Previous Page Next Page 
వసుంధర కధలు -9 పేజి 30

 

    ఇద్దరూ జ్యోతిష్కుడి కోసం ఇల్లంతా వెదికారు. పనిలో పనిగా యింట్లో ఖరీదయిన వస్తువులే మైనా పోయాయా అన్నది కూడా చూశారు. శాంతాదేవి ఒంటి మీది నగలతో సహా అన్నీ భద్రంగా ఉన్నాయి.
    "మనం మూడు గంటలసేపు మైకంలో పడిపోయామన్నమాట. ఈ మూడు గంటల్లోనూ జ్యోతిష్కుడు ఏం చేశాడో?" అన్నాడు సోమయాజులు. అయన మాటలు పూర్తీ కాకుండానే ఆ ఇంట్లో గంగులు ప్రవేశించాడు.
    గంగుల్ని చూస్తూనే సోమయాజులు ముఖం వికసించింది. "ఏం రా-- ఏం జరిగింది?' అనడిగాడు.
    "పన్నెండు పావుకీ- పన్నెండున్నరకీ మధ్య మనింటి ముందో టాక్సీ అగిందండి. అందులోంచి ఓ సన్యాసి దిగాడండీ. తిన్నగా ఇంట్లోకి వెళ్ళి రెండు బరువైన పెట్టేలతో వచ్చాడండీ. అవి టాక్సీలో వేసుకుని బయల్దేరితే మోటారు సైకిల్ మీద నేను వెంటాడేనండి. ఓ రెండు గంటల సేపు నన్నూరంతా తిప్పి -- చివరకు టాక్సీ ఓ మర్రి చెట్టు దగ్గర అగిందండి. అక్కడ ఆ సన్యాసి బరువైన రెండు పెట్టేల్నీ చెట్టు వెనకాల దాచి వెళ్ళి పోయాడండీ. నేను వెళ్ళి ఆ పెట్టెను చూతును గదా -- ఓ పట్టాన మూట లూడి రాలేదండీ. అతి కష్టం మీద తెరిచి చూస్తె అందులో కంకర రాళ్ళు తప్ప ఏమీ లేదండి....' అన్నాడు గంగులు.
    "ఏడిసినట్లుంది . అదంతా మనని దోవ మళ్ళించడానికి ఆడిన నాటకమన్న మాట. అయితే జ్యోతిష్కుడు పెద్ద పధకం మీదనే వచ్చాడు. మనకంటే తెలివి గా మసిలాడు. బంగారాన్ని దక్కించుకునే ఉంటాడు..." అన్నాడు సోమయాజులు బాధగా..
    "నేను వదిలి పెట్టలేదండీ. ఆ సన్యాసిని కలుసుకున్నానండి. ఎవరో కుర్రాడు కోరిన ప్రకారం చేశాట్టండి. ఆ తర్వాత నెంబర్ని బట్టి టాక్సీ ని కూడా పట్టుకున్నానండి. అయితే అందులో డ్రైవర్ వేరేగా ఉన్నాడు. ఓ వంద రూపాయలు తీసుకుని తన టాక్సీని కాసేపు పొరుగూరతనికిచ్చెడట ...." అన్నాడు గంగులు.
    "సరేలే -- ఇందులో నువ్వు చేయగల్గింది చేశావ్ - ఇంక నువ్వు వెళ్ళొచ్చు." అన్నాడు సోమయాజులు.
    గంగులు వెళ్లి పోయేసరికి "అన్నట్లు మనింట్లో పనిమనిషేమయింది? దానికి చెప్పాంగదా - ఇల్లంతా ఓ కంట కనిపెడుతూండమని ...." అన్నాడాయన భార్యతో.
    "అదేనండీ .....నాకూ చిత్రంగా ఉంది. అదేమయిందో కనపట్టం లేదు....' అంది శాంతాదేవి.
    "జ్యోతిష్కుడి వాటం చూస్తె గుండెలు తీసిన బంటులాగున్నాడు. వాడు దాన్ని కూడా కనిపెట్టి ఏమైనా చేయలేదు గదా అని భయంగా వుంది నాకు...." సోమయాజులు.
    "వాదంతటివాడే కానీ -- దాసీ దాని గురించి ఎంతని ఆలోచిస్తాం?" అంది శాంతాదేవి.
    "ఒకవేళ వాడు దాన్ని చంపేసి ఎక్కడైనా పారేస్తే ఆ శవం పోలీసుల కు దొరికితే -- శవాన్ని పోలీసులు మన పనిమనిషి దని గుర్తిస్తే మనం కూడా కేసులో ఇరుక్కుంటాం...."
    శాంతాదేవి మొగుడు వంక చిత్రంగా చూసి --  "ఏమండీ -- జ్యోతిష్కుడు నెలల తరబడి బంగారం గురించి చెబుతూంటే దాన్ని గురించే పట్టించుకోలేదు మీరు -- ఇప్పుడు దీని కెంత దూరం ఆలోచించారండీ .... " అంది.
    "బాగుందే -- అది కల్పన. ఇది వాస్తవం" అన్నాడు సోమయాజులు.

