార్ధక నామధేయురాలయింది. నిష్పక్ష పాత బుద్ది గల న్యాయమిత్ర నిజంగా న్యాయానికి మిత్రులే! అలనాడు కురుక్షేత్ర యుద్ద భూమియై ధర్మ క్షేత్రమని నిరూపించుకొన్న ఈ గడ్డ పై ఈ ఉత్తములకు  ఘన సత్కారాలు చేయగలిగిన మన ప్రభుత్వం నిజంగా గర్విస్తున్నది.
    "ఈ వీర పురుషుడు గౌతమ్ "వీర చక్ర' విజేత అయినాడు. తండ్రిని మించిన తనయుడు ఈ ధర్మారావు -- ఇటు ప్రభుత్వం, అటు ప్రజలు -- అందరి మెప్పులనూ పొందిన వ్యక్తీ. తన ఉదాత్త భావాలతో, సద్వర్తనతో సంఘాన్నే బాగుచేయటానికి పూనుకొన్న ఈతడిని 'భారత రత్న' తో బహుకరిస్తున్నాము. ఈ అద్వితీయ చరిత్రకు అంతకూ తేర వెనక సారధి అయిన విష్ణు నారాయణ్ శర్మ' ను 'పద్మ విభూషణ్' తోనూ, స్త్రీ లోకానికే ఆదర్శ ప్రాయ అయిన రాజ్యలక్ష్మీ దేవిని 'స్త్రీ రత్న' అనే ప్రత్యెక బిరుదు తోనూ సన్మానిస్తున్నాము.
    "ఈ కేసులో అతి నేర్పుతో పని చేసిన డిటెక్టివ్ బలరాం, న్యాయమే జీవిత ధ్యేయంగా భావించి ఉపకరించిన శక్త్యనుసారం మాకు అజ్ఞాతంగా ఉపకరించిన సత్యాదేవి, న్యాయమిత్ర, అర్జున్ గారలకు మెరిట్ సర్టిఫికెట్ల ను ఇస్తున్నాము." కరతాళధ్వనులు మిన్ను ముట్టాయి.
    రాష్ట్రపతి తిరిగి చెప్పారు: "ఇటువంటి వీరోత్తములే నేడు దేశానికి అత్యవసరం. గౌతమ్ , రాజ్యలక్ష్మీ , నారాయ శర్మ గారలకు అర్హ స్థానాలలో ఉండి, వారి సేవలను దేశ రక్షణకు వినియోగించమని ప్రభుత్వం అర్ధిస్తున్నది."
    గౌతమ్ లేచి వేదిక ఎక్కి సవినయంగా చెప్పాడు; "ప్రభుత్వం వారి మన్ననలకు పాత్ర మైన మా జన్మలు ధన్య మైనాయి. కాని, అవిదేయతగా భావించక పొతే , తృణీ కారంగా అపార్ధం చేసుకొనక పొతే ఒక్క మనవి. పధ్నాలు గేళ్ళ దీర్ఘ వియోగంతో నిరర్ధకంగా నే గడిచిపోయాయి మా జీవితాలు. ఆనందంగా గడప వలసిన రోజులు విచారంలో, నిందల లో తిరిగిపోయాయి. ఇప్పుడైనా ఒక చోట ప్రశాంతంగా కలిసి జీవించాలని మా కోరిక. అయితే , ఎక్కడ ఉన్నా మేము దేశ క్షేమానికి పాటు పడేవారమే! ఏదైనా మంచికే వచ్చినట్టు, ఈ కారాగార వాసం లో నేనొక సత్యాన్ని గ్రహించాను. మానవులలోని అజ్ఞానం, స్వార్ధం, రాక్షసత్వం వారిని అక్రమచర్యలకు ప్రోత్సహిస్తాయి. పోట్లాటలు, యుద్దాలు వీటి పర్వవసానమే! వీటిని నిర్మూలించితే సంఘం బాగు పడుతుంది ; ఆ బాగే దేశ కల్యాణకారణమవుతుంది! అందుకే నేనూ, నారాయణ్ శర్మ , రాజ్యలక్ష్మీ అందుకు కృషి చేయదలిచాము. పసిపిల్లలైనా పండు వృద్దులైన ఆధ్వర్యం వహించి నడిపించే వారి నేర్పును బట్టి తయారవుతారు. నారాయణ్ శర్మ నడిపిన అనాధ శ్రమం , ఖైదీల పట్ల ధర్మారావు ప్రవర్తనా, రాజ్యలక్ష్మీ ఓర్పూ, నేర్పూనాలో ఈ భావాలను కలిగించాయి. అందుకు ప్రభుత్వం వారు దయతో అనుమతించాలని ప్రార్ధిస్తున్నాను. అనాధులైన బాల బాలికలను తీర్చి దిద్దడం లోనూ, కరుకు దేరిపోయిన ఖైదీల కు పునరావాస కేంద్రాన్నేర్పరచి గౌరవ జీవన మార్గాలు ఏర్పరచి, వారి జీవితాలను మంచికి తిప్పడం లోనూ మా శక్తిని వినియోగించి, ఈ విధంగా దేశానికి సేవ చేయ తలుచుకున్నాము. కాని మేము ప్రస్తుతం నిరాధారులం. అందువల్ల ప్రభుత్వం వారు మా ఆశయాలను గుర్తించి , అందుకు అవసరమైన ధన సహాయం కూడా చేయ గలరని ఆశిస్తున్నాను.
    ఇక ఈ యువ దంపతులు -- సత్య, ధర్మారావు -- సదా ప్రభుత్వం వారి నమ్మిన సేవకులుగా ఉంటారు."
    ఉదార హృదయులైన రాష్ట్రపతి -- గౌతమ్ ఉన్నతాశయాలను అభినందించడమే కాక గౌతమ్ సత్సంకల్పానికి ఎల్లప్పుడూ తమ అండ ఉండగల దని చెబుతూ అప్పటికప్పుడు నాలుగు లక్షల రూపాయలు మంజూరు చేశారు.
    "ధర్మారావు ను స్టేట్ జైలు సూపరింటెండెంట్ గా నియమిస్తున్నాము." అన్న మాటలు విన్న సత్య ధర్మారావు ను ప్రశంశా పూర్వకంగా చూస్తుండగా జనగణమన అతి మధురంగా వినివస్తూ శ్రోతల హృదయాలలో కోటి జేగంటల గణగణ నాదాలను పలికించు తుండగా సభ ముగిసింది.
    ముచ్చటైన మువ్వన్నె జాతీయ పతాకం మీద ఉన్న ధర్మ చక్రం గర్వంగా, ఠీవి గా మృదులాస్యం చేస్తున్నది.

                                 (సమాప్తం)


 Previous Page

WRITERS
PUBLICATIONS