న్యూయార్క్ లో, ఓ రెస్టారెంట్ లో ఓ యాడ్ ఫోటో గ్రాఫర్ కృష్ణనందనని మొట్ట మొదటిసారి చూసి థ్రిల్లయి పోయాడు.
ఆ యాడ్ ఫోటో గ్రాఫర్ పేరు జయముఖి, బొంబాయికి చెందినా ఫేమస్ యాడ్ ఫోటో గ్రాఫర్. విడీయో గ్రాఫర్ అతను.
నేరుగా తనని తాను పరిచయం చేసుకుని, మోడల్ గా రమ్మని ఆహ్వానించాడు.
మొదట సిగ్గుపడింది కృష్ణనందన.
తర్వాత సరదా పడింది. తర్వాత తన అందానికి గర్వపడింది.
ఒప్పుకుంది.
జడ్ - టర్కీ టవల్స్ యాడ్ ఫిల్మ్ లో మొట్టమొదట నటించింది. అంతే ----ఆ యాడ్ పిల్మ్ ఇండియాలో అద్భుతమైన సంచలనం సృష్టించింది.
ఎక్కడా చూసినా ----
ఎవరి నోటి వెంట విన్నా -------
కృష్ణ నందనా........కృష్ణ నందన.......
తర్వాత రెండు, మూడు సోప్స్........ఆ సోప్స్ రెండూ అతి తక్కువ సమయంలో ప్రాచుర్యాన్ని పొందాయి. విపరీతంగా సేల్స్ పెరిగాయి. ఆ సమయంలో మిస్ ఇండియా గా ఎన్నికైంది. దాంతో బొంబాయి మద్రాసు సినిమా ప్రోడ్యుసర్స్ దృష్టి కృష్ణనందన మీద పడింది. మొదట బొంబాయికి చెందిన ఓ ప్రొడ్యుసర్ ఫిల్మ్ లో యాక్టు చెయ్యడానికి ఒప్పుకుంది కృష్ణనందన.
కో - ప్రొడ్యుసర్ ల, ప్రొడ్యుసర్ మధ్య తగువు ఎర్పడడంతో ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది.
వెంటనే మద్రాస్ నుంచి వచ్చిన ఆ ఫర్ని కాదనకుండా ఒప్పుకుంది.
ఆ సినిమా "ప్రేమ పిలుపు"
సూపర్ డూపర్ హిట్టయింది ఆ సినిమా.
తెలుగులో ఏడాది పాటు ఆడింది. తమిళ, కన్నడ, మళయాళ ఆఖరికి హిందీలోనూ సంచలనం సృష్టించింది.
వరసగా ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చిపడ్డాయి. ఊపిరి తీసుకోకుండా వచ్చిన అవకాశాల్ని ఉపయోగించుకుంది.
విశాలమైన సోఫాలో విశాలమైన ప్రొడ్యుసర్, విలాసంగా కూర్చున్నాడు.
ఆయనకేదురుగా------
విమల్.......
"మీ అమ్మగారు మహానటి మీ నాన్నగారు కూడా గొప్ప నటుడు నాకు ఫ్రెండ్ .....అందుకే నిన్ను నా సిన్మాలో తీసుకున్నాను .......ఏం చేస్తారో ఏమో .......మన పిక్చర్ సూపర్ హిట్టవ్వాలి....హిట్టయితే మీ ఫెయిర్ తోనే హిందీలోనూ తెలుగులోనూ సినిమాలు ఎనౌన్స్ చేస్తాను...."
చెప్పుకు పోతున్నాడు ప్రొడ్యుసర్.
అదే సమయంలో ఆ గదిలోకి ఎంటరైంది కృష్ణనందన.
హరివిల్లు కిందకు దిగి, ఆకు చెప్పులేసుకుని నడిచినట్టుగా ముందుగా అందంగా వచ్చి కూర్చుంది కృష్ణనందన.
"చూడమ్మా......కృష్ణనందన. ఈయనే విమల్. నిన్న చెప్పానుగా మన రుక్మిణీ దేవి గారబ్బాయి."
విమల్ ని పరిచయం చేసాడు ప్రొడ్యుసర్.
మందారం మొగ్గ విచ్చుకున్నట్టుగా నవ్వింది కృష్ణనందన.
ఆ నవ్వు, జలపాతంలో తడిసిన అడవి పువ్వులా వుంది.
అభిమానంగా విమల్ వేపు చూసింది కృష్ణనందన.
ఆత్మీయంగా కృష్ణనందన వేపు చూసాడు విమల్.
డోర్ పట్టుకుని నిలబడి వున్నాడు మేనేజర్ - కల చెదిరిపోయింది.
"మీ కోసం ఎవరో వచ్చారు."
"నా కోసమా ఇక్కడకా" ఆశ్చర్యంగా అడిగాడు విమల్.
"మాధురి" మేనేజర్ నోట్లోంచి ఇంకా ఆ మాట రాలేదు.
గబగబా బెడ్ రూం లోంచి బయటికొచ్చి , మెట్లు దిగాడు.
కింద హల్లో , బూడిద రంగు సోఫామీద కుర్చునుంది మాధురి.
"ఏవిటి సడన్ సర్ ఫ్రైజ్ ......" మాధురికి ఎదురుగా , కుర్చీలో కూర్చుంటూ అన్నాడు విమల్.
"సర్ ప్రైజ్ ల స్టార్ మీరే .....నేను కాదు. సడన్ గా హైదరాబాద్ వచ్చారు. సడన్ గా మాయమైపోయారు." అంది నవ్వుతూ మాధురి.
నవ్వాడు విమల్.
"ఆ రోజు నా ప్రవర్తనకు మీకేం కోపం రాలేదు కదా." నెమ్మదిగా అన్నాడు విమల్.
"కోపమా. వచ్చే వుంటుంది. నాకు తెలీదు.' తిరిగి చిన్నగా నవ్వుతూ అంది మాధురి.
"అవునూ, ఈ సీక్రెట్ ప్లేస్ ఎలా కనుక్కున్నారు మీరు." లంచ్ చేస్తున్న సమయంలో అడిగాడు విమల్.
"ఇప్పుడిప్పుడే మీ సీక్రెట్స్ అన్నీ తెల్సుకుంటున్నాను" ఓరగా చూస్తూ అంది మాధురి.
"నో సీక్రెట్స్ ఇన్ మై లైఫ్.......మై లైవ్ ఈజ్ ఎన్ ఓపెన్ ప్లే గ్రౌండ్....ఎనీ బడీ ప్లే......' అన్నాడు విమల్ ఓరగా చూస్తూ.
"ఓపెన్ బుక్ ని , ఓపెన్ ప్లే గ్రౌండ్ గా మార్చారా......బాగుంది......బైదిబై రేపు ఈవినింగ్ ఏదైనా ప్రోగ్రాం ఉందా....."
"లేదు......సాంగ్ పిక్చరైజేషన్ .........నైట్ " అన్నాడు విమల్.
"అయితే రేపు ఈవినింగ్ షార్ప్ సిక్సో క్లాక్ కి వింటర్ సీజన్ ఫంక్షన్ హాల్ కోస్తారా?"
ఏం .......ఏవిటి విశేషం."
"అది సస్పెన్స్ ......మీరోస్తానంటే నేనే దగ్గరుండి తీసికెళతాను. ఓ.కే.-
అంగీకారసూచకంగా తలూపాడు విమల్.
మరి కాసేపయ్యాక మాధురి అక్కడనుంచి వెళ్ళిపోయింది. మాధురి వెళ్ళిపోయాక మాధురి ఆలోచనలతో చాలాసేపు గడిపాడు విమల్.
అంతకు కొన్ని గంటల ముందు కృష్ణ నందన నుంచి వచ్చిన ఫోన్ కాల్ విషయం పూర్తిగా మరిచిపోయాడు.
మాధురి....మాధురి......ఎటుచూసినా మాధురి.
* * * *
