"అంటే....." విమల్ ఎర్రటి ముఖం మీద నెత్తురు మాయమై పోయింది. ఆ ముఖం పాలిపోయింది.
"ఎందుకెళ్ళావ్ .......చెప్పు . ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నారా....ఆ అమ్మాయి పేరేం పేరు........మర్చిపోయాను.....ఒకసారి చెప్తారా......"
"మాదురి" అప్రయత్నంగా విమల్ నోట్లోంచి ఆ పేరు వచ్చేసింది.
"చూసావా.....వెంటనే నీ నోటివెంట ఆ అమ్మాయి పెరోచ్చేసింది. అంటే .....నీకు, ఆ అమ్మాయికి ఏదో "లింక్ " వుందన్నమాట.....మధురిలో నువ్వు ఏం కోరి, ఆ అమ్మాయి వెనుక తిరుగుతున్నావో , నాకేం అర్ధం కావడం లేదు. ...జస్ట్ అప్ట్రాల్ అర్దనరీ సిన్మా యాక్టర్ ........అంతేకదా ....కానీ......
ఓ మిస్ ఇండియా నీ చుట్టూ తిరిగిన క్షణాల్ని నువ్వు మరిచిపోతున్నావ్....."
విమల్ నోటివేంబడి అస్సలు మాటలు పెగలడం లేదు.
తన అసహనానికి, తన దుఃఖానికి తన బాధకు , తన అత్మియతకు తన ఆలోచనల్లో ఏర్పడిన శూన్యానికి ఏం జవాబివ్వాలో " అతనికి తెలీడం లేదు."
మౌనం...
మౌనం.....
అక్టోబర్ ౩౦ న బాబు బర్త్ డే ......నీకు గుర్తుండే వుంటుందనుకుంటున్నాను. అక్టోబర్ అంటే ......ఈ నేలే ......" ఆ మాట అంటున్నప్పుడు నవ్వింది నందన.
'అది జ్ఞాపకం చేద్దామని ........పెట్టేస్తున్నాను....బైదిబై ......నీ ఎదురుగా, నిలబడ్డ, ఆ ఆపరేటర్ కి ఓ రెండువేలు ఇస్తానని చెప్పాను.....ఇస్తావు కదూ......సీ.....యూ .......హేపీ డే....."
ఆ చివర నందన పెట్టిన ముద్దు అస్పష్టంగా వినిపించింది విమల్ కి.
ఫోను రిసీవర్ పెట్టేసిన చప్పుడు.
విమల్ కి మాట్లాడాలని వుంది. మాట్లాడలేడు. ఆ ఫోన్ రిసివర్ని ముద్దు పెట్టుకోవాలనుకున్నాడు ముద్దు పెట్టుకోలేడు, ఆపరేటర్ శంకర్ రిసివర్ని అందుకున్నాడు భయం భయంగా.
టెలిఫోన్ బూత్ లోంచి బయటికొచ్చాడు విమల్.
ఎదురుగా మేనేజర్ వినయంగా చేతులు కట్టుకుని నిలబడ్డాడు.
"అతనికి అయిదువేలు........కేష్ ఇవ్వు" చెప్పేసి గబగబా నడిచాడు విమల్.
'అయిదు వేలా, " డామ్మని నోరు తెరిచాడు ఆపరేటర్ శంకర్ విమల్ చెప్పిన మాటని అతనసలు నమ్మలేకపోయాడు.
"యూ ఆర్ ఎ లక్కీ ఫెలో" మేనేజర్ కి ఆ గొడవలన్నీ తెల్సు. ప్రేమ ఎంత గుడ్డిదో, దయ కూడా అలాంటిదే.
మేనేజర్ తన హ్యాండ్ బ్యాగ్ లో వున్న కేష్ లోంచి అయిదు వందల నోట్లను లెక్కపెట్టి, అయిదువేలు , ఆపరేటర్ శంకర్ చేతిలో పెట్టాడు. జరుగుతున్నాదంతా చిత్రంగా వుంది శంకర్ కి.
