Previous Page Next Page 
వసుంధర కధలు-8 పేజి 25

 

    ఆ యువకుడు నావంక జాలిగా చూసి - "మీరు చూడ్డానికి పెద్ద మనిషిలా కనబడుతున్నారు. మీరనుకుంటున్న పార్వతి అన్న మీకు నిజంగా ప్రాణ స్నేహితులై ఉండాలి, నా భార్యకు -- ఆ పార్వతీకి పోలికలున్నాయేమో నాకు తెలియదు. ఈమె పార్వతి కాదనీ శారద అని మరోసారి చెబుతున్నాను. గత ఎనిమిది మాసాలుగా మేమిద్దరం ఒకరిని విడిచి ఒకరు వుండడం జరుగలేదు. దయతలచి మీరు మమ్మల్నింక వేధించవద్దు -" అన్నాడు.
    "మీ స్నేహితుడి చెల్లెలి ఫోటో ఒకటి ఉంటె ఇవ్వండి. అనుకోకుండా ఆమె మాకు తటస్థపడితే మీకు సహాయపడతాం -" అంది నేను పార్వతిగా భావిస్తుంటే కాదు శారదని అంటున్న ఆమె.
    పార్వతికి నేను మగవాడు ఆడదానికి అనగలిగినంత దగ్గరా అయ్యాను. ఆమెను గుర్తించడంలో పొరపాటు చేయలేను. అప్పటికీ ఊరుకున్నా ఈ విషయన్నింతటితో వదల దలచుకోలేదు.
    టిఫిన్ చేసి బయటకు వచ్చేక హోటల్ లో ఒక క్లీనర్ కుర్రాడితో మాట్లాడాను. వాడికి తరచుగా నేను చిల్లర డబ్బులు బక్షీద్ గా ఇస్తుంటాను. ఆ జంట ఇంటి అడ్రస్ తెలుసుకో వలసిందిగా వాడిని కోరాను ప్రోప్రయిటర్ పర్మిషన్ తీసుకున్న ఆ కుర్రాడు జంట వెంట పడ్డాడు.
    మర్నాడుదయం హోటల్ కు వెళ్లాను. "వాళ్ళు తిన్నగా సినిమాకు పాయారు సార్! నేనూ పోయాను మరి. రాత్రి పదిన్నరకు వాళ్ళు ఇల్లు చేరుకున్నారు-" అంటూ కుర్రాడు చిరునామా ఇచ్చాడు. వాడికి పదిరూపాయలు ఇచ్చాను.

                                   9

    తలుపు తట్టాను కానీ కాస్త భయంగానే ఉంది. ఆమె నన్ను గురించి ఏమనుకుంటుందో , తను నిజంగా పార్వతి కాకపోతే భర్త లేని సమయంలో ఇంటికి వచ్చినందుకు ఏ విధంగా భావిస్తుందోనన్న జంకు నాలో ఉంది.
    తలుపులు తెరుచుకున్నాయి. తలస్నానం చేసిందేమో - జుట్టు విరబోసుకుని ఉందామె. సందేహం లేదు- నేనుపోరబడడం లేదు. ఈమె పార్వతే నని అనిపించింది.
    "మీరా." అందామె తడబడుతూ.
    "గుర్తు పట్టావన్న మాట --"అని నవ్వి -- "లోపలకు రావచ్చా!" అన్నాను.
    "వారు ఇంట్లో లేరు -" అందామే జంకుతూ.
    "తెలిసే వచ్చాను -" అంటూ ముందడుగు వేశాను.
    "మీకేదైనా పని ఉంటె వారున్నప్పుడు రావచ్చు. సాయంత్రం అయిదు గంటలకు వారు తిరిగి వస్తారు-" అందామె.
    'అయితే సాయత్రం అయిదు గంటలవరకూ అతను రాడన్నమాట "! అంటూ తలుపులు వేశాను.
    ఆమె బెదురూ కళ్ళతో నావంక చూస్తూ -"మీరే ఉద్దేశ్యంతో ఇక్కడకు వచ్చినా -- నలుగురూ చెడు ఉద్దేశ్యంతో వచ్చినట్ల్ భావిస్తారు. నా కాపురంలో నిప్పులు పోయకండి -" అందామె.
    నేను తడబడ్డాను. నిజంగా నేనొక అమాయకురాలిని బాధించడం లేదు కదా- అనిపించింది! అయినా నెమ్మదిగా - పార్వతిని నేను మరిచిపోలేదు. ఒకటి కాదు రెండు కాదు - పదహారు రోజులు ఆమె నాదానిగా మసిలింది. ఆమెతో గడిపిన ప్రతిక్షణం మధురం అపూర్వం! ఆ పార్వతిని గుర్తు పట్టడంలో నేను పోరపడను. నువ్వు పార్వతివి. కాదనకు. అప్పుడు నీకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తే రెచ్చ గొట్టి దగ్గర చేసుకున్నావు ఇప్పుడు దగ్గరకు రావడానికి ప్రయత్నిస్తుంటే అబద్దాలు చెప్పి- పోమ్మంటున్నావు. నీ విచిత్ర ప్రవర్తనకు కారణం తెలియడం లేదు -" అన్నాను.
    "మీ ప్రవర్తనే నాకు విచిత్రంగా ఉంది. వివాహితురాలైన ఆడదాని వెంటపడి బాధించటం మీకు భావ్యం కాదు. మీరిలా వచ్చి వెళ్ళినట్లు నా భర్త చూస్తె ఏమను కుంటారు"! అందామె ఇంచుమించు కళ్ళనీళ్ళు పర్యంత మై.
    "నువ్వు గొప్పనటివి పార్వతీ-" అనుకున్నాను. అదే సమయంలో ఎవరో తలుపు తట్టారు. పార్వతి కంగారు పడింది. "ఎవరో వచ్చారు -- నామీద దయుంచి మీరు కాస్త ఆ పక్క గదిలోకి వెళ్ళగలరా " అంది.
    "నేను దొంగను కాదు. దాక్కోవలసిన అవసరం లేదు -" అన్నాను.
    "కానీ మిమ్మల్ని దాచవలసిన అవసరం నాకుంది - ప్లీజ్ -' అంటూ ఆమె నా చెయ్యి పట్టుకుని పక్క గదిలోకి లాక్కు వెళ్ళి ఓ బీరువా పక్క నిలబెట్టి -- "వచ్చినవాళ్ళు వెళ్ళే వరకు -- ఇక్కడించి కదలవద్దు -" అని వెళ్ళిపోయింది.
    ఆఖరికి ఏగతి పట్టింది నాకు!
    వచ్చిన వ్యక్తీ ఆడదని కంఠం చెబుతూనే ఉంది - "ఎలా ఉందమ్మా కొత్త కాపురం ?" ఆ అడ కంఠం కంగుమని మ్రోగుతుంది.
    పార్వతి మాట వినపడలేదు.
    "చూడమ్మా -- కొత్తగా వచ్చావు. ఈ వీధిలో ఎవ్వరూ కలుపుగోరు మనుషులు కారు. కొత్తగా ఎవరు వచ్చినా ఒకటి రెండు రొజులు చూసి నేనే వచ్చి పలకరించి పోతుంటాను . ఏదైనా సాయం కావాల్సి వస్తే అడగడానికి సందేహించకు --" అందా కంఠం మళ్ళీ.
    'అలాగే నండీ --" పార్వతి కంఠం.
    మరో పావుగంట మాట్లాడేక ఆ కంఠం వెళ్ళిపోయింది. తలుపులు వేసి పార్వతీ నా దగ్గరికొచ్చింది. "చూశావా -- నన్నేలాంటి ఇబ్బందిలో పెట్టారో -- ఆవిడ ,మీరు లోపలకు రావడం చూసే ఉంటుందని నా అనుమానం --" అంది పార్వతి.
    "తప్పులేని చోట భయం కూడా ఉండదు-" అన్నాను వెటకారంగా.
    'అభయం ఆడదానికి తెలుస్తుంది. మగవాడికి అర్ధం కాదు-" అందామె.
    "భయపడే ఆడదానికీ -- భయపడని ఆడదానికీ తేడా -- మగవాడికి తెలుస్తుంది -" అంటూనేనామెను సమీపించి దగ్గరగా లాక్కున్నాను. ఒంటరితనం , పూర్వపు చనువు - నాకు ఆవేశాన్ని కలిగించగా నేను కాస్త ధైర్యం చేశాను. ఆమె మాట్లాడకుండా వణుకుతుంది. మరి భయమో ఏకారణం తెలియదు- ఆమె అరవలేదు కానీ గింజు కుంటోంది వీలైనంత మౌనంగా.
    ఆ మాత్రం చాలు నాకు . ప్రస్తుతం శ్రీధరబాబు చెల్లెలు ఇక్కడెందుకున్నదీ అన్న వివరం మీద నాకు ఆసక్తి లేదు. ఆ అవకాశాన్ని వినియోగించుకోవడం మీదనే నా ఆసక్తి!
    "ఒకప్పుడు నీ గురించి రెండు వేలు ఖర్చు పెట్టాను. నాకు డబ్బు లెక్కలేదని గ్రహించే ఉంటావు. నీ భర్త అయిదు గంటల వరకూ రాడు కదా -- మనకు చాలా సమయం ఉంది-" అన్నాను.
    "ఇది మీకు న్యాయం కాదు, పెళ్ళైన దాన్ని -- " అందామె .
    ఇంచుమించు ఏడుస్తూ , ఆమె అసహాయత నాకు తెలిసిపోయేక నా ధైర్యం పెరిగింది. "నేను నీకు కొత్త కాదు -" అన్నాను.
    ఒకప్పుడు పార్వతి నన్ను లొంగదీసుకుంది. ఈరోజు నేనామెను లొంగదీసుకున్నాను.

                                      10
    నేను వెళ్ళిన పని ఏమిటి -- చేసినపని ఏమిటి అని తల్చుకుంటే నాకే సిగ్గు వేసింది. పశువులా ప్రవర్తించడ మంటే అదేనేమో !
    అయితే నా సిగ్గూ , పశ్చాత్తాపం కొన్ని క్షణాలు మాత్రమే! మర్నాడు నేను మళ్ళీ పార్వతి ఇంటికి వెళ్లాను. తలుపు తీసిన పార్వతి తలుపు వేసుకోబోయింది. ఎలాగో లోపల అడుగు పెట్టాను. ఈరోజు ఆమె నిన్నటి కంటే సులభంగా లొంగిపోయింది. మూడు వందల నోట్లుంచిన ఒక కవరు ఆమె గురించి వదిలేసి వచ్చాను.
    ఆ తరువాత కనీసం పదిసార్లు పార్వతి ఇంటికి వెళ్ళాను. ఈ పదిరోజుల్లోనూ ఆమె గురించి నేను ఎక్కువగా తెలుసుకున్నదేమీ లేదు. పదకొండవ సారీ ఆమె ఇంటికి వెళ్ళినప్పుడా ఇంటికి తాళం వేసి ఉంది.
    అవేసిన తాళం చాలా రోజులు అలాగే ఉంది. ఒక నెల రోజుల అనంతరం మాత్రం -- మళ్ళీ తాళం తీసి ఉంది. ఆశగా వెళ్ళి తలుపు తట్టాను. తలుపులు తెరుచుకున్నాయి. ఒక ముసలమ్మ గారు -- "ఎవరు బాబూ ---" అంటూ పలకరించింది.
    కాస్త షాక్ తిన్నాను- ఈ ఇంట్లో శంకర్రావు గారని ఒకరుండాలి !....."  
    'అయన ఇల్లు కాళీ చేసి ఓ వారం రోజులయుంటుందనుకుంటాను -- నిన్ననే మేము దిగాం --" అందా బామ్మగారు.
    నేను అక్కణ్ణించి బయట పడ్డాను. దొరికినట్లే దొరికి పార్వతీ మళ్ళీ మాయమైంది. ఆమెను గురించి మిస్టరీ అర్ధం చేసుకుందుకు ప్రయత్నించవలసిన నేను -- అలా చేయలేక పోయాను. నాలోని బలహీనత మరే ఇతర విషయం మీదా దృష్టిని కేంద్రీకరించలేకుండా చేసింది.........
    రోజులు గడుస్తున్నాయి.
    ఉద్యోగానికి సంబంధించి మళ్ళీ నేను క్యాంపుకు వెళ్ళవలసి వచ్చింది. ఈ పర్యాయం నాతొ పాటు నా కొలీగ్ శివరావు కూడా ఉన్నాడు. ఇద్దరం కలిసి కాస్త ఓమాదిరి పెద్ద పట్టణానికే మూడు వారాల టూర్ ప్రోగ్రాం మీద బయల్దేరాం.
    ఇద్దరం ఒక హోటల్ లో బస చేద్దామనుకుంటే శివరావు అలా వద్దన్నాడు - 'చక్కగా ఒక ఫామిలీ పోర్షన్ అద్దెకు తీసుకుందాం -" అన్నాడు.
    నేను సరేనన్నాను. వెళ్ళినరోజు సాయంత్రం లగేజి క్లోక్ రూమ్ లో పడేసేక శివరావుని అనుసరించాను. అతను తిన్నగా ఒక హోటల్ కు దారితీశాడు. అక్కడ అతను హోటల్ ప్రోప్రయిటర్ కి తన పేరు చెప్పి- "నేను వ్రాసిన ఉత్తరం అందిందనుకుంటాను. అన్ని ఏర్పాట్లు చేసే ఉంటారనుకుంటాను-" అన్నాడు.
    ప్రోప్రయిటర్ పరిచయ పూర్వకంగా నవ్వి ఒక్కసారి ఏదో పుస్తకం తిరగేసి జేబులోంచి ఒక కాగితం తీసి దాని మీద ఓ అడ్రస్ రాసిచ్చాడు.
    "పద పోదాం -" అన్నాడు శివరావు నాతొ.
    శివరావు మా ఊరు ట్రాన్స్ ఫర్ మీద వచ్చి మూడు నెలలే అయినప్పటికీ నాకు త్వరగా సన్నిహితుడయ్యాడు. అతనికి నాకు తెలియని ఎన్నో విషయాల్లో అనుభవముంది -- కావడానికి నా వయసు వాడే అయినా!" 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS