శాస్త్రి , శర్మ -- అలాంటి మురికివాడలో ఓ చిన్న ఇంటి ముందాగి తలుపు తట్టారు. అది నేడో, రేపో కూలేలా ఉన్న ఇల్లు. బాగా పరీక్షించి చూస్తె అదొక పెంకుటిల్లు అని తెలుస్తుంది.
తలుపు తట్టగానే లోపల అలికిడి కావాలి. కానీ అలాంటిదేమీ జరగలేదు. కానీ రెండో సారి తలుపు తట్టడానికి శర్మ భయపడ్డాడు. "ఇవి తట్టవలసిన తలుపులు కావు. తాకవలసిన తలుపులు--" అన్నాడతను.
"ఇంట్లో ఎవరో వుండే వుండాలి. లేకపోతే ఇంటికి తాళం పెట్టి వుండేవారు--"అన్నాడు శాస్త్రి.
"ఈ యింటికి తాళమా -- భలే జోకు...." అన్నాడు శర్మ.
శాస్త్రి బుర్ర పనిచేసింది-- "అవును -- ఈ ఇంటికి తాళం అక్కర్లేదు. ఈ తలుపుకు గడియ మాత్రం అవసరమా-- తలుపు కాస్త తోసి చూద్దాం -- ' అంటూ అతను నెమ్మదిగా తలుపు తోసే ప్రయత్నం చేశారు. శర్మ అతణ్ణి జాగ్రత్త జాగ్రత్త అని హెచ్చరించాడు, కానీ తలుపు సులభంగానే తెరుచుకుంది. అయితే అక్కడ దృశ్యం చూసి ఇద్దరూ ఆశ్చర్య పోయారు.
అక్కడ ఓ ఇరవై ఏళ్ళ లోపు యువతి నగ్నం గా నిలబడి వుంది. సుమారు నలభై ఏళ్ళ మగాడు ఆమె వంటిని తుడుస్తున్నాడు-- గుడ్డతో, ఇద్దరు కూడా వీళ్ళని చూసి ఉలిక్కిపడ్డారు. ఆ యువతి చటుక్కున కాస్త మూలగా వెళ్ళింది.
"ఎవరుమీరు ? ఇక్కడి కెందుకు వచ్చారు?' అన్నాడా మనిషి కోపంగా.
"తలుపు తట్టే వచ్చాం కానీ మైకంలో మీకేమీ వినపదినట్లు లేదు..." అన్నాడు శాస్త్రి , ఆ మనిషిని పరీక్షించి చూస్తూ. ఆ మనిషి పరమ వికారం గానూ, బికరిలాగానూ వున్నాడు.
"వెళ్ళండిక్కడ్నించి -" అన్నాడామనిషి.
"ఇక్కడేం జరుగుతుందో తెలుసుకుని మరీ వెడతాం --" అన్నాడు శర్మ.
ఆ మనిషి ఒప్పుకోలేదు. ఆ అమ్మాయి చదువుకున్న దానిలా వుంది. వీడు బిచ్చగాడిలా వున్నాడు. ఇక్కడిలా ఎందుకు కలుసుకుంటున్నారు? ఈప్రశ్నకు జవాబు దొరికేదాకా మిత్రులిద్దరూ అక్కణ్ణించి కదలమని చెప్పేశారు.
"మేమిద్దరం ప్రేమించుకున్నాం--" అన్నాడా మగాడు.
"నేను నమ్మను. ఇందులో ఏదో తిరకాసుంది. నాలుగు తంతే నువ్వే నిజం చెబుతావు--" అంటూ శాస్త్రి చెయ్యత్తాడు.
అరుపులూ , కేకలూ పెట్టడం ఆ బికారి వాడి కిష్టం లేదు- కాబోలు ...త్వరగానే తమ కధ చెప్పాడు.
ఆ బికారి బికారి కాదు. అదో వేషం. అతడు, ఆమె కూడా పరమ బికారి వేషంలో ఈ ఇల్లు చేరుకున్నారు. వారి దగ్గర జోలెల నిండా , చల్లని ఫోల్దింగ్ పరుపుతో పాటు ఎన్నో ఆధునిక శృంగార ఉపకరణ సాధనాలున్నాయి. వాటి సాయంతో ఇద్దరూ ఘుమఘుమలాడేలా తయారై ఓ గంట గడిపి వెళ్ళిపోతారుట. ఇద్దరూ ప్రేమికులు. అమ్మాయి మధ్యతరగతి కుటుంబీకురాలు. డబ్బు అవసరంలో వుంది. మగాడు ఉళ్ళో టాప్ లెవల్ పెద్దమనిషి. వెళ్ళింటికి డబ్బు సాయం చేసి ఈ పిల్లను ఎవ్వరికీ తెలీకుండా రహస్యంగా అనుభవించడం వాడి ఉద్దేశ్యం.
"అది నేనేం చెబితే అది చేస్తుంది. దాని తల్లి చావు బతుకుల్లో వుంది. వైద్యం పేరు చెప్పి నెలకు అయిదు వేలు దాకా ఖర్చవతుంది. రోజుల్లెక్కన రేటు కట్టినా నేనిచ్చేది ఎక్కువే! కానీ నేను వితరణ గలవాడ్ని, జాలి గుండె కలవాడ్ని కాబట్టి అటు పుణ్యం, ఇటు పురుషార్ధం చూసుకుని దీన్నిక్కడకు తీసుకొచ్చాను. ఒక్కరోజుకూ- కావాలంటే నా తర్వాత మీరు కూడా దాన్ని వాడుకోండి. కానీ నా రహస్యం దాచండి--" అన్నాడు బికారిలా కనబడే మగాడు.
"నువ్వలా కూర్చో-- మమ్మల్ని ముందా అమ్మాయితో మాట్లాడనీ -- " అన్నాడు శర్మ. శాస్త్రి. అక్కడ పడి వున్న మురికి గుడ్డల్ని మూలగా విసిరేశాడు. ఆ యువతి గబగబా బట్టలు వేసుకుంది. అప్పుడు శాస్త్రి ఆమెను సమీపించి -- "నీకేం భయం లేదు. వాడంటే నీకు ఇష్టమేనా?' అన్నాడు.
"ఇష్టం లేదు. కానీ తప్పదు ...." అన్నదా యువతి.
"మీ అమ్మకు వైద్యం జరిగుతుంది. నీకే ప్రమాదం వుండదు. ఆ బాధ్యత నాది. ఇంకా వాడంటే నీకిష్టమేనా?"
ఆ యువతి స్వరం తగ్గించి -- "వాడి పేరు భూషణ రావు. వాణ్ని కాదని ఈ ఊళ్ళో ఎవ్వరూ బ్రతకలేరు. ఊళ్ళో పెద్ద మనిషి. అందుకే నాలాంటి కన్నె పిల్లల్ని ఇలాంటి చోట్లకి తీసుకువస్తాడు. నా అదృష్టం కొద్దీ ఈ రోజే మీరొచ్చారు. ఈరోజే మొదటిసారిగా వీడు నన్ను తీసుకుని వచ్చాడు--"అంది.
శాస్త్రికి ఆ మాటలు అంత నమ్మదగ్గవిగా తోచలేదు. అవకాశం రాగానే ఏ ఆడదైనా తను కన్నెపిల్లనని నమ్మించాలని చూస్తుంది. అయినా అంతకుమించి ఆమె మాత్రం ఏం చేయగలదు? అబల, అసహయురాలు.... ఆడది! శాస్త్రి ఆమెని వదిలి భూషణరావు దగ్గరకు వచ్చి "మిస్టర్ భూషణరావు నీ రహస్యం మాకు తెలిసిపోయింది - ఇకమీదట నువ్వీ పిల్ల జోలికి వెళ్ళకూడదు వెళ్ళావో నీ బ్రతుకు బైట పెడతాం--" అంటూ శర్మ వైపు చూసి -- "ఊ" అన్నాడు. వెంటనే శర్మ తన దగ్గరున్న మినీ కెమెరా తో భూషణరావు మారువేషం ఫోటోలు విడివిడిగానూ, ఆ యువతి తోనూ కలిపి కూడా తీశాడు.
"ఈ ఫోటోలు వాడే అగత్యం మాకు కలిగించకు--" అంటూ శాస్త్రి భూషణరావు ని హెచ్చరించాడు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక శాస్త్రి, శర్మ అక్కడే మకాం చేయాలనుకున్నారు. భోజన పదార్ధాలు కూడా తెచ్చుకున్నారు. తినేసి కటిక నేల మీద నిద్రపోయారు. చాలా రోజులుగా అలిసిపోయి వున్నారేమో - ఇద్దరికీ వళ్ళు తెలియని నిద్ర పట్టేసింది.
చీకటి పడిన కొంతసేపటికి ఆ యింటి ముందు ఓ దృడ కాయుడు ఆగాడు. అతడు చూడ్డానికి కాస్త భయకరంగానూ, చాలా బలం గానూ వున్నాడు. ఆ ఇంటి ముందు ఆగి చుట్టూ చూశాడతను. తటపటాయిస్తూ గుమ్మం దాకా వెళ్ళి తలుపు తోశాడు. నేలమీద పడుకుని వున్న రెండు ఆకారాలు అతడికి కనిపించాయి. దృడకాయుడు ఆ అకారాల్ని సమీపించి ఓ ఆకారం మీద చేయి వేసి -- "ఏయ్-- ఏయ్- లే!" అన్నాడు.
ఆ ఆకారం ఓ పట్టాన లేవలేదు. దృడ కాయుడు చాలాసేపు కుదిపాడు. అతికష్టం మీద ఆ ఆకారం కళ్ళు విప్పి --" ఎవర్నువ్వు?" అన్నాడు.
"నేను పోతురాజు మనిషిని. వడ్డీ కట్టడానికింకా నెలరోజుల్లో ఒకరోజు అయిపొయింది --" అన్నాడా వ్యక్తీ.
శాస్త్రి ఉలిక్కిపడి -- శర్మా -- లే!" అన్నాడు అప్రయత్నంగా.
శర్మ కూడా లేచాడు. దృడ కాయుడు ఆశ్చర్యంగా "వేషం చూస్తె ముస్లిమ్స్ లా వున్నారు. మీరు హిందువులా?' అన్నాడు. అప్పటికి శాస్త్రికి తను చేసిన పొరపాటు స్పురించింది-- "మేము హిందువులం, ముస్లిలం --" అన్నాడతను గంభీరంగా.
"ఎవరతను?" అడిగాడు శర్మ.
"పోతురాజు వడ్డీ గురించి హెచ్చరించడానికి పంపాడు--" అన్నాడు శాస్త్రి.
"హెచ్చరికే కాదు . అన్న టైముకి డబ్బివ్వవక పొతే వసూలు చేయాల్సింది కూడా నేనే!" అంటూ అతడు చేతులు కదిపి కండలు పొంగించాడు.
"చాలా థాంక్స్ - మీ మేలు మరువలేను--మరి మళ్ళీ రేపు కలుద్దాం--" అన్నాడు శర్మ. పోతురాజు మనిషి వెళ్ళిపోయాడు. మిత్రులిద్ద్రరూ లేచి కళ్ళు నులుపుకుని -- "ఇంకా ఈ వెధవింట్లో ఎందుకూ వుండడం . ఇంక హోటలు కే పోయి ఉండొచ్చు" అనుకుని అక్కణ్ణించి కదిలారు.
7
నాలుగు రోజులు పాటు శాస్త్రి , శర్మ రకరకాల ప్రాంతాలు తిరిగారు. నాలుగు రోజులు కూడా రాత్రి అయ్యేసరికి పోతురాజు మనిషి శాస్త్రిని హెచ్చరించడం జరిగింది.
"మన్ని ఇంత తెలివిగా ఎలా నిఘా వేస్తున్నాడో తెలియడం లేదు--" అన్నాడు శాస్తి.
"పోతురాజు అక్కడ నిన్నేం చేశాడో పూర్తిగా మరోసారి చెప్పు!" అన్నాడు శర్మ.
"నా ఫోటో తీసుకున్నాడు. నా వెలి ముద్రలు తీసుకున్నాడు...." అని ఆగి ....'అన్నట్లు దెంతోనో నన్ను గుచ్చాడు కూడా -- చురుక్కుమంది నాకప్పుడు. అప్పుడు నేను దాన్ని గురించి అంతగా పట్టించుకోలేదు--" అన్నాడు శాస్త్రి.
"ఇంకేం అర్ధమయింది. ఇది సామాన్యమైన గ్యాంగు కాదు. చాలా పెద్ద గ్యాంగు , నీకు బహుశా హాని చేయని రేడియేషన్ డోస్ ఇచ్చి వుంటాడు దాంతో నువ్వేక్కడున్నది సులభంగా ట్రేస్ చేస్తున్నారు. నీ ఫోటో వుంది, నీ వెలి ముద్ర వుంది. నీ ఉనికి తెలుస్తుంది. ఇంకేం -- నీకెంత అప్పయినా ఇవ్వగలరు వాళ్ళు--" అన్నాడు శర్మ.
"అయితే మనమిప్పుడెం చేయాలి? ఇంటాయన బాకీ వసూలవుతుంది కానీ ప్రతినెలా పదేసి వేలు ఈ పోతురాజు కెక్కడ చదివించుకుంటాం!" అన్నాడు శాస్త్రి.
'అవును, ఇప్పుడెం చేయాలి?" డబ్బు వెనక్కివ్వాలన్నా కూడా మనం ఖర్చు పెట్టింది కాక ఇంకో పది వేలు జతపర్చి మరిఇవ్వాలి . లేనిపోనీ చిక్కు తెచ్చుకున్నాం" అన్నాడు శర్మ.
