Previous Page Next Page 
డాళింగ్ పేజి 41

 

    "ప్రేమకన్నా మించిన సంబంధం మన మధ్య వుంది. డోంట్ వర్రీ విమల్ ------ఐ లవ్ యూ......ఐ లైక్ యూ.......అనవసరంగా లేనిపోని ఆలోచన్లు పెట్టుకోకు......మిత్రా ఇవాళుంటాడు రేపు పోతాడు.........టేకిట్ ఈజీ .........టేక్ రెస్ట్.......మీకు రెస్ట్ చాలా అవసరం......" విమల్ చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని ప్రేమగా నిమురుతూ లాలనగా అంది.
    ఎన్నెన్నో అగాదాల్లోంచి ఎన్నెన్నో వేడి ఇసక మైదానాల్లోంచి ఎడారుల్లోంచి వంటరిగా నడిచొచ్చిన వాడిలా వున్నాడు విమల్.
    మాధురి కళ్ళలోకి సూటిగా చూసాడు. ఆ కళ్ళలోని ఆర్ద్రతకు చలించిపోయాడు.
    "మాధురీ.......నేనేమైపోతున్నాను." తనలో తను గొణుక్కున్నట్టుగా అన్నాడు.
    "ఏమై పోవడం లేదు ........" తన ఒడిలో వున్న అతని తలమీద నిమురుతూ నుదుటి మీద పడిన జుత్తును సవరిస్తూ అంది మాధురి.
    "నువ్వెప్పుడూ నాతోనే వుంటావు కదూ........" ఆ మాటల వెనక విమల్ లో చిన్నపిల్లాడి మనస్తత్వాన్ని చూసింది మాధురి.
    చిరుచెమటతో నిండిన అతని నుదుటిని మెల్లగా చుంభీంచింది.
    విమల్ కి హాయిగా వుంది.
    తన రెండు చేతుల్ని ఆమె భుజం మ్మీద వేసి ఆమెను దగ్గరగా లాక్కున్నాడు.
    ఇప్పుడు ఆ ఇద్దరి పెదాల మధ్య ఎంతో దూరం లేదు.
    అతని మీసాలు మొదట ఆమె పెదవులకి తగిలాయి. తనలో తను నవ్వుకుంది మాధురి.
    ఓ అయిదు క్షణాలు మౌనం -
    గాడంగా చుంభించాడు విమల్. ఆమెను తన హృదయానికి గట్టిగా అదుముకున్నాడు ----గదంతా నిశ్శబ్దంగా వుంది.
    పెదవుల మీద, నుదుటి మీద, బుగ్గల మీద, కంఠం మీద ........మెరుస్తున్న ముద్దులు.
    తమకంగా ఆమె వీపు మీద చెయ్యి వేసి ముందుకి లాక్కున్నాడు.
    పక్కకు తొలగిపోయిన పైట, నిండు గుండెల వేపు చూసాడు విమల్. ఎందుకో ఆ క్షణాన మాధురికి పైట సరిచేసుకోవాలనిపించలేదు.
    అతను మరింత దగ్గరవుతున్నాడు.
    వారించాలా? వద్దా? సున్నితమైన సమస్య........
    "మధూ........ఐ లవ్ యూ" ఆమె శరీరాన్ని చుట్టేస్తూ అన్నాడు విమల్.
    మాధురీ ఏం మాట్లాడలేదు భయంతో తన తల్లిని తనకు కాకుండా చేస్తారేమోనని చిన్నపిల్లాడు తల్లి ఒడిలోకి కూరుకుపోయినట్లుగా వున్నాడు విమల్.
    సరిగ్గా అదే సమయంలో ఆ ఇంటికి ఇరవై అడుగుల దూరంలో ఓ కారొచ్చి ఆగింది. అందులోంచి ముగ్గురు వ్యక్తులు దిగారు. వాళ్ళు అటూ ఇటూ చూస్తూ మాధురి ఇంటివేపు వచ్చారు. మేడమీద ఒక గదిలో తప్ప , మిగతా ప్రదేశంలో దీపాలు లేవు.
    "యూ వాంట్ మీ ........నౌ........అతని చేతుల్ని వారిస్తూ అంది మాధురి.
    అవుననట్లుగా అతను కళ్ళతోనే జవాబు చెప్పాడు.
    "వద్దు విమల్. కోరిక తీరిపోయాక ఆకర్షణ సన్నగిల్లుపోతుంది. ఒకర్నొకరు పూర్తిగా అర్ధం చేసుకున్న వ్యక్తులమైన, ఆకర్షణ తగ్గిపోయాక మన ప్రేమకు ఇంత బలం వుండదు, మన ఫీలింగ్స్ క్కూడా విలువుండదు. అంచేత ........"
    నామీద నీకు నమ్మకం లేదా.........' నెమ్మదిగా అడిగాడు విమల్.
    "ఉంది కాబట్టే చెప్తున్నాను........"
    సరిగ్గా అదే సమయంలో వాళ్ళు ముగ్గురూ మేడ మెట్లెక్కుతున్నారు.
    అడ్డొచ్చిన గుర్ఖాను నోరు మూయించి పక్కకు తప్పించి, తలుపు తీసిన పనిమనిషిని బెదిరించి లోన కొచ్చారు వాళ్ళు. వాళ్ళెవరో ఏంటో తెలీక అరవబోయి అరిస్తే చస్తావ్ అన్నట్టుగా గుడ్లురిమి చూసిన అందులో ఒక వ్యక్తిని చూసి భయపడి బిక్కచచ్చిపోయి నిల్చుండిపోయింది పనిమనిషి.
    ఏదో అడుగుల చప్పుడు వినిపిస్తే ఆశ్చర్యంగా విమల్ వేపు చూసింది మాధురి.
    ఈ సమయంలో , తన రూమ్ దగ్గరికి డైరెక్టుగా ఎవరొస్తారు? తను పొరపాటు పడిందేమో.
    లేదు. వరండా మీద.
    అడుగుల చప్పుడు స్పష్టంగా విన్పిస్తోంది.
    పిల్లో కిందనున్న రివాల్వర్ వేపు చూసింది మాధురి.
    అదే సమయంలో తలుపు మీద టకటక చప్పుడు.
    ఒక్క ఉదుటున ఎలర్ట్ అయాడు విమల్.
    భయంగా విమల్ వేపు చూసింది మాధురి.
    మళ్ళీ టకటక చప్పుడు.
    "ఎవరూ' గొంతు పెగల్చుకుని నెమ్మదిగా అంది.
    "మాధురీ ఓపెన్ ద డోర్. ఆయామ్ సుజన్."
    సుజన్. సుజన్ మిత్ర ఇప్పుడు ఈ సమయంలో ఇలా ఎందుకోసం వచ్చుంటాడు . ఎవరి కోసం. విమల్ కోసమా?
    ఏం చెయ్యాలో తోచలేదు.
    గబుక్కున తలుపు తెరిచింది.
    ఎదురుగా సుజన్ మిత్ర - పక్కన ఇంకో ఇద్దరు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS