Previous Page Next Page 
వసుంధర కధలు-6 పేజి 29

 

                                    12

    టైము ఏడయింది.
    "బై...."అంది సుశీల.
    "బై...." అన్నాడు సుభాష్.అతడికి కాస్త దూరంలో జగ్గూ వున్నాడు. సుభాష్ అక్కడ్నించి బయల్దేరాక జగ్గూ కూడా అక్కణ్ణించి కదిలాడు.
    మరోవైపు గేట్లోంచి సుశీల బైటకు వచ్చింది. అప్పుడే ఆమెకు ఎదురు పడ్డాడు సుదర్శనం. అతడి నామే చూసింది కానీ పట్టించుకోలేదు.
    "హలో!" అన్నాడు సుదర్శనం. అతడి గొంతు వణికింది.
    సుశీల ఆశ్చర్యంగా చూసింది.
    "నాపేరు సుదర్శనం!" అన్నాడతడు.
    ఆమె అతడి వంక ప్రశ్నార్ధకంగా నే చూసింది.
    "మీ పేరు సుశీల కదూ? మీరు ప్రిన్సిపాల్ మోహనమూర్తి గారమ్మాయి కదూ!" అన్నాడు సుదర్శనం.
    అతడాడిగిన పద్దతి ని బట్టి మర్యాదస్తుడి గానే భావించి- "అరె మీకు మా నాన్నగారు తెలుసా?' అంది సుశీల.
    'అయ్యో -- ఆయన్ని తెలియని వాళ్ళెవరుంటారు?" అని - "నేను మిమ్మల్ని కల్సుకుని మీతో మాట్లాడాలని చాలా కాలంగా అనుకుంటున్నాను. మీతో పాటు కలిసి అడుగులేయోచ్చ్హా?" అన్నాడు సుదర్శనం.
    సుశీల నవ్వి -- "మా నాన్నగారు నాకు పూర్తీ స్వేచ్చ నిచ్చారు. కానీ నాతొ మీరేం మాట్లాడతారు?"
    "నా ఫ్రెండోకడు -- అయ్యే యస్ ప్యాసయ్యాడు. ఇంకా పోస్టింగు రాలేదు. వాడి దగ్గర మీ ఫోటో వుంది. మిమ్మల్ని పెళ్ళి చేసుకోవాలను కుంటున్నాడు. కానీ ధైర్యం చేసి ముందుగా మీకే ఆ మాట చెప్పాలని తాపత్రయం. వాడి దగ్గరే నేను మీ ఫోటో చూశాను...." సుదర్శనం కల్పిత గాధ నొకటి మొదలు పెట్టాడు.
    సుశీల కీ కల్పిత గాధ ఆకర్షణీయంగానే వుంది. ఆమె సుదర్శనంతో కలిసి అడుగులు వేస్తోంది.
    అలా కొంతసేపటికి అతడనుకున్న అడ్డదారి దగ్గర పడింది.
    తగ్గిందనుకున్న వణుకు మళ్ళీ సుదర్శనంలో ప్రారంభ మైంది.
    సుశీల మాత్రం అతడి కబుర్లు వింటూ మధ్య మధ్య ప్రశ్నలు వేస్తోంది. క్రమంగా అడ్డదారి దగ్గర పడుతోంది.
    "అలా పోదాం -- దగ్గర దారి...."అన్నాడు సుదర్శనం అడ్డదారి వైపు చూపిస్తూ.
    సుశీల క్షణం తటపటాయించి -- "ఆదాట్టే మంచి దారి కాదు ...."అని -- 'అయినా మీలాంటి వారు పక్కనుంటే భయముండదు లెండి...." అని తనే అటువైపు తిరిగింది.
    సుదర్శనం తనూ అటువైపు తిరగాలనుకున్నాడు. కానీ కాళ్ళు సహకరించలేదు. ఎవరైనా ముందుకు తోస్తే తప్ప అతడు ముందుకు వెళ్ళేలా లేడు.
    సుశీల నాలుగడుగులు వేసి వెనక్కి తిరిగింది.
    సరిగ్గా అప్పుడే శరవేగంతో వస్తున్నా స్కూటరోకటి సుదర్శనాన్ని గుద్దింది. హరన్ మోగుతున్నా సుదర్శనం తప్పుకోలేక పోయాడు. అప్పుడక్కడ యాక్సిడెంటయింది. స్కూటర్ మీద ఇద్దరున్నారు. వాళ్ళకు చిన్న దెబ్బలు తగిలాయి. సుదర్శనం మాత్రం క్రింద పడ్డాడు. మరి లేవలేదు. అతడికి స్పృహ తప్పింది.
    సుశీల కతడెవరో తెలియదు. కానీ స్కూటర్ వాలాల సాయంతో -- ఆమె అతడిని దగ్గర్లోని ప్రయివేట్ నర్శింగ్ హోం లో చేర్చింది.
    సుదర్శనం దగ్గిర ఏ వివరాలు లేకపోవడం వల్ల ఆమె అక్కణ్ణించే ఇంటికి ఫోన్ చేసి -- తానొక అపరిచితుడిని నర్శింగ్ హోం లో చేర్చాననీ-- అతడికి స్పృహ వచ్చేవరకూ నర్శింగ్ హోం లో వుండవలసిన బాధ్యత తనకున్నదనీ చెప్పింది. కాసేపటికి -- మోహనమూర్తి అక్కడికి వచ్చి అక్కడి పరిస్థితి చూసి -- "మనమిక్కడుండనవసరం లేదు. అతడికి స్పృహ రాగానే నర్సింగ్ హోం వారు మనింటికి ఫోన్ చేసి చెబుతారు. అవసరమనుకుంటే అప్పుడు సాయపడొచ్చు---" అన్నాడు.
     వాళ్ళిద్దరూ యింటికి వెళ్ళిపోయారు. అయితే సుశీలకు మనసు మనసులో లేదు. ఆమె తరచుగా రాత్రి నర్సింగ్ హోం కి ఫోన్ చేస్తూనే వుంది --  సుదర్శనానికి స్పృహ వచ్చిందా అని.

                                   13
    తెల్లవారుజామున నాలుగు గంటలకు సుదర్శనానికి స్పృహ వచ్చింది. తనేక్కడున్నది ముందతడికి తెలియలేదు. దగ్గర్లో వున్న నర్సు కొంత చెప్పాక మొత్తం జరిగినదంతా అతడూహించుకోగలిగాడు. అప్పుడతడికి తనమీద తనకే ఏహ్య భావం కలిగింది.
    సుభాష్ ని ప్రేమించిన సుశీలను తను మానభంగం చేయాలనుకున్నాడు. స్పృహ తప్పిపోయిన తననామే నర్సింగ్ హోం లో చేర్పించింది.
    జీవితమంటే ఉద్యోగం సంపాదించడ మొక్కటే కాదు. కానీ ఉద్యోగం కోసం -- తను ఒక అతీత జీవితంతో పాటు తన జీవితాన్ని కూడా నాశనం చేసుకోబోయాడు.
    "నాచేత పాపం జరక్కుండా దేవుడు ఆపాడు. అయినా నానుంచి కూడా కొంత నిష్కృతి తప్పదు. నేనీ యింటర్వ్యూ కి వెళ్ళను. ఆ విధంగా సుభాష్ కి ఉద్యోగం వస్తుంది. సుశీల సుఖపడుతుంది....' అనుకున్నాడు సుదర్శనం.
    ఈలోగా అతడికి స్పృహ వచ్చిందని తెలుసి డాక్టరతడ్ని చూడవచ్చాడు-- "పాపం -- ఆ అమ్మాయ్యేవరో మీ గురించి చాలా ఆదుర్దా పడింది. మీకు పెద్దగా దెబ్బలేమీ తగల్లేదు. స్పృహ తప్పిందంటే అందుకు కారణం షాక్ అయుండాలి. లేదా ఎందువల్లో ఆ సమయంలో మీ మెదడు బలహీనంగా ఉండి వుండాలి. మీ వివరాలు చెప్పండి....' అన్నాడు డాక్టరు.
    సుదర్శనం తన ఇంటి చిరునామా చెప్పగానే అయన మోహనమూర్తి ఇంటికి ఫోన్ చేసి కబురు చెప్పాడు.
    కాసేపట్లో మోహనమూర్తి స్వయంగా నర్శింగ్ హోం కి వచ్చాడు. అయన సుదర్శనంతో - "మా అమ్మాయి కబురు చెప్పడానికి మీ ఇంటికి వెళ్ళింది. కాసేపట్లో మీ వాళ్ళు వస్తారు. అన్నట్లు నీకీరోజు ఇంటర్వ్యూ వుంది కదూ!' అన్నాడు.
    "మీకెలా తెలుసు?" అన్నాడు సుదర్శనం ఆశ్చర్యంగా.
    "ఇంటర్వ్యూ కాల్స్ పంపిన పదిమంది అడ్రసులూ కంఠతా వచ్చేశాయి. నీ అడ్రసు చెప్పగానే నువ్వు మా ఇంటర్వ్యూ సుదర్శనానివేనని అర్ధమైంది నాకు...."
    "కానీ -- నేను ఇంటర్వ్యూ కి వెళ్ళడం లేదండి...." అన్నాడు సుదర్శనం.
    "ఎందుకని?"
    "ఈ యాక్సిడెంట్ కాగానే ఎదోలాగుంది...."
    "అలాగనకు. ఇందులో నీకు మంచి చాన్సుంది..."
    "నాకేం చాన్సు లేదండి -- ఎవరో సుభాష్ అనే అతడికి మంచి చన్సుందని కాలేజీలో టాకుందిటండి..."
    ప్రిన్సిపాల్ ముఖం ఎర్రబడింది. -- "ఆ సుభాష్ నాకు కాబోయే అల్లుడు. ఉద్యోగం కోసం నన్నూరికే సతాయిస్తున్నాడు. నాక్కాబోయే అల్లుడు కాబట్టి అతడికా ఉద్యోగం వచ్చే ప్రసక్తి లేదు. మా కాలేజీ కమిటీ మెంబర్స్ కొందరు నన్ను కాదని సుభాష్ కుద్యోగం ఇవ్వాలనుకుంటున్నారు. అలా చేస్తే మనసులో ఏ మూలో నేను సంతోషిస్తానని వారి నమ్మకం. అందుకే నామాట నెగ్గడం కోసం నా మిత్రుడు ప్రొఫెసర్ రామేశం ను సెలక్షన్ కమిటీ చైర్మన్ గా చేశాను. అతడేవ్వరి మాటా వినడు. అందరిలోకీ మంచి అర్హతలున్న నీ పేరు రామేశానికి సూచించాను కూడా. ఎట్టి పరిస్థితుల్లోనూ అతడు సుభాష్ ను సెలక్టు చేయడు, చేస్తే నేనుద్యోగానికి రాజీనామా చేస్తానని రామేశానికి తెలుసు...."
    సుదర్శనం చటుక్కున మంచం మీంచి లేచి మొహనమూర్హి కాళ్ళ మీద పడిపోయి -- "ఈరోజుల్లో మీ లాంటి వాళ్ళుంటారని కలలో కూడా ఊహించలేదు...." అన్నాడు.
    "నన్నుహల్లో ఉంచకపోయినా ఫరవాలేదు. నీ ఊహల్ని మీలాంటి వాళ్ళు నిజం చేస్తే చాలు .... అన్నాడు మోహనమూర్తి.
    సుదర్శనానికి కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి.
    ఇంత సులభమైన వ్యవహారానికి -- తానెంత తతంగం చేశాడు?
    ప్రిన్సిపాలు స్ట్రిక్టు అని తనకేందరో చెప్పారు . నిజాన్ని, మంచిని -- అంత సులభంగా నమ్మని తాను ఎన్నో రోజులు ఇంత క్షోభా అనుభవించాడు.
    మంచిని నమ్మి వుంటే....?    
    ఇంకా యేమైనా మొహనమూర్ర్హి లో అనుమానాలుంటే.....తనకుద్యోగం రాగానే సుదర్శనానికి అవి తీరిపోయాయి.
    ఎదుటి వాళ్ళ నిజాయితీని, మంచితనాన్నీ మోహనమూర్తి  తప్పుగా అంచనా వేయడనడానికి నిదర్శనంగా  సుభాష్ సుశీలను పెళ్లి చేసుకున్నాడు.

                           ----:అయిపొయింది :-----
   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS