Previous Page Next Page 
డాళింగ్ పేజి 38

 

    "అంచేత నా మెంటల్ పాపర్టీ లోంచి పుట్టిన ప్రేమకు ఇన్ స్పిరేషన్ ఏంటో ఎవరో మీకు చెప్పాలని , మిమ్మల్ని ఇక్కడకు తీసుకోచ్చాను."
    పరాకుగా ఉన్న విమల్, ఆ మాటతో ఉలిక్కిపడ్డాడు.
    "ఒక బిజినెస్ మాన్ ఇంత సీరియస్ గా లవ్ గురించి మాట్లాడడం నేనెప్పుడూ వినలేదు" మెల్లగా అన్నాడు విమల్.
    "మరి దేనిగురించి మాట్లాడడం విన్నారు." వెంటనే అడిగాడు సుజన్ మిత్ర.
    "బిజినెస్ గురించి, బ్లాక్ మార్కెటింగ్ గురించి మర్డర్స్ గురించి నవ్వుతూ అన్నాడు విన్నాడు.
    "నేను లవ్ లో ఫెయిల్ అయ్యననుకోండి. జరిగేవి మర్దర్సే" తనూ నవ్వుతూ చెప్పాడు సుజన్ మిత్ర.
    "అంత సీరియసా మీ లవ్." గ్లాసులోని డ్రింక్ ని సిప్ చేస్తూ అన్నాడు విమల్.
    ఆ మాటకు జవాబు చెప్పలేదు సుజన్ మిత్ర.
    అతని కళ్ళల్లో మాధురి కదలాడుతోంది. మాధురిని తనెందుకు ఇష్టపడుతున్నాడో సుజన్ మిత్రకు స్పష్టంగా తెల్సు. ఈ పరిస్థితిలో మాధురి గురించి తను మాట్లాడితే, విమల్ ఎలా రియాక్టు అవుతాడో? ఎలా టెంప్ట్ అవుతాడో?
    అలా టెంప్ట్ చెయ్యడం సుజన్ మిత్ర సరదాల్లో ఓ సరదా. వ్యాపార వ్యవహారాల్లో మనుషుల్ని టెంప్ట్ చేసి, ఓడించి , వెక్కిరించి తను రిలాక్స్ అవడం అతని హాబీ కూడా?
    అందుకే సుజన్ మిత్ర సడన్ గా టాఫిక్ మార్చాడు.
    "అతి తక్కువ టైం లో మీరు ఇండస్ట్రీ కొచ్చినా , మీకు మాంచి ఫాలోయింగ్ ఉంది ----కదా మిస్టర్ విమల్."
    ఆ పొగడ్త వెనక అగాధాన్ని గుర్తించలేదు విమల్ ----
    "మీరూ , మాధురీ ఇద్దరి జంట ఇక్కడ చాలా ఫేమస్ అట కదూ" మాధురి మాట వినగానే కళ్ళెత్తి సూటిగా చూసాడు విమల్.
    "నిన్న మీ ఇద్దరి  చుట్టూ మూగిన మీ ఫాన్స్ ని చూస్తేనే తెలుస్తుంది. మీ క్రేజ్ యూత్ లో ఎంతుందో....యామై కరెక్ట్."
    స్లో పాయిజన్ స్లోగా ప్రవహిస్తోంది.
    "ఎస్, యూ ఆర్ కరెక్ట్ సుజన్ , మాధురి .షీ ఈజ్ ఏ లవ్ లీ గర్ల్" మాధురి గురించి విమల్ చేత మాట్లాడించటమే సుజన్ మిత్ర ధ్యేయం.
    ఆ ధ్యేయం నెరవేరుతోంది.
    "ఎస్.......ఐ....నో...షీ ఈజ్ ఏ లవ్ లీ గర్ల్. అందుకే మాధురి అంటే మీ కిష్టం కదూ."
    "ఎస్ మిస్టర్ సుజన్. ఐ లైక్ మాధురి. ఐ లవ్ మాధురి. మాధురిని నేనెంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలీదు- మాధురి లేకపోతే .......ఈ పరిస్థితుల్లో నేనేమయ్యేవాడినో నాకు తెలీదు. మాధురి నా ప్రాణం. మాధురి నా సర్వస్వం. మాధురి ,,,,,,నేనెప్పుడూ ఊహించుకునే ఒక డ్రీమ్" ఎస్......మిస్టర్ సుజన్.......నా కళ్ళెదుట కనిపించే అద్భుతమైన డ్రీమ్......"
    విమల్ మనసులోని నిజమైన ఫీలింగ్ అది. అలా ఆ సమయంలో తను బయటపడ్డాడని విమల్ కి తెలీదు.
    అదే కావాలి సుజన్ మిత్రాకు. ఆ మాటలకు ----
    సుజన్ మిత్ర కళ్ళు విష సరస్సుల్లా తయారయ్యాయి.
    వెలుగుతున్న సెగరేట్ ను విసురుగా కింద పడేసాడు సుజన్ మిత్ర .
    గ్లాసులోని ద్రవాన్ని దానిమీద పోసాడు.
    అది భగ్గుమంది!
    "వండ్రపుల్ మిస్టర్ విమల్. అద్భుతంగా చెప్పారు. కానీ నేనేదో మీ గురించి విన్నాను. మీకు ఇదివరకే మారేజ్ అయిందని, భార్య , బాబు అమెరికాలో ఉన్నారని, మీరేమైనా డైవర్స్ తీసుకున్నారా?"
    సుజన్ మిత్ర ఎదుటివాళ్ళతో ఎలా ఆడుకుంటాడో , అన్నదానికి ఇది ఉదాహరణ మాత్రమే.
    అంతవరకూ తాగిన మత్తు సర్రున దిగిపోయింది. దాని స్థానంలో కోపం ఉవ్వెత్తున లేచింది.
    "దిసీజ్ ప్యూర్ లీ మై పర్సనల్. డోంట్ ఎంటర్ ఇన్ టూ మై పర్సనల్ లైఫ్" కోపంగా.
    తన సీట్లోంచి లేస్తూ అన్నాడు విమల్.
    "ఓ.కే. బాబా అలాగే మీరు కూడా ఓ విషయం గుర్తుంచుకోవాలి. డోంట్ ఎంటర్ ఇన్ టూ మాదురీస్ పర్సనల్ లైఫ్ అల్సొ ఎందుకంటె మాధురి నాకు కాబోయే భార్య" ఆ మాట ఇంకా పూర్తీ కాలేదు.
    "మాధురి యువర్ వైఫ్! ఐ డోంట్ బిలివ్. ఐ డోంట్ ఎక్సేప్ట్. " విమల్ తన చేతిలోని డ్రింక్ గ్లాసుని దబాలున కింద పడేసి లేస్తూ అన్నాడు.ప్రస్తుతం అతను ఏం చేస్తున్నాడో తెలీని స్థితిలో వున్నాడు.
    కోపంగా కుడికాలితో, టీపాయ్ ని తన్నాడు. అది వెళ్ళి గోడకు గుద్దుకుని భళ్ళుమని బద్దలై పోయింది.
    "మిస్టర్ విమల్" గట్టిగా అరిచాడు సుజన్ మిత్ర. గబుక్కున సుజన్ మిత్ర భుజాలు పట్టుకుని, అతని కళ్ళవేపు చూస్తూ-
    "మిస్టర్ సుజన్ . బిజినెస్ పనిమీదోచ్చావ్. బిజినెస్ పని చూసుకుని మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో -----మాధురి పేరుని మరిచిపో. లేకపోతే .......మర్చిపోయేటట్టుగా చేయాల్సి వస్తుంది .....గుర్తుంచుకో."
    విసురుగా తోసేస్తూ అన్నాడు విమల్.
    ఇద్దరూ  స్వింగ్ లోనే ఉన్నారు. ఆ విసురుకి సుజన్ మిత్ర సోఫాలోంచి పక్కకు పడిపోయాడు.
    "బాస్టర్డ్." పడిపోయిన సుజన్ మిత్ర పైకిలేచి ,  ముందుకు కదలబోతున్న విమల్ చేతుల్ని పట్టుకుని ఆపి------
    "దిసీజ్ కెనడా కోబ్రా, చచ్చిపోతావ్." ఇంకేదో అనబోయాడు.
    అప్పటికే విమల్ కుడిచెయ్యి పెళ్ళుమని సుజన్ మిత్ర చంపమీద తాకటంతో అతని కళ్ళు బైర్లు కమ్మాయి.
    గబగబా విమల్ అక్కడి నుంచి బయటికొచ్చి కారు స్టార్ట్ చేసాడు.   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS