Previous Page Next Page 
డాళింగ్ పేజి 33

 

    "మాధురిని తను కాకుండా , ఇంకెవరైనా కోరుకుంటే ......" తనలో తనే ఈ ప్రశ్నను చాలాసార్లు వేసుకున్నాడు సుజన్ మిత్ర.
    "ఆ వ్యక్తీ బతకడు......తను బతకనివ్వడు........" తనే జవాబు చెప్పుకున్నాడు.
    మర్నాడు విమల్ ని కలిసి మాధురి విషయం మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు సుజన్ మిత్ర.
    ఆ రోజంతా విమల్ గురించి చాలాసేపు ఆలోచించాడు.

                                              *    *    *    *

    ఇంకా పూర్తిగా తెలవారలేదు.
    ఫోన్ గణగణమని మోగడంతో మేలుకువొచ్చింది మాధురికి. గబుక్కున లేచి రిసీవరు అందుకుంది.
    "హలో.......మాధురీ హియర్......" అవతలి పక్క నుంచి డైరెక్టర్ గొంతు. పదినిమిషాల సేపు మాట్లాడారు.
    "విమల్ రాత్రి షూటింగ్ కి రాలేదు. ఒకే ఒక సాంగ్ బేలన్స్ ఉండిపోయింది. నీకు తెలుసు కదా.........రాత్రంతా అతని కోసం మనవాళ్ళు ట్రై చేసారు ......మీకోసం కూడా ట్రై చేసాం ఎక్కడుంటాడో నీకు తెలిస్తే చెప్పమ్మా. నేనీవేళ మరి ట్రై చేయదలుచుకోలేదు. నేనసలే తిక్క వెధవని. ఫైటింగ్ సీన్ లకి ఎలాగూ డూప్ ల్ని వాడుతున్నాం. ఈ సాంగుకి కూడా డూప్  పెట్టి తీసేస్తాను......" టక్కున ఫోన్ పెట్టేసాడాయన.
    రిసీవర్ని పెట్టేసి తల పట్టుకుని కూర్చుంది మాధురి.
    రాత్రి విమల్ షూటింగ్ వెళ్ళలేదు......అంటే ......ఏటేళ్లిపోయాడు."
    ఆ ప్రశ్నకు మాధురికి జవాబు దొరకలేదు. కాని విమల్ ఎందుకలా చేసాడన్నది మాత్రం అర్ధమైంది.


                                                  *    *    *    *

    సుజన్ మిత్ర జీవితాన్ని, చాలా సీరియస్ గా తీసుకుంటాడు. జీవితంలో జరిగే ప్రతి సంఘటనకీ విలువ, ఉపయోగం ఉన్నాయని భావిస్తాడతను.
    సాధారణంగా తను అనుకున్నది సాధించడానికి. అతను పాజిటివ్ గానే ప్రయత్నాలు ప్రారంభిస్తాడు.
    తనకది పాజిటివ్ గా దొరకదు అని, నిర్ణయించుకున్నవాడు విధంగా దాన్ని పొందాలో అన్ని దారులూ వెతుకుతారు.
    ఆ ఆసమయంలో అతనికి ఏ దారైనా ఒకటే! అలాంటి సమయంలో అతను ఏది చెయ్యడానికైనా సిద్దమే!
    మద్రాసులో, మరో రెండ్రోజులు, ఉండడానికి నిశ్చయించుకున్నాడంటే , విమల్ మాధురి ల మధ్యన ఎలాంటి సంబంధం ఉందొ, తెలుసుకోవడానికే!
    అది గాడమైన అనుబంధమైతే---
    ఏం చేయాలో అప్పుడే నిర్ణయించుకున్నాడు సుజన్ మిత్ర.
    సుజన్ మిత్ర రంగంలోకి దిగాడు.
    కేవలం, ఆరుగంటల కాలవ్యవధి.
    విమల్ గురించి , మాధురి గురించి పూర్తీ ఇన్ ఫర్ మేషన్ వచ్చేసింది. అందుకైనా ఖర్చు పదివేలు.
    "వాళ్ళది ఉత్తి ప్రేమో, గాడ ప్రేమో తెలీదు గానీ సార్. ఇద్దరు మూడు నాలుగేసి రోజులు మాయమై పోతుంటారు సార్. అలా ఎన్నిసార్లు మాయమైపోయి, ప్రొడ్యుసర్ల కి ఎంత నష్టాన్ని తెచ్చాడో సార్.
    "అలా మాయమైపోయి ఎక్కడికేళతారు?" సుజన్ మిత్ర ప్రశ్న వేసాడు.
    "ఇద్దరు యంగ్, బ్యూటీ పుల్. డబ్బున్న అడ, మగలు ఎక్కడ కెళ్ళినా, ఎందుకేళతారో మనకు తెల్సుకదా సార్"
    చివరి పాయింటు సుజన్ మిత్ర మీద బాగా పనిచేసింది.
    "నేను చెప్పానని ఎక్కడా చెప్పకండి సార్. పిల్లలు గలవాణ్ని కొత్త కరెన్సీ కాగితాల్ని కళ్ళ కద్దుకుని వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తీ విమల్ గెస్ట్ హౌస్ మేనేజర్ నరసింహం.
    వాళ్ళిద్దరి మధ్య శారీరక సంబంధాలు కూడా వున్నాయా? సుజన్ మిత్ర మనసు కుత కుత లాడిపోయింది. ఆరోజు ---
    విమల్ ని ఎలాగైనా కలవాలని నిశ్చయించుకున్నాడు సుజన్ మిత్ర. తన మనుషుల్ని పంపించాడు.
    లేడు - విమల్ లేడు - స్టూడియోలలో లేడు. గెస్ట్ హౌస్ లో లేడు ----ఎక్కడాలేడు.
    "ఎక్కడా లేడు సర్." వచ్చిన మనుషులు సుజన్ మిత్రతో చెప్పారు.
    "ఎక్కడా లేడన్నది కాదు అన్సర్. మీకు కన్పించలేదు అంతేనా .
    ఆలోచిస్తున్నాడు సుజన్ మిత్ర.
    మధురికి పోన్ చేసాడు.
    చాలాసేపు రింగయింది , ఎవరూ లిప్ట్ చెయ్యలేదు.
    అంటే .......
    ఉంటే మాధురి , విమల్ ఒకేచోట ఉండాలి.
    ఆ నిర్ణయానికొచ్చాడు సుజన్ మిత్ర.
    అప్పటికి సమయం మధ్యాహ్నం పన్నెండు గంటలైంది.
    సాయంత్రం ఆరుగంటల లోపు తను విమల్ ని పట్టుకోవాలి. నిర్ణయించుకున్నాడు సుజన్ మిత్ర.
    తనే స్వయంగా విమల్ గురించి ఫోన్ ద్వారా ఎంక్వయిరీ చెయ్యడం ప్రారంభించాడు.
    విమల్ అలవాట్లు, అభిమానులు, మిత్రులు, ప్రోడ్యుసర్లు, డైరెక్టర్లు అందరికీ ఫోన్లు వెళ్ళాయి.
    విమల్ గెస్ట్ హౌస్ దగ్గర, సిటీలోని బంగళా దగ్గర మనుషుల్ని పెట్టాడు.
    గంటలు గడుస్తున్నాయి.
    విమల్ జాడలేదు.
    "విమల్ బాగా డిప్రెషన్ లో వున్నప్పుడు బార్లలో కాలక్షేపం చేస్తాడు' లేకపోతే సాదా మనిషిలా రోడమీద తిరుగుతాడు , అనే ఇన్ ఫర్మేషన్ తెలియడంతో, ఫైవ్ స్టార్ హోటల్లో ని బార్లలో గాలింపు చర్యలు ప్రారంభమయ్యాయి.
    మద్రాసు రోడ్లమీద , విమల్ ని వెతుకుతూ , అయిదు కార్లు తిరుగుతున్నాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS