Previous Page Next Page 
శంఖారావం పేజి 30

 

    'సరే -- అలాగే చెబుతాను ...."
    "పొరపాటున కూడా నా గురించి చెప్పవు కదూ?"
    "చెబితే ఈ ఊబిలోకి నిన్ను కూడా లాగినట్లవుతుంది. నా అదృష్టం కొద్దీ నాకు దక్కిన స్నేహితురాలివి. నీకు ఆపద రానిస్తావా ?" అంది సురుచి.
    మురహరి నల్లగా ఉన్నా ముఖం కళగానే ఉంటుంది.
    అయిదడుగుల అరంగుళాల ఎత్తు.....
    ఎప్పుడూ తెల్లని బట్టలలో చెరగని చిరునవ్వుతో ఉంటాడు.
    సురుచి తనకు విశేషం చెబుతున్నప్పుడు కూడా అతను చిరునవ్వుతోనే ఉన్నాడు.
    "కలలు కనే వయసు నీది!" అన్నాడు మురహరి నెమ్మదిగా.
    "ఇలాంటి కలలు నాకెందుకు వస్తున్నాయి!"
    "మొదటి రెండు కలలు సంగతీ నాకు తేలియదు...." అన్నాడు. మురహరి నవ్వుతూనే -- "మూడో కల ఎందుకొచ్చిందో చెప్పగలను. బహుశా అదే మొదటిదని నా అనుమానం..."
    "అంటే ?"
    "నీ కలలన్నీ భగ్నం చేసానని నీకు నామీద మంటగా ఉంది. అందుకే ఇలాంటి కల వచ్చి ఉంటుంది. ఇదొక్కటే చెబితే బాగుండదని ఇంకో రెండు కలలు కల్పించావు...."
    "నేను నిజం చెబుతున్నాను. ఈ కల ఇప్పుడే ఎందుకు రావాలి ?" ఏదో మానవాతీతశక్తి నన్ను హెచ్చరిస్తుందని నా అనుమానం ....' అంది సురుచి.
    'ఆ శక్తి ఏమిటో నీచేతే చెప్పిస్తాను...." అన్నాడు మురహరి.
    'అంటే ?"    
    "నా గురించి నువ్వేవరికో చెప్పావు. నామీద కుట్ర పన్నిన వారికి నువ్వు సహకరిస్తున్నావు. ఇప్పుడేమీ తెలియనట్లు నాముందుకు వచ్చి మొసలి కన్నీరు కారుస్తున్నావు....' అన్నాడు మురహరి.
    "నేను నీకు వ్యతిరేకంగా పనిచేయగలనా?"
    "అదే ఇప్పుడు తెలుసుకుంటాను!"
    "సురచి భయపడింది -"నువ్వు నన్ను నమ్మడం లేదు-"
    మురహరి చిరునవ్వుతో -- "నిన్ను నేను నమ్మడానికి రెండు పద్ధతులవలంభించాలి " అన్నాడు.
    సురుచి అతడి వంక కుతూహలంగా చూసింది.
    'అటు చూడు" అన్నాడతను.
    గోడకు వ్రేలాడుతోంది నోరు తెరిచిన పులితల! పులి కోరలు తెల్లగా మెరుస్తున్నాయి.
    మురహరి ఆమెకు పులితలను చూపించలేదు.
    ఆ పక్కగా ఉందొక కొరడా!'
    సురుచి వళ్ళు జలదరించింది.
    "దాంతో మృగరాజునని విర్రవీగే అడవి సింహాన్ని మనం చెప్పినట్లు ఆడేలా చెయ్యొచ్చు. బలంలో తనకు సాటి లేదనుకునే మదగజం చేత సర్కస్ చేయించవచ్చు. అది నీమీదుపయోగించాననుకో -- నిన్ను నమ్మడానికి పది నిమిషాలు చాలేమో!"
    సురుచి తమాయించుకుని -- "రెండో పద్దతి ఏమిటి?" అంది.
    మురహరి నుంచి బెదిరింపు మాటలు వినడం ఆమెకి కొత్త కాదు. ప్రతిసారి కొత్త రకంగా బెదిరిస్తాడతడు. ప్రతి బెదిరింపూ నరల్లోంచి వణుకు తెప్పిస్తుంది.
    "నాతొ రా!" అంటూ లెచాడతడు.
    ఆమె అతడిననుసరించినది.
    ఇద్దరూ ఓ చిన్న గదిలో ప్రవేశించారు.
    గది మధ్యలో ఓ బల్ల ఉంది. బల్ల ముందు కుర్చీ ఉంది.
    ఓ పక్కగా తలుపులు లేని బాత్రూముంది. అయినా బయటివారికి కనిపించకుండా స్నానం చేయవచ్చు. టాయ్ లెట్ , కుళాయి -- గుమ్మానికి పక్కగా ఉన్నాయి.
    గదిలో ఫ్యాను తిరుగుతోంది.
    గదికి కిటికీలు లేవు- వెంటి లెటర్సుంన్నాయి-- బాగా ఎత్తున !
    చెప్పాలంటే అదొక జైలు గదిలా ఉంది.
    "నువ్వు నాకు వారం రోజులు టైమిచ్చావు. ఈవారం రోజులూ నువ్వేవర్నీ కలుసుకో కూడదు. ఈ వ్యవహారంలో నీ పాత్ర ఏదీ లేదని నేను నమ్మడానికి వారం రోజులూ ఈ గదిలో నువ్వు నాకు అతిధిలా ఉండాలి. రోజూ ఉదయం - కాఫీ, టిఫిన్లు, మధ్యాహ్నం భోజనం , సాయంత్రం కాఫీ, టిఫిన్లు, రాత్రి భోజనం -- నీకోసం ఈ బల్ల మీద ఉంచబడతాయి. ఎటొచ్చీ నువ్వు కటిక నేలమీద పడుకోవాలి. ప్రపంచంలో నీకు సంబంధ ముండదు. వార్తలు తెలియవు. నీతో కబుర్లాడే వాడుండడు. అయినా కొరడా దెబ్బల కంటే ఇదే మెరుగనుకుంటే నువ్విక్కడే ఉండొచ్చు -' అన్నాడు మురహరి.
    సురుచి అతడి వంక చూసింది.
    అతడు నవ్వుకున్నాడు.
    ఆ నవ్వులో క్రూరత్వం లేదు. సంతోషం!
    "చెప్పు ! చాయిస్ నీదే!"
    "ఇక్కడే ఉంటాను" అందామె. ఆమె మనసులో ఉదయను తిట్టుకుంటుంది. కొరివితో తల గోక్కున్నట్టయిందామెకు.
    'అయితే కదలకుండా నిలబడి కళ్ళు మూసుకో -- నేను చెప్పేదాకా నువ్వు కన్నెత్తి చూడకూడదు. నోరు విప్పకూడదు --"
    ఆమె అతడి అజ్ఞ శిరసావహిస్తూ కళ్ళు మూసుకుంది.
    ఏం జరుగుతుందో ఆమెకు తెలుసు.
    "ఊ కళ్ళు తేరు -- " అన్నాడతను.
    ఆమె కళ్ళు తెరిచింది.
    కొద్ది క్షణాల క్రితం వరకూ ఆమె వంటి నలంకరించిన దుస్తులన్నీ ఇప్పుడతడి చేతుల్లో ఉన్నాయి.
    ఆమె సిగ్గు పడలేదు. సిగ్గు తనకు నచ్చదని అతడోకసారి ఆమెతో అన్నాడు.
    "గదిలోపల బోల్టు లేదు. బయట్నించే నేను వేస్తాను. నీకు భోజన సదుపాయాలూ చేసే మనిషి బయట్నింఛి తలుపు తీసుకునే వస్తాడు. అతడు నీ జోలికి రాడు'. కానీ ఇలా మరో మగాడి కంట పడటం నీ కిష్ట ముండక పొతే తలుపు అలికిడికి నువ్వు బాత్రూం లోకి వెళ్లి దాక్కోవచ్చు " అన్నాడతను.
    ఆమె అసహాయంగా తలాడించింది.
    "రోజులేలాగుంటాయో చెప్పలేము . ఒకోసారి పోలీసులో మరెవ్వరో ఈ ఇంటిని శోధించవచ్చు. అప్పుడు నేను వారి పక్కన ఉండవచ్చు. ఉండక పోవచ్చు. అందుకే ముందుగా హెచ్చరిస్తున్నాను. నువ్వీ గదిలో ఉండగా నాకు తప్ప ఎవరి కంట బడినా పిచ్చి దానిలా నటించాలి. నువ్వు పిచ్చి దానివి కాబట్టి నీ వంటి మీద దుస్తులు లేవు. నువ్వు పిచ్చి దానివి కాబట్టి నిన్నిలా గదిలో బంధించాను. ఈ నమ్మకం ఇతరులకు కలగాలి. అదీ అవసరమైతేనే -- సాధారణంగా నా ఇంట్లో అలాంటావసరం రాదు....!"
    ఆమె మళ్ళీ తలాడించింది.
    "ముందే చెబుతున్నాను. నేను చెప్పినట్లు చేయక పోయావో -- వారం రోజుల తర్వాత నువ్వు నిజంగా పిచ్చాసుపత్రిలోనే ఉంటావు " అన్నాడతడు.
    ఆమె తలడాంచింది.
    'ఉంటాను. వారం రోజుల తర్వాతే మనం కలుసుకుంటాం --"
    గదిలో ఒంటరిగా -- ప్రపంచంతో సంబంధం లేకుండా తను!'    
    తలుపులకు లోపల్నుంచీ బోల్టు లేదు.
    ఏ క్షణంలో ఎవరొస్తారో నన్న భయంతో తనకు నిద్ర కూడా పట్టదు.
    అలా ఒకటి కాదు.....రెండు కాదు....వారం రోజులు!
    "ఎరక్కపోయి ఇందులో ఇరుక్కున్నాను. అంతా ఉదయ చేసింది!" అనుకుందామే.
    కాసేపటూ ఇటూ పచార్లు చేసింది.
    కాసేపు కుర్చీలో కూర్చుంది.
    కాసేపు నేల మీద పడుకుంది.
    ఆమెకు టైము గడవడం లేదు.
    ఇలా ఉంటె ఈ గదిలో ఒక్కరోజులో పిచ్చిదాన్నై పోతాను -- అనుకుందామే.
    మురహరి కర్కోటకుడు. తనిక్కడ నుంచి తప్పించుకుని పోయే అవకాశం గానీ- పరుల కంట పడే అవకాశం గానీ లేవు.'    "భగవంతుడా -- వాడికి అంతం ప్రసాదించు " అనుకుందామే.
    అప్పుడే గది బయట అలికిడయింది.
    ఎవరో తాళం తీస్తున్నారు.
    'భోజన సమయుంటుంది" అనుకుందామే.
    తలుపు తెరుచుకునే లోగా బాత్ర్రూం లోకి పరిగెత్తింది.
    మళ్ళీ తలుపులు వేసిన చప్పుడయ్యే దాకా ఆమె బయటకు రాలేదు. ఆమె బయటకు రాగానే బల్ల మీద కారియర్ ఉంది. ఓ పింగాణి ప్లేటుంది. మంచి నీళ్ళ ప్లాస్కుంది. ప్లాస్కు కింద చీటీ ఉంది.
    అందులో --
    "భోజనానికి పదిహేను నిమిషాలు టైము. సరిగా పదిహేను నిమిషాల్లో నేను వచ్చి ఖాళీ క్యారియర్, ఎంగిలి కంచం తీసుకుని వెళ్ళాలి" అని రాసి ఉంది.
    సురుచి టైము చూసుకుంది.
    చేతికి వాచీ లేదు. దుస్తులతో పాటు మురహరి అది కూడా తీసుకున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS