Previous Page Next Page 
శంఖారావం పేజి 39

 

    హల్లో కూర్చుని సీతమ్మ భగవద్గీత చదువుకుంటోంది.
    అప్పుడు వేదాంతం, కులభూషణ్ ఇంట్లో అడుగు పెట్టారు.
    సీతమ్మ పుస్తకం మదిచింది. ఆమె ముఖంలో గీతాపారాయాణానికి మించిన తృప్తి వారిని చూడగానే కనబడింది.
    "ప్రయాణం క్షేమంగా జరిగిందా?" అందామె.
    "ఊ" అన్నాడు వేదాంతం.
    'అసలు వారం రోజుల్లో రావలసిన వాళ్ళం. కొన్ని కారణాల వల్ల పది రోజులకు దేకింది." అన్నాడు కులభూషణ్.
    "విస్సీ ఏడి?" అన్నాడు వేదాంతం చుట్టూ చూస్తూ.
    "వాళ్ళిద్దరూ సినిమాకి వెళ్ళినట్లున్నారు ------' అంది సీతమ్మ.
    "సినిమాకా -----ఈ సమయంలోనా ?" అన్నాడు వేదాంతం.
    'అవున్రా ----మ్యాట్నీకి వెళ్ళారు.....' అంది సీతమ్మ.
    వేదాంతం ముఖం ఎర్రగా అయింది.
    "ఏ సినిమాకెళ్ళారు ?" అన్నాడు కులభూషణ్.
    "నేనడిగితే కద --- చెప్పదానికి౧ మీరు వెళ్ళినప్పట్నించి వాళ్ళిద్దరూ ఒకటే తిరుగుడు....ఒకటే తిరుగుడు .....' అంది సీతమ్మ. ఫిర్యదులా చెప్పినా అందుకామె ఎంతో సంతోషిస్తున్నాదని ముఖం చూసి తెలుసుకోవచ్చు.
    'అమ్మా-----విశేషాలేమిటి?" అన్నాడు వేదాంతం మాట మార్చుతూ.
    'చాలా పెద్ద విశేషమొకటుంది ...." అంది సీతమ్మ.
    వేదాంతం కళ్ళు పెద్దవయ్యాయి --"ఊ" అన్నాడు.
    'కాసేపట్లో రామశాస్త్రిగారోస్తారు --' అంది సీతమ్మ.
    "ఊ" అన్నాడు వేదాంతం.
    "ఎందుకని అడగవెం ?' అంది సీతమ్మ.
    "ఎందుకమ్మా?" అన్నాడు కులభూషణ్.
    "మంచి ఫోటోలు తెస్తారు----"
    "ఫోటోలెమిటి ?" అన్నాడు వేదాంతం ఆశ్చర్యంగా.
    "ఫోటోల్లో పిల్లలు నచ్చితే -- మనం పెళ్ళి చూపులకు వెళ్ళొచ్చు --"
    "ఎవరి ఫోటోలు ఎవరికి నచ్చాలి ?" అన్నాడు కులభూషణ్.
    సీతమ్మ నవ్వి -- "మీ కోసం వధువుల ఫోటోలు తెప్పిస్తున్నాను. మీకు నచ్చుతాయని నమ్మకం" అంది.
    "మా పెళ్ళి కేం తొందరోచ్చింది ?" అన్నాడు వేదాంతం.
    "తొందరేమరి- మీరు చేసుకుంటే తప్ప విస్సీ గాడు పెళ్ళి చేసుకొట్ట. అందుకని ముగ్గురి పెళ్ళి ఒక్కసారే...."
    "విస్సీకి పెళ్ళా?" అన్నాడు వేదాంతం అదోలా!
    సీతమ్మ తెల్లబోయి --"అదేమిట్రా -- అలాగన్నావు !" అంది.
    వేదాంతం తడబడుతూ -- 'అబ్బే ఏం లేదు! ఎవరితో వాడి పెళ్ళి ?" అన్నాడు.
    "బాగుంది --- ఇంకెవరితో ....మన ఉదయతో ...."
    వేదాంతం నిరుత్సహంగా -- "సరేలే -- ఇక ఊళ్ళో విశేషాలేమిటో చెప్పు" అన్నాడు.
    "ఉళ్ళో విశేషాలతో మనకి పనేమిటి ?" అంది సీతమ్మ.
    'అది కాదు , మురహరి లా ఇంకెవరైనా ....'
    "ఏమో నాకవేమీ తెలియదు. కాసేపట్లో రామశాస్త్రి గారు వస్తారు. ఫోటోలు చూద్దురు గాని....' అంది సీతమ్మ.
    "మీమీపూట వస్తామని నీకెలా తెలుసమ్మా?" అన్నాడు కులభూషణ్ ఆశ్చర్యంగా.
    'చెప్పందే ఎలా తెలుస్తుంది?" వారం రోజుల్నుంచీ రామశాస్త్రి గారిని రోజూ తిప్పుతున్నాను" అంది సీతమ్మ.
    "నీ శ్రద్దకు సంతోషించాంగానీ -- రామశాస్త్రిగారు వస్తే ఫోటోలు నేను చూడనన్నానని చెప్పు" అన్నాడు వేదాంతం.
    "ఏం?" అంది సీతమ్మ.
    "నా మనసులో ఒక ఫోటో ఉంది. అది తప్ప ఇంకేమీ నాకు నచ్చదు ..." అన్నాడు వేదాంతం.
    "దాందేముంది? ఆ ఫోటో ఎవరిదో చెప్పు ...." అంది సీతమ్మ.
    "ఆ ఫోటో గురించి నీకు చెప్పే అదృష్టం నాక్కలగాలని నేనూ ఆశిస్తున్నాను. ప్రస్తుతాని కింకేమీ అడక్కు. రామశాస్త్రి వస్తే ఫోటోలు చూడనన్నానని చెప్పు " అంటూ లోపలకు వెళ్ళిపోయాడు వేదాంతం.
    సీతమ్మ స్వరం కాస్త తగ్గించి -- "ఇంటికి రాగానే వాణ్ని మంచినీళ్ళు కావాలా అనడగడాని క్కూడా లేదు. నువ్వు చెప్పరా నాన్నా-- దార్లో ఏమైనా తిన్నారా ?' అంది కులభూషణ్ తో.
    కులభూషణ్ నవ్వి --"కడుపు పగిలేలా తిన్నాం-- మంచి నీళ్ళ కూడా కడుపులో ఖాళీ లేదు" అన్నాడు.
    ఇంటికి రాగానే మంచి నీళ్ళడిగినా వేదాంతని క్కోపం వస్తుంది. ఇది మా ఇల్లు పరాయి వాళ్ళకులా మాకిక్కడ మర్యాద లేమిటి -- అంటాడతడు. సీతమ్మ తన కన్నా తల్లి కాదని అతడికి తెలియడం వల్ల ఆమెకు కన్న తల్లిలా చూసుకునేందుకు కతడు అసహజంగా ప్రవర్తిస్తుంటాడు. మతం మార్చుకున్న ముస్లిం , క్రైస్తవులు- హిందూ మతాన్ని ఒరిజినల్ క్రిస్టియన్స్ , ముస్లింలకు మించి -- నిరసిస్తారు. అలాంటిదే వేదాంతం ప్రవృత్తి!
    'ఇంటికి వస్తూ తిని వచ్చారా?" అంది సీతమ్మ బాధగా.
    "మేమీ సమయంలో వస్తున్నట్లు ముందుగా నీకు తెలియదు కదా-- అందుకని వేదాంతం ...' అంటూ నీళ్ళు నమిలాడు కులభూషణ్.
    సీతమ్మ మాట్లాడలేదు.
    కులభూషణ్ కూడా అక్కణ్ణించి వెడుతూ -- 'అమ్మా కాసేపు పడుకుంటాను. రామాశాస్త్రిగారి ఫోటోలు నేను కూడా చూడను. నా మనసులోనూ ఒక ఫోటో ఉంది. అదేవరిదో సమయం వచ్చినపుడు చెబుతాను...." అన్నాడు.
    "సరే నీ యిష్టం " అని నిట్టూర్చి --"దొడ్లో మాలి ఉంటాడు. వాడితో చెప్పు ఇంటికి పట్టుకుపోవడానికి అన్నముందని" అంది సీతమ్మ.
    కులభూషణ్ ఉలిక్కిపడి -దొడ్లోకి వెళ్ళకుండా వంటింట్లోకి వెళ్ళాడు. అక్కడ గిన్నెల్లో రకరకాల పదార్దాలేదురు చూస్తున్నాయి.
    'అమ్మ గొప్పతనం అంచనా వేయడం కష్టం --' అనుకున్నాడతను. అక్కణ్ణించి దొడ్లోకి వెళ్లి మాలిని పిలిచి విషయం చెప్పి - తన గదిలోకి కాక వేదాంతం గదిలోకి వెళ్లి -- 'అమ్మ మనకోసం వంట చేసింది. ఎదురు చూస్తూ కూర్చుంది. మనం అడిగి తింటే బాగుండేది. అడగలేదని నిరుత్సాహపడింది" అన్నాడు.
    వేదాంతం నిట్టూర్చి --'అమ్మ మన అదృష్టం" అన్నాడు/.
    "అలాంటి అమ్మను మనం రెండు విధాల నిరుత్సాహపరిచాము" అన్నాడు కులభూషణ్.
    "రెండు విధాలా?" అన్నాడు వేదాంతం ప్రశ్నార్ధకంగా.
    'అవును మనం వచ్చి భుజం మించి సామాన్లు దింపుకోగానే అమ్మ పెళ్ళి కబురు చెప్పింది. నీ మనసులో ఒక ఫోటో ఉందన్నావు. నా మనసులోనూ ఓ ఫోటో ఉండన్నాను. అమ్మ నిరుత్సాహం మాటల్లో వర్ణించ లేను.'    
    "నీ మనసులో ఫోటోయా ? ఎవరిదిరా?" అన్నాడు వేదాంతం విపరీతంగా ఆశ్చర్య పడుతూ.
    'చెప్పను "
    "ఎలా చెబుతావు ? ఒకటా రెండా - వందల ఫోటో లుంటాయి నీ మనసులో -- అవునా?"
    "నిజం చెబుతున్నాను. నా మనసులో ఒకటే ఫోటో ఉంది!"
    "నేను నమ్మను "
    'అందుకు రుజువు కూడా ఉంది. మనం ఆటవిక గ్రామానికి వెళ్ళినప్పుడు నా ప్రవర్తన నీ కక్కడ విచిత్రంగా అనిపించలేదూ? ఆచ్చాదన లేని పరువాల విందులకు నేను చలించానా ?' అన్నాడు కులభూషణ్.
    వేదాంతం ఆలోచనలో పడ్డాడు.
    "నా మనసులోని ఫోటో నాలో నిగ్రహాన్ని పెంచింది-"
    "ఎవర్రా ఆ అమ్మాయి?" అన్నాడు వేదాంతం.
    "ఆమె పేరు చెప్పను" అంటూ ఉదయకూ తనకూ ఏ పరిస్థితుల్లో వివాహమయిందో .....ఆ తర్వాతే లాంటి సంఘటనలు జరిగాయో చెప్పడతడు.
    "నువ్వు ఉదయను పెళ్లి చేసుకున్నావా?" అన్నాడు వేదాంతం తెల్లబోయి.
    "పేరు అనొద్దన్నానా?"
    "నువ్వు చెప్పిన విశేషానికి ఉదయ మాత్రం సరిపోతుంది "
    "అంతా నీ ఊహకే వదిలి పెడుతున్నాను...." అన్నాడు కులభూషణ్.
    అప్పుడు వేదాంతానికి ఉదయ మాటలు గుర్తుకొచ్చాయి. ఒకవేళ విశ్వనాద్ ని పెళ్ళి చేసుకోకపోతే --ఇంకెవరినైనా పెళ్ళి చేసుకుంటాను తప్ప వేదాంతాన్ని పెళ్ళి చేసుకో నంది. ఆమె మాటల అర్ధమిదా!
    'అయితే ఇప్పుడెం చేస్తున్నావు ?" అన్నాడు వేదాంతం.
    "ఆమె ప్రేమకు అడ్డు రాను. ఆమె కోసం జీవితాంతం అవివాహితుడిగా ఉండిపోతాను..."
    'అయితే నీ నూరేళ్ళ జీవితం...."
    "కంగారు పడకు . నేను అవివాహితుడిగా ఉంటానన్నాను. బ్రహ్మచారిగా మిగిలిపోతాననలేదు --" అన్నాడు కులభూషణ్.
    వేదాంతం నవ్వి "మరి అక్కడ అంత నిగ్రహం పాటించావెందుకు ?" అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS