Previous Page Next Page 
వసుంధర కధలు -9 పేజి 27

 

    సత్యంబాబుగారి ముఖంలో ఆనందం స్పష్టంగా చేసెను. అయన భవన నిర్మాణం పూర్తయి,బయట అలంకరణ జరుగుతున్న సమయంలో నేను పనిమొదలు పెట్టాను.
    "ఎంత? అనడిగాడాయన పని మొదలు పెట్టె ముందు.
    "అడ్వాన్సు పది వేలు. నా పని మీకు నచ్చితే ఇంకో పదిహేను వేలివ్వాలి.నచ్చక పొతే పదివేలు చాలు...." అన్నాను.
    అయన అంగీకర సూచకంగా తలూపి అడ్వాన్సుగా పది వేలిచ్చేశారు. నాకు చాలా సంతోషం కలిగింది. ఇది నేనూహించని సంపాదన.
    అయితే నేను స్వీకరించిన పని నాకే ఓ సవాల్ గా భావించాను. అంత డబ్బునాయన ఖర్చు పెట్టదల్చుకొన్నప్పుడు ఆయనకు సంతృప్తి కలిగించడం నా విధి. డబ్బు ఎగవేడాని క్కూడా అయన నా పనిని తప్పు బట్టలేని విధంగా ఉండాలి. అందుకే మొత్తం వారం రోజుల పాటు రాత్రీ పగలు శ్రమించి మూడు గడుల్లోనూ మొత్తం ఇరవై ఏడు రహస్యపుటరల్ని తయారు చేశాను.
    అందులో ఒక తమాషా చేశాను. గది నేలకి ,గోడలకీ కూడా పూర్తిగా తాళం చెవి పట్టే కీ హోల్ డిజైన్ ఉంచాను. అంటే గది గోడల్ని గానీ నేలను గానీ చూస్తుంటే కొన్ని వందల కీ హోల్స్ కనబడతాయన్నమాట. కానీ అన్నీ డిజైన్స్ కావు. ప్రతి గదిలోనూ తొమ్మిది కీ హోల్స్, రహస్య పుటరలకు కీ హోల్స్.వాటిని గుర్తు పట్టడానికి కొన్ని వివరాలున్నాయి.
    ఆ వివరాలను బట్టి కరెక్ట్ కీ హోల్స్ ను అయిడంటిఫై చేయవచ్చు. వాటిని మూసి వేస్తూ ఇనుప ముక్కలుంటాయి. అయస్కాంతం సహాయంతో ఆ ఇనుప ముక్కను తీసివేసి వాటి కోసం ప్రత్యేకం తయారు చేయబడ్డ స్టెయిన్ లెస్ స్టీలు తాళం చెవులతో ఆ అరలను తెరువవచ్చు. ఒక్కొక్క గదికి ఒక్కొక్క తాళం చొప్పున మొత్తం చూడు తాళాలు తయారు చేశాను నేను.
    సత్యంబాబు వచ్చి గదిలోని ఏర్పాటు చూసి డంగై పోయాడు. ఇలాంటి పనితనం అద్భుతం అన్నాడాయన. మర్నాడు నాకు పది హీను వేలు కాక పాతిక వెలిస్తానని చెప్పాడు. నేను చాలా సంబరపడ్డాను. నా జీవితంలోనే ఒక పెద్ద మలుపు వస్తోందనుకున్నాను. అది నేను వేస్తున్నలాంటి మలుపు కాదని అప్పట్లో నాకు తెలియదు.
    ఆ  ఇంట్లో గృహప్రవేశ మహోత్సవం జరగడానికి రెండ్రోజులుందన్న రోజు రాత్రీ పదకొండు గంటలకు నేనూ, సత్యంబాబు ఆ భవంతికి వెళ్ళాం.
    అప్పుడే సత్యంబాబు నా కళ్ళు చెదిరిపోయే నిధి చూపించాడు. అది ప్యాకేజీ సెట్లలో ఉన్న బంగారు అచ్చులు. ఒక్కొక్కటి కేజీకి తక్కువకాకుండా వున్న ఆ అచ్చులు మొత్తం యభైకిపైగా వున్నాయి.
    "ఇంత బంగారమా! ఎలా వచ్చింది?" అన్నాను ఆశ్చర్యంగా.
    "అదంతా నీ కనవసరం. ఇది దాచడానికే నిన్ను రహస్య పుటరలు చేయనున్నాను" అన్నాడు సత్యం బాబు.
    "రహస్యంగా మీరే దాచలేక పోయారా?" మధ్య నన్నెందుకు పిలిచారు?"
    సత్యం బాబు నవ్వాడు. "ఈ అరల రహస్యం నీకూ నాకూ తప్ప మరెవ్వరికీ తెలియకూడదు. అందుకే ఈ బంగారం దాచడానికి నీ సహాయం తీసుకుంటున్నాను. ఇద్దరు మనుషులుంటే పని త్వరగా అయిపోతుంది. సులువుగా కూడా ఉంటుంది ...."
    నేనాయనకు సహాయం చేశాను. అన్నీ మధ్య గదిలోని తొమ్మిది అరల్లోనూ సర్దేశాం. సర్దడం పూర్తయ్యేక మళ్ళీ అరలు మూసేసి కీ హోల్స్ లో ఇనుప ముక్కను పెట్టేశాం. సత్యంబాబు గదంతా కలియతిరిగి 'అద్భుతం!" అన్నాడు.
    అయన మాటెందుకు . ఆ గదిలో అప్పటి పరిస్థితిలో - ఆ పనితనం నాదేనా అని నాకే ఆశ్చర్యం వేసింది. నేను సత్యం బాబు వంక చూసి ఆశ్చర్యపోయాను.
    అయన చేతిలో రివాల్వర్ వుంది.
    "ఈ రహస్యం మనిద్దరికే తెలుసును. నీ భార్యకు నేను అన్నమాట తప్పకుండా పాతిక వేలు అందజేస్తాను. నువ్వు నాకు చేసిన మేలు నేను మరువలేను. కానీ నా వృత్తి అలాంటిది. నిన్ను చంపక తప్పదు'..." అన్నాడు సత్యంబాబు.
    ఊహించని పరిణామానికి దెబ్బతిన్నాను. "ఇది చాలా అన్యాయం బాబూ" అన్నాను.
    "నాకు తెలుసు. కానీ అన్యాయాలు చేయడం నాకు తప్పడం లేదు. నేను కట్టించిన ఈ భవంతీ నా అన్యాయాల కారణంగానే వెలసింది. ఇంత బంగారం అన్యాయంగా చేజిక్కించుకున్నాను. ఈ రహస్యాన్ని దాచడానికింకో అన్యాయం అవసరం" అన్నాడు సత్యంబాబు.
    నాబుర్ర వేగంగా పని చేసింది. మరికాసేపు ఆయన్ను కబుర్ల లో పెట్టాను. తిరగబడే తెలివితేటలు నాకున్నవని ఆయనూహించలేదు.
    మెరుపులా ఆయనపై దాడి చేశాను. అయన చేతిలోని రివాల్వర్ నా చేతిలోకి వచ్చింది. ఇంక నేను క్షణం కూడా ఆలోచించలేదు. ఆ దుర్మార్గుడ్ని బ్రతకనివ్వడం చాలా ప్రమాదమనిపించింది. అప్పటికప్పుడు కాల్చేశాను.
    రివాల్వర్ ను, తాళం చెవులను జేబులో వేసుకుని మారు వేషం లోనే అక్కణ్ణించి బయటపడ్డాను. ఇంటి ముందు ఓ టాక్సీ సిద్దంగా ఉంది. టాక్సీ ఎక్కి ఇల్లు చేరాను.
    నేను టాక్సీ దిగేముందు నాకు టాక్సీ వాలా చావు కబురు చెప్పాడు చల్లగా. "సార్ ఆ భవనం లోంచి ఎవరో వచ్చి టాక్సీ అడుగుతారని , అడిగిన వ్యక్తిని అడిగిన చోట దింపి తర్వాత తనకు  సమాచారం చెప్పమని, ఒకాయన నన్ను కోరాడు. మీరు పారిపోగలిగితే ఈ లోగా ఎక్కడైనా పారిపోండి. మానవత్వం గలవాడిగా ఈ సహాయం నేను మీకు చేస్తున్నాను."
    నేనశ్చర్యపడి , "ఏమీ తెలియదని బుకాయించలేవా?' అన్నాను.
    "మరొకరూ, మీరొకరూ అయితే సరిపోతుంది. నన్నడిగినదేవరనుకున్నారు! పీటర్!" అన్నాడు.
    నా గుండెలది రాయి . పీటర్ ఆ ఊళ్ళో రౌడీ లకు, రౌడీ . అతను పేరు చెబితే పోలీసులే భయపడతారు. ఏమాత్రం తప్పుడు సమాచారాన్నందించినా టాక్సీ డ్రైవర్ కి ప్రాణాలు దక్కవు.
    నేను టాక్సీ డ్రైవర్ కి ధన్యవాదాలు చెప్పుకుని తలుపు తట్టాను. మీ అమ్మ తలుపు తీసేలోగా వేషం మార్చేసుకున్నాను. మీ అమ్మకు వివరాలన్నీ చెప్పకుండా ముందు నిన్ను రక్షించాలను కున్నాను. అందుకే రాత్రికి రాత్రి నిన్ను తీసుకుని మకాం మార్చేశాను. మీ అమ్మని కూడా రాజమండ్రీ రమ్మనమని చెప్పాను కానీ ఆమె రాలేదు.
    ఒకటి రెండు రోజులు చూసి వేషం మార్చుకుని బెజవాడ వెళ్ళి వచ్చాను. ఇంట్లో మీ అమ్మ లేదు. మనింటికి పీటర్ వచ్చాడనీ అమ్మను తీసుకు వెళ్ళాడని తెలిసింది. ఆ తర్వాత ఇంతవరకూ మీ అమ్మ జాడ తెలియలేదు...."
    నరసింహులు కాసేపాగాడు. శ్రీనాద్ కళ్ళలోని అశ్చ్యర్యం చూసి ఆయనకు నవ్వొచ్చింది.
    "నాన్నా! " అన్నాడు శ్రీనాద్. 'అయితే నువ్వో పెద్ద నేరస్థుడివన్నమాట...."
    "కనీసం పోలీసుల దృష్టిలో కాదు" అని నవ్వాడు నరసింహులు. "సత్యం బాబుగారి హత్య గురించి ఎక్కడ ఎటువంటి వార్తా రాలేదు. అయన మాయమైనట్లు అయన కొడుకు ఫిర్యాదిచ్చాడట. పోలీసులింతవరకూ అయన జాడ కనుక్కో లేకపోయారు. ఆ మేడ తమకు అచ్చి రాలేదని భావించి, సత్యంబాబు గారబ్బాయి దాన్ని చవగ్గా అమ్మేస్తే సోమయాజులు గారది కొనుక్కున్నారు. ఆ ఇంట్లో బంగారం గురించి నాకు తప్ప మరెవ్వరికీ తెలియదు...."
    శ్రీనాద్ తండ్రి వంక ఆశ్చర్యంగా చూసి , "తెలిసి ఏం లాభం నాన్నా?" అన్నాడు.
    "ఉంది. ఓ ఇరవై అచ్చులు మనం తెచ్చుకోబోతున్నాం." అన్నాడు నరసింహులు.
    "ఎలా?"
    "ఇలా!" అంటూ నరసింహులు కొడుకు చెవిలో ఏమిటో చెప్పాడు. శ్రీనాద్ అంతా శ్రద్దగా విన్నాడు.
    "వింటుంటే సులభంగానే ఉంది కానీ నాక్కాస్త భయం వేస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరుగుతాయంటావా?"
    'అంతా నీకెందుకూ. నేను చెప్పినట్లు చెయ్...." అన్నాడు నరసింహులు.
    'అలాగే చేస్తాను. కానీ ఆ పీటర్ ఎవరు? వాడు మనింటి కెందుకు వెళ్ళాడు? అమ్మని ఏం చేశాడు? భవనంలో ఉన్న బంగారం గురించి వాడి కేమీ తెలియదా?" అన్నాడు శ్రీనాద్.
    "నీ ప్రశ్నలు సరైనవే కానీ వాటికి జవాబులు మనకీ తెలియదు. ఆ పీటర్ ఎవడో వాడికి బంగారం గురించి ఎంతవరకూ తెలుసో నాకు తెలియదు కానీ, నేను మాత్రం నాకు తెలిసిన రహస్యాన్ని భద్రంగా దాచాను.
    ఒక వడ్రంగి మేస్త్రీ ఆ భవనంలో ప్రత్యేకంగా పని చేసేడని ఇంకెవరి కైనా తెలుసో తెలియదో కానీ ఆవడ్రంగీ  మేస్త్రీ రూపం మాత్రం వారెవ్వరూ చూడలేదు. అందుకే నేను మకాం మార్చేక వడ్రంగం చేయ లేదు. కాయకష్టం చేసిబ్రతికాను. నన్నింకేవ్వరూ ఏ విధంగానూ అనుమానించ లేని విధంగా ప్రవర్తించాను. నిన్ను గ్రాడ్యుయెటు చేశాను. మకాం మళ్ళీ బెజవాడ కు మార్చాను.
    బంగారం గురించీ, ఉద్యోగం గురించీ ప్రయత్నాలు మొదలు పెట్టాను. నీ బ్రతుకు పూర్తిగా ఒక దారిలో పడింది. నేను బంగారాన్నందిస్తే నీ బ్రతుకు బంగార బాటలో నడుస్తుంది. లేదూ నీకొచ్చిన నష్టమేమీ లేదు. ఇదే పని నేను కాస్త ముందుగా చేసి ఉంటె , ఏమో బంగారం దొరక్కపోతే నా బ్రతుకు అంతమైతే, నీ చదువు ఆగిపోయేది. దాంతో నీ భవిష్యత్తేమై పోయేదో ఏమో" అన్నాడు నరసింహులు.
    "నువ్వు చాలా మంచి వాడివి నాన్నా!" అన్నాడు శ్రీనాద్.
    "నేను నిజంగా మంచి వాడనైతే దేవుడు నాకన్యాయం చేయకూడదు. నేను రేపు తల పెట్టిన పని జయప్రదంగా ముగుస్తుంది" అన్నాడు నరసింహులు.

                                     5
    "ఏమండీ" అంది శాంతాదేవి.
    "ఏం?"
    "టైము పన్నెండు కావస్తోందనుకుంటాను. మనం అన్ని విధాలా సిద్దంగా ఉన్నట్లేనా?"
    "ఆహా! నగలూ, నట్రా లాకర్ జేరాయి. క్యాషంతా బ్యాంకులో డిపాజిట్ట యింది. దొంగాడు పట్టుకుపోవా లంటే ఫర్నిచరుంది. లేదా నీ మెడలో మంగసూత్రా లున్నాయి...."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS