పొదుపరి భర్తలు- గడుసరి భార్యలు
న్నలగడ్డ రామలక్ష్మీ

రామం, రవి ఇద్దరూ ఒకే గదిలో అద్దె కుంటున్నారు. అది చాలా చిన్న గది. అయితేనేం అద్దె కూడా చాలా తక్కువ . ఇద్దరూ ఓకే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఒకే జీతం ఇద్దరికీ యించుమించు ఒకే మారు పెళ్ళిళ్ళు అయ్యాయి. ఇద్దరి భార్యలదీ ఒకే ఊరు. వారిద్దరూ స్నేహితురాండ్రు.
రామం, రవి -- ఇద్దరికీ యింకా పాతికేళ్ళు నిండలేదు. కాపురం పెట్టాలంటే యిద్దరికీ భయంగానే ఉంది. కారణం .... ఖర్చులు....
సుమారు ఎనిమిది వందల రూపాయల జీతం వస్తుంది. అందులో ఇంటి అద్దె వందరూపాయలు. చెరో యాభయ్యీ యిచుకుంటారు. ఇద్దరూ ఖర్చుల విషయంలో యెంతో పొదుపుగా వుంటారు. వాళ్ళ అయిడియా ఏమంటే ఒకటి రెండు సంవత్సరాల పాటు డబ్బు బాగా పోగుచేసి అప్పుడు భార్యలను కాపురానికి తీసుకు రావాలని!
వీళ్ళకీ అభిప్రాయం కలగడానికి స్నేహితులు కారణం. ఆడవాళ్ళు దుబారా మనుషులనీ -- భర్త యిబ్బందుల నర్దం చేసుకోరనీ- ఒకసారి కాపురం పెట్టాక - వాళ్ళు ఏమంటే అది చేసి తీరాలనీ స్నేహితులంతా వీళ్ళని భయపెట్టారు. అందులో కొంత నిజమూ వున్నదని వీళ్ళకు అనిపించేది. పెళ్ళయి కాపురాలు పెట్టిన స్నేహితులంతా అప్పుల పాలై వున్నారు.
రామం , రవి - ఇళ్ళకీ విషయం రాయలేదు. ఇంటి కోసం వెతుకుతున్నామనీ దొరకగానే కాపురం పెడతామనీ వాళ్ళు రాశారు.
ఇద్దరిలోకి రామం నిదానస్తుడు. రవి దుడుకు మనిషి. అతడికి యిట్టె కోపం వచేస్తుంది. అది పాలపొంగులా తగ్గిపోతుంది కూడా. రవికి తన బలహీనత గురించి తెలుసు. అందుకని అతడు సాధారణంగా రామం సలహా తీసుకుంటే గానీ ఏ విషయంలోనూ ముందుకు వెళ్ళడు.
ఇద్దరూ సెలవులు కలిసి వచ్చినపుడు కలిసి యింటికి వెళ్ళి వస్తుంటారు. వీళ్ళని ఆదర్శ స్నేహితులుగా చాలా మంది చెప్పుకుంటారు.
రామం భార్య కమల. రవి భార్య విమల. వాళ్ళ నుంచి వారానికి రెండుసార్లు ఉత్తరాలు వస్తాయి. ఆ ఉత్తరాలు వచ్చిన రోజు వాళ్ళకు పండుగ రోజు. ఉత్తరం వచ్చిన వెంటనే బదులు రాస్తుంటారు.
ఆరోజున ఇద్దరికీ ఉత్తరాలు వచ్చాయి. రామం తనకు వచ్చిన ఉత్తరాన్ని చదువుకుని అదోలాగున ఉండిపోయాడు. రోజూ కనిపించే మెరుపు ఆరోజు అతడి కళ్ళలో కనబడలేదు. అయితే ఆ విషయం రవి గమనించలేదు. అతడు తన ఉత్తరం చదువుకునే హడావుడిలో వున్నాడు. ఉత్తరం చదవడం పూర్తీ కాగానే అతడి ముఖం అయోమయంగా అయిపొయింది.
"ఇది నా ఉత్తరం కాదు బ్రదర్?' అన్నాడు రవి. అతడా ఉత్తరాన్ని రామానికి అందించాడు.
"డియర్ మూర్తీ!
మావారిప్పట్లో నన్ను కాపరానికి తీసుకెళ్ళరు. ఇక్కడికి రావడం కూడా వచ్చే దసరాలకే! నువ్వు- కొన్నాళ్ళ పాటు నెలనెలా యిక్కడికి క్యాంపులు వేసుకోరాదూ! నీ కౌగిలి కోసం ఎదురు చూస్తున్నాను. పెళ్ళికి ముందు నీతో అనుభవాలు మధురాను భూతులుగా నెమరు వేసుకుంటున్నాను. కానీ ఎంత కాలమని యిలా నెమరు వేసుకొను.... కొత్త అనుభూతులు కలిగించడానికి ఒక్కసారి రావూ?
నీ
విమల
రామం ఉత్తరం పూర్తీ చేసి ...."ఈ ఉత్తరం నీకు కాదు- కానీ ....ఇదినీ భార్య వ్రాసిందే ....క్రింద సంతకం చూడు..."అన్నాడు.
అప్పటికీ రవి బుర్ర పనిచేయసాగింది . ఉత్తరం లోని సారాంశం అతడికి వంట బట్టేసరికి ముఖం ఎర్రబడింది.
'అంటే?" అన్నాడతను పిడికిలి బిగించి.
"ఆవేశపడకు"అన్నాడు రామం.
"నీకూ ఇలాంటి ఉత్తరం వచ్చి వుంటే నా బాధ తెలిసేది....' అన్నాడు రవి.
రామం నవ్వి ఊరుకున్నాడు.
"దాన్ని చంపేస్తాను " అన్నాడు రవి.
'అందువల్ల నీకు లాభమేమిటి?"
విమలను తను చంపడం లోని లాభనష్టాల గురించి ఆలోచించడానికి రవికి కాసేపు పట్టింది.
'అవును- అందువల్ల నాకు లాభమేమిటి? దానికి విదాకులిచ్చేస్తాను . ఇంకో పెళ్ళి చేసుకుంటాను...." అన్నాడు రవి.
"ఆ సంగతి తర్వాత చూడొచ్చు. నువ్వు కంగారు పడకు. ఈరోజే ఇంటికి బయల్దేరి వెళ్ళు. నీ భార్యను ఎకాంతంలోకి పిలు. ఈ ఉత్తరాన్ని చూపించి సంజాయిషీ అడుగు అప్పుడు బహుశా నువ్వు అనుకోనిది జరుగవచ్చు" అన్నాడు రామం సాలోచనగా.
"కానీ.....నేను నా ఆవేశాన్ని అణచుకోలేమోననిపిస్తోంది. నువ్వు కూడా నాతొ రారాదూ" అన్నాడు రవి.
"నో....నేను రాను. నువ్వొక్కడివే వెళ్ళి వచ్చి జరిగింది నాకు చెప్పాలి " అన్నాడు రామం.
"నేనొక్కడినే వెడితే దాన్ని చంపేస్తానని నా అనుమానం...."
"అయితే నీకూ స్వర్ణకూ జరిగిన వ్యవహారం విమలకు తెలిస్తే -- విమల నిన్నేం చేయాలి ?' అన్నాడు రామం.
'అదా? ....అది వేరు....'అన్నాడు రవి నీళ్ళు నములుతూ.
"అది వేరెందుకవుతుంది? వయసులో ఒంటరి తనం యువతీ యువకుల మనసుల్ని పెడద్రోవ తోక్కిస్తుంది"
"కానీ పెళ్ళయ్యాక కూడా -- ఇలా బరితెగించి ...."
'చూడు రవి ! నీకు స్వర్ణతో కలిగిన సంబంధాన్ని పెళ్ళి అంటారా? అదొక తాత్కాలికమైన అనుభవం. మన భ్ర్యలను సంబంధించినంత వరకూ మన విషయమూ అంటే౧ వారికీ మనకూ సరియైన అనుబంధమేదీ! కొన్నాళ్ళు కలిసి కాపురం చేస్తే తప్ప అసలైన అనుబంధం ఏర్పడదు. అప్పుడొకరి నొకరు గాడంగా ప్రేమించాడమూ, ఒకరి కోసం ఒకరు బ్రతకాలను కోవడమూ జరుగుతుంది. నా మటుకు నాకు తప్పు మనదే ననిపిస్తుంది. త్వరగా కాపురం పెట్టె ఏర్పాట్లు చేయాలని పిస్తుంది " అన్నాడు రామం.
'ఇంకా దానితో కాపురమా?" అన్నాడు రవి.
"చూడు.... గురివింద గింజలా మాట్లాడకు" అన్నాడు రామం.
2
రవి తలుపు తట్టగానే విమలే వచ్చి తలుపు తీసింది.
"మీరా?" అన్నదామె . ఆశ్చర్యంతో ఆమె కనురెప్పలు అల్లల్లాడాయి. క్షణ మాత్రం ముగ్ధుడై చూశాడు రవి.
"ఇంట్లో ఎవ్వరూ లేరా?' అన్నాడు రవి.
"లేరు - ఉత్తరం లేకుండా ఇలా వచ్చేశారేమిటి?"
"ఏం రాకూడదా?" నీ కార్యక్రమాలకు అంతరాయం కలుగుతుందా?" కటువుగా అన్నాడు రవి.
"మీరు వస్తే నా కార్యక్రమాలకు అంతరాయం కలగడమేమిటండీ -- కార్యక్రమాలు ప్రారంభమయ్యేదే మీ రాకతో ..." అంది విమల మనోహరంగా నవ్వుతూ.
ఆ నవ్వుకు రవి కరిగిపోతున్నాడు. తను కరిగిపోకుండా వుండడం కోసం అతడు ఉత్తరం గుర్తు చేసుకుంటున్నాడు. మళ్ళీ అతనిలో ఆవేశం పుడుతున్నది.
ఆ యింట్లో రవి- విమల ....ఇద్దరే!
విమల తనకు భార్య ...ఏకాంతం లో దొరికింది ... కొద్ది నెలల విరహం ....కానీ ఆమె కులట....
కులట అయితేనేం ....తనకు భార్య కాబట్టి తన కోరికను అభ్యంతరం చెప్పదు. తన కోరిక తీరాక అప్పుడామెను నిలదీయాలి. నిందించాలి. కాల దాన్ని పోవాలి.
అదీకాక రామం తనను అవేశపడవద్దన్నాడు.
రవి విమల భుజం మీద చేయి వేశాడు. ఆమె అతడిని వాతెసుకున్నది. అది స్త్రీ పురుషుల కౌగిలి. అ అనుభూతి అనుభవంతో మాత్ర,మే తెలుసుకోనగలిగినది.
"ఏమండీ?" అంది విమల.
"ఊ" అన్నాడు రవి.
"మనమెప్పుడూ యిలాగే...." సగంలో ఆపేసింది విమల.
రవికి మళ్ళీ భార్య కులట అన్న విషయం గుర్తుకు వచ్చింది. ఇప్పుడు ఈ పళంగా ఈమెను పీకే పిసికి చంపేస్తే....
...అమ్మో...జైలు....ఉరిశిక్ష....
తన కౌగిలి లో వున్నది ఓ కులట. ఆమెనేలా భరించడం?
రవికి రామం సందేశం గుర్తు వస్తున్నది. కులట అయిన స్త్రీ వద్దకు కులట అని తెలిసి వెళ్లి డబ్బిచ్చి అనుభవించి వస్తున్నా రెందరో పురుషులు.
