Previous Page Next Page 
డాళింగ్ పేజి 31

 

    "కంగ్రాట్స్ " సంతోషాన్ని వ్యక్తం చేస్తూ అన్నాడు అనుపమ్ ఖేర్.
    సుజన్ మిత్ర మాటలకు అవాక్కయిపోయింది మాధురి.
    అలాంటి అభిప్రాయం సుజన్ మిత్ర మనసులో ఉందని కూడా తెలీదు మాధురికి.
    అప్పుడెప్పుడో , చిన్నప్పుడు పెద్ద వాళ్ళకు ఊసుపోక అనుకున్న మాటల్ని పట్టుకుని, ఆ బంధాన్ని ఏర్పరచుకోవాలనుకుంటున్నాడా? కాని తనకెప్పుడూ అలాంటి అభిప్రాయం కలగలేదు. ఆ అభిప్రాయంతో నేనా తనను దగ్గరకు తీసుకుంది. నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. గాల్లోకి లేసింది! ఆమె కెందుకో అసహనంగా అనిపించింది."
    "మా మధూ కోసమే ఇన్నాళ్ళూ ఆగాను" అనుపమ్ తో ఏదేదో హుషారుగా చెప్పుకుపోతున్నాడు సుజన్ మిత్ర.
    "ఏం మధూ." మధ్యలో ఏదో అని అడిగాడు సుజన్ మిత్ర. ఆ మాటకు ఎలా రియాక్ట్ అవాలో అర్ధం కాలేదు మాధురికి.
    పేలవంగా ఓ నవ్వు నవ్వింది.
    ఆ పేలవానికి అర్ధం తెలుసుకునే మూడ్ లో లేడు సుజన్ మిత్ర.
    "చిన్నప్పటి దోస్తీ మాది, రక్తసంబంధం మాది. నేనంటే మా మధుకీ ఎంతిష్టమో తెలుసా."
    చెప్పుకు పోతున్నాడు సుజన్ మిత్ర.
    మాధురి చూపులు ఒక్కసారి గేటు వేపు మళ్ళాయి.
    సిల్వర్ కలర్ మారుతి ఒన్ దౌజేండ్.
    ఒక్కసారిగా మాధురి ముఖం వికసించింది.
    "మిత్రా, నీ పర్మిషన్ లేకుండా , ఓ ఫ్రెండ్ ని ఇన్ వైయిట్ చేసాను. విమల్ అని ఫేమస్ సిని ఆర్టిస్ట్ పరిచయం చేస్తాను .......రా" అంది సంతోషంగా.
    "ఎక్యుజ్ మీ" అనుపమ ఖేర్ తో చెప్పి, మాధురి వెనక నడిచాడు సుజన్ మిత్ర.
    కార్లోంచి దిగిన విమల్ అటూ ఇటూ చూస్తున్నాడు.
    లాన్ లోని చాలామంది లేడిస్ కళ్ళు "విమల్" మీద పడ్డాయి.
    హీరో విమల్....." కొంత మంది ఎక్సయిటింగ్ గా అనడం విమల్ చెవుల్లో కెళ్ళింది.
    ఓ అరడజను మంది విమల్ వేపు పరుగు పరుగున వెళ్ళారు.
    "హీరో మిస్టర్ విమల్ హౌ ఆర్యు....." ఓ కాలేజీ అమ్మాయి చాలా పరిచయం ఉన్న అమ్మాయిలా పలకరించింది.
    "అటో గ్రాఫ్ ప్లీజ్........"అని తన అందమైన కుడి అరచేతిని చూపించింది.
    మిగతా అమ్మాయిలు అతన్ని ఆరాధనగా చూస్తూ నిలబడ్డారు.
    "పెన్ను లేదు." పెన్ను కోసం జేబు వెతుకుతూ అన్నాడు విమల్.
    "పెన్నెందుకు ....మీ పెదాలున్నాయిగా....." కవ్విస్తూ అందా అమ్మాయి.
    "మీ ఇంటికి ఫోన్ ఉందా" అడిగాడు విమల్.
    అలా విమల్ ఎందుకు అడుగుతున్నాడో అర్ధం కాలేదు ఆ అమ్మాయికి.
    "ఓ ఉంది" అంటూ ఫోన్ నెంబర్ కూడా గబగబా చెప్పేసింది ఆ అమ్మాయి.
    "నీ పేరేం పేరు" మళ్ళీ అడిగాడు. అందమైన ఆ అమ్మాయి ముఖం వేపు చూస్తూ.
    "జ్వాలన....."
    అయితే రేపు మీ ఇంటికి ఫోన్ చేస్తాను . మీ డాడీకి చెప్తాను.....మీ అమ్మాయికి ఓ రెండు మగ పెదాల్ని కొనివ్వండని .......సరేనా"
    ఆ మాటకు భావం అర్ధమై జ్వలన సిగ్గుపడింది. హీరో విమల్ తనతో మాట్లాడినందుకు గర్వంగాను, ఆనందంగాను చుట్టూ ఫ్రెండ్స్ వేపు చూసింది.
    "ఆ పెదాలు , మీలాంటి హీరో పెదాలైతే " ఆ మాటలు జ్వలన నోటి నుంచి ఇంకా బయటకు రాలేదు. ఇంతలో ------
    అక్కడ కొచ్చింది మాధురి.
    "హలో . విమల్ ఇంత లేటా."
    అంతవరకూ ఆ అమ్మాయిలూ మాధురిని , సినిమా యాక్టర్ మాధురి అని గుర్తుపట్టలేదు. దానిక్కారణం మాధురి మేకప్ లో లేకపోవడమే.
    "మాధురి .......మాధురి "ఆ అమ్మాయిల నోటివెంట ఒకేసారి ఆ మాట!
    "మీ హిట్ ఫెయిర్ సినిమా ముళ్ళ గులాబీ  పదిసార్లు చూసాను ఐయామ్ యువర్ ఫెన్" మాధురి దగ్గరగా ఓ అమ్మాయోచ్చి అంది ఎక్సయిటింగ్ గా,
    "థాంక్యూ " చెప్పి విమల్ వేపు తిరిగి ---
    హి ఈజ్ మిస్టర్ సుజన్ మిత్రా.........అని మిత్రాని పరిచయం చేసింది మాధురి.
    'ఆయామ్ విమల్ "మిత్రా తో కరచాలనం చేసాడు విమల్.
    హార్టీలీ వెల్ కమ్ టూ యూ.......మిస్టర్ విమల్. కమాన్. రండి మీ చుట్టూ ఫాన్స్ మూగక ముందే మనం ఇక్కడ నుంచి పారిపోవడం మంచిది. అన్నాడు సుజన్ మిత్ర హడావుడి పడిపోతూ.
    ఆ లాన్ లోంచి లోనకెళ్ళారు ముగ్గురూ.
    తన గురించి చెప్పుకొచ్చాడు సుజన్ మిత్ర.
    వి. ఐ.పి. ల బార్ రూమ్ లోకి తీసుకొచ్చాడు సుజన్ మిత్ర విమల్ ని. ఆ బార్ అందంగా ఉంది. చెప్పేవరకూ అది బార్ రూమ్ అని ఎవరికీ తెలియదు. దానిక్కారణం బయట నాజూకైన డోర్ పై "సిట్టింగ్ రూమ్ " అని ప్లాస్టిక్ లెటర్స్ ఉన్నాయి.
    లోన ప్రశాంతంగా చల్లగా ఉంది.
    తెల్లటి డ్రస్సులో బేరర్స్ వినయంగా సర్వ్ చేస్తున్నారు.
    ఓ మూల కూర్చున్నారు ముగ్గురూ.
    బేరార్ వచ్చి . మూడు గ్లాసుల్ని పెట్టి వెళ్ళిపోయాడు.
    "షాంపైన్ .......తీసుకోండి......." ఒక గ్లాసుని విమల్ కి అందిస్తూన్నాడు సుజన్ మిత్ర. తన గ్లాసుని తీసుకున్నాడు విమల్.
    "నీక్కూడా చెప్పాలా........" తన గ్లాసుని తీసుకుంటూ అన్నాడు సుజన్ మిత్ర,
    "నో థాంక్స్......" అంది మాధురి స్థిరంగా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS