Previous Page Next Page 
డాళింగ్ పేజి 26

 

    "ఎవరు మీరు . ఎక్కడ నుంచోచ్చింది" ఆశ్చర్యపోతూ అడిగాడు మేనేజర్.
    రోడ్డు చివర పబ్లిక్ బూత్ కొచ్చింది. చాలా అర్జెంట్ . " మేనేజర్ గబుక్కున లేచి నిలబడ్డాడు.
    "మీరు కాదు, విమల్ గారే కావాలిట."
    "ఎవరట."
    "వాళ్ళ డాడీ."
    పబ్లిక్ టెలిఫోన్ కీ ఏమ్ .సి. జయేంద్రదత్ ఫోన్ చెయ్యడంచాలా విచిత్రంగా వుంది వ్యవహారం."
    "విమల్ గారు నిద్రపోతున్నారు."
    "నాకు తెల్సినంతవరకూ ఆ ఫోన్ చాలా అర్జెంటు. వెళ్ళి లేవండి. మళ్ళీ పది నిమిషాల్లో ఫోనోస్తుంది. టెలిఫోన్ బూత్ లో ఎవరూ లేరు. నేనేల్తా"
    గబగబా పరుగులాంటి నడకతో బయటికొచ్చేసాడు ఆపరేటర్ శంకర్.
    

                                                   *    *    *    *

    సరిగ్గా పది నిమిషాలైంది.
    టెలిఫోన్ బూత్ లో ఫోన్ మోగింది.
    హడావుడిగా రిసీవరేత్తాడు శంకర్.
    "చెప్పనా."
    "చెప్పానండీ." ఎదురుగా రోడ్డు మీద , జయేంద్రదత్ బిల్డింగ్ వేపు చూస్తూ అన్నాడు శంకర్.
    "పది నిమిషాల్లో మళ్ళీ ఫోనోస్తుందని చెప్పావా."
    "చెప్పానండీ" అని గాభరాగా చెప్పి, ఆ బిల్డింగ్ గేటు వేపు చూసాడు.
    అందులోంచి బయటికొస్తూ విమల్.
    అందమైన విమల్. సినిమా హీరో విమల్.
    ఎప్పుడూ ఆ రోడ్ మీద, నడిచి ఎరగని విమల్,
    ఎడం చేత్తో ఎగురుతున్న జుత్తుని సర్దుకుంటూ వస్తున్నాడు విమల్.
    "విమల్ గారోస్తున్నారండీ" నెమ్మదిగా అన్నాడు శంకర్.
    విమల్ అడుగులు టెలిఫోన్ బూత్ కి దగ్గరవుతున్న కొద్దీ, శంకర్ గుండెలో ఎందుకో తెలీని అలజడి ప్రారంభమైంది.
    "డాడీ....విమల్ హియర్."
    విమల్ గొంతు మత్తుగా వుంది. విమల్ కళ్ళు గమ్మత్తుగా వున్నాయి.
    అవతలి నుంచి నవ్వు.
    ఆ నవ్వు విషపాతంలా వుంది.
    "డాడీ కాదు .....మిస్టర్.....విమల్.........నేను" ఆ గొంతును పోల్చుకున్నాడు విమల్.
    "నువ్వా!!"
    నమ్మలేక పోతున్నాడు విమల్.
    "అవున్నేనే ఏం.......రహస్యంగా అతి తక్కువమందికి మాత్రమే తెల్సిన మీ డాడీ కట్టించిన ఏకాంత మందిరానికి కనీసం ఫోన్ కూడా లేకుండా ప్లాన్ డ్ గా విశ్రాంతి కోసమే కట్టించిన ఆ ఏకాంతమందిరానికి. నేను ఫోన్ చేస్తానని ఊహించలేదు కదూ."
    అసలు ఆ ఫోన్ నే భరించలేక పోతున్నాడు విమల్. అదొక ట్రాప్ లా వుందతనికి.
    ఒక్కసారి పెను కోపం అతన్నాక్రమించింది. ఎదురుగా వున్న శంకర్ వేపు సీరియస్ గా చూసాడు.
    "నీ ఐక్యూ కి నా హేట్సాఫ్. కానీ, ఎందుకు ఫోన్ చేసావో చెప్పు" అసహనంగా అడిగాడు.
    'అయాం సారీ! నీకు నేనెప్పుడూ చెప్పలేదు. నాకిక్కడ రెండే రెండు పనులున్నాయి. ఒకటి ఇక్కడ బాబులో నిన్ను చూసుకోవడం. రెండు అక్కడ నువ్వెవరికీ దక్కకుండా చూసుకోవడం. రెండో పనిలో భాగంగానే ఈ ఫోను నీకీ పాటికి తెల్సే వుంటుంది."
    "సీ.....నందనా ఆయామ్ నాటేటాల్ ఎవే ఫ్రమ్ మై ఒన్ డ్యూటీస్ అండ్ రెస్పాన్స్ బులిటీస్, డోంట్ ఎరాస్ మీ .....ప్లీజ్ . లీవ్  మీ ఎలౌన్ ప్లీజ్ నందనా . లీవ్ మీ ఎలౌన్ .....' చాలా అసహనంగా , బాధగా అన్నాడు విమల్.
    నవ్వింది కృష్ణనందన. పొరలు పొరలుగా తెరలు, తెరలుగా.
    "సినిమాల్లో జోక్స్ బాగుంటాయి. ఎందుకంటె అది జీవితానికి సంబంధం లేకుండా వుంటాయి కాబట్టి. లైఫ్ ఈజ్ ఏంటైర్లీ సేపరేటింగ్. డోంట్ పుల్ జోక్ .........వాంటెడ్ గా జోక్స్ వేసే వాళ్ళన్నా, అమాయకంగా నటించే వాళ్ళన్నా నాసహ్యమని నీకు తెల్సు కదూ."
    "ఇదిల్లు కాదు........ఫోన్." గట్టిగా అన్నాడు విమల్.
    "నాకు తెలుసు. మిస్టర్ విమల్. ఇది సినిమా షూటింగ్ కాదు జీవితం అని నేనూ అనగలను కానీ అనను."
    "ఇంతకీ నువ్వెందుకు ఫోన్ చేసావ్."
    విమల్ ప్రశ్నకు వెంటనే జవాబు రాలేదు.
    "ఇందాకే చెప్పాను. అక్కడ నువ్వెవరికీ దక్కకుండా చూసుకోడానికని .......అర్ధమైందా."
    "నేనేం ఇక్కడ విచ్చలవిడిగా తిరగడం లేదు. రోడ్లమీద పోర్లడం లేదు. ఆ మాట అనేసి, ఫోన్ ని టక్కున పెట్టేద్దామనుకున్నాడు విమల్.
    ఎక్కడో, మనసు మారుమూల గదిలో, వినీ విన్పించానీ లయ తొలి ముద్దు స్వప్నం, అల్చిప్పలా అల్చిప్పాలో ముత్యంలా మెరిసిన స్వప్నం.
    సముద్రతీరం వెంబడి నడిచిన నాలుగు పాదాలు, కన్నా కలలు, సరుగుడు చెట్ల చాటున బిగిసిన కౌగిలి, ఆడుకున్న మాటలు, చేసుకున్న బాసలు.
    కొబ్బరాకుల సందుల్లోంచి జారిపడిన వెన్నెల కిరణాలకు ఉక్కిరిబిక్కిరైనా సిగ్గు మంచు మేఘాలు.
    విమల్ చేయలేని పని అది.
    "మైడియర్ ......విమల్ .......విచ్చలవిడిగా తిరగడం లేదన్నావ్ షూటింగ్ మధ్యలో మద్రాసు నుంచి హైదరాబాద్ వెళ్ళి, ఆ ఆమ్మాయిని చూసొచ్చావ్ ......అవునా........దీన్నే మంటారో........." ఆ మాటకు షాక్ తిన్నాడు విమల్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS