ఆ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ లోని విశాలమైన ఏ.సీ . బెడ్ రూమ్ లో పడుకున్నాడు విమల్.
ఏ.సి . శబ్దం తప్ప బిల్డింగు అంతా ప్రశాంతంగా వుంది.
వాచ్ మెన్ గేటు దగ్గర చిన్న స్టూల్ మీద కూర్చున్నాడు. అక్కడకు అర కిలోమీటరు దూరంలో -
ఒక పబ్లిక్ టెలిఫోన్ బూత్ వుంది.
ఆ టెలిఫోన్ బూత్ కి ఎక్కువగా ప్రజలు రారు. అక్కడున్న బంగాళాల్లో ప్రతి ఒక్క ఇంటికీ పర్సనల్ ఫోన్స్ ఉన్నాయి.
ఆ టెలిఫోన్ బూత్ లో , ఇరవై ఏళ్ళ కుర్రాడొకడు కూర్చున్నాడు. రోజూ అతనికి గంటల తరబడి అక్కడ కూర్చోవడం అలవాటే!
అందుకే అతను-
ఉదయం వచ్చినప్పుడే ఏదో నవల తెచ్చుకుంటాడు. సాయంత్రానికల్లా పూర్తీ చేసేస్తాడు.
ప్రస్తుతం అతని చేతిలో చేజ్ నవల కీడ్ వుంది. ఆ రోమాన్స్ లో, అ సస్పెన్స్ లో ఆ కుర్ర ఆపరేటర్ మునిగిపోయున్నాడు.
కరెక్టుగా ఆ సమయంలో -
పబ్లిక్ టెలిఫోన్ గణగణా మోగింది.
పబ్లిక్ టెలిఫోన్ కి బయటనుంచి అరుదుగా టెలిఫోన్ వస్తుంది. సహజంగా డిపార్టు మెంట్ నుంచి వస్తాయి ఆ ఫోన్స్.
అందుకే ఆ ఫోన్ మోతను పట్టించుకోలేదు ఆపరేటర్.
మళ్ళీ గణ గణ మోగింది.
ఒకసారి తలతిప్పి మోగుతున్న ఫోన్ వేపు విసుగ్గా చూసి తల పక్కకు తిప్పేసుకున్నాడు.
సరిగ్గా అయిదు నిమిషాల సేపు టెలిఫోన్ మోగి ఆగిపోయింది.
"హమ్మయ్య" తనలో తనే నిట్టూర్చాడు ఆపరేటర్. మళ్ళీ పుస్తకంలో పడ్డాడు.
రెండు నిమిషాల తర్వాత -
ఏదో అడగుల చప్పుడైతే తలెత్తి చూసాడు ఆపరేటర్.
ఎదురుగా నలభై ఏళ్ళ వయసున్న వ్యక్తీ.
"టెలిఫోన్ బూతేనండీ.....' చాలా వినయంగా అడిగాడు ఆపరేటర్ని అడిగి మళ్ళీ తనలో తనే అనుకుంటున్నట్లుగా"
"టెలిఫోన్ ఉంది కదా. టెలిఫోన్ బూతే" అని అనుకుని.
"ఇక్కడ మిల్క్ బూత్ ఎక్కడుందండీ ." మళ్ళీ అడిగాడు ఆపరేటర్ పలకలేదు. మళ్ళీ అడిగాడతను.
ఆపరేటర్ తలెత్తాడు. అతన్ని చూడగానే, ఎవనుకున్నాడో ఏమో "మిల్క్ బూత్ అవర్స్, మార్నింగ్ సిక్స్ టూ ఎయిట్. ఇప్పుడు క్లోజ్ చేసి వుంటుంది" చెప్పాడు.
అవతలి వ్యక్తీ చిన్నాగా నవ్వాడు.
"మిల్క్ బూత్ వర్కింగ్ అవర్స్ నాకేండుకయ్యా బాబూ. మిల్క్ బూత్ దగ్గర నేనుంటానని చెప్పాను.
"ఎవరితో."
"మా అబ్బాయితో."
"మీ అబ్బాయితోనా......ఎందుకు?" ఆశ్చర్యంగా అడిగాడు ఆపరేటర్.
"మా ఇంటికెళ్ళాడానికయ్యా. బాబూ" విసుక్కున్నాడు అవతలి వ్యక్తీ.
"ఈ ఏరియాలో సందులన్నీ తిరిగి, మా ఇంటి కెళ్ళడం చాలా కష్టమయ్యా బాబూ. ఎప్పుడూ ఎవరో ఒకరి ఇళ్ళకు వెళ్ళిపోవడం తప్ప మా ఇంటికి స్ట్రయిట్ గా వెళ్ళిన పాపాన పోలేదు. అందుకే నేను బయటికి వచ్చినప్పుడల్లా , నేను ఫలానా టైముకి తిరిగోస్తానని మా ఆవిడకి చెప్పోస్తాను. ఆవిడ మా అబ్బాయిని పంపిస్తుంది. ఇవాళ ఆ మిల్క్ బూత్ కూడా మర్చిపోయాను. అందుకే నీ దగ్గరకొచ్చా. " గబగబా ముందుకి నడుచుకుంటూ వెళ్ళిపోయాడా వ్యక్తీ.
"హరిబుల్" వెళ్ళిపోతున్న వ్యక్తివేపు , క్రేక్ ని చూసినట్టు ఓసారి చూసి, మళ్ళీ నవల్లో పడ్డాడు.
ఒక్క నిమిషం గడిచింది.
ఫోన్ గణగణ మోగింది టక్కున పోనేత్తాడు.
"హలో , దిసీజ్ .......ఏదో చెప్పబోయాడు ఆపరేటర్.
"నాకు తెలుసు మిస్టర్ శంకర్." అందమైన ఆడపిల్ల గొంతులా ఉందది.
"మిస్టర్ శంకర్. నువ్వు టీ నగర్, మూసా స్ట్రీట్ లో వుంటావు కదూ. ఇక్కడ జీతం నెలకు ఎనిమిదివందలు కదూ. నాకు చిన్న హెల్ప్ చేసిపెడితే నీకు రెండు వేలిస్తాను. ఒక్క పదినిమిషాల పని కోసం ఆలోచించుకో ......." ఆ ఆడపిల్ల గొంతులోంచి, ఆ మాటలు గబగబా వచ్చాయి.
"ఎవరు మీదు......నా పేరు మీకెలా తెల్సు."
"నాకన్నీ తెల్సు. పని చేస్తావా లేదా అన్నది ప్రశ్న. ఆలోచించుకో. రెండువేల రూపాయలు, రెండున్నర నెలల జీతం."
అలాంటి ఫోన్ కాల్ రావడం శంకర్ కి గమ్మత్తుగా వుంది. అందులోనూ, ఓ అమ్మాయి నుంచి ....మధురమైన ఆ స్వరాన్ని బట్టి , ఆ అమ్మాయిని ఊహించుకుంటున్నాడు శంకర్.
"నేను మీ పని చేస్తే , మీరు నాకు డబ్బెలా అందజేస్తారు.'
ఫోన్లో ఆ గొంతులోంచి వచ్చిన నవ్వు స్పష్టంగా విన్పించింది శంకర్ కి.
"పనైనా వెంటనే నీ డబ్బు నీ కందుతుంది."
"ఎలా?" అడిగాడు శంకర్.
"ముందు నేను చెప్పిన పని చెయ్యి.......చేస్తారా!"
ఒప్పుకోక తప్పలేదు ఆపరేటర్ శంకర్ కి.
"చెప్పండి"
ఫోన్లోని ఆ గొంతు చెప్పడం ప్రారంభించింది. శ్రద్దగా వింటున్నాడు శంకర్.
* * * *
"విమల్ గారున్నారా? వాళ్ళ డాడీ నుంచి ఫోను. చాలా అర్జంటు. ముందు వాచ్ మెన్ తో చెప్పాక, వాచ్ మెన్ లోనికి పంపించాడు. మేనేజర్ తో చెప్పాడు శంకర్.
