మాధురి చేతిని పట్టుకుని లాన్ లోకి తీసికోచ్చాడు సుజన్ మిత్ర.
"హి ఈజ్ మిస్టర్ దిలీప్ టెక్స్ టైల్స్ బిజినెస్ మాన్......షి ఈజ్ మిసెస్ దిలీప్......అనుపమ్ చైర్మన్ .....సదరన్ ఎక్స్ ప్రెస్ న్యూస్ పేపర్స్ తులసీ రామ్ ........టాటా గ్రూప్ ....."వరుసగా అందర్నీ పరిచయం చేస్తున్నాడు సుజన్ మిత్ర.
అందమైన సుజన్ మిత్ర పక్కన, మరీ అందమైన మాధురీ ..........అక్కడున్న వాళ్ళలో అతి తక్కువ మందికి మాత్రమే మాధురి సినిమా నటిగా తెల్సు!
లాన్ లో పరిచయాలయాక-
"కమాన్ మధూ కెనడా నుంచి నాతొ పాటు వచ్చిన ప్రెండ్స్ కాన్ఫరెన్స్ హాల్లో వున్నారు. పరిచయం చేస్తాను రా" తొందర తొందరగా కాన్ఫరెన్స్ హాల్లోకి కాల్లుపోయాడు.
అక్కడో అరడజను మంది ఫారినర్స్ , ఓ ఐదుగురు ఇండియన్స్ ఉన్నారు. లోనికొచ్చిన సుజన్ మిత్ర పక్కనున్న మాధురి వేపే అందరి కళ్ళు ఉన్నాయి.
"సీ" మిస్టర్ లారెన్స్ ఐ టోల్డ్ యూ ఎబౌట్ ఒన్ ఎన్ చాటింగ్ యాంగ్ లేడీ ..షి ఈజ్ .....మాధురి మీట్ మాధురీ "పళ్ళ నిండా నవ్వుతో లారెన్స్ లేచి మాదురితో కరచాలనం చేసాడు.
ఆ పక్కనున్న స్నేహితుల కళ్ళు మాధురి అందాన్ని ఆబగా కొలుస్తున్నాయి.
"వాటే బ్యూటీ పుల్ లేడీ" ఎవరో నెమ్మదిగా కామెంట్ చెయ్యడం మాధురికి విన్పించింది. ఆ కాంప్లిమెంట్ విని మనసులో నవ్వుకుంది.
ఆ స్నేహితుల్లో ఒకరు తన చేతిలోని వైన్ గ్లాసుని మాధురికి ఆఫర్ చేశాడు.
"నో థాంక్స్...." అంది మధురి మృదువుగా . ఆ కెనడియన్ భుజాలెగరేసి నవ్వేశాడు.
ఓ పావుగంట గడిచింది.
సుజన్ మిత్ర , మాధురి ఎదురుగా కూర్చున్నారు. మాధురి నెమ్మదిగా కూల్ డ్రింక్ సిప్ చేస్తోంది.
ఆ ఎర్రటి పెదాల వేపు చూస్తున్నాడు సుజన్ మిత్ర.
"నిజంగా నువ్వు రావనుకున్నాను సుమా ఎనిహౌ నువ్వు నన్ను మరిచి పోనందుకు చాలా ఆనందంగా ఉంది. ఆయామ్ వెరీ వెరీ లక్కీ అండ్ వెరీ వెరీ హీపీ నాట్ ఓన్లీ హేపీ హెపీయస్ట్ ఫేరో బికాజ్ -------"
మిగతా మాట చెప్పలేదు సుజన్ మిత్ర.
మాధురి అరచేతిని తన చేతిలోకి తీసుకుని నొక్కి "ఐ లవ్ యూ మధూ" అన్నాడు హస్కిగా.
మాధురి నవ్వింది మృదువుగా.
"ఏం ఎందుకలా ఒక్కసారిగా నవ్వావ్." చిరుకోపంతో అడిగాడు సుజన్ మిత్ర.
"ఏం ...లేదు. నేనిక్కడికి వచ్చిందగ్గర్నింఛి ఐ లైక్ యూ పదం ఎన్నిసార్ల న్నావో తెలుసా అందుకే."
"అది నా ఊతపదం కాదు కనిపించిన ప్రతి అడపిల్లతో ఇదే మాట అంటావనుకున్నావా!" సుజన్ మిత్ర జోగ్గా అన్నాడు.
ఆ జొక్కి తను కూడా నవ్వి.
"ఏమో నాకేం తెలీదు కదా."
"హలో......"దూరం నుంచి ఎవరో పెద్ద్డగా విష్ చేసుకుంటూ ఇక్కడకు రావడంతో , సుజన్ మిత్ర లేచి ముందు కెళ్ళాడు. వాళ్ళిద్దరూ పలకరిపులయ్యాక ఏవో మాటల్లో పడ్డారు."
-----మాధురి సడన్ గా చేతి గడియారం వేపు చూసింది.
ఆరు నలభై అయిదు నిమిషాలైంది.
విమల్ -----
వస్తానన్నాడే. ఇంకా ఎందుకోసం రాలేదు. ఆలోచిస్తూ , తన సీట్లోంచి లేచి లాన్ లో కొచ్చింది. లాన్ లో ఓ పక్కన కూర్చుంది ఏకాంతంగా .
అయిదు నిమిషాలు.
పది నిమిషాలు ......పావుగంట గడిచింది.
మాధురి చూపులు "మెయిన్ గెట్ ' వేపే వున్నాయి.
విమల్ మరిచిపోయాడా! ఫోన్ చేస్తే .....ఆ ఆలోచన రావడంతో లేచి నిలబడింది మాధురి.
హాల్లోకి వెళ్ళబోతున్న మాధురి దగ్గరకు ఎవర్నో తీసుకొచ్చాడు సుజన్ మిత్ర.
"హలో , మధూ హి ఈజ్ అనుపమ్ ఖేర్. హిందీలో పెద్ద సిన్మా స్టార్.
"హలో, విష్ చేసింది మాధురి.
"మీ సినిమాలు నేను చూడలేదు." నిర్మొహమాటంగా చెప్పాడు అనుపమ్ ఖేర్,
నవ్వేసింది మాధురి.
"మీ దక్షిణాది హీరోయిన్లు మా నార్త్ ని పరిపాలిస్తున్నారు. అలాగైతే మీరు కూడా అతి త్వరలో బొంబాయి రావడం తప్పదన్న మాట.
నవ్వుతూ అన్నాడు ఇంగ్లీషులో అనుపమ్ ఖేర్.
"అఫరోస్తే వదులుకోకండి బొంబాయి ఎప్పుడొచ్చినా , ఫోన్ చెయ్యడం మరవకండి" మళ్ళీ అన్నాడతను.
"భలేటోడివయ్యా , అనుపమ్ , మాధురి ఎవరనుకున్నావ్. సిన్మా ఎక్టరే అనుకుంటున్నావా?" సూటిగా మాధురి కళ్ళవేపు చూస్తూ అన్నాడు సుజన్ మిత్ర.
అలాగ ఎందుకు చూసాడో అర్ధం కాలేదు మాధురికి.
"మరి?"
నవ్వాడు సుజన్ మిత్ర. నవ్వి, మాధురి కుడిచేతిని తన గుండె మీద వేసుకుని -
"చెప్పెయ్యానా .......మధూ " అని "సి మై డియరెస్టు ఫ్రెండ్ షి ఈజ్ మై ఊడ్ బీ ఇది సీక్రెట్ . పెళ్ళి కార్డు లిచ్చేవరకూ ఎవరితోనూ చెప్పకూడదనుకున్నాను. నువ్వు మళ్ళీ ఎప్పుడు కలుస్తావో......అందుకే ముందుగా నీకు చెప్పేశాను" అన్నాడు సుజన్ మిత్ర.