ఆ నోట్లను తీసుకుంటున్నప్పుడు శంకర్ చేతులు వణికాయి.
కరెన్సీ కాగితమే అయినా, కరెన్సీ కరెంట్ ఫెన్సింగ్ లాంటిది ఆ విషయం శంకర్ కి తెలీదు.
* * * *
ఎ.సి. రూమ్ లో ఒక్కడూ కూర్చున్నాడు విమల్.
చుట్టూ ఎన్నెన్నో ఆలోచనలు. ఆలోచనల మధ్య నిస్త్రాణంగా కూర్చున్నాడతను.
ఆ ఆలోచనల్లో కృష్ణనందన......
విమల్ ని అమితంగా ప్రేమించిన కృష్ణ నందన.
విమల్ ని అమితంగా ప్రేమించిన కృష్ణ నందన.
కృష్ణ నందన ........క్షణంలో పాత జ్ఞాపకాలు వరద ప్రవాహంలా అతన్ని చుట్టూముట్టాయి.
* * * *
ప్రొడక్షన్స్ ఆఫీసు కోలాహలంగా వుంది. అంతకు ముందురోజే ఆ ప్రొడక్షన్స్ కొత్తసినిమా షూటింగ్ ప్రారంభోత్సవం. అన్నపూర్ణ స్టూడియోస్ లో అట్టహాసంగా ప్రారంభమైంది.
లేడీ ఓరియంటెడ్ సినిమా.
ఒక మగువ మమత, ఆరాధన పరిస్థితుల కారణంగా ద్వేషంగా మారిపోయి, తను అమితంగా ప్రేమించిన మగవాద్నే అనుమానించి అవమానించి, మానసికంగా హింసించి చివరకు ఇద్దరూ ప్రాణత్యాగం చేసే సినిమా.
అందులో హీరోయిన్ కృష్ణనందన..........
కృష్ణ నందన.......
అతి తక్కువ సమయంలో హీరోయిన్ గా పైకొచ్చిన అందమైన నటి కృష్ణనందన.
మద్రాసు లయోలా కాలేజీలో చదువుకుంది. తండ్రి జే. ఆర్ . రావుకి షూ టాపర్స్ ఎక్స్ పోర్టు బిజినెస్ ఉంది. షూ టాపర్స్ ఎక్స్ పోర్ట్ ద్వారానే జే. ఆర్. రావు పైకొచ్చాడు. ఆ బిజినెస్ అతన్ని న్యూయార్క్ వరకు తీసికెళ్ళింది.
న్యూయార్క్ సిటిలో ఒక అద్బుతమైన రెస్టారెంట్ అధిపతి అతను ఆ రెస్టారెంట్ పేరు 'ప్రెటీ ఇండియా"
కృష్ణనందన పోస్టు గ్రాడ్యుయేషన్ న్యూయార్క్ లోనే చేసింది.
జె. ఆర్ . రావు తెలుగువాడు. భార్య బెంగాలీ అమ్మాయికి తల్లి పోలికలోచ్చాయి కృష్ణనందనకు.
కృష్ణనందనను మొదటిసారి చూసిన వాళ్ళేవరూ , ఆ అమ్మాయి ఇండియన్ అంటే ఎవరూ నమ్మరు!
ఏ ఇటాలియన్ నో, ఏ కెనడా అమ్మాయో అనుకుంటారు.
పాదరసం, పాస్టర్ ఆఫ్ పారిస్ చేసిన అపురూపమైన గాజు బొమ్మలా ఉంటుంది కృష్ణ నందన.
నీలికళ్ళు , నీలి నీలి కురులు అశోక వృక్షంలా అంతెత్తు పొడవు ముద్దు ముద్దు మాటలు......హస్కీ వాయిస్........
