కొండల్రావు కొడుకు శేషారావు ఏదో పెళ్ళిలో రాధను చూసి ప్రేమించాడు. కొండల్రావు కా పెళ్ళి ఇష్టం లేదు, రాధను కిడ్నాప్ చేయమని అయన జయరాజుకు చెప్పాడు. ఇది ఓ రాస్కెల్ విని జయరాజు పేరుతొ పేర్రాజింట ప్రవేశించి రాధను కిడ్నాప్ చేసి కోదండరామయ్య మనుషులకి అప్పగించాడు. ఈ మోసాన్ని గ్రహించి కొండల్రావు , శేషారావు , జయరాజు సమయానికి వచ్చి ఆమెను రక్షించారు.
"కన్న కొడుక్కు అయినింటి సంబంధం చేయాలన్న తాపత్రయం తప్పితే మగువులకు మానభంగం చేయించాలనుకునే దుర్మార్గుడ్ని కాదు నేను--" అన్నాడు కొండల్రావు.
సరిగ్గా అప్పుడే కోదండరామయ్య మనిషి జేబులోంచి రివాల్వర్ తీశాడు. రెండో చేత్తో చటుక్కున రాధను తనవైపుకు లాక్కున్నాడు.
"ఇంతరవరకూ నేననుకున్న వన్నీ సాధించాను. ఇదీ నేను సాధిస్తాను. నన్నడ్డుపెట్టారో మిమ్మల్నందర్నీ కాల్చి పారేస్తాను--" అంటూ చటుక్కున గదిలోకి దూరి మళ్ళీ తలుపులు వేసుకున్నాడు.
తలుపులు గడియ వేసి అతను రాధ వంక చూస్తూ -- "మానభంగం తప్పనిసరి. మనసు తేలిక చేసుకుని సుఖపడు--" అన్నాడు.
రాధ మ్రాన్పడి పోయింది. అంతమంది మగవాళ్ళు తనకు రక్షణగా వున్నారని ఆమె ఆశపడింది. నిజంగానే ఇప్పుడామె లో ప్రతిఘటించే శక్తి లేదు.
10
సరిగ్గా రెండు గంటల తర్వాత గది తలుపులు తెరచుకున్నాయి.
తలుపు తీసింది రాధ!
ఆమె ఇప్పుడు వికసించిన పువ్వులా లేదు. వాడి రాలిన పువ్వులా ఉంది. కళ్ళలో జీవం లేదు.
గది బయట కొండల్రావు, శేషారావు, జయరాజు నిర్జీవంగా కూర్చున్నారు. తలుపులు తెరచుకోగానే జయరాజు మాత్రం లేచి - "ఎక్కడ వాడు?' అన్నాడు.
"గదిలో ఉన్న బాత్ర్రూం వెంటి లేటర్లోంచి దూకి పారిపోయాడు--" అంది రాధ. ఆమె శేషారావును సమీపించి -- "మీ ప్రేమ కధ ఇలా ముగుస్తుంది. నా శవాన్ని పెళ్ళి చేసుకోవాలని చాలా మనసు పడ్డారు. కాసేపటిలో నా శవం తయారవుతుంది --" అంది.
శేషారావేమీ మాట్లాడలేదు.
"ఇంతమంది మగాళ్ళముండి నిన్ను రక్షించ లేకపోయాం-- " అన్నాడు కొండల్రావు నిట్టుర్చుతూ.
"ఆడదాన్ని రక్షించలేని మగాళ్ళు మగాళ్ళే లా అవుతారు? మీరు మగాళ్ళు కాదు--" అంది రాధ.
"రాధా -- అంత మాటనకు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇప్పటికీ కూడా --" అన్నాడు శేషారావు.
"అదే నిజమైతే -- ప్రియురాలితో దుర్మార్గుడు గది లోపలకు లాక్కెళ్ళి బలవంతం చేస్తుంటే చేతులు ముడుచుకుని బయట ఎలా కూర్చుంటావ్ నువ్వు మగాడివి కాదు -- ' అంది రాధ.
"మనిషి పరిస్థితులకు బానిస. ఆడదాన్ని రక్షించలేని వాడు మగాడు కాదని నువ్వంటున్నావు, - కానీ ఆడదాన్ని అర్ధం చేసుకుని ఆదరించగలవాడే మగాడని నేననుకుంటున్నాను. నీ గత చరిత్రలో నాకు నిమిత్తం లేదు. నిన్ను నేను పెళ్ళి చేసుకుంటాను--" అన్నాడు శేషారావు.
రాధ ఆశ్చర్యంగా చూసి --"నేను సర్వం కోల్పోయానని మీరనుకోవటం లేదా?' అంది.
"నువ్వు ఏం కోల్పోయావో నాకు తెలియదు. దానితో నాకు నిమిత్తం లేదు కూడా. నేను మాత్రం నిన్ను కోల్పోలేను."
"ఇంకా మాటలెందుకు? ఇందులో నాదీ చాలా వరకు బాధ్యత ఉంది. నిన్ను మా యింటి కోడల్ని చేసుకుంటాను. ముందు అంతా కలిసి మీ యింటికి వెడదాం. మిగతావన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. మనమిప్పుడు చేయవలసిందల్లా గతాన్ని మరిచిపోవటమే!"అన్నాడు కొండల్రావు.
11
"వాడు కోదండరామయ్య మనిషిలా లేడూ?' అన్నాడు జయరాజు.అతను కారు డ్రైవ్ చేస్తున్నాడు.
శేషారావు , రాధ వెనక సీట్లో కూర్చుని వున్నారు. ఇద్దరూ పసుపు బట్టలతో వున్నారు. వారిద్దరికీ పేర్రాజు ఇంట శాస్త్రోక్తంగా , సింపుల్ గా వివాహం జరిగింది. వివాహానికి కొండల్రావు, జయరాజు తప్ప ఇంకెవ్వరూ రాలేదు. వివాహమైన వెంటనే కొండల్రావు వేరే వెళ్ళి పోయాడు. జయరాజు ని తోడుగా తీసుకుని శేషారావు రాధ బయల్దేరారు.
రాధ అదృష్టానికి ఆ ఊరు వూరంతా ఆశ్చర్య పోయింది. కొండల్రావు ఆ గ్రామ పౌరుల్లో చాలా మంది పెద్దలకు తెలిసినవాడే! అయన కొడుకు పెళ్ళి అంత సింపుల్ గా జరిగినందుకు అంతా ఆశ్చర్య పడ్డారు కూడా.
కారు రామచంద్రాపురం వెడుతుండగా దార్లో జయరాజు కు కోదండరామయ్య మనిషి కనిపించాడు.
"కారాపు-"అన్నాడు శేషారావు.
"మీరు ఆగండి - పసుపు బట్టలతో వున్న మీరు అవేశపడకూడదు. వాడి అంతు తేల్చటానికి నేనోక్కడ్ని చాలు-" అన్నాడు జయరాజు.
కోదండరామయ్య మనిషి రోడ్డుకు పక్కగా కూర్చున్నాడు. అతడి ప్రక్కన ఓ బ్రీఫ్ కేసుఉంది. అతడు కారు గురించి పట్టించుకోనూ లేదు. అటు చూడనూ లేదు.
"నా రాధ కన్యాయం చేసిన వాడి అంతు నేనే తేల్చాలి" అంటూ శేషారావు కారు దిగి పరుగెత్తాడు. అప్పటికి వాళ్ళిద్దరినీ చూసిన కోదండరామయ్య మనిషి అక్కడ్నించి పరుగెత్తాడు. వాళ్ళిద్దరూ అతణ్ణి తరుముతున్నారు.
రాధ ఆశ్చర్యంగా ఆ పరిణామాన్ని చూస్తోంది. వాళ్ళు ముగ్గురూ కనుమరుగయ్యే సరికి కారు డోర్ హటాత్తుగా తెరచుకుంది. రాధ ఉలిక్కిపడి అటు చూసింది. మొట్ట మొదట కాకినాడ శేషయ్య మనిషిగా తమ యింట అడుగు పెట్టిన నకిలీ జయరాజు అతను.
"దుర్మార్గుడా -- మళ్ళీ వచ్చావా?" అంది రాధ కోపంగా.
"నీకోసం ఎన్ని సార్లయినా వస్తాను--" అంటూ ఆమె పసుపు బట్టల్ని చూసి గతుక్కుమని -- 'అయితే శేషారావు నిన్ను పెళ్ళి చేసుకున్నాడ?' అన్నాడు నకిలీ జయరాజు.
"నువ్వు చెప్పినవన్నీ ఆబద్దాలు, చేసినవన్నీ మోసాలు నన్ను మలిన పరిచిన దుర్మార్గుడు వాడనుకుని వాళ్ళలా పరుగెత్తారు. కానీ నువ్వేనని తెలిస్తే ఈ క్షణం నా భర్త, అసలు జయరాజు నీ రక్తం తాగెస్తారు--' అంది రాధ ఆవేశంగా.
ఆరోజు జరిగినదంతా రాధకు ఒక్కసారిగా గుర్తు కొచ్చింది.
* * * *
అతనామెను గదిలోకి లాగి జంతు బలాన్నామె పై ప్రయోగించి చీర లాగేశాడు. ఆమె పెనుగులాట ను లెక్క చేయక వివస్త్రను చేసి మంచం మీదకు నెట్టేశాడు. సరిగ్గా అప్పుడే అతను కిక్కురుమనకుండా నేల కూలిపోయాడు. రాధ లేవబోయింది. అప్పుడామెకు నకిలీ జయరాజు కనబడ్డాడు.
"వెధవ-- ఈ సాయంత్రం దాకా లేవలేడు...." అంటూ కాలితో మంచం కిందకు నెట్టేసి "వీడి కప్పగించడానికే నేను నిన్నిక్కడికి తీసుకొచ్చింది?' అన్నాడు.
"ఎలా వచ్చావిక్కడికి ?' అంది రాధ. తను వివస్త్ర గా వున్నానని కూడా మరిచిందామే.
"నీకోసం ఎలాగైనా వస్తాను. ఇప్పుడు నా కెదురు లేదు --" అన్నాడు జయరాజు.
'అంటే?' అంటూ ఆమె అక్కడే పడి వున్న చీర నందుకోబోయింది.
ఆమెను నకిలీ జయరాజు వారించి -- "నీకు మానభంగం ఎలాగూ తప్పదు. మనసు తేలిక చేసుకుని సుఖపడు-" అన్నాడు చిన్నగా నవ్వుతూ.
"నువ్వూ అదేమాట?' అందామె.
జయరాజామే పక్కన చేరాడు. ఆమెలో ఇప్పుడు ప్రతిఘటించే శక్తి బొత్తిగా లేదు.
"నీకు తెలుసో, తెలియదో -- ఇదంతా ఓ పెద్ద నాటకం. నిన్నక్కడ కిడ్నప్ చేసి మానభంగం జరిపించడానికి ఏర్పాటు చేసినది కొండల్రావు, శేషారావులు" అన్నాడు నకిలీ జయరాజు.
రాధ నమ్మలేదు. కానీ ఆమె అతడి కౌగిలి లో వుంది. అతడు చెప్పేది వింటోంది. చేసేదానికి ప్రతిఘటించలేకపోతోంది. శారీరకంగా, మానసికంగా ఆమె ఆలసి పోయింది. నకిలీ జయరాజు చెప్పుకుపోతున్నాడు.
