మళ్ళీ త్వరగా బుద్ది పనిచేసింది. సాయంత్రం 4 గం|| కి ఒక బస్సుంది. అది ఎక్కానంటే -- రాత్రి 11 గం|| కి శ్రీమతి ఊరు చేరుకుంటాను.ఉత్తరం వచ్చేదాకా అత్తారింట్లో కాపలా కాసి అది అందుకుని శ్రీమతిని తీసుకుని వెనక్కు రావాలి.
కాలేజీకి వెళ్ళి సెలవు చీటీ రాసి ఇచ్చేశాను. ఇంటికి వచ్చి కొద్దిగా రెండు రోజులకు సరిపడా సామాను ఒక ఎయిర్ బ్యాగ్ లో సర్దుకుని బయటకు వచ్చి తలుపు తాళం తీస్తుండగా ఇంటి ముందు కారాగింది. అందులోంచి రమణరావు దిగాడు.
"ఎక్కడికో బయల్దేరినట్లున్నావ్? నీకోసం కాలేజీకి వెళ్ళాను. అక్కడ లేవన్నారు. ఎందుకైనా మంచిదని ఇంటికేసి వచ్చాను. నా ఊహ కరెక్టయింది. నువ్వు దొరికావు !" అన్నాడు రమణరావు.
"ఏమిటి విశేషం?" అన్నాను.
"ఈరోజు క్లబ్ లో రోజీ డ్యాన్సు .నీకు మాటిచ్చాను గదా-- రోజీ డ్యాన్సున్నరోజున క్లబ్ కు తీసుకు వెడతానని" అన్నాడు రమణరావు.
నాలాంటి సెక్సు పిచ్చి వాళ్ళ కోసమే రోజీ పుట్టిందని చాలా మంది అంటారు. చాలా అండర్ గ్రౌండ్ క్లబ్బుల్లో రోజీకి మంచి పేరూ, డిమాండు ఉంది. క్లబ్బు లోనే తన చాలా భాగం జీవితం గడిపే రమణరావు ఆమె చిలిపి చేష్టల గురించి చాలాపర్యాయాలు నాకు చెప్పాడు. నేనుత్సహంగా వినేవాడిని. కానీ ఎక్కడెక్కడి ఊళ్ళకో వెళ్ళి రోజీ డాన్స్ లు చూడ్డానికి నేను రమణారావులా ధనవంతుడిని కాను మరి! అసలు నేనుంటున్న ఊరిలోనే క్లబ్బులకు వెళ్ళలేను నేను. రమణరావు చెప్పే కబుర్లు వింటూ లొట్టవేస్త్గుంటానంతే.
"నీలాంటి వాణ్ణి క్లబ్బు లోకి లాగడం మంచిది కాదనుకో. కానీ ఈ ఊళ్ళో రోజీ డాన్సు ఉన్నప్పుడు తప్పక తీసుకు వెడతాను" అన్నాడేప్పుడో ఒకసారి రమణరావు. అతగాడి కెంత గుర్తు! నామీద అతనికున్న అభిమానానికి నాకు చాలా ఆనందం కలిగింది.
అంతలోనే -- రోజీ డాన్సు చూసే అవకాశం వదులుకోక తప్పదు.
"నేను అర్జంటుగా అత్తగారింటికి వెళ్ళాలి--"
"ఏమిటంత అర్జంటు...."
"తెలియదు. రమ్మని టెలిగ్రాం వచ్చింది. తెల్లారేసరికి ! అక్కడుండాలి!"
రమణరావు నవ్వాడు. "తెల్లారేసరికి కదా -- నేనూ అక్కడికి వెళ్ళాలి. రాత్రి డాన్స్ ప్రోగ్రాం అయేక, నా కార్లో వెడదాం.తెల్లారేసరికి తప్పక అక్కడుంటాం--" సరా?"
మనసు పీకింది. అత్తగారి ఊరు వెళ్ళడానికి -- కారులో అయితే అయిదు గంటలు చాలు. రోజీ డాన్స్ చూసి రమణరావు కారులో వెళ్ళడం ;లో నష్టమేముంది అనిపించింది. మనసులో ఒక మూల భయం పీకుతూనే ఉంది. విధి నాకు ఎదురు దేబ్బతీస్తుందేమోనని.
ఏమైతేనేం రమణరావు నన్ను లొంగదీసుకున్నాడు. రాత్రి తొమ్మిది గంటలకు ఆక్లబ్ కు వెళ్ళాం. సరిగ్గా 8-45 కు రోజీ డాన్స్ ప్రారంభమయింది. ఆమె ఈ డాన్స్ పారిస్ నైట్ క్లబ్ లో నేర్చుకున్నట్లు ప్రకటించి -- నృత్యం ఆరంభించింది.
మేమున్న హల్లో ఒక యాభై మంది మాత్రం ఉన్నారు. అందరూ గొప్పవాళ్ళలాగే కనిపిస్తున్నారు నా కంటికి.
నేనూ,రమణరావు పక్కపక్కన కూర్చున్నాం . రమణరావు తో పాటు నేను కూడా కొద్ది కొద్దిగా తాగుతున్నాను.
రోజీ నిజంగానే పేరుకు తగ్గట్లు రోజా పువ్వులా ఉంది. ఆమె చక్కగా నృత్యం ప్రారంభించింది.అయిదు నిమిషాలలో ఆమె నృత్యం చేసే పద్దతి మారిపోయింది.
రోజీ క్రమంగా వంటి మీద బట్టలు తీసేయడం ప్రారంభించింది. ఒళ్ళంతా వేడెక్కి పోయింది. ఆమె బట్టలు తీసే పద్దతి నన్ను చాలా రెచ్చ గొట్టింది. నా మనసు రోజీతో నిండిపోయింది.
4
"రమణరావు -- నీ ఋణం ఎలా తీర్చుకోగలను? నావంటి సామాన్యుడికి నీ ఖర్చుతో ఎంత సౌఖ్యం కలిగించావు?" అనుకున్నాను. రోజీ ఒడిలో తల పెట్టుకుని, ఒక గంటసేపు రోజీ నాకు స్వర్గ సౌఖ్యాలు చూవిచూపింది.
నా కర్తవ్యం గుర్తొచ్చింది. నేను టైము చూసుకున్నాను. రాత్రి 10 గంటలుదాటింది.
"ఏమిటి టైము చూసుకుంటున్నారు?" రోజీ పలకరించింది.
"ప్రయాణం గురించా?" అంటూ రమణరావు అక్కడికి వచ్చాడు. నేను లేచి కూర్చున్నాను. "ఒక్క కునుకు తీసి పోదాం-- 3 గం || ప్రాంతాల బయల్దేరి వెడదాం -- ఏమంటావు?" అన్నాడు.
ఒక్కక్షణం ఆలోచించాను. 2 గం || కు బయల్దేరినా ఎనిమిది గంటల ప్రాంతాల అక్కడుంటాను. ఏమీ ఇబ్బంది లేదు. నా మనసులోనివిషయం ఊహించాడో ఏమో రమణరావు వెళ్ళిపోయాడు.
మళ్ళీ నాకు మెలకువ వచ్చేసరికి -- చాలా నీరసంగా అనిపించింది. టైము చూసుకున్నాను. వాచీ ఇంకా రెండు గంటలు చూపిస్తోంది. అంటే నేను 3 గం|| లే పడుకున్నానన్నమాట. కానీ ఎంతో కాలంగా నిద్రపోయినట్లనిపిస్తోంది. ఇంకామత్తుగా వుంది కానీ నిద్రపోవాలని లేదు. ఇంకా గంట టైముంది కదా అని బద్దకంగా అలాగే పడుకున్నాను. పక్కలో సుందరి లేదు. జరిగినవన్నీ మననం చేసుకుందుకు ప్రయత్నిస్తున్నాను.
ఈరోజు ఎంత అదృష్టం నాకు! అయాచితంగా ఒక రోజు లభిస్తేనే ఇంత ఆనందంగా ఉందే -- రోజూ ఇటు వంటి ఆనందం లభించే -- రమణరావు అదృష్టం తలచుకుంటేనే అసూయ కలిగింది.
ప్రపంచంలో మరేమీ అవసరం లేదు. కాంత, కనకం - ఈ రెండూ ఉంటే మగవాడికి అంతకంటే కావలసినదేముంది?
టైము మూడయింది. ఇంకా రమణరావు జాడ లేదు. ఉలిక్కిపడి లేచాను.
"మెలకువ వచ్చిందా ?" తియ్యని కంఠం వినిపించింది. గుర్తు పట్టాను. కొన్ని గంటల క్రితం నాకు ఆనందమిచ్చిన రోజీ.
"రమణారావుగారికి ఆరోగ్యం బాగాలేక ఇంటికి వెళ్ళిపోయాడు. మిమ్మల్ని అన్న ప్రకారం తీసుకు వెళ్ళలేక పోయినందుకు సారీ చెప్పమన్నారు -" అంటూ ఆమె నా దగ్గరగా వచ్చింది.
"రమణరావు గారెంత మంచివారు. మీవంటి రసికుల్ని నాకు పరిచయం చేశారు--" ఆమె మృదువుగా నన్ను చుంభించింది.
"ఆ క్షణంలో నా భావాలేమిటో చెప్పలేను. కంగారు, గర్వం, భయం ,ఉత్సాహం అన్నీ కలిపి- చిత్రమైన అనుభూతి కలిగింది.
మళ్ళీ నాకు బస్స్ గతి -- అయిదు గంటల ప్రాంతంలో ఒక బస్సు ఉంది. -- కానీ ఇదేమిటో -- నాకింత నీరసంగా ఉంది.
నేను తూలడం గమనించి -- "ఉండండి కాఫీ ఇస్తాను" అంటూ ఆమె అక్కణ్ణించి వెళ్ళి మరో క్షణం లో వచ్చింది. ఆమె తెచ్చిన వేడి వేడి కాఫీ తాగాక కస్తబలం చేకూరింది. "వస్తాను, చాలా థాంక్స్ -- " అంటూ అక్కణ్ణించి బయటపడ్డాను. రోడ్డు మీద కనబడ్డ రిక్షా ఎక్కి బస్సు స్టాండు చేరుకున్నాను. అప్పుడు టైము నాలుగయింది.
సరిగ్గా నాలుగున్నర కు -- నా బస్సు స్టాండుకు వచ్చింది. ఎక్కి -- టికెట్ తీసుకుని కూర్చున్నాను.
సరిగ్గా అయిదు గంటలకు బస్సు కదిలింది. ఎందుకో చెప్పలేను కానీ చాలా నీరసంగా ఉంది. బస్సు కుదుపుకు మళ్ళీ కాస్త నిద్ర పట్టింది. అలా రెండు గంటల సేపు కునికి పాట్లు పడ్డాక -- బస్సు ఒక ఊళ్ళో ఆగింది. అక్కడ న్యూస్ పేపరొకటి కొన్నాను.
నేను రోజూ రెగ్యూలర్ గా వార్తలు చదువుతాను. అందులోనూ ముఖ్యంగా స్పోర్ట్స్ న్యూసు -- ఈరోజు పేపరు చదువుతుంటే ఏదో తేడా వుందని పించింది. లేవర్ క్వార్టర్ ఫైనల్ నెగ్గినట్లు గుర్తుంది. ఈ పేపర్లో ఫైనల్స్ నెగ్గినట్లుంది. సెమీ పైనలు సంగతి ఏమయింది?
కాజువల్ గా ఒకసారి పేపరు మీది తేదీ పరికించాను. ఒక్కసారి తెల్లబోయాను . అది రేపటి తేదీ!
ఇదెక్కడి ఆశ్చర్యం? రేపటి పేపరీ రోజేలా గొస్తుంది.
నిన్నటి తేదీ 21 అని స్పష్టంగా గుర్తుంది నాకు. మరి ఈ రోజు 23 ఎలా అవుతుంది?
మరోసారి యధాలాపంగా అడిగినట్లుగా -- పక్కనున్న ఆయన్నడిగాను-- "ఈరోజు తారీఖెంతండీ?' అని .
"ఇరవై మూడు !" అన్నాడాయన.
"ఆ" అన్నాను. "ఆర్ యూ ష్యూర్ -- " అన్నమాట ఆ ప్రయత్నంగా నా నోటమ్మట వచ్చింది. నా పక్కనున్నాయన నా వంక అదోరకంగా చూసి -- ఏం మాట్లాడకుండా ఊరుకున్నాడు.
నా బుర్ర తీవ్రంగా పని చేస్తోంది. మానసికంగా నేను ఒక రోజు వెనకపడ్డాను. ఇది ఎలా జరిగింది?
నేను 21 వ తేదీ బయల్దేరి రోజీ డాన్స్ కు వెళ్ళాను. అందులో సందేహమేమీ లేదు. డ్యాన్స్ క్లబ్ నించి బస్సు స్టాండు కి వచ్చేసరికి --23 వ తేదీ వచ్చేసింది. అంటే అక్కడ నేను పూర్తిగా ఒకరోజు ఉన్నానన్న మాట -- కానీ ఎలా?
ఒకే ఒక్క పాజిబులిటీ! అక్కడ నేను నిద్రపోయివుండాలి.
నా ఆలోచనకు నేనే ఉలిక్కిపడ్డాను. అంత నిద్ర నేనెలా పోయాను?
అసలు నిజంగా నేనంత సేపు నిద్రపోయానా?
