Previous Page Next Page 
డెత్ ఛాంబర్ పేజి 27


    అతను మాట్లాడుతూనే ఆమెను తనమీదకు లాక్కుని ఆమె పెదాలు గాఢంగా చుంబించాడు. చంద్రిక ఉక్కిరిబిక్కిరయింది.
    అతను మాట్లాడుతున్నమాటలూ, అతని కౌగిలీ అతని పెదాలు తన పెదాలను తాకడం అన్నీ తెలుస్తూనే వున్నాయ్. కానీ తనశరీరం తన అధీనంలోలేనట్లూ, తన మనసు తన అధీనంలో లేనట్లూ అనిపిస్తోంది. అతను మరింత గాఢంగా ఆమెను తనకు హత్తుకున్నాడు.
    చంద్రిక మైనపుబొమ్మలా అతని చేతుల్లోనలిగిపోతోంది.
    ఆమెను ఆలోచనలు అస్పష్టంగా అలుముకుంటున్నాయ్. అతనితో వివాహమా? ఈ సినిమా ఫీల్డ్ లో చాలామందికి ఇద్దరు భార్యలుండడం తనకు తెలుసు. మిగతా వారిలో రహస్యసంబంధాలు సాగిస్తున్నవారెక్కువ!
    అంచేత అతనూ తనూ వివాహం చేసుకోవడంలో అనౌచిత్యం ఏమీలేదు. అతనన్నట్టు ఇద్దరికీ ఓ విధమైన అవగాహన ఉంది. అతనంటే తనకి గౌరవం వుంది. తనంటే అతనికి విపరీతమైన అభిమానం! కానీ తమ వివాహం సఫలమవుతుందా. అతనూ తనూ ఇద్దరూ నటీనటులవడంవల్ల కలిగే ఇబ్బందులేమయినా ఉంటాయా? ఎందుకుంటాయ్?
    భార్యభర్తలిద్దరూ డాక్టర్లయిన వాళ్ళెంతమంది లేరు? వాళ్ళసంసారాలు సవ్యంగా సాగడంలేదూ? మరి తనకెందుకు అనుమానం.
    కౌశల్ అందగాడు. అతనిలోలోపాలు కూడా ఉన్నాయ్. అయినా లోపాలు లేనిదెవరు? ప్రతిమనిషికీ కొన్ని బలహీనతలుంటాయ్.
    ఒకో మనిషి ఒకో విధంగా వ్యవహరిస్తాడు. ఎవరి వ్యక్తిత్వం వారిదే. ఆ మాటకొస్తే తనలో కూడా లోపాలులేవూ? తనూ శీలవతి కాదు గదా! అతనూ అంతే! అంచేతపాత చరిత్రలు అనవసరం. చంద్రికఇంక ఆలోచించలేకపోతోంది.
    ఆమె కళ్ళు మూతలుపడుతున్నాయ్. అతని కౌగిలి కలిగిస్తోన్న మత్తుతో కోరికలు రాజుకుంటున్నాయ్.
    తన మొఖానికి అతి సమీపంగా ఉన్న అతని మెడచుట్టూ చేతులువేసి తన గుండెలకు హత్తుకుందామె. ఆ తరువాత ఆమెను మత్తు ఆవహించింది.
    మోహన్ రెడ్డి చెప్పిందంతా శ్రద్దగా విన్నాడు నూతన్.
    "అయితే మీకు అరవైమంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉందంటారు!"
    "అనటం కాదు! కావాలంటే వాళ్ళందరినీ ఇప్పుడే పిలిపిస్తాను -"
    "అవసరం లేదు. మీ మాటమీద నాకు నమ్మకంవుంది"
    "వాళ్ళు కాక మిగతా ఇండిపెండెంట్లు పదిమంది నా గ్రూప్ లో జాయినవుతామంటున్నారు. మళ్ళీ ప్రధానిమంత్రి గారి దగ్గర అనకండి! మన అపోజిషన్ పార్టీలో కూడా నేను ముఖ్యమంత్రి అయే పక్షంలో నన్ను సపోర్టు చేస్తామంటున్నారు."
    నూతన్ గుండెవేగంగా కొట్టుకోసాగింది.
    ఇప్పుడు అసలయిన విషయం మాట్లాడే సమయంవచ్చింది.
    "మరి మిగతా ఫార్మాలిటీస్ సంగతేమిటి? మీరెంత వరకూ ఫండ్స్ ఇవ్వగలరు?"
    "ప్రస్తుతం వున్న చీఫ్ మినిష్టర్ ఎంతిచ్చాడో నాకు తెలీదు. కానీ ఎప్పుడో దానికి వందరెట్లు సంపాదించే ఉంటాడు. నాకుమాత్రం ముఖ్యమంత్రిగా చేసేందుకు కేవలం సంవత్సరం మాత్రమే టైముంది. ఆ తరువాత జనరల్ ఎలక్షన్స్ కనుక ఎంత కన్సిషనిస్తే అంత మంచిది -"
    నూతన్ జాగ్రత్తగా మాట్లాడాడు"ప్రధానమంత్రి ఈ విషయంలో నాక్కొన్నిసూచనలిచ్చారు. కనుక మీ ఆఫర్ చెప్తేదానినిబట్టి నేను మాట్లాడతాను".
    "నేను రెండుకోట్లు ఇవ్వాలనుకుంటున్నాను."
    నూతన్ స్టన్ అయాడు. అంత పెద్దమొత్తం అనుకోలేదతను. మహా అయితే యాభై లక్షలనుకున్నాడు.
    "రెండుకోట్లు కొంచెం తక్కువనుకుంటాను"
    "ఫుల్ టరమ్ అయిదేళ్ళయితే పదికోట్లు ఆఫర్ చేసేవాడిని - సంవత్సరమే పదవిలో ఉంటానని అందరికీ తెలుసుకాబట్టి కలెక్షన్స్ ఎక్కువ ఉండవ్!"
    "కలెక్షన్స్ తక్కువయితేనేం? మంత్రి పదవులు ఎమ్మెల్యేలకు అమ్ముతారు కదా! నలభయ్ మంది మంత్రులనుకున్నా నాలుగుకోట్లు వచ్చేస్తుంది మీకు - ప్రధానమంత్రిగారు స్పష్టంగా చెప్పారు పార్టీ ఫండ్ కి ఎవరెక్కువ డబ్బు ఇస్తే వాళ్ళకే పదవి అని"
    అతను కొద్దిక్షణాలు ఆలోచించాడు.
    "సరే మూడుకోట్లు కంటే ఎక్కువ ఇవ్వలేనని ప్రధానమంత్రికి చెప్పండి! ఇదే నా ఆఖరిమాట-"
    "ఓకే సాయంత్రం ఆరుగంటలకు ఫోన్ చేయండి! ఏ సంగతి చెప్తాను"
    అతను వెళ్ళిపోయాడు. ఆ తరువాత వరదాచారీ గోవర్ధన్ రాజూ కూడా ఒకరి తర్వాత ఒకరు వచ్చి మాట్లాడారు. వాళ్ళిద్దరూ కూడా రెండుకోట్లు ఆఫర్ ఇచ్చారు.
    మధ్యాహ్నం లంచ్ టైంలో మయూరి, నూతన్ కలిసే భోజనం చేశారు.
    "మనం షుమారు కోటిరూపాయలవరకు వస్తుందనుకున్నాం. కానీ ఇప్పుడు అనుకోకుండా మూడుకోట్లు వచ్చేట్లుంది. కాబట్టి నీకో యాభైలక్షలూ ప్రహ్లాద్ కో యాభయ్ లక్షలూ ఇవ్వదలచుకున్నాను...." చెప్పాడు నూతన్.
    ఆమె ఆనందంతో అతని పెదాలమీద ముద్దు పెట్టుకుంది.
    "యూ ఆర్ వెరీ జెనరస్"
    "మీ ఇద్దరి హెల్ప్ లేకపోతే నాకూ అవకాశం లేదు కాబట్టి"
    "మనకి రాత్రి ఎనిమిదిగంటల ఫ్లయిట్ కి టికెట్స్ బుక్ చేయమన్నారు. ఆ ప్రోగ్రామ్ ఫాలో అవుతున్నామా?"
    "అందులో సందేహమేమీలేదు. మనం ఇక్కడ రాత్రికి ఏ పరిస్థితిలోనూ ఉండటానికి వీల్లేదు"
    మధ్యాహ్నం నుండే గ్రూపులుగా ఎమ్మెల్యేలు వచ్చి కలుసుకోవడం ప్రారంభించారు.
    "వరదాచారి ముఖ్యమంత్రి అవడానికి అవకాశం వుంది" అంటూ వచ్చినవారితో చెప్తోంది మయూరి.
    "కాదు గోవర్ధన్ రాజే అవుతాడు. ఎంత డబ్బుకావాలంటే అంతడబ్బు ఇస్తానంటున్నాడట" అన్నాడు ప్రహ్లాద్.
    ఆ వార్తలన్నీ క్షణాలలో మోహన్ రెడ్డికి చేరిపోతున్నాయ్. టెన్షన్ భరించలేక నాలుగింటికి నూతన్ కి ఫోన్ చేశాడతను.
    "నేనే మోహన్ రెడ్డిని. ప్రధానమంత్రితో మాట్లాడారా నా విషయం?"
    "మాట్లాడాను. ఆయననామీద విసుక్కున్నారు. అంత తక్కువ డబ్బయితే అసలు మాట్లాడటం కూడా దండగ! పాత ముఖ్యమంత్రినేకొనసాగమంటాను" అన్నాడు. కానీ నేనునచ్చజెప్పాను. డబ్బొక్కటేకాదు- మనిషి కెపాసిటీ- ఇంటిగ్రిటీకూడా ముఖ్యం సార్" అన్నాం. నేను కొంచెం గట్టిగా మాట్లాడేసరికి ఆయన అప్పుడు మెత్తబడ్డారు. "సరే నీ ఇష్టప్రకారమే కానీ! అంటూ నా నెత్తిమీదపెట్టాడు. నాకు మాత్రం విరక్తిపుడుతోంది. ఇలాంటికాంప్లికేటెడ్ నిర్ణయాలు తీసుకోవటం ఇకనుంచీ నామీద పెట్టకండి సార్ అని చెప్పాను."
    "థాంక్యూ వెరీమచ్ కృష్ణకాంత్ నామీద పెట్టకండి సార్ అని చెప్పాను."
    "థాంక్యూ వెరీమచ్ కృష్ణకాంత్ గారూ! మీ సహాయం మర్చిపోను అయితే నేను ఇంకో గంటలో కాష్ తీసుకువస్తాను"
    "వెల్ కమ్! కాష్ ఎలాతేవాలో తెలుసుకదా!"
    "పాత పద్దతేగదా సార్! పెద్ద సూట్ కేసుల్లో తీసుకొస్తాను"
    "అన్నీ ఐదు వందలనోట్లే చూడండి"
    ఫోన్ డిస్కనెక్ట్ చేయగానే ప్రహ్లాద్ లోపలకొచ్చాడు.
    "ఒక చిన్న ప్రాబ్లెమ్ వచ్చింది సార్!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS