Previous Page Next Page 
వసుంధర కధలు -12 పేజి 28

 

                          ఘరానా హంతకుడు
                    
                                                                       వసుంధర

    'ఆయనింట్లో లేరు" అంది సీత.
    అతను నవ్వి "కావచ్చు , కానీ ఇంటికి వస్తారేమో కదా" అన్నాడు.
    "వస్తారు, కానీ అందుకింకా రెండు గంటలు టయిముంది" సందేహంగా అంది సీత.
    "ఫరవాలేదు. అంతసేపు వేచి వుండడం నాకు కష్టం కాదు" అంటూ లోపల కడుగు వేశాడతను.
    ఏం చేయాలో తోచలేదు సీతకు. అతను చూడ్డానికి చాలా మర్యాదస్తుడిలా కనబడుతున్నాడు. వయసు ముప్పై ఏళ్ళు ఉండవచ్చు. మాటల్లో సంస్కారం కనబడుతోంది. కానీ ఇంట్లో తనోక్కర్తే వుంది. ఇలాంటి సమయంలో అతను తనింట్లో రెండు గంటలసేపు వుండడం తనకు భయం కలిగించడం మాటటుంచి చూసే వాళ్ళకు బాగుండదు.
    "మీరెవరో తెలుసుకోవచ్చా?' అనడిగింది సంకోచంగా.
    "ఏమీ కంగారుపడనవసరం లేదు. అన్నయ్యా అని నన్ను నువ్వు పిలిస్తే ఆ పిలుపుకు అన్నివిధాలా న్యాయం చేకూర్చేలా ప్రవర్తించగలను " అన్నాడతను.
    అతని ఏకవచన ప్రయోగం సీతకు చాలా బాధ కలిగించింది. అయినా ఏమీ అనలేకపోయింది. ఎటొచ్చీ అతని మాటలు మనసుకు కాస్త శాంతినిచ్చాయి. "ఇంతకీ మీరెవరో చెప్పలేదు" అంది మళ్ళీ.
    అతను చనువుగా వెళ్ళి ఒక కుర్చీలో కూర్చున్నాడు. సీత తలుపులు వేయలేదు. ఆమె గుమ్మం దగ్గరే నిలబడింది.
    "నేనెవరినో తెలుసుకోవలసిన అవసరం నీకు లేదు" కానీ నువ్వు నన్నందరికీ నీ అన్నయ్యగా పరిచయం చేయాలి. అది నీకే మంచిది" అన్నాడతను.
    సీతకు చిరాకేసింది. "నువ్వెవరో నాకు తెలియదు. నిన్ను నా అన్నవని చెప్పుకోవలసిన అవసరం నాకే ముంది?"
    అతను చాలా తమాషాగా నవ్వి "వెరీగుడ్" అన్నాడు. "నువ్వు నన్నలా నువ్వనడమే బాగుంటుంది. అన్నయ్య నే చెల్లెలూ మీరు మీరు అంటూ మన్నించదు" అని ఒక్క క్షణం ఆగి "నన్ను నీ అన్నగా చెప్పుకోవలసిన అవసరం నీకు బాగా వుంది. నేనీ ఇంట్లో కొంతకాలం పాటు అతిధిగా ఉండబోతున్నాను. మరేరకమైన బంధుత్వమూ మనకు శ్రేయస్కరం కాదు" అన్నాడు.
    సీత ముఖం ఎర్రబడింది. 'అన్నీ నువ్వనుకంటే సరిపోదు" మే మంగీకరించాలి కదా."
    'చాలా పోరబడ్డవు" అన్నాడతను. "నాకోకరి అంగీకారనంగీకారాలతో పని లేదు. అనుకున్న పని అయేదాకా అనుకున్న చోట ఉండటానికి నేనెవరి అనుమతి కోసమూ ఎడురుచూడను."
    సీత కాస్త భయపడినా తమాయించుకుని "మేమూ అంతే -- మా అనుమతి లేనిదే మా ఇంట్లో ఎవ్వరూ ఒక్క క్షణం కూడా ఉండలేరు" అంది.
    'అలాగా -- ఆ సంగతీ చూద్దాం కానీ, చూడు చెల్లాయ్ నీ పేరేమిటో చెప్పమ్మా! చెల్లెలి పేరు తెలియకుండా ఉన్నానంటే బాగుండదు" అన్నాడతను.
    "మంచిది . నా పేరు సీత , నీ పేరు తెలుసుకోవచ్చా?" అనడిగింది సీత.
    "కొంతమందికి పేర్లతో నిమిత్త,ముండదు. రోడ్డు మీద కూరలమ్మేవాడిని వాడమ్మే కూరల పేరుతొ పిలుస్తాం తప్పితే పేరు తెలుసుకుందుకు ప్రయత్నించరు. అలాగే రిక్షావాళ్ళని, టాక్సీ వాళ్ళని -- వాళ్ళు వాళ్ళు నడిపే వాహనాల పేర్లతో పిలుస్తారు. పల్లెటూళ్ళలో అయితే కొంత మందిని బొత్తిగా పేర్లతో పిలవరు. ఏయ్ మంగలి- ఏయ్ చాకలి అని వాళ్ళ వృత్తుల్ని బట్టి ఆ పేర్లతో పిలుస్తారు. నేనూ అలాంటి వాడినే!"
    "చాలా డొంకతిరుగుడుగా చెబుతున్నావు. పేరు చెప్పవా?"
    "చెబుతాను, కానీ నువ్వు భయపడుతవేమోనని సందేహిస్తున్నాను."
    "నాకేం భయం లేదు, అదేదో నువ్వింట్లో అడుగుపెట్టి నప్పుడే పోయింది." అంది సీత.
    'చాలా మంచిది. అయితే చెబుతున్నాను విను . వృత్తిని బట్టి నన్ను పిలవాలను కుంటే హంతకుడు అని పిలవచ్చు" అన్నాడతను.
    సీత నివ్వెరపోయింది నోట మాట లేకుండా అతన్నే చూస్తూ ఉండిపోయింది.
    
                                     2
    ఇంట్లో అడుగుపెడుతూనే వీధి తలుపులు బార్లా తెరిచి ఉండడమూ. లోపల ఒక అపరిమిత వ్యక్తీ కుర్చీలో కూర్చుని ఉండడమూ చూసి ఆశ్చర్య పడ్డాడు జానర్ధనం. బహుశా భార్యకు సంబంధించిన బంధువై ఉంటాడనుకున్నాడు.
    జనార్ధనాన్ని చూస్తూనే ఆగంతకుడు లేచి "వచ్చేవా - రా చాలా కూర్చో !" అన్నాడు.
    అతని పలకరింపుకు ఆశ్చర్యపడుతూ జనార్దనం వెళ్ళి కుర్చీలో కూర్చుని బూట్లు విప్పుకోసాగాడు.
    "సీతా బావోచ్చేశాడు " అంటూ గట్టిగా కేకపెట్టాడు ఆగంతకుడు.
    వంటింట్లో పక్కింటావిడతో కబుర్లు చెబుతున్న సీత లేచింది. పక్కింటావిడ దొడ్డి దారిన వెళ్ళిపోయింది. సీత వీధి గదిలోకి వచ్చింది. ఆగంతకుడు పెట్టిన కేక ఆమెకు చాలా అసహ్యంగా అనిపించింది.
    సీత రాగానే "నీ బంధువుల్లో ఇలా ఓ అన్నయ్యున్నట్లు ముందే చెప్పి వుండాల్సింది సీతా ! ఇప్పుడు నేను వెర్రి ముఖం వేసుకుని చూడాల్సిన అవసరం తప్పేది' అన్నాడు జనార్దనం.
    "నాకేం తెలుసు. రోడ్డు నపోయే చాలామందికి నా కన్నయ్యలు కావాలనుందని" అంది సీత తీవ్రంగా. ఆగంతకుడి ముఖం లో అప్రసన్నత కనబడింది. జనార్దనం ముఖంలో ఆశ్చర్యం కనబడింది. అతనేమీ అర్ధం కానట్లు ఇద్దరి ముఖాలు మార్చి మార్చి చూశాడు.
    "బావా నువ్వు నా చెల్లెలికి మర్యాదలు నేర్చలేదు. అన్నగారినే అనుకో. అయినా ఇంటికి వచ్చేక కాస్త కాఫీ నీళ్ళయినా ఇచ్చిందేమో అడుగు" అన్నాడాగంతకుడు నిష్టూరంగా.
    "ముక్కూ మొగం తెలియని మగ వాడొచ్చి -- మీరు లేరన్నా కూడా వినకుండా ఇంట్లో తిష్ట వేసుక్కుర్చుంటే నేనేం చేసేది చెప్పండి. పక్కింటావీడిని పిలిచి కబుర్లాడుతూ కూర్చున్నాను. ఆవిణ్ణి నేనే పిలిచి పనులు చేసుకుంటూ కూర్చుంటే బాగుండదు కదా -- అందుకే ఈవేళ టిఫిన్ కూడా చేయలేదు " అంది సీత.
    జానార్ధనం ఆగంతుకుడిని తీవ్రంగా చూసి "మిస్టర్ నువ్వు...." అన్నాడు.
    ఆగంతకుడు నవ్వి "మీ ఇంట్లో ఆతిధ్యాన్ని కోరి వచ్చాడు. సుమారు రెండు నెలలుంటాను. చుట్టూ పక్కల అనుమానం రాకుండా ఉండటానికి నీ భార్యకు అన్నగా నీకు బావగా వరుస కలుపుకున్నాను" అన్నాడు.
    ఈ చనువుకు జనార్దనం ఆశ్చర్యపడ్డాడు. "బాగుంది అంతా నీ ఇష్ట మేనేమిటి?"
    'అనే అనుకోవాలి, అనుకున్న పని పూర్తీ చేయడానికి అనుకున్న చోట ఉండడం నా హక్కు" అతను చాలా నిబ్బరంగా అన్నాడు.
    "ఏమిటా అనుకున్నపని ?" తీవ్రంగా అడిగాడు జనార్దనం.
    "ఏం లేదు. కొన్ని హత్యలు చేయాలి!" చాలా సింపుల్ గా అన్నాడతను.
    జనార్దనం త్రుళ్ళిపడ్డాడు. మిస్టర్ ఎవర్నువ్వు?"
    "నేనెవరైతేనెం- నా పెరేమైతేనేం. నన్ను హంతకుడుగా గుర్రించుకుంటే చాలు ."
    ఈసారి జనార్ధనానికి కోపం వచ్చింది. "హత్యలు చేయదలచుకున్న వాడి నిక్కడి కెందుకొచ్చావ్ ? ఏ హోటల్లో నైనా మాకాం పెట్టలేకపోయావా ?'
    "ఎవరికీ అనుమానం రాకుండా అనుకున్న పనులు పూర్తీ చేసుకునేందుకు నీలాంటి వాళ్ళ ఇల్లే బాగా పనికి వస్తాయి. నా పధకాలను నేనెలా అమలు జరుపుతానో నీ కళ్ళతో నువ్వే చూస్తావ్ ...."
    'అయాం సారీ, అలా చూడాలని నేననుకోవడం లేదు. నిన్ను నా ఇంట్లో ఉండనివ్వను."
    "వెర్రి వాడా నిర్ణయం నాది కానీ నీది కాదని మర్చిపోతున్నావ్. నేనుండాలకున్నంత కాలం నువ్వోద్దన్నా ఉంటాను. వెళ్ళి పోవాలనుకున్న రోజున నువ్వు కాళ్ళు పట్టుకు బ్రతిమాలడినా క్షణముండను."
    "కాళ్ళు పట్టుకు బ్రతిమిలాడే రోజు ముందుందేమో కాని తెలియదు కానీ ప్రస్తుతానికి నిన్ను నేను మెడపట్టి గెంటబోతున్నాను " అన్నాడు జనార్దనం ఒక అడుగు ముందుకు వేసి.
    "మంచిది" అని ఆగంతకుడు తనూ ఒక అడుగు ముందుకు వేసి జనార్ధనాన్ని సమీపించి నెమ్మదిగా అతనికి మాత్రం వినిపించేలే "లలితారాణి కధ నాకు తెలుసు!' అన్నాడు.
    జనార్దనం ముఖంలో గాబరా కనపడింది. అతను భార్య వంక చూసి "సీత మంచినీళ్ళు!" అన్నాడు . సీత త్వరగా లోపలకు వెళ్ళింది.
    ఆగంతకుడు జనార్దనం భుజం మీద తట్టి "చూడు అనవసరంగా గాబరాపడకు. నేను నిన్ను బ్లాక్ మెయిల్ చేయడానికి రాలేదు. నీ దగ్గర్నుంచి డబ్బునూ ఆశించడం లేదు, నా పనయ్యే వరకూ నీ ఇంట్లో ఉండనీ" అన్నాడు.
    సీత వచ్చి మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది. జానర్ధనం గటగటా మంచినీళ్ళు తాగేశాడు. తర్వాత భార్య వంక చూసి "సీతా చాలా ఆకలిగా వుంది. ఏదైనా టిఫిన్ చేయి. ఏం చేసినా నీ అన్నయ్య మెచ్చుకునేలా ఉండాలి సుమా" అన్నాడు.
    సీత తెల్లబోయి భర్త వంక చూసింది. తర్వాత ఆమె నెమ్మదిగా వంటింట్లోకి వెళ్ళింది.

                                    3

    కాస్త తగ్గు స్వరంతో జనర్ధనానికీ , అగంతుడి కి సంభాషణ నడుస్తోంది.
    "ఎన్నాళ్ళు ఉంటావ్ ?' మా ఇంట్లో ...." అన్నాడు జనార్దనం.
    "ప్రస్తుతం వేసుకున్న అంచనా ప్రకారం రెండు నేలలనుకుంటున్నాను. ఒకోసారి అంచనాలు తారుమారు అవుతుంటాయి. వెళ్ళడానికి వారం రోజుల ముందు తెలియ జేస్తాన్లె!" అన్నాడాగంతకుడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS