"ఇంక సోమయాజులు గారికి స్పృహ వచ్చే మార్గం చూడాలి....." అనుకున్నాడు జ్యోరిష్కుడు.
'అబ్బ - ఇంత బంగారం ఒక్క సరిగా చూస్తుంటే కళ్ళు చేదిరిపోతున్నాయి...."
అన్నమాటలు విని కంగారుగా వెనక్కు తిరిగాడు జ్యోతిష్కుడు. అక్కడ కనబడ్డ మనిషిని చూసి అతని పై ప్రాణాలు పైనే పోయాయి. -- "పీటర్!" అన్నాడతను అప్రయత్నంగా.
"నాపేరు తెలుసా నీకు ....' ఆశ్చర్యంగా అన్నాడు పీటర్.
"నిన్నేరగని వాళ్లెవరైనా ఉంటారా?" ఈ ఊళ్ళో!"
పీటర్ నవ్వాడు-- "తెలుసు కాబట్టి నాదారికి అడ్డు రాకు మరి ...." అన్నాడు.
"ఏమిటి నీ దారి?' --- అన్నాడు జ్యోతిష్కుడు.
"ఈ డబ్బు నాది. దీని గురించి నేను అనరాని మాటలూ, పడరాని పాట్లు పడ్డాను. ఇప్పటి దీని విలువ కనీసం పాతిక లక్షలుంటుంది...." అన్నాడు పీటర్.
"మరీ అంత అత్యాశ కు పోకు. నా అంచనా ప్రకారం దీని విలువ పది హీను లక్షలకు మించక పోవచ్చు...." అన్నాడు జ్యోతిష్కుడు. కానీ అతని మనసులో మాత్రం ఈ పీటర్ దీని విలువ ఇంత ఖచ్చితంగా ఎలా తెలుసునా అని ఆశ్చర్యంగా ఉంది.
పీటర్ త్వరగా ఆ అచ్చు;ల్ని లేక్కవేశాడు. "ఇంకో ఇరవై వుండాలి. ఏం చేశావ్?"
జ్యోతిష్కుడు అదోలా పీటర్ వంక చూసి "ఇంకో ఉన్నాయేమో -- నేనింకా ఈ ఒక్క గదినే చూశాను. దీన్నానుకుని అటు ఇటూ గదులున్నాయి..." అన్నాడు.
'అది సరే ౦-- ఈ బంగారాన్ని నువ్వెలా కనుక్కున్నావ్?" అన్నాడు పీటర్.
"నేను జ్యోతిష్కుడిని. ఎక్కడ బంగారమున్నా నాకు తెలుస్తుంది...."
పేటర్ జేబులోంచి రివాల్వర్ తీశాడు -- "నువ్వు మాట్లాడుతున్నది పీటర్ తోనని గుర్తుంచుకో. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నిజం చెప్పు...."
జ్యోతిష్కుడు క్షణం మాత్రం తటపటాయించాడు. "నన్ను ప్రాణాలతో వదిలి పెడతానంటే నిజం చెప్పేస్తాను...." అన్నాడు.
"చెప్పు!"
"సత్యంబాబు గారు తెలుసు కదా నీకు...."
"ఊ"
'అయన ఈ మూడు గదుల్ని ప్రత్యేకంగా తయారు చేయించారు. ఒక వడ్రంగి మేస్త్రీ చేత....' అంటూ నరసింహులి కధంతా వివరంగా చెప్పాడు.
"ఎవడా వడ్రంగి మేస్త్రీ ? వాడి పేరు నరసింహులు కాదు గదా...."
"కాదు, రమణయ్య...." అన్నాడు జ్యోతిష్కుడు. "రమణయ్య నాకు స్నేహితుడు. తన కధంతా నాకు వివరంగా చెప్పి ఈ బంగారం తన పాల్జేయమన్నాడు. ఎన్నాళ్ళు గానో నిధి వుందని ఊరిస్తున్నా సోమయాజులు గారు చలించడం లేదు. ఆఖరికి విసిగిపోయి నేనే ఒక ఆకాశరామన్న ఉత్తరం అయన పేరును రాశాను. ఆయనింట్లో పాతిక లక్షలున్నాయని అవి బయటపెట్టి నాకివ్వకపొతే ప్రాణాలు తీసేసి- వాళ్ళని సర్వనాశనం చేస్తానని.
దాంతో వాళ్ళలో చలనం వచ్చింది. నిధి మీద నమ్మకం కుదిరింది. పాతిక లక్షల్లో పది లక్షలు నాకివ్వడానిక్కూడా అంగీకరించారు వాళ్ళు. ప్రస్తుతం స్పృహ లేని స్థితిలో వున్నారు వాళ్ళు. అనుకున్న ప్రకారం పాతిక్కాక పదిహేను లక్షల బంగారమే ఉండడంతో నేను తెల్లబోయాను. రమణయ్య నాకు చెప్పిన ప్రకారం ఇక్కడ ఈ గదిలో బంగారమంతా దొరకాలి మరి..."
"జాప్యం చేస్తే కొంపలు మునుగుతాయి. నాకు దొరికిందే చాలు. అసలు పోయిందనుకున్న దాంట్లో కొంతయినా దక్కింది అదే చాలు....' అని - "నీ రమణయ్య ని నాకు పరిచయం చేస్తావా? నాకూ ఇలాంటి రహస్య పుటరలు చేయగలడేమో కనుక్కోవాలి. చాలా అవసరం...." అన్నాడు పీటర్.
"చేస్తాను గానీ నేనిక్కడున్నట్లు నీకెలా తెలిసింది? ఇంత ఖచ్చితంగా ఇక్కడి కేలా రాగాలిగావ్? నీకూ జోస్యం తెలుసునా?" అన్నాడాశ్చర్యంగా జ్యోతిష్కుడు.
"అన్నీ కార్లో చెబుతాను. ముందు బంగారం బ్రీఫ్ కేసుల్లోకి సర్దాలి...." అన్నాడు పీటర్. ఇద్దరూ బంగారాన్ని బ్రీఫ్ కేసుల్లోకి సర్దారు. ఆ తర్వాత వీధిలోకి వచ్చారు. కార్లో కూర్చున్నాక పీటర్ కధ చెప్పడం మొదలు పెట్టాడు.
"సత్యంబాబు ఆదాయమంతా స్మగ్లింగ్ మీదనే . ఆయనకు నేను కుడి భుజంగా వుండేవాడిని. మాదంతా చాలావరకూ కమీషన్ వ్యాపారం. ఒక వస్తువును తెలివిగా కొంత కాలం పాటు దాచి - తర్వాత దాన్ని చేర్చవలసిన చోటుకు చేర్చడం మా పని. రహస్య పత్రాలూ మత్తు పదార్ధాలూ అంతవరకూ చాలా రవాణా చేశాం కానీ -- బంగారం రవాణా చాలా కాలం వరకూ చేయలేదు.
మా సంస్థ మీద బాగా గురి కుదిరేక -- ఈ బంగారం మా దగ్గరకు వచ్చింది. ప్రస్తుతం పోలీస్ చెకింగ్ చాలా దారుణంగా ఉన్నదనీ- ఈ బంగారాన్ని బొంబాయి లోని ఒక సేట్ కు చేర్చాలనీ-- కానీ అందుకు కనీసం ఒక నెల రోజులు ఆగాలని బంగారాన్ని మాకిచ్చినతను కోరాడు. మొత్తం వ్యవహారం నడిపించడానికి -- అనగా బంగారాన్ని దాచడానికీ, అ తర్వాత గమ్యస్థానం చేరడానికీ లక్ష రూపాయలడిగాం. అంగీకారం కుదిరేక పాతిక వేలు అడ్వాన్సు కూడా పుచ్చుకున్నాం.
బంగారం దాచే బాధ్యత సత్యం బాబు తీసుకున్నాడు. బంగారమున్న ప్యాకేజీ పెట్టెలు అయన కొత్తగా కడుతున్న భవనానికి తరలించబడ్డాయి. ఆరోజు రాత్రి అయన ఒక మేస్త్రీని తీసుకుని ఇంట్లో ప్రవేశించాడు. నేనో టాక్సీ వాలా నా ఇంటికి కాపలాగా ఉంచాను.
ఆ తర్వాత సత్యం బాబు ఆచూకీ దొరకలేదు. వెళ్ళి చూస్తె అయన కొత్త భవనంలో చచ్చి పడి వున్నాడు. వెంటనే వెళ్ళి సత్యం బాబు కొడుకుని కలుసుకుని పరిస్థితి వివరించి చెప్పాను.
అంతా విని -- "ఈ పరిస్థితుల్లో మా నాన్న చావు బయటపడితే అటు బంగారము పోవచ్చు. ఇటు ఇంటి పరువూ గంగపాలు కావచ్చు. శవాన్ని రహస్యంగా మాయం చేసేయ్ . ఓ వారం రోజులూరుకుని సర్దుకోవలసిన వన్నీ సర్దుకుని అప్పుడు మేము పోలీస్ కంపయింట్ ఇస్తాం....' అన్నాడు సత్యంబాబు కొడుకు. అంతే చేశాన్నేను.
టాక్సీవాలా నా కందజేసిన సమాచారాన్ని బట్టి హంతకుడు తిన్నగా బయల్దేరి నరసింహులు అనబడే వడ్రంగి మేస్త్రీ ఇంటికి వెళ్ళినట్లు తెలిసింది. అయితే పోలికలు విచారించి చూడగా సత్యం బాబు గారు భవనానికి పిలిచిన మేస్త్రీ గానీ, హంతకుడు కానీ నరసింహులు కాడని తెలిసింది. నరసింహులు భార్య నడగ్గా - ఎవరో నరసింహులికి తెలిసినతను అర్ధరాత్రి వేళ తనింటికి వచ్చి కాసేపుండి వెళ్ళిపోయాడని చెప్పింది.
కానీ నాకు నరసింహులు మీద బాగా అనుమానంగా వుంది. అతనికి ఎంతో కొంత సమాచారం తెలుసుండాలని పించింది. అందుకే ఆతని భాక్ర్యను పట్టుకున్నాను. నా కస్టడీ లో ఉంచాను. ఆమెను చూస్తె అమాయకురాలని తోచింది. కానీ ఆరోజు నుంచే నరసింహులు మాయం కావడమూ- ఆ తర్వాత తన భార్య కోసమైనా అతను తిరిగి రాకపోవడమూ నరసింహులి మీద నా అనుమానాన్ని పెంచాయి.
దురదృష్టవశాత్తు నరసింహులికి సంబంధించిన ఫోటో లేమీ దొరకలేదు. కొడుకు మీది బెంగతో కొద్ది రోజులకే ఆవిడా చనిపోయింది.
ఏదేమైనా బంగారం భవనంలోనే మాయమయుండాలని నా నమ్మకం. అందుకు మరో అవకాశం లేదు. కానీ ఎలా మాయమైందో - అదెక్కడ దాచాబడిందో ఎంత ప్రయత్నించినా తెలుసుకోలేక పోయాను.
ఆ ఇల్లు అచ్చి రాలేదని- అందుకే బంగారం పోవడమూ, తండ్రి చని పోవడమూ జరిగాయనీ సత్యం బాబు కొడుక్కు సెంటిమెంటు పట్టుకోగా- అతనా యిల్లు అమ్మేశాడు.
అ బంగారానికి నష్ట పరిహారంగా మేము ఏడు లక్షలు కట్టాల్సి వచ్చింది. ఆ డబ్బు చాలా కష్టం మీద సంపాదించాం. నెమ్మది మీద తీర్చాము. కానీ మరీ చెడ్డ పేరు వచ్చింది. వ్యాపారం పడిపోయింది. నమ్మకం మీద నడిచే ఈ వ్యాపారంలో ఒకసారి చెడ్డ పేరు వస్తే చాలా కష్టం. ఆ తర్వాత ప్రయత్న బలం మీద అయిదారేళ్ళ కు మళ్ళీ కాస్త చెప్పుకోదగ్గ స్థాయికి చేరుకున్నాం.
కానీ నేను మాత్రం ఆ ఇంటి మీదో కన్ను వేసుంచాను. ఆ ఇంట్లో నా ఏజంటు నాకు ఉప్పందించే ఏర్పాటు ఉంది. ఈరోజు నా ఏజంటు ద్వారానే నాకు సమాచార మందింది. సరైనా సమయానికి బంగారం అందుకో గలిగాను...." కధ పూర్తీ చేసి గర్వంగా చూశాడు పీటర్.
9
మధ్యాహ్నం మూడు గంటల వేళ సోమయజులకు మెలకువ వచ్చింది. అప్పటికాయన భార్య నిద్ర పోతూనే ఉంది. ఆయనే తట్టి లేపెసరికి కళ్ళు నులుముకుంటూ లేచిందావిడ. ఇద్దరూ వాస్తవాన్ని గ్రగించడానికి కాసేపు పట్టింది. నెమ్మది మీద పరిస్థితులన్నీ ఆకళింపు చేసుకున్నాక "జ్యోతిష్కుడు డేడే?" అన్నాడు సోమయాజులు.
"అవును - ఏడీ?" అంది శాంతాదేవి.