"ఈ నాటకమంతా ఎందుకో నాకు తెలియదు. నువ్వు వప్పుకుంటే నేను మాత్రం నిన్ను తప్పక పెళ్ళి చేసుకుంటాను. వీళ్ళంతా నిన్ను మోసం చేస్తున్నారు. కావాలని ఈ ఏర్పాట్లన్నీ చేసి తమకేమీ తెలీనట్లు నటిస్తున్నారు. నిన్ను కిడ్నాప్ చేసే పని నాకు శేషారావే అప్పగించాడు. వాళ్ళంటున్న కోదండరామయ్య మనిషి నిజంగా కోదండరామయ్య మనిషి కాదు. దూరపు వరుసలో శేషారావు కి అన్న అవుతాడు. అతడి చేత నీకు మానభంగం చేయించడం లో వాళ్ళ ఉద్దేశ్యమేమిటో నాకు తెలియదు. నేనూ వాళ్ళ మనిషినే. కానీ నీ ముఖంలో కనబడే అమాయకత్వానికి నేను లొంగిపోయాను. నువ్వంటే నాకు ప్రేమ పుట్టుకొచ్చింది. అయినా అసహయుడిని. కొండల్రావు నేదిరించడమంటే పాముతో చెలగాటం , అందుకని నిస్సహాయుడినై నిన్నిక్కడ యీ మనిషికి అప్పగించాను. రోజూ వచ్చి ఆ మనిషి నిన్ను బెదిరిస్తున్నా నిన్నీ రోజు వరకూ చెరపడని నాకు తెలుసు. నీకు మానభంగం జరిగిన విషయానికి వాళ్ళు సాక్షులు కావాలన్నది వారి పధకం. ఆ పధకం ప్రకారం ఇంతవరకూ జరిగింది. ఈ క్షణం లోనే నేను తెగించాను. ఎలాగూ నీకు మానభంగం తప్పదు. ఆ అవకాశం నేను తీసుకుంటేనేం? నిన్నా శేషారావు పెళ్ళి చేసుకోడు. ఏదో చేస్తాడు. అయితే నేను నిన్ను వెయ్యి కళ్ళతో కనిపెట్టి వుంటాను. కాపాడుకుని నాదాన్ని చేసుకుంటాను. అందుకే ఈ అవకాశం మరో మనిషి కివ్వదలుచుకోలేదు. నువ్వు కూడా ఈ విషయం ఎవరికి చెప్పకు. నిజం నిలకడ మీద నీకే తెలుస్తుంది. ఎప్పటికైనా నేనున్నానని గుర్తుంచుకో . ఇప్పుడు నాకు కొండల్రావు భయం లేదు. నా రహస్యం ఎవ్వరికీ తెలియదు. ఈ మనిషి కూడా అది వాళ్ళకు చెప్పుకోలేడు. అధతనికి పరువు తక్కువ. అందుకే ప్రమాదరహిత మైన ఈ క్షణాన్నేన్నుకున్నాను" అన్నాడు నకిలీ జయరాజు.
అతడు చెప్పేవాటిలో ఎంత నిజముందో అని ఆమె ఆలోచించడం లేదు. అంతా అయోమయంగా వున్నదామేకు. అన్నాళ్ళ ప్రతిఘటన ఏమయిందో కానీ క్షణంలో అతడికి సులభంగా లొంగిపోయింది.
* * * *
"నువ్వు చెప్పిందంతా అబద్దం. నన్ను శేషారావు పెళ్ళి చేసుకున్నాడు. అతడి విశాల హృదయం బైట పడింది. నువ్వు శేషారావు గురించి ఏవేవో కధలు చెప్పి నన్ను నీ వశం చేసుకుని తర్వాత నీ వ్యభిచార గృహాలకో అమ్మేద్దామనుకున్నావు. నీ ఆటలు సాగలేదు --ప్రపంచమంతా నీలాంటి వారే ఉంటారనుకోకు"అంది రాధ.
