శివరావు ఆ అడ్రస్ పట్టుకుని ఆ ఇంటికి చేరుకున్నాడు. ఇల్లు బాగానే ఉంది. శివరావు -- "వాటా మనకు కావలసిన విధంగానే ఉంది. ఇందులో సులభంగా రెండు కాపురాలు నడపొచ్చు" అన్నాడు.
ఇంటాయనకు అతను వందరూపాయలు ఇచ్చి -"టెంపరరీగా క్యాంపు పని మీద ఇక్కడకు వచ్చాం. ఇంత సౌకర్యము గల ఇల్లు దొరుకుతుందని మేమూ విని వుంటే కూడా శ్రీమతులను వెంట బెట్టుకుని వచ్చి వుండేవాళ్ళం. ఈరోజే టెలిగ్రామ్ ఇస్తాం రెండు మూడు రోజుల్లో మా ఫామిలీస్ రావచ్చు --" అన్నాడు.
నేను ఆశ్చర్యంగా శివరావు మాటలు వింటూ ఊరుకున్నాను కానీ ఏమీ మాట్లాడలేదు.
శివరావు భార్య ప్రస్తుతం ఏదో జబ్బుతో ఉన్న కారణంగా పుట్టింట్లో ఉంది. ఆమెకు విశ్రాంతి అవసరమనీ సాధ్యమైనంత వరకూ కొద్ది నెలల పాటు భర్తకు దూరంగా ఉండాటం మంచిదని డాక్టర్లు చెప్పినట్లు అతను నాకు ఇదివరలో చెప్పాడు. నా విషయం సరేసరి! బ్రహ్మచారిని. ఇప్పుడు మా ఫామిలీస్ ఎక్కణ్ణింఛి వస్తాయి ? ఇదే సందేహన్ని ఇంటాయన వెళ్ళిపోయాక శివరావు దగ్గర వేలుబుచ్చాను. శివరావు జవాబుగా నవ్వేశాడు -" ఇప్పుడు మనం అందుకే వెడుతున్నది !"
ఈసారి ఇద్దరం మళ్ళీ ఓ కొత్త చోటు కి వెళ్ళాం. అది ఒక చిన్న గది. ఆ గదిలో ఒకే ఒక మనిషి ఉన్నాడు. గది ముందు మాత్రం యాత్రీకులు సమాచార కార్యాలయం అన్న బోర్డు ఉంది. శివరావు అక్కడున్నతనితో --"నా ఉత్తరం మీకు అందేఉంటుందనుకుంటాను-" అంటూ తన పేరూ వివరాలూ చెప్పాడు.
ఆవ్యక్తి నవ్వి పక్కకు కదిలి అక్కడున్న బీరువా తలుపులు తీసి మూడు పుస్తకాలు మా ముందు పెట్టి -- "ఎన్నిక చేసుకోండి-" అన్నాడు.
ఆ పుస్తకాలో ఊహించిన విధంగానే ఆడవాళ్ళ ఫోటోలు ఫోటో కింద వారి వయస్సు ఉన్నాయి. శివరావు నా వంక చూసి "నీకు అభ్యంతరమా -" అనడిగాడు. అతని ఉద్దేశ్యం అర్ధం చేసుకున్న నేను లేదన్నట్లుగా తల ఆడించాను.
శివరావు ఒక పుస్తకం తిరగేసి తన ఎన్నిక పూర్తీ చేశాడు. నేను కూడా పుస్తకం తిరగ్స్తున్నాను. కానీ నా చేతులు కొద్దిగా వణుకుతున్నాయి. అనుకోకుండా పార్వతిని అనుభవించడం జరిగింది తప్పితే నేను వేశ్యల కోసం ప్రాకులాడటం ఇదే మొదలు. ఆపుస్తకంలో ఉన్న అందరూ అందంగానే ఉన్నారు. నేను చూడలేననిపించి శివరావునే నాక్కూడా ఎన్నిక చేసి పెట్టమన్నాను. అక్కడికి ఆపనీ పూర్తయింది.
"ఏమిటి మీ బంధుత్వం ?' అనడిగాడావ్యక్తీ.
"భార్యే!" అన్నాడు శివరావు.
ఆ వ్యక్తీ ఎక్కడికో ఫోన్ చేశాడు. కాస్సేపు ఆగాడు. అతని బల్ల మీది ఫోన్ అయిదు నిమిషాల్లో మళ్ళీ మ్రోగింది. అతను పెన్సిల్ తో కాగితం మీద యేవో వివరాలు నోట్ చేసుకుని శివరావు వంక చూసి -- "సారీ సార్ మరోసారి బుక్స్ తిరగేసి మరేవరీనైనా సెలక్ట్ చేసుకోండి. మీ కాండిడేట్ అల్ రడీ బుక్ అయిపొయింది -" అని నావంక చూసి - " మీ విషయంలో అంతా రిటై పోయింది -" అన్నాడు.
శివరావు మళ్ళీ పుస్తకాలు తిరగేయడం మొదలు పెట్టాడు. రెండు పుస్తకాలు చూసి అతను చిరాగ్గా -- "బోర్ గా ఉంది -" అన్నాడు . ఇప్పుడు నేను --" నా కాండిడేట్ నీకు నచ్చింది గదా ఎలాగు నాకు అంత ఆసక్తి లేదనుకో -" అన్నాను.
"కంగారుపడకు మిత్రమా! ఇంకా ఒక పుస్తకముంది మూడు వారాలిక్కడ గడపవలసిన అవసరముంది. నా గురించి నువ్వే కాస్త సెలక్షన్ చేసిపెడుతూ --" అన్నాడు.
మూడవ పుస్తకం మొదటి పేజీలోనే కళ్ళు జిగేల్ మనిపించే అందం కనపడగా శివరావుకు చూపించాను. "ఫంటాస్టిక్ " అన్నాడు శివరావు. ఆ వ్యక్తీ మళ్ళీ ఫోన్ చేశాడు. ఈసారి అన్నీ సరి అయ్యాయి. "రేపు సాయంత్రం అయిదు గంటలకు -" అన్నాడతను.
11
ఉమ, నేనూ సినిమా దియేటర్ లో ఉన్నాం. శివరావు శాంతతో ఎక్కడికో పోయాడు. ప్రస్తుతం ఉమ ఇక్కడ నాకు భార్యగా వ్యవహరించబడుతుంది.
సినిమాకు ఇంటర్వల్ వచ్చింది. లైట్లు వెలిగాయి. నేనూ, ఉమా ఏవో కబుర్లు చెప్పుకుంటున్నాం. హటాత్తుగా "హలో సుజాతా" అన్న పిలుపు వినబడి ఇద్దరం ఉలిక్కిపద్దాం. ఒక యువకుడు మావైపే వస్తున్నాడు.
"ఎవరండీ మీరు - " అనడిగాను ఆశ్చర్యంగా.
అతను నా ప్రశ్న వినకుండా ఉమా వంకే గుచ్చి గుచ్చి చూస్తూ - "సుజాతా నువ్వు ఇక్కడ?" అన్నాడు. ఉమా మాట్లాడలేదు.
నేను ఆ యువకుణ్ణి చూస్తూ మళ్ళీ - "ఈమె పేరు ఉమ, మీరంటున్న సుజాత ఎవరో మాకు తెలియదు -" అన్నాను.
"నేను నమ్మను సుజాత నాకు బాగా తెలుసు --" అన్నాడా యువకుడు.
'ఇంతలా మీకు మీరంటున్న సుజాతకు సంబంధమేమిటి ?" అన్నాను చిరాగ్గా.
"అది మీకనవసరం -- " అన్నాడతను తడబడుతూ.
"కానీ నాకు అవసరం. ఉమ నా భార్య అన్న సంగతి మీకు వేరే చెప్పనవసరం లేదనుకుంటాను -"
హల్లో దీపాలారిపోయాయి. నేను ఉమను చేతి మీద నెమ్మదిగా గిల్లి - " అతను తెలుసు కదా?" అనడిగాను.
"ఊ" అన్నదామె.
సినిమా నుంచి ఇంటికి వెళ్ళే వరకూ నేను మరి ఆ యువకుని ప్రసక్తి తీసుకురాలేదు. ఇంటికి వెళ్ళేక భోజనం చేసి పడుకునేటప్పుడు ఆమెను అడిగాను. "నీవు చాలా మందితో గడిపిన కారణంగా ఎంతోమందికి ఎన్నో పేర్లతో పరిచయమై ఉంటావు. అందులో నాకేమీ ఆశ్చర్యం లేదు. అయితే నీ వృత్తి తెలుసుండీ ఆ యువకుడు నిన్ను సినిమాలో అలా పేరు పెట్టి పలకరించడానికి కారణం నాకు అర్ధం కాలేదు -" అన్నాను.
ఆమె తమాషాగా నవ్వి - "నన్ను మీరు ఉమ అని పిలుస్తారు. కానీ తరువాత ఎప్పుడైనా ఎక్కడైనా ఒక మగవాడి పక్కన తటస్థ పడితే మీరు నన్ను ఉమ అని పిలిచి పలకరించరు. అప్పుడు నా పీరు రమ అని విన్నా ఆశ్చర్యపడరు. కారణం మీకు నా వృత్తి తెలుసు - " అని ఊరుకుంది.
అంటే ఆ యువకుడికి ఈమె వృత్తి తెలియదన్న మాట! అటువంటప్పుడు ఏ పరిస్థితుల్లో వీరి పరిచయం సంభవించింది అన్న కుతూహలం నాకు కలిగింది. అందుకే ఆమెను మళ్ళీ ప్రశ్నించకుండా ఉండలేకపోయాను. జవాబుగా ఆమె "ఇప్పుడు ఇక్కడ నేను రహస్యంగా మరో యువకుడితో పరిచయం పెట్టుకోవడం జరిగితే అతను నన్ను మీ భార్యగా భావిస్తుంటాడు. ఆ యువకుడి విషయంలోనూ అదే జరిగింది. నా పక్కన భర్త స్థానంలో మిమ్మల్ని చూడటం అతనికి ఆశ్చర్యం కలిగించడం సహజమేనని మీకు ఇప్పుడు అర్ధమయి ఉంటుందనుకుంటాను."
ఉలిక్కిపడ్డాను. నా బుర్రలో ఏదో తళుక్కు మాననట్లయింది. శారద గా వ్యవహరించబడే ఓకే అమ్మాయిని నేనూ పార్వతి అనిపిలిచెను. అప్పటి నా స్థితిలోనే ఇప్పటి ఈ యువకుడు ఉండి వుండాలి.
"బహుశా నన్ను వేధిస్తున్న ఒక ప్రశ్నకు సమాధానం నీ దగ్గర లభించగలదనుకుంటాను. శ్రీధర బాబు అని నాకో మిత్రుడున్నాడు. అతని చెల్లెలు పార్వతి అన్నను చూడడానికి వచ్చిన తరుణంలో అక్కడ నేనుండడమూ, అతను లేకపోవడమూ జరిగాయి. ఆమెతో నాకు పదహరు రోజుల పరిచయముంది. ఆ తర్వాత ఆమెను మా ఉళ్ళో శంకర్రావు అనబడే ఒకతని భార్యగా చూసాను. పాతపరిచయాన్ని పురస్కరించుకుని ఆమెను శారీరకంగా లొంగదీసుకోగలిగినా తను పార్వతి అని ఒప్పించలేక పోయాను. అది నాకు మిస్టరీగా మిగిలింది. శ్రీధర బాబు చెల్లెలు అనుమాన పరిస్థితుల్లో ఇంట్లోంచి మాయమైనట్లు నాకు తెలిసింది. మిమ్మల్ని ఎవరు ఎలా ఏర్పాటు చేస్తున్నారు? ఏదైనా పెద్ద ముఠా , అందమైన ఆడపిల్లల్ని అపహరించి బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతోందా?" అనడిగాను.
