Previous Page Next Page 
డాళింగ్ పేజి 29

 

    వింటర్ సీజన్ ఫంక్షన్ హాల్ విద్యుత్ దీపాల వెలుగులో తాజ్ మహల్ లా వుంది.
    లాన్ నిండా అందమైన కెన్ కుర్చీలు, టేబుల్స్, ఎక్కడ చూసినా ఉల్లాస వాతావరణం.
    లాన్ ఎడం పక్కన వచ్చి ఆగుతున్న మారుతీ కార్లు ----ఆ కార్లను చూడగానే తెల్సిపోతుంది. అక్కడి కొచ్చే అతిదుల స్థాయి ఎలాంటిదో, స్పీకర్ లోంచి వచ్చే మంద్రమైన సంగీతం ఉద్వేగభరితంగా వుంది.
    లేత బూడిదరంగు యూనిఫామ్స్ లో బట్లర్లు కూల్ డ్రింక్స్, హాట్ డ్రింక్స్ సరఫరా చేస్తున్నారు.
    నవ్వులు, జోకులు, విమర్శలు, పరామర్శలు, పలకరింపులు వ్యాపారం .......ఒక్కటేమిటి ......అదొక హైసోసైటీ పీపుల్ వరల్డ్ . అలాంటి గేదరింగ్ రేర్ గా జరుగుతుంది.
    ప్రస్తుతం ఆ గేదరింగ్ కి కారణం సుజన్ మిత్ర.
    సుజన్ మిత్రకు ముప్పై అయిదేళ్లుంటాయి . హిందీ సినిమా యాక్టర్ అనిల్ కపూర్ లా ఉంటాడు. కెనడాలో , అగ్రశేణికి చెందిన పదిమంది భారతీయ వ్యాపారస్తుల్లో అతనొకడు.
    అతను ఇండియాలో , మద్రాసు కేంద్రంగా తన వ్యాపారాన్ని ప్రారంభించాలను కున్నాడు.
    సుజన్ మిత్ర "బిజినెస్ సక్సెస్ "కి ప్రధానమైన కారణం .........ఆలోచన వచ్చిన వెంటనే ఆ ఆలోచనను ఆచరణలో పెట్టడం.......
    పదేళ్ళ క్రితం సుజన్ మిత్రను తెల్సిన వాళ్ళు బొంబాయిలో మాత్రమే ఉన్నారు. వాళ్ళను ఇవాల్టి "సుజన్ మిత్ర" పరిస్థితి అనూహ్యం.
    రోడ్డు పక్కన "చిట్ చాట్" వ్యాపారం చేసే ఒక వ్యక్తీ. అతి తక్కువ సమయంలో , కొన్ని కోట్లకు ఎదగగలడా?
    సక్రమైన మార్గంలో ఎదగగలడా? అన్నది వాళ్ళ సందేహం.
    అలాంటి ప్రశ్న ఎప్పుడొచ్చినా, సుజన్ మిత్ర నవ్వుతాడు. కొంత మంది నవ్వులో అభిమానం కన్పిస్తుంది. మరికొంతమంది నవ్వులో ప్రేమ కన్పిస్తుంది. ఇంకొంతమంది నవ్వులో విషం కనిపిస్తుంది. కానీ సుజన్ మిత్ర నవ్వులో కేవలం వ్యాపారం మాత్రమే కన్పిస్తుంది.
    వ్యాపారపు నవ్వు ఇంద్రధనస్సు లాంటిది. ఆ నవ్వులో రంగులుంటాయి. అలాంటి నవ్వుతో -
    అక్కడున్న అతిధులందర్ని విష్ చేస్తున్నాడు. అతను చేసే వ్యాపారంలో భాగస్వాములు కావడానికి అక్కడ చాలా మంది కోటీశ్వరులు సిద్దంగా ఉన్నారు. సుజన్ మిత్రకు యూరోపియన్ దేశాల్లో ఉన్న బిజినెస్ కాంటాక్ట్స్ కోసం అతనితో అక్కడ చేతులు కలుపుతున్న వాళ్ళు చాలామందున్నారు.
    నల్లటి సూటు,లేతాకుపచ్చ రంగు టై , ఖరీదైన కళ్ళద్దాలు ........ చేతిలో వైన్ గ్లాసు అందర్నీ పలకరిస్తున్న సుజన్ మిత్ర చూపులు మెయిన్ గెట్ వేపున్నాయి.
    పావుగంట గడిచింది.
    సుజన్ మిత్ర ఫేమస్ తమిళ ప్రొడ్యుసర్ రంగనాయకతో మాట్లాడుతున్నాడు.
    ...అదే సమయంలో మెయిన్ గెట్ లోంచి ఓ బ్లూ కలర్ మారుతి కారు వచ్చి ఆగింది.
    ఆ కారులోంచి దిగిన వ్యక్తీ మాధురి.
    కుంకుమ రంగు జరీ పట్టుచీరలో కారు నుంచి కిందకు దిగిన మాధురి వేపు ---
    కొన్ని వందల కళ్ళు ఒక్కసారిగా చూసాయి.
    వింటర్ సీజన్ లో అకస్మాత్తుగా మెరిసిన మెరుపులా మాధురి కారులోంచి దిగి అటూ యిటూ చూసింది.
    మాధురి వచ్చిన సంగతి ఎలా తెల్సిందో తెలీదు.
    ప్రొడ్యుసర్ రంగానాయికతో మాట్లాడుతున్న సుజన్ మిత్ర గబగబా పరుగులాంటి నడకతో రెండే రెండు క్షణాల్లో బయటకొచ్చాడు.
    అప్పటికి మెయిన్ హల్లో షాండలియర్ కింద నిలబడి వుంది మాధురి.
    ఆ సమయంలో మాధురి విధ్యుత్ ప్రతిమలా వుంది.
    సుజన్ మిత్ర , మాధురి -----
    ఇద్దరి మధ్య అయిదు అడుగుల దూరం.
    "మధూ..........." ఆ పిలుపులో ఎన్నాళ్ళకు కలిసాం అన్న మాధుర్యం .
    "మిత్రా........" మాధురి నోటివెంట మాటతో తెలియని స్పందన
    కొన్ని వందల కళ్ళు వాళ్ళిద్దర్నీ గమనిస్తున్న సంగతిని, సుజన్ మిత్ర మరిచిపోయాడు.
    "హౌ అర్యు.....మైడియర్ .........మధూ........" ఉప్పెనలా ముందు కొచ్చి గట్టిగా కౌగలించుకుని చిన్నపిల్లను ఎత్తినట్టుగా పైకెత్తి , నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు.
    సుజన్ మిత్ర మాధురికి బావ. మాధురి తండ్రి ధనుంజయ రావు చేల్లిలి కొడుకు.అందుకే అంత చనువుగా వ్యవహరిస్తున్నాడు. వాళ్ళ చిన్నప్పటి నుంచే పెద్దవాళ్ళు వాళ్ళిద్దరూ భార్యాభర్తలన్నట్లుగా నిశ్చయించటంతో ఆ భావం కూడా సుజన్ మిత్ర అంతరంగంలో బాగా పాతుకు పోయింది.
    "మధూ......నువ్విలా వున్నావ్.....డాడీ ఎలాగున్నారు......మమ్మీ చనిపోయారు కదా......నాకు న్యూస్ తెలిసింది కానీ నేనప్పుడు బ్రెజిల్ లో వున్నాను. ఆయామ్ సో సారీ మధూ. మెసేజ్ పంపించాను. అందింది కదూ. నువ్వు సినిమాల్లో టాప్ హీరోయిన్ వట కదా ఆ మధ్య న్యూయార్క్ తెలుగు అసోసియేషన్ చీఫ్ గెస్ట్ గా వెళ్ళాన్లే . అక్కడ నువ్వు యాక్ట్ చేసిన సినిమా చూసాను చాలా ఏళ్ళయింది కదా నిన్ను చూసి. ఆ సినిమా చూడబట్టే నిన్ను నేను ఈజీగా పోల్చుకున్నాను. నిజం ఎంత ఎదిగిపోయావ్ అసలు........ఈ బిజినెస్ కాన్ఫరెన్స్ ఇక్కడెందుకు పెట్టానో తెలుసా........సీక్రెట్ చెప్పేస్తున్నా.....నిన్ను కలవాలనే. కమాన్ చూడు నీకెలా ఫోన్ చేసానో వీళ్ళ క్కూడా అలాంటి ఫోన్లు వెళ్ళాయి. ఒకప్పుడు వీళ్ళందరి చుట్టూ నేను తిరిగిన వాన్నే ఆ రోజు నాకెవరూ సహాయం చెయ్యలేదు. ఈరోజు ఆ బిజినెస్ గొడవలన్నీ నీ కెందుకులే ........నువ్వొచ్చావు అదే చాలు. మూడు గంటల ప్లయిట్ లో బొంబాయి వెళ్ళిపోతున్నాను. అంత వరకూ నువ్వు నా తోడు ఉంటావు.....ఒకే కమాన్ రా నా ఫ్రెండ్స్ కి ఇంట్రద్యుస్ చేస్తాను .......
    ఎక్సయింట్ మేంటో, లవ్వో, ఎమోషనో చాలా రోజుల తర్వాత కలవడమో ఏవిటో తెలియదు సుజన్ మిత్ర మాట్లాడుతున్నప్పుడు ఆ వేగానికి ఆశ్చర్యపోవడం, కళ్ళార్పకుండా , అతని ఎక్స్ ప్రేషన్స్ వేపు చూడటం మాధురి కంతా గమ్మత్తుగా ఉంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS