Previous Page Next Page 
వసుంధర కధలు -9 పేజి 26

 

    'అదంతా కుదరదు. ఈరోజే ఎలాగో అలా లక్ష్మీని చూపాలి మీరు. ఎందుకంటె ఇంట్లో ఉన్న లక్ష్మీ రేపటి దాగా ఆగేలా లేదు....'అందావిడ.
    "అదేం ఏమయింది?' జ్యోతిష్కుడు ఆశ్చర్యంగా అడిగాడు.
    "బెదిరింపు ఉత్తరం ఒకటి వచ్చింది. మా అయన దాన్నే మాత్రమూ లక్ష్య పెట్టడం లేదు. మా ఇంట్లో పాతిక లక్షలు విలువ చేసే బంగార పుటచ్చు'లున్నాయి. అవి తనకు స్వాధీనం చేయకపోతే ఈ ఇంటినీ మమ్మల్ని కూడా నాశనం చేస్తామని ఎవడో ఆకాశ రామన్న ఉత్తరం రాశాడు. అయన అది చూసి నవ్వి , వాణ్ని రానీయ్ చూద్దాం అన్నారు....' అందావిడ.
    జ్యోతిష్కుడి ముఖం మాత్రం గంబీరంగా అయిపొయింది. "మీరేం భయపడకండమ్మా . మీ ఇంట్లోని లక్ష్మీ నింకేవ్వరూ కదపలేరు. ఈవేళ అంజనం వేసి చూసి రేపు చెబుతాను....' అన్నాడు.
    ఆవిడా ముఖం మాత్రం దిగులుగానే వుంది.
    'అన్నీ తతంగాలకూ ఒక నూర్రూపాయలు ఖర్చంటుంది...." అన్నాడు జ్యోతిష్కుడు.
    "చూడండి పంతులు గారూ మా ఇంట్లో డబ్బుందని మీకు తెలిసినపుడు ఎప్పుడైనా రహస్యంగా వచ్చి ఎత్తుకు పోవచ్చు గా...." అందావిడ.
    జ్యోతిష్కుడు ముక్కు మీద వేలేసుకుని , "మీ ఆహ్వానం మీదనే మీఇంటికి కోస్తాను. మీరడిగిన మీదటనే ధనం చూపిస్తాను. మీరిచ్చిన దానంస్వీకరిస్తాను. ఆ తర్వాత నా వృత్తికి స్వస్తి చెబుతాను" అన్నాడు.
    సోమయాజులు గారి భార్య జ్యోతిష్కుడితో కాసేపు బేరాలు ఆడింది. అతను దిగి రాలేదు. తనకు పది లక్షలు రానమిచ్చి తీరాలని చెప్పాడు.
    చిట్టచివర జ్యోతిష్కుడి మాటల కంగీకరించింది సోమయాజుల గారి భార్య. కానీ ఆవిడ నవ్వుతూ. "ఒక వేళ చివరి క్షణంలో మేము మిమ్మల్ని మోసంచేస్తే"అంది.
    జ్యోతిష్కుడు  నవ్వలేదు. "అన్నీ ఏర్పాట్లు చేసుకుని వస్తాను. మీరు నా షరతులంగీకరించిన పక్షంలో రేపటికి కొన్ని పనులు చేయాలి. ముందుగా మీఇంట్లో ఉన్న నగలూ, ఇతర విలువైన ఆభరణాలూ బ్యాంకులో లాకర్లోదాచేయాలి. రేపు మధ్యాహ్నం పన్నెండింటి కల్లా ఆ పని పూర్తీ చేసుకుని వచ్చే మాటయితే మిగతా పని నేను చూస్తాను..."
    'అన్నీ లాకర్లో దాచాడమెందుకు?"
    "రేపు మీకు కాసేపు స్పృహ వుండదు. ఆ సమయంలో మీ ఇల్లు దోచుకు పోగలనన్న అనుమానం మీ కుండవచ్చు...." అన్నాడు జ్యోతిష్కుడు.
    "వాటం చూస్తె మీరు నిజంగా పాతిక లక్షలు చూపించేలాగున్నారే?' అంది సోమయాజులు గారి భార్య.
    'అవును, అందులో పదిహేను మీవి. పది నావి..." అన్నాడు జ్యోతిష్కుడు.
    
                                   3
    "శాంతా" సోమయాజులు గారు భార్య ని పిలిచాడు.
    శాంతా దేవి పరుగెత్తుకుంటూ వచ్చింది"ఏమన్నాడు నీ జ్యోతిష్కుడు?" కాస్త అత్రంగానే అడిగాడాయన.
    ఆవిడ ఒక్క నిముషం ఆగి ఊపిరి పీల్చుకుని, "మధ్య మీకెందుకు-  ఈ గొడవలు?" అంది.
    "మళ్ళీ టెలిఫోన్ వచ్చింది నాకు...." అన్నాడు సోమయాజులు.
    "ఏమని?"
    "ఈ రాత్రికే పాతిక లక్షలు ఇచ్చుకోవాలిట. లేకపోతె సర్వనాశనం చేస్తారుట...."
    "మీరేమన్నారు?"
    "నాకేం తెలియదు పొమ్మన్నాను...."
    "అలాగంటే ఎలాగండీ...." అంది శాంతాదేవి భయంగా.
    'చేయగలిగిందేముంది? మన అస్తింతా కలిపి అయిదు లక్షలు చేయదు. పదేళ్ళ క్రితం లక్ష రూపాలకు చవగ్గా వచ్చింది కదా అని ఈ భవంతి కొన్నాను తప్పితే ఇంత భవనం మెయింటైన్ చేసే తాహతు కూడా నాకు లేదు... ఇప్పుడున్నపళంగా ఈ ఇంట్లో పాతిక లక్షలున్నాయ్ అవి తెచ్చి ఇమ్మంటే నేనేం చేసేది? ఎక్కణ్ణించి తెచ్చేది?"
    "అవుననుకోండి. కానీ అవతల వాడూరికే అడగడు కదా."
    "అందుకే నాకేమీ తెలియదు. కావాలంటే మా ఇంటికి రా. డబ్బెక్కడుందో చూపించు. అంతా పట్టుకు పో అన్నాను..." అన్నాడు సోమయాజులు.
    "అంటే వాడేమన్నాడు?"
    "ఏమీ అనలేదు. నవ్వాడు. చాలా గట్టిగా అదోలా నవ్వాడు" అన్నాడు సోమయాజులు.
    "ఆ తర్వాత...."
    "ఫోన్ పెట్టేశాడు....." సోమయాజులు నవ్వేశాడు.
    "ఓ మూల నేను హడలి చస్తుంటే మీకు నవ్వేలా గోస్తుందండీ . " అంది శాంతాదేవిచిరాగ్గా.
    "చేబుతాన్లె గానీ నీ జ్యోతిష్కుడు సంగతి చెప్పు."
    వివరంగా చెప్పింది శాంతాదేవి. సోమయాజులు గారి ముఖం గంబీరంగా అయిపొయింది. "నాకేదో అనుమానం గా ఉంది. ఇది నవ్వవలసిన విషయం కాదు" అన్నాడాయన.
    "అది నేనెప్పుడో చెప్పాను"
    "నువ్వు చెప్పడాని కేంలే గానీ జ్యోతిష్కుడి గురించి నాకు చాలా అనుమానాలున్నాయి." అన్నాడు సోమయాజులు. 'అతనికి మనింట్లో బంగారముందని ఎన్నాళ్ళ నుంచి తెలుసు? కనీసం రెండు నెలలుగా అతను నాతొ ఈ మాట అంటున్నాడు. దాన్ని బట్టి రెండు నెలల నించే ఈ విషయమతనికి తెలుసునా అనుకుందామా అంటే అంతకు ఒకటి రెండు నెలల ముందే మనింటి దగ్గర మకాం పెట్టాడు. బంగారం గురించి తెలిసే అతనిక్కడ మకాం పెట్టాడా?బంగారం గురించి అతనికేలా తెలిసింది? అసలు మనింట్లో కి బంగారం ఎందుకు, ఎలా వచ్చింది? జ్యోతిష్కుడికి వివరాలన్నీ తెలిసిన పక్షంలో మనకు తెలియకుండా దాన్ని తరలించుకు పోవచ్చు గదా...."
    "ఈ సందేహాలు నాకూ వచ్చాయండీ. కానీ జ్యోతిష్కుడి మాటలు మీకు చెప్పానుగా. నా మటుక్కు నాకు అతను నమ్మదగ్గ వ్యక్తీ అనే తోస్తోంది. అతను నిజం గానే జ్యోతిష్కుడు . అతనికి కొన్ని మానవాతీత శక్తులుండి ఉండాలి. వాటి సాయంతో అతను మనింట్లోని బంగారాన్ని కనుగొని ఉంటాడు. మనకిష్ట ముంటే నే దాన్ని చూపించదలిచాడు. లేకపోతె...."
    "అదలా గుంచు. అందుకు పదిలక్షలు ప్రతిఫలం కోరుతున్నాడతను. అతని మాటలను బట్టి చూస్తుంటే, డబ్బు విషయంలో బాగా నమ్మకంగా ఉన్నాడతను. ఇందులో ఏదైనా మోసముండి వుండాలి. లేదా జ్యోతిష్కుడు నిజం చెబుతున్నడనుకోవాలి...." అన్నాడు సోమయాజులు.
    "ఇప్పుడెం చేయాలో చెప్పండి."
    "చేయదానికేముంది ? మన జాగ్రత్తలో మన ముండాలి...."
    శాంతాదేవి భర్త వంక ప్రశ్నార్ధకంగా చూసింది.
    "గంగులుకి చేబుతానుగుమ్మం వద్ద కాపలా కాయమని."
    శాంతాదేవి గంగులు తెలుసును. అతను సోమయాజులుకు నమ్మిన బంటు, బలంలోనూ ఆకారంలోనూ ఏనుగు.
    

                                    4
    "అబ్బీ------"
    "ఏం నాన్నా!"
    "ఉద్యోగ మెలాగుంది?"
    "ఉద్యోగానికేం?" రాజాలా గుంది."
    "ఎలా ఉన్నా అది నువ్వింకేన్నాల్లో చేయనక్కర్లేదురా అబ్బీ!"
    "ఏం నాన్నా?"
    "మనం లక్షాదికార్లమైపోతున్నాం. ఎటొచ్చీ అందుకు నీ సహకారం కావాలి...."
    "ఏమిటిది నాన్నా" అన్నాడాశ్చర్యంగా శ్రీనాద్. తన సహకారంతో తాము లక్షాదికార్ల మైపోతామంటే అతని కాశ్చర్యంగా ఉంది.
    "చెబుతాను గానీ దానికి ముందు నేను నీకో కధ చెప్పాలి" అన్నాడు నరసింహులు. అతని కళ్ళముందు ఆ కధ మేదుల్తున్నట్లుంది. కళ్ళు ఏవో దృశ్యాలను చూస్తున్నట్లుగా ఉన్నాయి. శ్రీనాద్ చెప్పమన్నట్లుగా తండ్రి వంక చూశాడు. కానీ అయన కొడుకును చూడలేదు. అయన పెదవులు మాత్రం కదిలాయి.
    "పదేళ్ళ క్రితం కధ ఇది...." నరసింహులు మొదలు పెట్టాడు. "ఈ ఊళ్ళో అప్పుడు నేను పచ్చగానే బ్రతుకుతున్నాను. చాలామంది ఇళ్ళలో నేను చేసిన ఫర్నిచర్ వుండేది. అప్పుడే నాకు సత్యం బాబుగారితో పరిచయమైంది. రహస్య పుటరతో ఒక టేబిల్ చేయమన్నాడాయన. నేను చేశాను. నా పనితనానికాయన ఆశ్చర్యపోయాడు. అయన అదేపనిగా నన్ను పొగడుతుంటే నేను తేలిగ్గా తీసిపారేసి, అవకాశం రావాలి గానీ అంతకంటే గొప్పగా చేయగలను నేనని చెప్పాను. అయన కళ్ళు మెరిశాయి.
    'అయితే నాకో పెద్దపని చేయాలి. చేస్తావా?' అన్నాడాయన.
    "ఏ పనైనా చేస్తాను కానీ బాగా డబ్బు కావాలి" అన్నాను.
    "ఎంత కావాలేంటి?" అన్నాడాయన.
    "ముందు పని చెప్పండి" అన్నాను.
    అయన అప్పుడొక భవనం నిర్మిస్తున్నాడు. అదించుమించు పూర్తీ కావచ్చింది. అది రెండతస్తుల మేడ. రెండో అంతస్తులో వరుసగా మూడు గదులున్నాయి.వాటిలో నేను రహస్య పుటరలు ఏర్పాటు చేయాలి.
    సరేనన్నాను నేను.
    "ఇది చాలా రహస్యం. నువ్వెవరివో ప్రపంచానికి తెలియకూడదు. ఆ ఇంటికి నువ్వెప్పుడూ మారువేషం లోనే రావాలి." అన్నాడాయన.
    అలాంటివి నాకు చేత కాదన్నాను.
    "నువ్వేం చేయనక్కర్లేదు.అన్నీ నేను చూసుకుంటాను. నాతొ పద" అన్నాడాయన.
    నేనాయన కారెక్కాను. కార్లో వేషం మార్చుకునేందు కవసరమైన సామాగ్రి వుంది. నున్నని క్రాపింగు పోయి గుండు , పిలక ఏర్పడింది నాకు. ముఖానికి మీసాలు, వేషం మార్చుకోవడం అంత సులభమని నేనెన్నడూ అనుకోలేదు.
    ఇద్దరం కలిసి అయన భవనానికి వెళ్ళాం. అయన చెప్పిన గదులు మూడు "బాగా పరీక్షగా చూసేక, మరో పది రోజుల్లో ఇట్లు కట్టడం పూర్తయి పోతుందనుకుంటాను. అప్పుడే నా పని మొదలుపెడతాను. అన్నీ నేనే స్వయంగా పూర్తీ చేస్తాను. కొన్ని అరలు గోడల్లోనూ కొన్ని అరలు నేల మీదా ఏర్పాటు చేస్తాను. బ్రహ్మరుద్రుడికికూడా వాటిని కనుగొనడం సాధ్యం కాదు. ఆ విధంగా నేను వాటిని తయారు చేస్తాను. మీరు మాత్రం నా గురించి సిమెంటూ వగైరా అవసర వస్తువులు ఏర్పాటు చేయించండి...." అన్నాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS