Previous Page Next Page 
బ్రతుకు బొంగరం పేజి 32


    "చంద్రిక....చంద్రిక..." కనుతెప్పాలను అతి కష్టం మీద పైకెత్తి ఆమెను చూశాడు.
    ఎవరో అపరిచిత తనను గుండెల కదుముకుంటూ , స్త్రీత్వం తో ఆవేశాన్ని తెప్పిస్తూ, నరాలను బిగింప చేస్తూ , పురుషత్వాన్ని రెచ్చగొడుతున్న ఎవరో వనిత!
    "ఎంతిస్తావ్?' వెకిలిగా నవ్వుతూ అడిగింది. అతని కర్ధం గాలేదు. బరువుగా ఆమెను చూశాడు.    
    ఆమె జేబులు తడమ సాగింది. ఒక్క పైసా కూడా ఆమెకు తగల్లేదు.
    "డబ్బుల్లేని బేరమా? ఛీ....' ఇంకా ఏదో అశ్లీలంగా బండబూతులు మరాఠీ లో తిడుతూ తలుపులు తీసి, అతను పిచ్చిగా పెనుగు లాడుతున్నా బయటకు తోసి, తుపుక్కున ఉమ్మేసి, దభాల్న తలుపులు వేసుకుంది.
    "అతను తెలిపోతున్నట్లుగా లేచాడు. కాలిపోతున్న శరీరంతో, కోరికతో వేగిపోతున్న శరీరంతో అతను కారులో కూర్చుని బర్రున పోనిచ్చాడు.
    గొందులన్నీ తిరిగి కారు రాజగోపాలం ఇంటి ముందు అలిసిపోయినట్లుగా ఆగింది.
    వెన్నెల లాగా ట్యూబ్ లైట్లు ఇంటి ముందు వెలుగుతున్నాయి. బయటి తలుపులు దగ్గిరగా వేసి ఉన్నాయి. అడుగులు తడబడుతుంటే నెట్టి లోనికి వెళ్ళసాగాడు.
    డ్రాయింగు రూం లో ఎవ్వరూ లేరు. లోని గదిలో ఎవరూ లేరు. ఇంకా లోపలికి నడవ సాగాడు.
    ఇంకా లోపల బెడ్ రూం లో ప్రియంవద పడుకొని ఉంది. సౌందర్యం నిద్రిస్తున్నట్లుగా ఆమె ఉంది. మత్తుగా నిద్రలో ఉన్న ఆమెను చూశాడు. అలిసిపోయి, అందంగా నిద్రిస్తున్న ఆమె వెంట్రుకలు దట్టంగా దిండు చుట్టూ పరచబడినట్లుగా ఉన్నాయి. ఇంద్రధనుస్సు లాంటి కనుబొమ్మలు. పొడుగ్గా కుంచెతో చిత్రించినట్లుగా కనురెప్పలు. నిద్రలో కొంచెం ఎగురుతున్న నాసికా పుటాలు. ఎర్రటి వణుకుతున్న పెదవులు. తొలగి తోలగనట్లుగా ఉన్న పమిట.
    రవిచంద్ర ఆ సౌందర్యాన్ని భరించలేకపోయాడు.
    ముఖానికి చేతులు అడ్డం పెట్టుకొని వెనక్కి తిరిగాదు. రెండుఅడుగులు వేసిన తరవాత ఎందుకనో వెనక్కి తిరగ బుద్ది అయింది. తను అశక్తుడయినట్లుగా, అన్నీ తన అధీనం తప్పినట్లుగా అనిపించి వెనక్కి తిరిగాడు.
    ప్రియంవద నిద్రిస్తున్నది.
    క్షణకాలం ఆమెను చూశాడు. తూలుతూ ఆమె దగ్గిరికి , మరింత దగ్గిరికి, మంచం దగ్గిరికి నడిచాడు.
    అలికిడికి ఆమె కొంచెం మెదిలింది.
    అతని మస్తిష్కం పనిచేయటం మానేసింది. వణుకుతూ ఆవేశంతో ఆమె పొడుగాటి కేశాలను సవరించాడు. నెమ్మదిగా వాటిని తన పెదిమల కానించు కున్నాడు.
    ఆమె కొంచెం కదిలింది.
    మోహం- అసలే మత్తుగా ఉన్న అతనికి మరింత మత్తును కల్పించింది. కామం చురకత్ట్టి లా అతణ్ణి కోయసాగింది. కోరికల పాము పడగ విప్పి అతణ్ణి కాటేసింది!
     ఆవేశంలో బరువుగా ఆమె పెదిమలకు తన పెదిమలు ఆనించాడు. సగం నిద్రలో సన్నగా నవ్వుతూ ఆమె రెండు చేతులనూ అతని కంఠనికి బిగుస్తూ , "వచ్చారా, ఇంత అలస్యమా?' అన్నది. మరుక్షణమే తనేన్నడూ ఎరగని ఏదో వింత వాసన తగిలినట్లయి గభాల్న కళ్ళు విప్పింది.
    సమస్త ప్రపంచము క్షణకాలం ఆమె కళ్ళ ముందర గిర్రున తిరిగింది.
    తనమీదికి  వంగుతున్న అతణ్ణి, విస్మయంతో , ఆశ్చర్యంతో, భయంతో, అసహ్యంతో, చూసింది.
    "రవీ!" అని బిగ్గరగా కేకేసింది. తనమీదికి మరింతగా వంగుతున్న అతణ్ణి దూరంగా నెట్టేయటానికి ప్రయత్నించింది.
    "రవీ, ఏమిటిది?"
    "ప్రియా........"
    "రవీ, తాగావా?"
    "ప్రియా......"
    "రవీ, నేను ప్రియను........."
    "నాకు తెలుసు."
    "తెలుసా రవీ....ప్రియంవదను నేను" ఏడుస్తున్న ఆమె.
    "నాకు తెలుసు , ప్రియా....నీవు నా ప్రియవు ."
    "ఛీ..ఛీ....రవిచంద్రా!'
    "రవిచంద్రవు కావూ? దుర్మార్గుడా! తాగి ఇంత సాహసించావా?"
    వదిలించుకోటానికి శతవిధాలా ప్రయత్నిస్తూ, అతణ్ణి గట్టిగా కొరుకుతూ, ఉద్రేకంతో, కోపంతో పగపట్టిన తాచులా ప్రియంవద!
    "నేను రవిని కాను. రాజగోపాలాన్ని....నేను ....నటన! నేను....రా....జ...గో....పా...లా...న్ని....ఈ ఇల్లు....ఈ సుఖము....నీవు.....ఆన్నీ నావే...."
    "ఛీ...."
    "ప్రియా ....నీవు నాకు కావాలి. ఈ సుఖం, ఈ ఆనందం, నాకు కావాలి..."
    "దుర్మార్గుడా...సిగ్గు లేదూ....నన్ను వదులు. నిన్ను తమ్ముడిలా చూసుకున్నాను. నీవు బాధపడుతుంటే నేను బాధపడ్డాను. నీవు అమాయకుడివి, మంచి వాడివను కున్నాను. ఇంత పతనమవుతావనీ, ఇంత అమానుషంగా, ఇంత నీచంగా ప్రవర్తిస్తానని...." ఏడుపుతో ..సిగ్గుతో ...జుగుప్సతో వణికిపోతున్నది ఆమె కంఠం.
    'ప్రియా...ప్రియా...." తన కౌగీలి లోకి ఆమెను బలవంతంగా తీసుకుంటున్న అతను.
    రక్కుతున్న ప్రియ.... మనిషి మంచితనం మీద, పవిత్రత మీద నమ్మకం సడలిన ప్రియ.....బిగ్గరగా ఏడుస్తూ అతణ్ణి తిడుతూ అరుస్తున్న ప్రియంవద.
    "రవిచంద్రా" బరువుగా ఎవరిదో గొంతు మోగింది ఆ గదిలో.
    చటుక్కున అటు చూసింది ప్రియ. సంతోషం , ఏడుపూ పెన వేసుకున్నాయి ఆమెను.
    "మీరోచ్చారా! నన్ను రక్షించండి. ఈ దుర్మార్గుడు ...." రాజగోపాలాన్ని తలుపు దగ్గిర చూసి సంతోషంతో ఏడుస్తున్న ఆమె.
    ఆ పిలుపు ఏదో లోకంలో ఉన్న రవిని గూడా ఈ లోకంలోకి పడేసింది.
    కండ్ల ముందు మసకలు కమ్ముతుంటే చూశాడు అటు వైపు. అతను....రాజగోపాలం.... ఏమీ అర్ధం కానట్లుగా అక్కడ రాజగోపాలం నిల్చోని ఉన్నాడు!
    లక్ష జలపాతాలు రవి మీదికి వదిలినట్ల యింది. మత్తు విరిగి నట్లయింది. ఆమెను వదిలి నెమ్మదిగా తల వంచుకొని, విసురుగా ఆ గది బయటికి ఉరికాడు.
    "ఏమండీ!" అమాంతం ఆమె రాజగోపాలాన్ని పెనవేసుకొని గుండెల్లో తల దూర్చింది.
    "ఊరుకో, ప్రియా!" అన్నాడు నెమ్మదిగా రాజగోపాలం.

                               21
    ప్రియంవద అలాగే రాజగోపాలం గుండెల మీద తల అన్చుకోని చాలాసేపు రోదించింది.
    తరవాత కళ్ళలో ఎర్రటి జీరలతో అతణ్ణి చూస్తూ ఆమె అన్నది:" "మీరు సమయానికి వచ్చి నా పవిత్రతను రక్షించారు."
    అతను చిరునవ్వుతో ఆమెను చూస్తూ, "ఇంత మాత్రానికే కళ్ళు వాచేలా ఎడుస్తావా? తప్పు కాదూ?" అన్నాడు.
    అర్ధం కానట్లు ఆమె విస్మయంతో అతణ్ణి చూసి, "ఇంతగా నా జీవితంలో ఎన్నడూ భయపడలేదు. ఆ దుర్మార్గుడు ఇంత అత్యాచారానికి ఒడి కడతాడని నా కలలో కూడా అనుకోలేదు" అంది. ఆమె రవి జ్ఞాపకం రాగానే కోపంతో వణికిపోసాగింది.
    "ఇన్నాళ్ళ నించి ఏదో బాధపడుతున్నట్లుగా అంతా నటన! సమయం కోసం పొంచి ఉన్నాడు. మనం అతని పట్ల చూపిన అభిమానం, ఆదరణ అన్ని మరిచి పోయాడు. కృతఘ్నుడు.!"
    "ప్రియా, అతన్ని గురించి అంత కఠినంగా మాట్లాడకు." రాజగోపాలం మాటలకు ఆమె చర్రున లేచింది.
    "ఇంకా మీకు అతని మీద అభిమానం ఉందా? మనం మంచివాడని, పసిపిల్లవాడి లాంటి వాడని ఆదరించి నందుకు బాగా బుద్ది చెప్పదు. ఛీ, మనుషుల మీద నమ్మకం లేకుండా చేశాడు."
    రాజగోపాలం బరువుగా మందహాసం చేసి తల పంకించాడు. ఆ తల పంకింపు అర్ధం ఆమెకు తెలియలేదు. అసలు అప్పుడామే తెలుసుకొనే స్థితిలో కూడా లేదు.
    సుడిగుండం లో చిక్కుకున్న ప్రాణికి అకస్మాత్తుగా ఒక ఆసరా దొరికితే ఎంత సంతోషం , ఎంత హాయి , ప్రమాదపు అనుభవం, కేవలం ఒక పీడా కలగా జ్ఞాపకాల్లో కలిసి పోతున్నందుకు ఎంత ఆనందం కలుగుతుందో , అంత సంతోషం, అంత హాయి, అంత ఆనందం ఆ క్షణాన ఆమె పొందింది.
    ఎదురుగా హిమాలయా పర్వతం లా రాజగోపాలం ఆమెకు గోచరించాడు. కన్నీటి ప్రవాహం అతణ్ణి తడిపెస్తుండగా ఆమె అతనిలో లీనమైంది.
    
                           *    *    *    *
    బంగళా కు వచ్చి రవిచంద్ర కుప్పలా కూలిపోయాడు. అది చేతనావస్థ కాదు. అచేతనా వస్థ కాదు! ఇప్పుడిప్పుడే అతను తెలివిలోకి వస్తున్నాడు. లీలగా ఏవో జ్ఞాపకాలు అతనిలో, ఆ అవస్తలో మెదులుతున్నాయి. ఎవరో తన రూపంలో, ఏదో భయంకరమైన పనికి తలపడినట్లుగా అనుభూతి! తన సర్వావయవాలను సిగ్గుతో కుంచించుకు పోయేటట్లు చేస్తున్న ఆ జ్ఞాపకపు గాయం!
    "ఏమిటది? ఎవరు తను?
    ఆ చీకట్లో పక్క మీద భయంకరంగా పోర్లాడాడు. గుండెల్లో మంట. మెదడులోని రక్త నాళాలు చిట్లి నట్లుగా బాధ. పదేపదే జ్ఞప్తికి వచ్చే ఆ భయంకరసన్నివేశం తాలుకూ నీడలు!
    "భగవాన్!' మొదటిసారి అనుకున్నాడు. 'భగవాన్! దయామయా! నాకేమిటి శిక్ష?' పదేపదే ఆవేదన రూపంలో హృదిలో ఆ ప్రశ్న ధ్వనించింది.
    ఏం చేశాడు తను?    
    తను....తను ప్రియంవద పవిత్రత ను భగ్న పరచ ప్రయత్నించాడు!
    తనలోని జవాబుకు ఉలిక్కిపడ్డాడు; వణికిపోయాడు; కున్గిపోయాడు; పాలిపోయాడు; నిశ్చేష్టుడయ్యాడు.
    ఆ పని తను చేశాడా? మంచితనాన్ని సర్వదా కాపాడుకోవాలని ప్రయత్నించిన రవిచంద్ర చేశాడా?
    అవును , తను చేశాడు. తనలోని రాక్షసత్వం తో బాటు ఇన్నాళ్ళ నించి మరుగున పడ్డ కాముకత్వం ఆ పని చేసింది. అని ఆ భయంకర కృత్యం తనద్వారా చేయించాయి.
    అతను మెల్లిగా తల వంచుకున్నాడు! కాళ్ళ కింద భూమీ బద్దలయి సాపీగా మారిన తనను పాతాళ లోకం తనలో ఇముడ్చుకుంటుందేమోనని ఎదురు చూశాడు కాని అది జరగలేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS