పాపభీతి
జొన్నలగడ్డ రామలక్ష్మీ

సీతన్న పంతులు ఒక్కడూ ఇంట్లో కూర్చుని అకౌంట్ పుస్తకాలు తిరగేస్తున్నాడు. ఆ పుస్తకాలాయన ఇన్ కంటాక్స్ డిపార్టు ,మెంటు వారి కోసం ప్రత్యేకంగా తయారు చేసినవి. అయితే వాటిలోనే అసలకౌంట్సుకి సంబంధించిన చిన్న క్లూ లుంటాయి. అవి సీతన్న పంతులోక్కడు మాత్రమే తెలుసుకోగలడు.
అయన కా ఊళ్ళో కిరాణా దుకాణముంది. రోజుకి చిల్లరగా అమ్మేది యాభై వేలకు తక్కువుండదని అంతా చెప్పుకుంటారు. పద్దు పుస్తకంలో మాత్రం అమ్మకం వెయ్యి పై చిలుకని ఉంటుంది. చిల్లర బేరాలు కాకుండా టోకున అయన రోజుకి రెండు లక్షల రూపాయల వ్యాపారం చేస్తారని ప్రతీతి. అందులో కొంత బంగారం స్మగ్లింగూ ఉంటుంది. కొంత బియ్యం, పప్పు లాంటివి ఉంటాయి.
సీతన్న పంతులిది చిన్న డాబాయిల్లు. అందులో అయన భార్య, ముగ్గురు పిల్లలు వుంటున్నారు. ఆ ఇల్లు చేస్తే రోజూ లక్షల వ్యాపారం చేసే భాగ్యవంతుడి నివాస గృహ మనిపించదు, నెలకు రెండువేలు తెచ్చుకునే గవర్నమెంటు ఉద్యోగి క్వర్టార్లా ఉంటుందది.
అయన వ్యాపారం పదేళ్ళ క్రితం ప్రారంభించాడు. అప్పుడీ యింట్లోనే అద్దెకు ప్రవేశించాడు. బాగా కలిసొచ్చింది. రెండేళ్ళ లో ఆ యిల్లే కొనేశాడు. యింట్లోకి కాస్త ఫర్నిచర్ చేరింది. తప్పితే -- యింట్లో యింకేమీ మార్పులు చేయిన్చాలేదాయన. మనిషికి గర్వం లేదని, సింపుల్ గా జీవిస్తాడనే కాక పాపభీతి ఎక్కువని అంతా చెప్పుకునేవారు. ఇప్పటికీ చుట్టుపక్కల ఆయనకు మంచి పేరుంది.
ఇప్పుడు పెద్దబ్బాయి విశాఖ పట్నం లో ఇంజనీరింగ్ కాలేజీలో ఫైనలియర్ లో ఉన్నాడు. పెద్దమ్మాయి మెడిసిన్ రెండో సంవత్సరం . ఆఖరివాడిక్కడే తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. ఆరోజు తల్లీ కొడుకు లిద్దరూ కలిసిమాట్నీ సినిమాకు వెళ్ళారు.
సీతన్న పంతులు సినిమాలు చూసేది తక్కువ. ఎప్పుడైనా చూసినా ఒంటరిగా చూస్తాడు దుకాణాన్ని నమ్మకస్తులైన మనుషులిద్దరి కప్పగించాడు. వాళ్ళ మీద ఎప్పుడు మెరుపుదాడులు చేస్తాడో వాళ్ళకే తెలియదు. ఆయనకీ తెలియదు. అందువల్ల వాళ్ళు అయిదేళ్ళ నుంచి ఆయనకు నమ్మకస్తులుగానే ఉంటున్నారు. అదీకాక సీతన్న పంతులు- వాళ్ళిద్దరికీ నెల జీతాలివ్వాడమే కాక -- అవసరమైనప్పుడల్లా ధనరుపేణా, వస్తు రూపేణా సాయం చేసి ఆదుకుంటుంటాడు. అందుకాయన అవసరమే కారణమైనా -- అంత బాగా మరెవరి వద్దా ముట్టక పోవడం వల్ల కూడా వాళ్లాయనకు నమకస్తులుగా ఉంటున్నారు.
వ్యాపారం ఏ దశలో ఉన్నదీ తెలుసుకోవడం కోసం, ఇన్ కంటాక్స్ వారి నింకా ఏవిధంగా తప్పు దారిని పట్టించవచ్చూ అన్నది తేల్చుకోవడం కోసం, తన మెరుపుదాడి ఎప్పుడవసరమూ అన్నది నిర్ణయించడం కోసం యిప్పుడాయన పద్దు పుస్తకాలు తిరగేస్తున్నాడు. సరిగ్గా అప్పుడే ఎవరో కాలింగ్ బెల్ మ్రోగించారు.
సీతన్న పంతులు పుస్తకాలు మూసి అలమారాలో పెట్టి తనే వెళ్ళి తలుపు తీశాడు. అక్కడ పనిమనిషి రత్తమ్మ ఉంది.
"ఈవేళ పనిలోకి రానన్నావేమో!" అన్నాడాయన.
"పనిలోక్కాదు బాబూ! డబ్బుల కోసం వచ్చాను...."
"డబ్బులేందుకే -- ఏనెల జీతం అనేలే ఇస్తున్నాంగా."
"మావాడికి జబ్బు చేసింది...." అంది రత్తమ్మ.
"ఎంత కావాలేమిటి?" అన్నాడు సీతన్న పంతులు.
'యాభై రూపాయలండి ...." ఆదుర్దాగా అంది రత్తమ్మ.
'లోపలకు రా...." అన్నాడు సీతన్న పంతులు తను లోపలకు నడుస్తూ. రత్తమ్మ ఆయన్నునుసరించి లోపలకు వెళ్ళింది.
'అలా కూర్చో ...." అన్నాడు సీతన్న పంతులు.
రత్తమ్మ నేలమీద కూర్చుంది.
సీతన్న పంతులు బీరువా తలుపులు తీశాడు. అందులో వానిటీ బ్యాగోకటి తీసి రత్తమ్మ చేతికిచ్చి -- "ఇందులో ఏముంటే అది నీదే -- తీసుకో !" అన్నాడు.
ఊహించని ఈ ఔదార్యానికి రత్తమ్మ తెల్లబోయింది. అది ఆత్రుతగా ఆ బ్యాగు తెరిచి డబ్బు కోసం చూసింది. అంతా వెతికితే రెండు పది పైసల నాణె'లూ, ఓ అయిదు పైసలు నాణెము ఉన్నాయి.
"నాతో ఎగాతాలేంటి బాబూ!" అంది రత్తమ్మ.
"ఎగతాళి కాదు. ఇంట్లో వున్న డబ్బదే ...." అన్నాడాయన.
"ఇష్టం లేకపోతె ఇవ్వనని చెప్పొచ్చుగా బాబూ...." అంది రత్తమ్మ.
"నేను నిజమే చెప్పాను..." అన్నాడు సీతన్న పంతులు.
"నేను నమ్మను.."
"పోనీ నువ్వే బీరువా లో ఏముందో చూడు."
ఏమనుకుందో రత్తమ్మ వెంటనే లేచి బీరువా దగ్గరకు వెళ్ళింది. వెతకక్కర్లెకుండానే బీరువా అరలో ఎదురుగా ఓ మనీ పర్స్ కనిపించింది రత్తమ్మకు. ఆమె అది తీసి చూసింది. నిండా నోట్లు , వంద, యాభై , ఇరవై, పది - రూపాయల నోట్లున్నాయి.
"ఇవిగో బాబూ - ఇందులోంచి యాభై రూపాయలు నాకివ్వండి ....' అంది రత్తమ్మ.
'అయ్యో అది నా డబ్బు. అమ్మగారికి తెలీకుండా ఖర్చు పెట్టాలనుకున్నప్పుడే నేనిందులో డబ్బు వాడతాను." అన్నాడు సీతన్న పంతులు.
'అంటే?"
ఇంటి వాడకాని కింట్లో కొంత డబ్బుంటుంది. అదంతా అయన భార్య వద్దనే ఉంటుంది. అప్పుడామే సినిమాకి వెడుతూ అ డబ్బంతా తీసుకుని వెళ్ళిపోయింది.
"మగాళ్ళ కి ఆడాళ్ళకు చెప్పకూడని ఖర్చులుంటాయి. ఆ ఖర్చుల కోసం ఇది నేను దాచుకున్నాను. నువ్వు మా యింట్లో పనిచేస్తున్నావు. నీవల్ల మీ అమ్మగారికే ప్రయోజనం. నీకెప్పుడు అవసరమైనా ఆవిడే డబ్బిస్తుంది. నాకూ నీవల్ల ప్రయోజనమేదైనా వుందంటే చెప్పు ఆ పర్సు లోంచి తీసి డబ్బిస్తాను."
రత్తమ్మకు కాస్త అర్ధమయింది.
సీతన్న పంతులు వయసు నలభై అయిదుంటుంది. రత్తమ్మ వయసు ఇరవై కీ పాతిక్కీ మధ్య. మనిషి పని చేసుకుని బ్రతుకుతుంది కాబట్టి దృడంగా వుంటుంది. అయన ఆమె వంక అనేకసార్లు ఆకలి చూపులు చూశాడు. ఒకటి రెండు సార్లు దాన్ని చేయి పట్టుకునీ, కావాలని డీకొని చూశాడు. రత్తమ్మలో అనుగ్రహనికీ బదులు ఆగ్రహం కనపద్దంలో, అవన్నీ పోరాపాటు న జరిగినట్లు నటించడమే కాక "కళ్ళు నేత్తిమీదే పెట్టుకొని నడుస్తున్నావా -" అని తనే కసిరాడు కూడా.
ఇప్పుడాయన కవకాశ మొచ్చింది. డైరెక్టుగా అడిగాడు.
"నేనలాంటి దాన్ని కాదు బాబూ!" అంది రత్తమ్మ.
"సరే - ఆ పర్సలాగిచ్చి వెళ్ళిపో" అన్నాడు సీతన్న పంతులు.
రత్తమ్మ యింకేమీ మాట్లాడకుండా ఆయనకు పర్సు తిరిగిచ్చేసి అక్కణ్ణించి వెళ్ళిపోబోయింది.
"అబ్బ ఏం పౌరుషమే నీకు.... డబ్బిస్తాన్లె " అన్నాడాయన.
రత్తమ్మ వెనుదిరిగింది. సీతన్న పంతులు చేత్తో యాభై రూపాయల నోటు పట్టుకున్నాడు. ఆశకూ, అనుమానానికీ మధ్య ఆమె మనసు కొద్ది క్షణాలూగిసలాడింది. ఆశ అనుమానాన్ని జయించగా ఆమె మళ్ళీ సీతన్న పంతుల్ని సమీపించింది.
సీతన్న పంతులు నోటు కింద పెట్టాడు. దాని మీద పర్సు ఒత్తుపెట్టాడు.
"ఉత్తినే డబ్బు తీసుకోవడం అన్యాయం కదే...." అన్నాడాయన.
"మీరు నన్నలాగనడం న్యాయమా బాబూ ." అంది రత్తమ్మ.
"ఇందులో తప్పేముందే? నువ్వాడదానివి. నేను మగాణ్ణి. భగవంతుడు మనల్నోకరి కోసం ఒకరిని పుట్టించాడు. నాకు నువ్వంటే మనసైంది. నీకూ నేనంటే మనసైతే కాసేపు స్వర్గం చూడొచ్చు...." అన్నాడు సీతన్న పంతులు.
రత్తమ్మ ఏదో అనబోయింది. ఆయన బలవంతంగా దాన్ని దగ్గరకు తీసుకుని "దేవుడు మగాడికి బలాన్నిచ్చింది ఆడదాన్ని లొంగదీసు కునేందుకే" అన్నాడు.
రత్తమ్మ విదుల్చుకొబోయింది. అయన పట్టు బలంగా వుంది.
"వదలకపోతే అరుస్తాను బాబూ!" అంది రత్తమ్మ కోపంగా.
సీతన్న పంతు లోకచేత్తో ఆమె నోరు నొక్కి , "అరవడం వల్ల నీకే నష్టం. నువ్వు నాయింట్లో దొంగతనానికొచ్చావని చెబుతాను. చుట్టుపక్కల జనం, పోలీసులు అందరూ నామాటే నమ్ముతారు. అప్పుడు నువ్వు జైల్లో కేడతావు. అక్కడ పోలీసులు నిన్ను దారుణంగా చెడగొడతారు. జైలు కెళ్ళావని నీకింకెక్కడా పని దొరకదు. నీ మొగుడు నిన్ను వదిలేస్తాడు. నీ జీవితం కుక్కలు చింపిన విస్తరవుతుంది " అన్నాడు.
రత్తమ్మ భయంగా ఆయనవంకే చూసింది.
"ఎందుకే అలా భయపడతావు? నీకేమీ డబ్బుకి డబ్బు ....అటుపైన ప్రమాదమూ తప్పుతుంది." అన్నాడాయన.
రత్తమ్మ ప్రతిఘటించడం మానేసింది.
సీతన్న పంతులామే నోటి నుంచి చేయి తీశాడు.
ఆ తర్వాత ఆమె అరువనూ లేదు.
2
టైము సాయంత్రం అయిదు గంటలయింది.
గవరయ్య విసురుగా సీతన్న పంతు లింటికికొచ్చాడు.
అర్జెంటుగా యాభై రూపాయలు కావలసోచ్చాయి. తనకు వంట్లో బాగోలేదని అబద్దమాడి యజమాని నడిగి డబ్బు తెమ్మని భార్యను మూడున్నరకు కాబోలు పంపాడు. ఇప్పటికీ రాదు. ఎప్పటికి రాదు.
ఉన్నపళంగా వస్తే రానూ పోనూ కలిసి అరగంట. ఇప్పుడే వస్తానన్న మనిషి ఎప్పటికీ రాకపోయేసరికి గవరయ్య కు ఓపిక చచ్చి తనే బయల్దేరాడు.