                                                           10
    కారు ఓ ఇంటి ముందాపాడు పీటర్. జ్యోతిష్కుడు అతను కలిసి - బ్రీఫ్ కేసు అన్నింట్లో జేరవేశారు. తర్వాత పీటర్ తలుపులు వేశాడు.
    "మిస్టర్ నీ పేరేమిటో తెలియదు కానీ నీ సాయం చాలా కావాలి నాకు. ముందుగా రమణయ్య ను నా దగ్గరకు తీసుకు రావాలి నువ్వు. అతని సాయంతో ఈ ఇంటి గదిలో  రహస్యపుటరలు చేయించాలి."
    "అది నావల్ల కాదు. మిత్రద్రోహం చేయలేను...." అన్నాడు జ్యోతిష్కుడు.
    "నాకు నీ మిత్రుణ్ణి సాయపడమనడం ద్రోహం అవుతుందా?"
    "ఒక విధంగా ద్రోహమే! ఒకసారి రహస్యపుటరలు చేసినందుకే గదా రమణయ్య ను సత్యం బాబు అంతం చేయాలను కున్నాడు. మీ పని పూర్తయ్యాక మీరూ అలా అనుకుంటే ....? అనుకుంటే ఏమిటి -- అలాగే అనుకుంటాను !'
    "అనవసరపుటనుమానాలు పెట్టుకోవడం వల్ల, మిత్రద్రోహం సంగతటుంచి ముందు నీ ప్రాణాలు కూడా పోవచ్చును...." అన్నాడు పీటర్.
    "నీవు -- ఆలోచించుకో-- ఈ ఇంట్లోంచి నువ్వే విధంగానూ బయటపడలేవు. అర్ధగంట టైమిస్తున్నాను. ఆలోచించుకుని నీ నిర్ణయం చెప్పు. ఆ కాసేపూ నేను బయట తిరిగి వస్తాను...." అన్నాడు పీటర్.
    "వ్యవధి అనవసరం. ఒకవేళ అంగీకరించిన పక్షంలో నన్ను వదిలి పెడతావా?"
    "వదిలిపెట్టను. నువ్వా రమణయ్య చిరునామా ఇవ్వాలి. ఇచ్చిన చిరునామా తప్పయితే అది తెలిసిన ముప్పై నిముషాల కంటే బ్రతకవు నువ్వు...."
    "సరైన దైతే ఎంతకాలం బ్రతుకుతాను?"
    "జ్యోతిష్కుడివి కదా -- అది నీకే తెలియాలి...."
    "నా ఆయుర్దాయం నీకంటే ఎక్కువే వుంది" అంటూ జ్యోతిష్కుడు హటాత్తుగా పీటర్ మీద కలబడ్డాడు. పీటర్ ఇది ఊహించినట్లు లేదు. జ్యోతిష్కుడు మాత్రం కలయబడడం లో పీటర్ మెడ మీద తమాషాగా ఒక నరం తొక్కాడు. క్షణాల మీద పీటర్ కు స్పృహ తప్పింది.
    జ్యోతిష్కుడి వేషంలో నున్న  నరసింహులు పీటర్ ని పక్క గదిలోకి లాగి ఓ మూలగా పడుకో బెట్టాడు. తర్వాత అతను నెమ్మదిగా అ ఇంట్లోంచి బయటకు వచ్చి దారిని పోతున్న రిక్షా అతన్ని పిలిచి బెరమాడాడు.
    బంగారమున్న మూడు బ్రీప్ కేసులూ రిక్షాలో వేయించాడు. రిక్షా శరవేగంతో వెళ్ళిపోయింది.
    నరసింహులు వెళ్ళిన తర్వాత గంటకు పీటర్ కు స్పృహ వచ్చింది. జరిగినదంతా స్ప్రురణకు  వచ్చింది. పీటర్ కారు ఎక్కాడు. అతని కారు శరవేగంతో ఓ భవనం ముందు ఆగింది. పీటర్ కారు దిగాడు. భవనంలో అడుగు పెట్టాడు. గుమ్మం లోనే ఒక అందమైన యువతి అతన్ని చూసి కన్ను గీటింది.
    "బాస్ ఉన్నారా?" అడిగాడు పీటర్.
    "ఉన్నారు కానీ కొత్త పిట్ట వచ్చింది. కాస్త ఖుషీలో ఉన్నారు..."
    "పీటర్ వచ్చాడని చెప్పు. అర్జంటంతున్నాడని చెప్పు...." అన్నాడు పీటర్.
    అ యువతి మెట్లెక్కి మేడమీదకు వెళ్ళింది.
    మరో పది నిముషాల్లో ఒకతను మెట్లు దిగి వచ్చాడు.
    మనిషి తెల్లగా పుష్టిగా వున్నాడు. వయసు ముప్పైకి నలభై కి మధ్యలో ఉంటుంది. ముఖంలో చిరాకు కాస్త కనబడుతోంది -- "ఏమిటి వేళకాని వేళ వచ్చావ్?' అన్నాడు.
    "పదిహేను లక్షలు విలువ చేసే ముప్పై బంగారు అచ్చులు చేతికి చిక్కినట్లే చిక్కి మాయమయ్యాయి. మీకోపిక ఉందంటే అంతా వివరంగా చెబుతాను...." అన్నాడు పీటర్.
    అతని చిరాకు పూర్తిగా తొలగి పోయినట్లుంది... "చెప్పు !" అన్నాడు ఆత్రుతగా.
    పీటర్ అంతా వివరంగా చెప్పాక -- "మా నాన్నగారు దాచిన బంగారం ఇన్నాళ్ళకు బయట పడిందన్న మాట. నిన్ను మెచ్చుకోక తప్పదు....' అన్నాడతను.
    "అవును ముత్యం బాబూ" అన్నాడు పీటర్ - "కానీ ఏం లాభం?"
    "అలా నిరుత్సాహ పడకు. ఒకసారి చేజిక్కాక జ్యోతిష్కుడు ఎక్కడికి పోతాడు? మనవాళ్ళని ఊరంతా వదిలి పెడదాం వాడి ఆనవాళ్ళు చెప్పి వేటకుక్కల్లా ఊరంతా గాలించమందాం. సన్యాసీ లాంటి వాడెవడు కనపడ్డా పట్టుకుని లాక్కుని రామ్మందాం...." అన్నాడు ముత్యం బాబు.
    "తండ్రిని మించిన తెలివి మీది....." అన్నాడు పీటర్ మెచ్చుకుంటూ.
    ముత్యం బాబు హటాత్తుగా - "ఒకవేళ జ్యోతుష్కుడిది మారు వేషమేమో!" అన్నాడు.
    'అదే నిజమైతే ఇక ఈ జన్మకు మనం వాణ్ణి పట్టలేము" అన్నాడు పీటర్ నీరుకరుతూ.....


                       -----: అయిపొయింది :-----


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS